సాక్షి, కృష్ణా: ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీకి ఆర్టీసీ నోటిఫికేషన్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం నడుస్తోంది. అయితే ఈ ప్రచారాన్ని ఖండించింది ఏపీఎస్‌ఆర్టీసీ. తాము ఎటువంటి నోటిఫికేషన్ ఇవ్వలేదని చెబుతూ.. ఆ ప్రచారాన్ని నమ్మి మోసపోవద్దంటూ ఏపీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తోంది.
ఇదిలా ఉంటే.. ఏపీఎస్సార్టీసీలో డ్రైవర్ , కండక్టర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసినట్లు పెద్ద ఎత్తున ప్రచారం మొదలుపెట్టారు కొందరు. పైగా వాట్సాప్‌లో Apsrtc వెబ్ సైట్ డొమైన్ ను యాడ్ చేస్తూ నోటిఫికేషన్ అంటూ ప్రచారం చేశారు ఆ అగంతకులు. ఈ నేపథ్యంలో ఈ ప్రచారాన్ని ఖండించింది ఆర్టీసీ. అలాంటిదేమైనా ఉంటే తాము అధికారికంగానే ప్రకటించి రిలీజ్ చేస్తామని స్పస్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment