Waste
-
ఆహార వృథాను తగ్గిస్తూ.. ఆకలి తీరుస్తూ.. స్విగ్గీ కొత్త కార్యక్రమం
ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ దేశవ్యాప్తంగా ఆహార వృథాను అరికడుతూ, పేదల ఆకలిని తీర్చేందుకు కొత్తగా ‘స్విగ్గీ సర్వ్స్(Swiggy Serves)’ పేరుతో సేవలు ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. ఆహార వృథాను కట్టడి చేసేందుకు మిగులు ఆహారాన్ని పేదలకు పంపిణీ చేయనున్నట్లు పేర్కొంది. ఇందుకోసం రాబిన్ హుడ్ ఆర్మీ (RHA) అనే స్వచ్ఛంద సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు తెలిపింది.స్విగ్గీ సర్వీసెస్ రెస్టారెంట్లు, డెలివరీ భాగస్వాముల విస్తృత నెట్వర్క్ నుంచి మిగులు ఆహారాన్ని గుర్తించి, దాన్ని సేకరించేందుకు రాబిన్ హుడ్ ఆర్మీ సహకారం తీసుకోనున్నట్లు స్విగ్గీ పేర్కొంది. తినదగిన ఆహారం వృథా కాకుండా ఆకలితో ఉన్న పేదలకు పంపిణీ చేస్తామని చెప్పింది. పైలట్ దశలో స్విగ్గీ సర్వీసెస్ 126కి పైగా రెస్టారెంట్లతో ఈ మేరకు ఒప్పందం చేసుకుంది. ప్రాథమికంగా 33 నగరాల్లో ఈ సర్వీస్‌ను ప్రారంభించినట్లు కంపెనీ అధికారులు తెలిపారు.ప్రతిష్టాత్మక లక్ష్యాలుఈ కార్యక్రమం ద్వారా తినదగిన ఆహారం వృథా కాకుండా 2030 నాటికి 50 మిలియన్ల మందికి భోజనం అందించాలనే లక్ష్యం ఏర్పాటు చేసుకున్నట్లు స్విగ్గీ(Swiggy), ఆర్‌హెచ్‌ఏ తెలిపాయి. ఇది సామాజిక బాధ్యత పట్ల స్విగ్గీ నిబద్ధతను, స్థిరమైన, సమ్మిళిత పర్యావరణ వ్యవస్థను సృష్టించడానికి చేసే ప్రయత్నాలకు నిదర్శనమని అధికారులు పేర్కొన్నారు.టెక్నాలజీ అండస్విగ్గీ సర్వీసెస్ విజయానికి సాంకేతిక పరిజ్ఞానం కీలకంగా మారింది. మిగులు ఆహార సేకరణ, పునఃపంపిణీని సమన్వయం చేయడంలో స్విగ్గీ ప్లాట్‌ఫామ్ కీలక పాత్ర పోషించనుంది. ఆహార మిగులును అంచనా వేయడానికి, ఆహార పునఃపంపిణీ లాజిస్టిక్స్‌ను ఆప్టిమైజ్ చేయడానికి అధునాతన అల్గారిథమ్‌లను అమలు చేయాలని కంపెనీ యోచిస్తోంది. భోజనం అవసరమైన వారికి నాణ్యత ప్రమాణాలతో సమర్థవంతంగా చేరేలా చూస్తుంది.ఈ సందర్భంగా స్విగ్గీ ఫుడ్ సీఈఓ రోహిత్ కపూర్ మాట్లాడుతూ..‘స్విగ్గీ సర్వ్స్తో కొత్త ప్రయత్నం చేస్తున్నాం. ఇందుకు ఆర్‌హెచ్‌ఏ సహకారం కీలకం. ఆహారం వృథాను, ఆకలి సమస్యను ఏకకాలంలో పరిష్కరించడానికి ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుంది. మా రెస్టారెంట్ భాగస్వాముల నుంచి అవసరమైన వారికి ఆహారాన్ని పునఃపంపిణీ చేయడానికి ఆర్హెచ్ఏతో భాగస్వామ్యం ఎంతో దోహదం చేస్తుంది. ప్రస్తుతం 33 నగరాల్లో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. త్వరలో మరిన్ని ప్రాంతాలకు ఈ సర్వీసును విస్తరిస్తాం’ అని అన్నారు. రాబిన్ హుడ్ ఆర్మీ సహ వ్యవస్థాపకుడు నీల్ ఘోస్ మాట్లాడుతూ..‘ఆకలిని తగ్గించే ఈ భాగస్వామ్య మిషన్ కోసం రాబిన్ హుడ్ ఆర్మీ స్విగ్గీతో కలిసి పని చేయడం ఆనందంగా ఉంది. ఆకలి సమస్యను తీర్చేందుకు ఇతరులను ప్రేరేపించడం మంచి పరిణామం’ అన్నారు.స్విగ్గీ సర్వ్స్లో ఎలా చేరాలంటే..రెస్టారెంట్ భాగస్వాములు స్విగ్గీ ఓనర్ యాప్‌లోని ఫామ్‌ను పూరించడం ద్వారా ఈ స్విగ్గీ సర్వ్స్లో చేరవచ్చని కంపెనీ తెలిపింది. తర్వాతి సమన్వయం కోసం ఆర్‌హెచ్‌ఏ రెస్టారెంట్ భాగస్వాములతో వాట్సప్ సమూహాల ద్వారా కమ్యునికేట్ అవుతుందని తెలిపింది. ఆర్‌హెచ్‌ఏ వాలంటీర్లు ఈ భాగస్వాముల నుంచి మిగులు ఆహారాన్ని సేకరించి, అవసరమైన వారికి పంపిణీ చేసే బాధ్యతను తీసుకుంటారు.