
'రైతులకు కనీస మద్దతు ధర ఇవ్వాలి'
జగిత్యాల : జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డుని తెలంగాణ శాసనసభాపక్ష ఉపనేత జీవన్ రెడ్డి మంగళవారం సందర్శించారు. ధాన్యం మద్దతు ధర గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
రైతులకు కనీస మద్దతు ధర చెల్లించాలని ఆయన అధికారులను నిలదీశారు. మద్దతు ధర చెల్లించకుంటే రైతులతో కలిసి ఆందోళనకు దిగుతామని జీవన్రెడ్డి హెచ్చరించారు. ఆయన వెంట స్థానిక పార్టీ కార్యకర్తలు, నాయకులు ఉన్నారు.