వరుణుడు ఎప్పుడు కరుణిస్తాడో తెలియదు. వర్షాల్లేక నారుమడులు వేయడానికి రైతులు సాహించడం లేదు. పరిస్థితులు ఆశాజనకంగా లేకపోవడంతో నాట్లు పడటం లేదు. జిల్లా కరువు వైపు అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో ఎప్పటికప్పుడు పరిస్థితులను అంచనావేస్తూ రైతులకు మార్గదర్శనం వహించవలసిన అధికారులు అచేతనంగా ఉండిపోతున్నారు. అధికారుల మధ్య సమన్వయం కానరావడం లేదు. ఖరీఫ్‌కు సంబంధించి ఇంతవరకు కన్వర్జెన్సీ(కలయక) సమావేశమే నిర్వహించలేదు. దీంతో ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా అధికారులు వ్యవహరిస్తున్నారు. చెరువులు, ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో నీరెంత ఉందో వ్యవసాయ అధికారులకు తెలియదు. ఎక్కడెంత సాగు అవుతుందో ఇరిగేషన్ అధికారులకు తెలియదు. నీరెప్పుడు విడుదల చేస్తారో తెలియక వ్యవసాయ అధికారులు రైతులకు దిశా నిర్ధేశం చేయడం లేదు. దీంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
సాక్షి ప్రతినిధి, విజయనగరం : ఖరీఫ్‌లో లక్షా 19వేల 472హెక్టార్లలో వరి సాగవుతుందని వ్యవసాయ శాఖ అధికారుల అంచనా. రుతుపవనాల ఆగమనంతో వర్షాలు పడ్డాయి. కాకపోతే ఊరించి ఉసూరుమనిపించాయి. ఆ తర్వాత వర్షాలు పడలేదు. దీంతో 60శాతం(5751హెక్టార్లలో) మేర నారుమడులు వేశారు. 3,855హెక్టార్లలో(3.2శాతం) మాత్రమే ఇంతవరకు నాట్లు పడ్డాయి. సాధారణంగా జూలై నెలలో 40శాతం మేర నాట్లు పడాలి. ముఖ్యంగా పార్వతీపురం డివిజన్‌లో నాట్లు పూర్తవ్వాలి. కానీ వర్షాలు పడకపోవడంతో పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉన్నాయి. జూలై 15నాటికి 178.7మిల్లీ మీటర్ల వర్షపాతం పడాల్సి ఉండగా కేవలం 78.5 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. దాదాపు 100 మిల్లీమీటర్ల మేర తేడా ఉంది. దీన్నిబట్టి పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పక్షం రోజుల్లో ఆశించిన మేర వర్షాలు పడకపోతే
మున్సిపాలిటీలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించగా.. మద్దతుగా పాల్గొన్న సాలూరు ఎమ్మెల్యే పీడిక.రాజన్నదొర మాట్లాడుతూ చంద్రబాబు నిరంకుశ వైఖరిపై ధ్వజమెత్తారు. విజయనగరం మున్సిపాలిటీలో మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన దీక్షలు చేపట్టగా సీపీఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ, జిల్లా కార్యవర్గ సభ్యుడు రెడ్డి.శంకరరావులు మద్దతు తెలిపారు. ప్రభుత్వం వైఖరిని నిరసిస్తూ బుధవారం విజయనగరం, బొబ్బిలి, సాలూరు, పార్వతీపురం మున్సిపల్ కార్యాలయాలను ముట్టడించనున్నట్లు మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా కార్యదర్శి టి.వి. రమణ ప్రకటించారు. ఈ ముట్టడి కార్యక్రమానికి రెగ్యులర్ కార్మికులు మద్దతునిస్తారని, పాలనవ్యవహారాలను పూర్తిగా స్తంభింపజేసి ప్రభుత్వానికి తమ సత్తా చూపిస్తామని హెచ్చరించారు.
కష్టకాలంలో రైతన్న... చేష్టలుడిగిన యంత్రాంగం!
Published Tue, Jul 21 2015 11:45 PM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement
Advertisement