పెళ్లి అనంగానే ఎంత ఆర్భాటంగా జరుగుతుందో అంతే రేంజ్‌లో వేస్ట్ వస్తుంది. ముఖ్యంగా ప్లాస్టిక్ వేస్టేజ్ ఎక్కువగానే ఉంటుంది. మంచినీళ్ల బాటిళ్ల దగ్గర నుంచి భోజనాల వరకు ప్లాస్టిక్ వేస్టేజ్ ఎక్కువగానే వస్తుంది. అలాంటి వాటికి చోటివ్వకుండా శభాష్ అనేలా ఎకో ఫ్రెండ్లీగా పెళ్లి చేసుకుంది ఓ జంట. ఒకరకంగా చెప్పాలంటే 'జీరో వేస్ట్ వెడ్డింగ్'కి అసలైన నిర్వచనంగా నిలిచింది ఆ దంపతుల పెళ్లి.
బెంగుళూరులోని వధువరులు అందరికీ ఆదర్శంగా నిలిచేలా జీరో వేస్ట్ వెడ్డింగ్‌ని జరుపుకుంది. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా వధువు డాక్టర్ పూర్వీ భట్ షేర్ చేసుకుంది. ఇది తన కల అని, కేవలం తన కుటుంబం సహకారం వల్లే సాధ్యమయ్యిందని ఆనందంగా చెప్పుకొచ్చింది. భూమాతను కాలుష్యం కోరల నుంచి రక్షించుకునేందుకే తాను ఇలాంటి వివాహం చేసుకోవాలనుకున్నట్లు తెలిపింది. ముఖ్యంగా తన తల్లి సహకారంతోనే ఇలా జీరో వేస్ట్ వివాహాన్ని చేసుకోగలిగానని అంటోంది.
అంతేగాదు ఆ పెళ్లి తంతుకు సంబంధించిన వీడియోని కూడా షేర్ చేసింది. ఆ వీడియోలో పెళ్లి మండపాన్ని చెరకు గడలతో నిర్మించారు. డెకరేషన్‌కి మామిడి ఆకులు, కొబ్బరి ఆకులను వినియోగించారు. భోజనాలను అరటి ఆకుల్లో వడ్డించగా, వధువరుల దండలను పువ్వులు, పత్తిదారలతో రూపొందించినవి ఉపయోగించారు. అలాగే రిటర్న్ గిఫ్ట్‌గా కూడా జ్యూట్ బ్యాగ్‌లను ఇచ్చారు. ఎక్కడ ఇసుమంత ప్లాస్టిక్ గానీ, పేపర్‌ని గాని వినియోగించలేదు.
పైగా ఈ తంతు ముగిసిన వెంటనే ఆ పెళ్లి మండపానికి ఉపయోగించిన చెరుకుగడలను గోవులకు తినిపించగా, మిగతా ఆకుల వేస్ట్ అంతా పోలాలకు ఉపయోగపడేల కంపోస్ట్ ఎరువుగా మార్చారు. అలాగే పెళ్లిలో పెద్ద ఎత్తున వినియోగించే వాటర్ వేస్ట్‌ని చెట్లకు వెళ్లేలా మళ్లించారు. ఎక్కడా..నీళ్ల దగ్గర నుంచి ప్రతి వస్తువు తిరిగి భూమిలోనే ఇంకిపోయేలా ఉండే ఎకోఫ్రెండ్లీ వస్తువులనే ఉపయోగించారు ఆ వధువరుల తల్లిదండ్రులు. ఇలాంటి వివాహాన్ని జరిపించినందుకు వధువు డాక్టర్ భట్ తన తల్లిని అభినందించి కూడా. ఇంకెందుకు ఆలస్యం ఆ వీడియోని మీరు కూడా వీక్షించండి.
(చదవండి: చింత వద్దిక.. చింత చిగురు ఉందిగా..)
Comments
Please login to add a commentAdd a comment