‘ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం అరాచకాలకు పాల్పడుతోంది. రైతులు, రైతు కూలీలను బెదిరించి బలవంతంగా భూములు గుంజుకుంటోంది. గతంలో రైతుల బతుకులను నాశనం చేసిన చక్రవర్తులు, పాలెగాళ్లు, భూస్వాములు మట్టి కొట్టుకుపోయారు. ప్రస్తుత ప్రభుత్వానికీ అదే గతి పడుతుంది’’ అని సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ వి.గోపాల గౌడ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు