- ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి
రాయికల్ : ప్రజా సమస్యల పరిష్కారంకోసం కృషి చేస్తానని జగిత్యాల ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అన్నారు. కిష్టంపేట గ్రామంలో మంగళవారం ట్రాన్స్‌ఫార్మర్, దోభీఘాట్‌ను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ గ్రామంలోని సమస్యల పరిష్కారమే ధ్యేయమన్నారు. గ్రామాల్లోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రజాప్రతినిధులు గుర్తించి తన దృష్టికి తీసుకురావాలని, తద్వారా సమస్యలు పరిష్కరిస్తామన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో ఉంటేనే మండలం అభివృద్ధి చెందుతుందన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ గోపి మాధవి, సర్పంచ్ తంగెళ్ల రమేశ్, ఎంపీటీసీ శంకరయ్య, ఉపసర్పంచ్ సురేశ్‌గౌడ్, నాయకులు జాన గోపి, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మహిపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.