'నయీం డైరీని బయటపెట్టాలి'
Published Mon, Dec 19 2016 1:14 PM | Last Updated on Wed, Aug 15 2018 9:37 PM
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో సోమవారం గ్యాంగ్ స్టర్ నయీంపై ప్రతిపక్షాలు అధికార టీఆర్ఎస్ పార్టీని ప్రశ్నించాయి. ఈ విషయంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ప్రశ్నలతో అధికార పక్షాన్ని ఉక్కిరిబిక్కరి చేశారు. నయీం డైరీని బయటపెట్టాలని డిమాండ్ చేశారు. డైరీ బయటపడితే అందరి పాత్ర బయటకొస్తుందని అన్నారు.
జీవన్ రెడ్డి ప్రశ్నలకు స్పందించిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు నయీం ఆస్తులు, కేసు విచారణ తదితరాలను వివరించారు. వీటిపై స్పందించిన జీవన్ రెడ్డి కేసుతో సంబంధమున్న అధికారులను ఇంకా ఎందుకు అరెస్టు చేయలేదని కేసీఆర్ కు సూటి ప్రశ్న వేశారు. నయీం కేసుపై సీబీఐ విచారణ జరిపిస్తే అసలు విషయాలు వెలుగులోకి వస్తాయని అన్నారు.
Advertisement
Advertisement