అనంతపురం అగ్రికల్చర్ : పెట్టుబడిరాయితీ (ఇన్‌పుట్ సబ్సిడీ)కి సంబంధించి సోమవారం సాయంత్రానికి రూ.550 కోట్ల పరిహారం జాబితాలు అప్‌లోడ్ చేయడం పూర్తయిందని వ్యవసాయశాఖ జేడీ కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఇందులో రూ.330 కోట్ల జాబితాలు ట్రెజరీకి సమర్పించడం జరిగిందన్నారు. ట్రెజరీ నుంచి నేరుగా రైతుల ఖాతాల్లోకి పరిహారం జమ చేసే కార్యక్రమం రెండు మూడు రోజుల్లో మొదలు కావచ్చని తెలిపారు.