విజయనగరం ఫోర్ట్: కరువు ప్రాంతాలుగా ప్రకటించిన మం డలాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇన్‌పుట్ సబ్సిడీ(పెట్టుబడి రాయి తీ) పేరుతో ఆర్థిక సాయం అం దివ్వాల్సి ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం విజయనగరం జిల్లా కు ఆ నిధులు విడుదల చేయడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. వీటిని కొన్ని జిల్లాలకు విడుదల చేసి... ఈ జిల్లాను విస్మరించడంపై విమర్శలు వినిపిస్తున్నా యి. గత ఏడాది ఖరీఫ్‌లో జిల్లాలోని ఆరు మండలాల్లో కరువు ఏర్పడింది. ప్రభుత్వం సైతం గంట్యాడ, విజయనగరం,మెంటాడ, దత్తిరాజేరు, కొత్తవలస, వేపాడ మండలాలను కరువు మండలాలుగా ప్రకటించింది.
ఈ మండలాల్లో 2108.5 హెక్టార్లకు చెందిన 73.057మంది రైతులకు రూ.3.16 కోట్లు నిధులు అవసరమని జిల్లా వ్యవసాయాధికారులు లెక్కగట్టి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ఇలా విజయనగరం జిల్లాతో పాటు రాష్ట్రంలోని మరికొన్ని జిల్లాల్లోగల 300కు పైగా మండలాలను ప్రభుత్వం కరువు మండలాలుగా ప్రకటించింది. ఇటీవల అధికశాతం మండలాలకు ప్రభుత్వం ఇన్‌పుట్ సబ్సిడీ నిధులను విడుదల చేసింది. కాని విజయనగరం జిల్లాకు మాత్రం విడుదల చేయలేదు. దీంతో రైతులు ఇదేం తీరు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్ని రకాలుగా వెనుకబడిన విజయనగరం జిల్లాకు నిధులు విడుదల చేయడంలో తాత్సారం చేయడం తగదని వాపోతున్నారు.
10 నెలలుగా ఎదురు చూపులు
ప్రకృతి సహకరించక ఆరు మండలాల రైతాంగం ఎంతో నష్టాన్ని చవిచూసింది. కనీసం ఆదుకోవాల్సి సర్కారు సాయం అందివ్వడానికి మీన మేషాలు లెక్కిస్తోంది. మళ్లీ ఖరీఫ్ వచ్చేస్తోంది. రైతాంగం సాగుజూదానికి సమాయత్తమవుతోంది. గడచిన పది నెలలుగా రైతులు వాటికోసం ఎదురుచూస్తున్నా... సర్కారులో చలనం లేదు. దీనిపై వ్యవసాయ శాఖ డెప్యూటీ డైరెక్టర్ అప్పలస్వామివద్ద సాక్షి ప్రస్తావించగా జిల్లాకు ఇన్‌పుట్ సబ్సిడీ ని«ధులు ఇంతవరకు విడుదల కాని మాటవాస్తవమేనని తెలిపారు. అవి రాగానే అందజేస్తామని పేర్కొన్నారు.
ఎందుకంత వివక్ష?
Published Tue, Jun 6 2017 10:30 PM | Last Updated on Tue, Sep 5 2017 12:57 PM
Advertisement
Advertisement