తాడేపల్లి: మరోమారు రైతన్నలకు ఇన్‌పుట్ సబ్సిడీ ఇచ్చేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వం సిద్ధమైంది. 2021 నవంబర్‌లో కురిసిన భారీ వర్షాలు, వరదలకు నష్టపోయిన పంటలకు సీఎం వైఎస్ జగన్ ఇన్‌పుట్ సబ్సిడీ పంపిణీ చేయనున్నారు. రేపు(మంగళవారం) తన క్యాంపు కార్యాలయం నుంచి రైతన్నల అకౌంట్లలో సీఎం జగన్ జమ చేయనున్నారు.
మొత్తం 5.71 లక్షల మంది రైతన్నలకు 534.77 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీని ఏపీ ప్రభుత్వం అందించనుంది. దీని ద్వారా 1220 రైతు గ్రూపులకు వైఎస్సార్ యంత్ర సేవాపథకం కింద 29.51 కోట్ల లబ్ధి చేకూరనుండగా, ఇన్‌పుట్ సబ్సిడీ, యంత్ర సేవా పథకం కలిపి మొత్తం 564.28 కోట్లు పంపిణీ చేయనున్నారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోయిన 19.93 లక్షల మంది రైతులకు 1612 కోట్ల సాయం అందించారు.
Comments
Please login to add a commentAdd a comment