రుణమాఫీపై రైతుల్లోకి: ఉత్తమ్
9న పెద్ద ఎత్తున సోనియా కృతజ్ఞతా దినోత్సవం
సాక్షి, హైదరాబాద్: రుణమాఫీపై పెద్ద ఎత్తున రైతుల నుంచి దరఖాస్తులను తీసుకోవాలని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు. మహబూబ్‌నగర్, మెదక్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన ముఖ్యనేతలతో ఆయన గాంధీభవన్ లో సోమవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పతీ నియోజకవర్గానికి కనీసం 20 వేలకు తగ్గకుండా రైతుల నుంచి దరఖాస్తులను తీసుకోవాలని ఉత్తమ్ అన్నారు.
ఈ నెల 9న సోనియాగాంధీ జన్మ దినం సందర్భంగా తెలంగాణ కృతజ్ఞతా దినోత్సవంగా రాష్ట్రమంతటా, ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలను నిర్వహించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులతో కలిపి ఈ నెల 20న ఇందిరాపార్కు వద్ద ఒకరోజు నిరసన దీక్ష నిర్వహించాలని సూచించారు. సమావేశాల్లో మాజీమంత్రులు, డీసీసీ అధ్యక్షులు, నియోజకవర్గాల ఇన్‌చార్జీలు, ముఖ్యనేతలు పాల్గొన్నారు.