నష్టాల్లో ఉన్న రైతులను వెంటనే ఆదుకోండి: రాష్ట్రాలకు కేంద్రం విజ్ఞప్తి | immediate assist to farmers from the State Disaster Relief Fund, asked central government | Sakshi
Sakshi News home page

నష్టాల్లో ఉన్న రైతులను వెంటనే ఆదుకోండి: రాష్ట్రాలకు కేంద్రం విజ్ఞప్తి

Published Sun, Mar 29 2015 5:38 PM | Last Updated on Sat, Sep 2 2017 11:33 PM

immediate assist to farmers from the State Disaster Relief Fund, asked central government

న్యూఢిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రాష్ట్ర విపత్తు నిర్వహణ నిధి(ఎస్డీఆర్ఎఫ్) నుంచి అన్ని రాష్ట్రాలకు తక్షణసాయం కింద రూ. 5270 కోట్లు విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను కోరింది. రాష్ట్ర విపత్తు నిర్వహణ నిధి నిబంధనల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు వర్షాభావ ప్రాంతాల్లోని రైతులకు ఒక్కో హెక్టారుకు రూ.4500, నీటిపారుదల పుష్కలంగా ఉన్న ప్రాంతాలకు రూ. 9000, శాశ్వత పంటలకు ఎకరానికి రూ. 12,000 ఇన్ పుట్ సబ్సిడీ ఇవ్వడానికి అవకాశం ఉంది. అయితే రాష్ట్ర విపత్తు నిర్వహణ నిధిలోని నిధులకంటే వ్యయం ఎక్కువయ్యే పక్షంలో కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని కేంద్రం కోరింది. ప్రాథమిక నివేదిక ఆధారంగా రబీ సీజన్ లో వర్షాభావ పరిస్థితుల కారణంగా 13 రాష్ట్రాల్లోని 181 లక్షల హెక్టార్లలో పంట నష్టం సంభవించిందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement