అనంతపురం అర్బన్ : జిల్లాలో తీవ్ర కరువు పరిస్థితి నెలకొనడంతో రైతులు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని, వారిని ఆదుకోవడానికి ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ.1,248 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీని వెంటనే విడుదల చేయాలని కలెక్టర్ కోన శశిధర్‌ను వైఎస్సార్ సీపీ జెడ్పీ ఫ్లోర్‌లీడర్ వెన్నపూస రవీంద్రారెడ్డి కోరారు. రెవెన్యూ భవనంలో మీకోసం కార్యక్రమంలో కలెక్టర్‌ను సోమవారం ఆయన కలిశారు. ఈ సందర్భంగా రవీంద్రారెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలోని 12, 63, 604 మంది రైతులు పరిహారం కోసం ఎదురుచూస్తున్నారన్నారు.
అందులో 2013 ఖరీఫ్‌లో రూ. 643 కోట్లు, 2014లో రూ. 573 కోట్లు, 2011-12 సంవత్సరానికి సంబంధించిన బకాయిలు రూ. 32 కోట్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. టీడీపీది పూర్తిగా రైతు వ్యతిరేక ప్రభుత్వమని, రైతులు కష్టాల్లో ఉన్న కనికరించడంలేదన్నారు. జిల్లా రైతుల పరిస్థితి దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం కళ్లు తెరిచి వెంటనే ఇన్‌పుట్ సబ్సిడీని విడుదల చేయాలని కోరారు.
ఇన్‌పుట్ సబ్సిడీ విడుదల చేయండి
Published Tue, Mar 10 2015 2:34 AM | Last Updated on Thu, Mar 21 2019 7:27 PM
Advertisement