
వంశీ (ఫైల్)
ప్రేమ విఫలమైనందునే అతను ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు.
చాంద్రాయణగుట్ట: ఓ యువకుడు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. ఎస్సై శివతేజ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.ఇంద్రానగర్‌కు చెందిన శివరాజ్ కుమారుడు వంశీ (18) బ్యాండ్ కార్మికుడిగా పని చేసేవాడు. బుధవారం ఉదయం తన తల్లిని బైక్‌పై తీసుకెళ్లి ఫలక్‌నుమా వట్టెపల్లిలో వదిలేసిన వంశీ 11.30 గంటలకు తిరిగి వస్తానని చెప్పాడు. మధ్యాహ్నం అతను రాకపోవడంతో ఆమె ఫోన్ చేయగా స్పందించలేదు.
దీనికితోడు తన వాట్సాప్ స్టేటస్‌లో ‘ఫ్రెండ్స్ ఐయామ్ లివింగ్ మై లైఫ్’ అంటూ మెసేజ్ పెట్టడాన్ని గుర్తించిన అతని స్నేహితులు హుటాహుటిని ఇంటికి వచ్చారు. అప్పుడే అతని తల్లి అక్కడికి రావడంతో అందరూ తలుపులు బద్దలుకొట్టి చూడగా ఇంట్లో ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకొని కనిపించాడు. అతడిని కిందకు దింపి ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. ప్రేమ విఫలమైనందునే అతను ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు.