సాక్షి, విజయవాడ: రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కురిసిన అకాల భారీ వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు ఈ నెల 27న ఇన్‌పుట్ సబ్సీడీ అందించనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... చరిత్రలో ఎన్నడూ ఇంత త్వరగా ఏ ప్రభుత్వం ఇన్‌పుట్ సబ్సీడీ ఇవ్వలేదన్నారు. రైతులను ఆదుకునేందుకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. వరదకి, వర్షానికి తేడా తెలియకుండా లోకేష్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వంలో రైతులకు 2 వేల కోట్ల రూపాయల ఇన్‌పుట్ సబ్సీడీకి ఎగణామం పెట్టారని ఆరోపించారు. (చదవండి: ఉల్లి విషయంలో ఏపీ ప్రభుత్వం తీపి కబురు)
ఆ బకాయిలు కూడా సీఎం వైఎస్ జగన్ రైతులకు అందించారని తెలిపారు. టీడీపీ హాయాంలో రైతులకు రూ. 1,075 కోట్ల వడ్డీ లేని రుణాల మొత్తాన్ని ఎగనామం పెడితే తామోచ్చాక చెల్లించామన్నారు. పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు చేసిన పాపాలు వెంటాడుతున్నాయని వ్యాఖ్యానించారు. ప్యాకేజీ పేరుతో చంద్రబాబు పోలవరం ప్రాజెక్ట్‌ను గందరగోళంలో పడేస్తే.. ఇప్పుడు అదే అంశాలను కేంద్ర ప్రభుత్వం చెప్తోందని మంత్రి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment