
'వారిద్దరి భేటీ చీకటి ఒప్పందమే'
హైదరాబాద్ : ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ భేటీలో చీకటి ఒప్పందం జరిగిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...రాష్ట్ర ప్రజల ఇబ్బందులు సీఎంకు పట్టడం లేదని ధ్వజమెత్తారు.
కనీసం కొత్త కరెన్సీని రాష్ట్రానికి పంపాలని కూడా ప్రధానిని కేసీఆర్ అడగలేదన్నారు. పెద్ద నోట్ల రద్దు, రాష్ట్ర ఆదాయం తగ్గడానికి ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. రెండున్నరేళ్లలో కేసీఆర్ రూ.70 వేల కోట్లు అప్పులు చేశారని జీవన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.