రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ విడుదల విషయంలో చంద్రబాబు సర్కార్ కుటిల వైఖరిని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీలో ఎండగట్టారు. ఎన్నికల హమీలను తుంగలోకి తొక్కి ప్రభుత్వం రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ ఎగరగొట్టిందని ఆయన ఆరోపించారు. 2013 నుంచి మొత్తం రూ. 8వేల కోట్లకు గాను సర్కార్ ఇచ్చింది కేవలం రూ. 1500కోట్లు మాత్రమేనని... మిగిలిన రూ.6వేల 400 కోట్ల సంగతేంటని వైఎస్ జగన్ నిలదీశారు.