సాక్షి, ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌తో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు పనులు పూర్తయిన నేపథ్యంలో ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా రావాలని ఆయనను ఆహ్వానించారు. ఈ నెల 21న మేడిగడ్డ వద్ద గల కన్నెపల్లి వద్ద కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభించనున్న విషయం తెలిసిందే. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో మహారాష్ట్ర ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం కీలకం కావడంతో ఆ రాష్ట్ర సీఎంను ముఖ్యఅతిథిగా ఆహ్వానించాలని కేసీఆర్ నిర్ణయించారు.
ఇందులో భాగంగా ఈ రోజు ఉదయం మహారాష్ట్రకు చేరుకున్న కేసీఆర్.. తొలుత రాజ్‌భవన్ మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావుతో భేటీ అయ్యి ఆయన్ను కూడా ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఆహ్వానించారు. అనంతరం సీఎం ఫడణవీస్‌తో సమావేశమై స్వయంగా ఆహ్వానించారు. కాగా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మహారాష్ట్ర ప్రభుత్వంలో కేసీఆర్ ఒప్పదం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఇరురాష్టాల సీఎంల అంగీకారంతో నిర్మాణం, ముంపు వంటి అంశాలను త్వరతిగతిన పూర్తి చేసుకుని ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment