జగిత్యాల రూరల్ : గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధికి పెద్దపీట వేయడం జరుగుతుందని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఉపాధిహామీ పథకం కింద చేపట్టే సీసీ రోడ్ల నిర్మాణాలను మండలంలోని తాటిపల్లిలో రూ.15 లక్షల విలువైన, చల్‌గల్‌లో రూ.17 లక్షల విలువైన సీసీ రోడ్ల పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ఉపాధిహామీ పథకం ద్వారా సీసీరోడ్లు నిర్మాణం చేయనున్నట్లు తెలిపారు. ప్రజలకు మౌళిక వసతులు కల్పించేందుకు ఎన్ని నిధులైనా వెచ్చిస్తామన్నారు. అనంతరం చల్‌గల్ గ్రామ శివారులోని లక్ష్మీనృసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా జరుగుతున్న పూజా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కార్యక్రమంలో సర్పంచులు నీలం భూమన్న, జున్ను కవిత, ఎంపీటీసీలు ఎంబారి రాజేశ్వరి, మొర్రి లక్ష్మి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కొలుగూరి దామోదర్‌రావు, సింగిల్‌విండో చైర్మన్ అయిలవేని గంగాధర్, పంచాయతీరాజ్ శాఖ ఈఈ మనోహర్‌రెడ్డి, నాయకులు చెట్‌పల్లి సత్తన్న, బందెల మల్లయ్య, పెద్దన్న, జున్ను రాజేందర్, మల్లేశం, గంగారెడ్డి పాల్గొన్నారు.