19 నుంచి ఇన్‌పుట్‌ సబ్సిడీ పత్రాల పంపిణీ | input subsidy certificate issue from 19th | Sakshi
Sakshi News home page

19 నుంచి ఇన్‌పుట్‌ సబ్సిడీ పత్రాల పంపిణీ

Published Tue, Jun 13 2017 11:20 PM | Last Updated on Fri, May 25 2018 1:22 PM

input subsidy certificate issue from 19th

కర్నూలు(అగ్రికల్చర్‌): 2016 కరువుకు సంబంధించి 26 మండలాల్లో ఇన్‌పుట్‌ సబ్సిడీ మంజూరు పత్రాలు పంపిణీ చేసేందుకు కార్యాచరణ ప్రణాళికను అధికారులు సిద్ధం చేశారు. ఇన్‌పుట్‌ సబ్సిడీ కింద ప్రభుత్వం జిల్లాకు రూ.325 కోట్లు మంజూరు చేసింది. అయితే నిధులు మాత్రం విడుదల కాలేదు. ముందుగా 26 మండలాల్లో ఏ రైతుకు ఎంత ఇన్‌పుట్‌ సబ్సిడీ మంజూరైంది.. తదితర వివరాలతో పత్రాలు పంపిణీ చేయాలని ఆదేశించింది. ఇందులో భాగంగా ఈ నెల 19 నుంచి 25వ తేదీ వరకు గ్రామ సభలు నిర్వహించి ఇన్‌పుట్‌ సబ్సిడీ పత్రాలు పంపిణీ చేస్తారని జేడీఏ ఉమామహేశ్వరమ్మ తెలిపారు. అయితే రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీతో పాటు ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన, వాతావరణ భీమా పరిహారాలు వస్తే ఇందులో ఏది ఎక్కువగా ఉంటే దానిని మాత్రమే ఇస్తారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement