dobhi ghat
-
తాగునీటికే మొదటి ప్రాధాన్యత
రాయికల్(జగిత్యాల): తాగునీటి సమస్యకే మొదటి ప్రాధాన్యతనిస్తామని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని ప్రజల దాహర్తిని తీర్చేందుకు ఇటీవల బావి తవ్వగా ఆయన సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల కేంద్రంలో ఈద్గాకు 1.20 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా.. శ్మశాన వాటిక కోసం కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం దోబిఘాట్లను ప్రారంభించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ గోపిమాధవి, సర్పంచ్ రాజిరెడ్డి, ఎంపీటీసీ కట్కం సులోచన, సింగిల్‌విండో చైర్మన్ పడిగెల రవీందర్‌రెడ్డి, కో–ఆప్షన్ మెంబర్ మొబిన్, ఉపసర్పంచ్ మ్యాకల రమేశ్, వార్డు సభ్యులు కోల రవి, నాయకులు మహిపాల్, మున్ను, దివాకర్ పాల్గొన్నారు. -
పట్టపగలే రియల్ ఫైట్..
-
హైదరాబాద్‌లో పట్టపగలే రియల్ ఫైట్..
హైదరాబాద్ : హైదరాబాద్‌లో పట్టపగలు సినిమా ఫైట్‌ను తలపించేలా శనివారం ఇరువర్గాలు దాడులు చేసుకున్నారు. ఒకరిపై ఒకరు రాళ్లు, కర్రలు, సోడా బుడ్డిలతో ఫైట్ చేసుకున్నారు. మాదన్నపేట దోభీ ఘాట్ విషయంలో ఇరు వర్గాల మధ్య జరిగిన గొడవ...చిలికి చిలికి గాలివానగా మారింది. ఇరు వర్గాల మధ్య ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. కర్రలు, రాళ్లతో పరస్పర దాడులకు దిగడంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. దోభిఘాట్ ప్రభుత్వ స్థలాన్ని కొందరు కబ్జా చేస్తున్నారని స్థానికులు అడ్డుకోవడంతో వివాదం చెలరేగింది. స్థలాన్ని కబ్జా చేసేందుకు మాఫీయ యత్నాలను స్థానికులు అడ్డుకున్నారు. అయితే అప్పటికే సమాచారం అందుకున్న కబ్జారాయుళ్ల అనుచరులు అక్కడ వీరంగం సృష్టించారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని ఇరువర్గాలను శాంతింపచేసేందుకు ప్రయత్నించినా ఎవరూ వెనక్కి తగ్గలేదు. పోలీసుల ఎదుటే... కర్రలు, రాళ్లతో దాడులు చేసుకున్నారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి నిలకడగానే ఉన్నా స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది. గతంలో స్థానిక బస్తివాసులు ఈ వ్యహహారంపై గవర్నర్‌కు సైతం ఫిర్యాదు చేశారు.