ఏకకాలంలో రుణమాఫీ చేయాలి
పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్
నేరేడుచర్ల: రైతు రుణమాఫీని ఏకకాలంలో చేయాలని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లా పాలకీడు మండలం జాన్‌పహాడ్‌లో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రుణమాఫీ నిధులు సక్రమంగా విడుదల చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఏప్రిల్‌లో విడుదల చేయాల్సిన మూడో విడత రుణమాఫీ నిధులు అక్టోబర్ వచ్చినా సగమే రావడంతో రైతుల ఖాతాల్లో బ్యాంకర్లు జమ చేయడం లేదన్నారు.
ఏకకాలంలో మాఫీ చేస్తే రాష్ట్రంలో 40 లక్షల మందికి ప్రయోజనం చేకూరుతుందన్నారు. గ్రామీణ ప్రాంతాలు ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోగా బ్యాంకర్లు పంట రుణాలు ఇవ్వకపోవడంతో ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి రైతులు నలిగిపోతున్నారన్నారు. గత సంవత్సరం పంట నష్టం కింద కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఇన్‌పుట్ సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం ఇతర శాఖలకు మళ్లించడం శోచనీయమన్నారు.