తాగునీటికే మొదటి ప్రాధాన్యత | Drinking water is the first priority | Sakshi
Sakshi News home page

తాగునీటికే మొదటి ప్రాధాన్యత

Published Tue, Mar 27 2018 10:33 AM | Last Updated on Tue, Mar 27 2018 10:33 AM

Drinking water is the first priority - Sakshi

మోటార్‌ స్విచ్‌ ఆన్‌చేస్తున్న జీవన్‌రెడ్డి

రాయికల్‌(జగిత్యాల): తాగునీటి సమస్యకే మొదటి ప్రాధాన్యతనిస్తామని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని ప్రజల దాహర్తిని తీర్చేందుకు ఇటీవల బావి తవ్వగా ఆయన సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల కేంద్రంలో ఈద్గాకు 1.20 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా.. శ్మశాన వాటిక కోసం కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

అనంతరం దోబిఘాట్లను ప్రారంభించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ గోపిమాధవి, సర్పంచ్‌ రాజిరెడ్డి, ఎంపీటీసీ కట్కం సులోచన, సింగిల్‌విండో చైర్మన్‌ పడిగెల రవీందర్‌రెడ్డి, కో–ఆప్షన్‌ మెంబర్‌ మొబిన్, ఉపసర్పంచ్‌ మ్యాకల రమేశ్, వార్డు సభ్యులు కోల రవి, నాయకులు మహిపాల్, మున్ను, దివాకర్‌ పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement