తొలకరి పలకరించింది. మళ్లీ ఖరీఫ్ సీజన్ రానే వచ్చింది. కోటి ఆశలతో పంటల సాగుకు సిద్ధమవుతున్న రైతులకు పెట్టుబడులను...
అమలుకాని కేబినెట్ నిర్ణయం..
సాక్షి, హైదరాబాద్: తొలకరి పలకరించింది. మళ్లీ ఖరీఫ్ సీజన్ రానే వచ్చింది. కోటి ఆశలతో పంటల సాగుకు సిద్ధమవుతున్న రైతులకు పెట్టుబడులను సమకూర్చుకోవడం సవాలుగా మారింది. రుణమాఫీ విషయంలో సర్కారు మాటతప్పడంతో గత ఖరీఫ్‌లోనే బ్యాంకులు అప్పులు ఇవ్వలేదు. ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి ఎక్కువ వడ్డీకి అప్పులు చేసి మరీ పంటలు సాగు చేసినా గతేడాది ఆశించిన ఫలితం రాలేదు.
ఇలా పంటలు నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ అందించి వచ్చే ఖరీఫ్ సాగుకు పెట్టుబడుల సమస్య లేకుండా చూస్తామని రాష్ట్రప్రభుత్వం చెప్పింది. ఈ మేరకు రూ.1,067.77 కోట్లను ఇన్‌పుట్ సబ్సిడీగా తక్షణమే అందిస్తామంటూ ఏప్రిల్ 22న హామీ ఇచ్చింది. కానీ ఇంతవరకూ ఒక్క పైసా మంజూరు కాలేదు. మళ్లీ ఖరీఫ్ వచ్చేసింది. సాగుకు పెట్టుబడులు సమకూర్చుకోవడం పెనుసవాలుగా మారింది. దీంతో పల్లెల్లో రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు.