వైఎస్ రాజశేఖరరెడ్డి తీసుకున్న నిర్ణయాలు ఆయన తనయుడు జగన్‌మోహన్ రెడ్డికి లబ్ధి చేకూర్చాయి అనే ప్రాతిపదికన జగన్‌పై ఆరోపించిన కేసులు ఏవీ కోర్టులో నిరూపణ కావు అని ఘంటాపథంగా చెబుతున్నారు మాజీ మంత్రి, ప్రస్తుతం టి. కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే టి. జీవన్ రెడ్డి. నాటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కక్షసాధింపు చర్యతో వైఎస్ కుటుంబంపై పెట్టిన కేసుల వల్ల అంతిమంగా నష్టపోయింది కాంగ్రెస్ పార్టీయేనని స్పష్టం చేశారు. సీఎం స్థానంలో నాడు వైఎస్ నిబంధనలకు విరుద్ధంగా ఎవరికైనా లాభం చేకూర్చి ఉంటే అది మంత్రిమండలి బాధ్యత కిందికి వస్తుంది కాబట్టి కేబినెట్టే ఆరోపణలను ఎదుర్కోవాల్సి ఉందని, ఇలాంటి అంశాలు రేపు వైఎస్ జగన్‌కి చక్కగా తోడ్పడతాయని జీవన్ రెడ్డి చెబుతున్నారు. ఏపీలో చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజల్లో ఏర్పడిన తీవ్ర అసమ్మతి వైఎస్సార్ కాంగ్రెస్‌కి తప్పక మేలు చేకూరుస్తుందని మనసులో మాట చెబుతున్న టి.జీవన్ రెడ్డి అభిప్రాయాలు ఆయన మాటల్లోనే..