వైఎస్ మరణం కాంగ్రెస్ పార్టీకేకాక యావత్ తెలుగుజాతే నష్టపోయిందని ఆ పార్టీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అన్నారు.
'వైఎస్ మరణంతో తెలుగు జాతి నష్టపోయింది'
Published Fri, Jul 8 2016 11:18 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
వైఎస్‌తో హైదరాబాద్‌కు గుర్తింపు
ప్రాజెక్టుల రూపకల్పన ఆయనదే
జగిత్యాల అర్బన్ : వైఎస్ మరణం కాంగ్రెస్ పార్టీకేకాక యావత్ తెలుగుజాతే నష్టపోయిందని ఈ పార్టీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్టుల రూపకల్పన వైఎస్‌దేనని పేర్కొన్నారు. వైఎస్.రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా జీవన్‌రెడ్డి ‘సాక్షి’తో మాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖరరెడ్డి రాష్ట్రంలో చేపట్టిన అభివదిృపనులు ఎన్నో ఉన్నాయని గుర్తు చేశారు. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నిర్మాణం, ఫ్లడ్ కెనాల్, వరదకాలువ నిర్మాణం, ఫ్లడ్ మానేరు, ప్రాణహిత, చేవెళ్ల, దేవాదుల ప్రాజెక్ట్‌ల నిర్మాణం వైఎస్ హయాంలోనే రూపకల్పన జరిగిందని తెలిపారు. వైఎస్ మరణం తీరని లోటని, ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారని, ముఖ్యమంత్రి వైఎస్‌ను ఎన్నటికీ మరువలేరని పేర్కొన్నారు. రైతులకు ఉచితవిద్యుత్ అందించిన ఘనత వైఎస్.రాజశేఖరరెడ్డికే దక్కిందన్నారు.
ఆయన హయాంలో జగిత్యాల నియోజకవర్గం 1500 కోట్లతో అభివదిృ చెందిందన్నారు. జగిత్యాలలో జేఎన్‌టీయూ కళాశాల ఏర్పా టు, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లా ప్రజ లకు రాకపోకల కోసం కమ్మునూర్ వంతెన నిర్మాణం చేపట్టినట్లు చెప్పారు. కరీంనగర్‌లో శాతవాహన యూనివర్సిటీ, జగిత్యాలలో న్యాక్‌సెంటర్, మహిళా డిగ్రీ కళాశాల, పీజీ కళాశాల ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. హైదరాబాద్‌లో నిర్మించిన ఔటర్ రింగ్‌రోడ్ ప్రపంచంలోనే గుర్తింపు పొందిందన్నారు. మెట్రోలైన్ రూపకల్పన, పీవీ ఎక్స్‌ప్రెస్, ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు తదితర ఇలాంటి ఎన్నో అభివృద్ధి పనులు వైఎస్.హయాంలో చోటుచేసుకున్నాయి. ఆయన ఇప్పటికీ ప్రజలగుండెల్లో నిలిచిపోయారని పేర్కొన్నారు.
వైఎస్సార్ జయంతి వేడుకలకు ఏర్పాట్లు
వైఎస్.రాజశేఖరరెడ్డి జయంతిని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి తెలిపారు. ప్రతి ఆస్పత్రిలో పండ్లు పంపిణీచేయడంతో పాటు వివిధ కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ హాజరై విజయవంతం చేయాలని కోరారు.
Advertisement
Advertisement