Matrimonial sites are platforms designed to match: ఇటీవల కాలంలో చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలకు మ్యాట్రిమోనియల్ సైట్‌ల ద్వారా తమ పిల్లలకు తగిన సంబంధాలను వెతుకుతున్నారు. ఈ మధ్య కాలంలో అలా ఒకటైన జంటలు కోకొల్లలు. అదేవిధంగా మ్యాటిమోని సైట్ల ద్వారా మోసపోయిన ఉదంతాలు ఉన్నాయి. ఏంటి ఇదంతా అనుకోకండి ఇక్కడొక తండ్రి ఎంతో ఆశతో తన కూతురుకి సరిపోయే వరుడి వివరాలు పంపిస్తే ఆమె ఏం చేసిందో తెలుసా?
వివరాల్లోకెళ్తే....ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు తగిన మంచి సంబంధాలను వెతికి తీసుకువ్చి మరీ పెళ్లిళ్లు చేస్తుంటారు. తమ పిల్లలు మంచి వ్యక్తులను పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలనే తల్లిదండ్రులు కోరుకుంటుంటారు. ఇది సర్వసాధారణం. పాపం బెంగుళూరులోని ఓ తండ్రి అలానే భావిస్తాడు. ఈ మేరకు అతను తన కూతురుకి తగిన వరుడుని మాట్రిమోనియల్ సైట్‌లలో వెతికి మరీ అతని వివరాలను వాట్సాప్ ద్వారా పంపించాడు. ఐతే ఆమె తన తండ్రికి ఊహించని షాక్ ఇచ్చింది. మాట్రిమోనియల్ సైట్‌లలో ప్రోఫెల్‌లో సదరు వ్యక్తుల పూర్తి సమాచారం ఉండటం సహజం.
ఆమె అతని ప్రోఫెల్ చూసి ముచ్చటపడి ఉద్యోగం ఇచ్చింది. ఇంతకీ ఆమె బెంగళూరులోని స్టార్ట్ అప్ కంపెనీ సహ వ్యవస్థాపకురాలు ఉదితా పాల్. అంతేకాకుండా తన తండ్రికి ఆ వ్యక్తికి లావదేవీలను సులభతరం చేసే ఫిన్‌టెక్‌లో ఏడేళ్ల అనుభవం ఉండటం వల్ల తన స్టార్టప్ కంపెనీలో ఉద్యోగం ఇచ్చానని అందువల్ల తనను క్షమించమని తండ్రికి సందేశం పంపింది. వాస్తవానికి చూసిన ప్రతీ సంబంధం కుదరకపోవచ్చు గానీ ఇలా ఆమె ఆ వ్యక్తికి ఉద్యోగం ఆఫర్ ఇచ్చిన తీరు ఆమెకు తన కెరీయర్ పట్ల ఉన్న నిబద్ధత తెలియజేస్తోంది. ఈ మేరకు ఉదితా పాల్ తనకు తన తండ్రికి మధ్య జరిగిన వాట్సాప్ సంభాషణను స్క్రీన్ షాట్ తీసి మరీ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వాట్సాప్ సంభాషణ ఆన్‌లైన్‌లో తెగ వైరల్ అవుతోంది.
What getting disowned from father looks like. pic.twitter.com/nZLOslDUjq
— Udita Pal 🧂 (@i_Udita) April 29, 2022
Comments
Please login to add a commentAdd a comment