ఏడీఏలకు ఇన్ పుట్ పంపిణీ బాధ్యత
Published Mon, Jun 19 2017 11:38 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM
అనంతపురం అగ్రికల్చర్ : ఇన్పుట్ సబ్సిడీ పంపిణీ బాధ్యత వ్యవసాయ సహాయ సంచాలకుల (ఏడీఏలు)కు అప్పగించారు. గతంలో వీరి భాగస్వామ్యం లేకుండా ఏవోలు కీలకంగా వ్యవహరించారు. జిల్లా స్థాయి ఇన్పుట్ సెల్ అధికారులు పర్యవేక్షించారు. మిస్‌మ్యాచింగ్ జాబితాలు పెరిగిపోవడం, వాటిని సరిచేసుకునేందుకు రైతులు పడుతున్న అవస్థలు పరిగణనలోకి తీసుకుని ఈసారి డివిజ¯ŒS స్థాయిలోనే వీటికి ఫుల్‌స్టాప్ పెట్టేందుకు ఏడీఏలకు బాధ్యత అప్పగించారు. ఆది, సోమవారం డివిజ¯ŒS ఏడీఏలు, వారి పరిధిలోని ఏవోలందరూ స్థానిక జేడీఏ కార్యాలయంలో మకాం వేసి జాబితాలు క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ–క్రాప్ బుకింగ్ సమయంలో వివరాలన్నీ తెలుగులో నమోదు చేశారు. ఇప్పుడు వాటిని ట్రెజరీకి సమర్పించడానికి ఇంగ్లిష్‌లోకి మారుస్తున్నారు. అలాగే డబుల్ ఎంట్రీలు, ఒక మండలం కాకుండా ఇతర మండలాల్లోనూ భూములున్న వారి పేర్లు ఆధార్‌తో అనుసంధానం చేసి తీసివేసే ప్రక్రియ కొనసాగిస్తున్నారు. రెండు, మూడు రోజుల్లో తొలివిడతగా పరిహారం విడుదలయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
Advertisement