'మహారాష్ట్ర ఒప్పందంతో కేసీఆర్ మహా మోసం'
కరీంనగర్ : మహారాష్ట్ర ఒప్పందం పేరుతో సీఎం కేసీఆర్ మహా మోసానికి పాల్పడుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి ఆరోపించారు. కరీంనగర్ జిల్లాలో ఆదివారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ....కాంగ్రెస్ హయాంలోనే మహారాష్ట్రతో ఒప్పందం జరిగిందన్నారు.
టీఆర్ఎస్ శ్రేణులు ఇది వరకే ఒప్పందం చేసుకున్నామని సంబరాలు జరుపుకున్నాయని.... 23న మళ్లీ ఏమి ఒప్పందం చేసుకుంటారని జీవన్రెడ్డి ప్రశ్నించారు. ప్రాజెక్టుల నిర్మాణానికి కాంగ్రెస్ అడ్డుపడుతుందన్న కేసీఆర్ ఏ ప్రాజెక్టు కడితే అడ్డుకున్నామో చెప్పాలన్నారు. మేడిగడ్డ నుంచి మల్లన్నసాగర్, అక్కడి నుంచి ఎస్సార్ఎస్పీకి నీళ్లు ఎలా ఇస్తారని ఆయన అడిగారు. మెడ మీద తల ఉన్నవారి ఎవ్వరికీ కేసీఆర్ మాటలు అర్థం కావని జీవన్రెడ్డి ఎద్దేవా చేశారు.