తలసరి 55 కిలోల ఆహారం వృథాఐక్యరాజ్యసమితి వివరాల ప్రకారం భారతదేశంలో దాదాపు 195 మిలియన్ల మంది పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. ప్రపంచంలోని పోషకాహార లోపం ఉన్న జనాభాలో నాలుగోవంతు మంది మన దేశంలోనే ఉన్నారు. 2024లో గ్లోబల్ హంగర్ ఇండెక్స్ (GHI)లో 127 దేశాల్లో భారత్ 105వ స్థానంలో నిలిచింది. దేశంలో ఏటా తలసరి 55 కిలోల ఆహారాన్ని వృథా చేస్తున్నారు.ఇదీ చదవండి: రేడియో వ్యాపారం మూసివేతరాబిన్ హుడ్ ఆర్మీరాబిన్ హుడ్ ఆర్మీ (RHA) అనేది వేలకొద్దీ యువకులు, పదవీ విరమణ చేసిన వ్యక్తులు, గృహిణులు, కళాశాల విద్యార్థులు వాలంటీర్లుగా ఉన్న స్వచ్చంద సంస్థ. ఎలాంటి లాభాపేక్ష లేని ఈ సంస్థలో వాలంటీర్లను రాబిన్స్ అని పిలుస్తారు. ఈ వాలంటీర్లు రెస్టారెంట్లు/ పెళ్లిల్లు/ ఇవత కార్యక్రమాల నుంచి మిగులు ఆహారాన్ని సేకరించి ఆకలితో ఉన్నవారికి పంపిణీ చేస్తారు. పదేళ్లలో RHA ప్రపంచవ్యాప్తంగా 406 నగరాల్లో 153 మిలియన్ల మందికి పైగా భోజనాన్ని అందించింది. ప్రస్తుతం 13 దేశాల్లో 2,60,000+ మంది రాబిన్స్ ఉన్నారు. -
యూనియన్ కార్బైడ్ వ్యర్థాలను 6 వారాల్లోగా తొలగించండి
భోపాల్: భోపాల్‌లోని యూనియన్ కార్బైడ్ కర్మాగారంలోని వ్యర్థాల తొలగింపుపై మధ్యప్రదేశ్ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఆరు వారాల గడువిచ్చింది. పితంపూర్‌లోని వ్యర్థాల ట్రీట్మెంట్ ప్లాంట్‌లో వీటిని భద్రతా ప్రమాణాలకు లోబడి శుద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ విషయమై ఎలాంటి అసత్య వార్తలను వార్తలను ప్రసారం చేయరాదని కూడా ప్రింట్, ఆడియో, విజువల్ మీడియాను ఆదేశించింది. మీడియాతోపాటు సామాజిక మాధ్యమాల్లో యూనియన్ కార్బైడ్ వ్యర్థాల తరలింపుపై తప్పుడు, నిరాధార వార్తలు ప్రసారం కావడంతో పితంపూర్ వాసులు తీవ్ర నిరసనలకు పూనుకోవడం తెలిసిందే. జనవరి 2వ తేదీన మూతబడిన కార్బైడ్ కర్మాగారంలోని వ్యర్థాలను 12 సీల్డ్ కంటెయినర్లలో భోపాల్‌కు 250 కిలోమీటర్ల దూరంలోని పితంపూర్కు తరలించారు. స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో ఆ కంటెయినర్లలోని వ్యర్థాలు అలాగే ఉండిపోయాయి. వీటిని ట్రక్కుల నుంచి కిందికి దించేందుకు మూడు రోజుల సమయం పడుతుందని ప్రభుత్వ న్యాయవాది తెలపగా, భద్రతా నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలని హైకోర్టు సూచించింది. ముందుగా ఆ వ్యర్థాల్లోని విష రసాయనాలు ఎంత మేరకు ప్రమాదకరమో పరీక్షించి, ఆ నివేదికను బహిరంగ పరుస్తామని, ప్రజల్లో ఉన్న భయాందోళనలను పోగొడతామని తెలిపారు. -
తొక్కలో ఇంధనం
తొక్కే కదా అని అలుసుగా చూడొద్దు! ఏమో రేపు అవే మన బైకులు.. కార్లు.. లారీలను నడిపే ఇం‘ధనం’గా మారొచ్చు! దేనిగురించి అనుకుంటున్నారా? అదేనండీ మనం కరకరలాడించే చిప్స్.. ఫ్రై.. కూరల్లో లొట్టలేసుకుంటూ లాగించే బంగాళాదుంపల సంగతిది. ఈ ఆలుగడ్డ తొక్కలు, వ్యర్థాల నుంచి బయో ఇంధనాన్ని ఉత్పత్తి(Biofuel Production) చేసే సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని కనిపెట్టారు మన శాస్త్రవేత్తలు. దీన్ని పరీక్షించేందుకు త్వరలో ప్రయోగాత్మక (పైలట్) ప్లాంటును కూడా ఏర్పాటు చేయనున్నారు. ఇది విజయవంతమైతే.. బంగాళా దుంపలతో బైక్ నడిపేయొచ్చన్నమాట!!సాక్షి, బిజినెస్ డెస్క్: బంగాళాదుంపల(potato) ఉత్పత్తిలో ప్రపంచంలోనే చైనా తర్వాత రెండో స్థానంలో ఉంది భారత్. అయితే, సరైన నిల్వ సదుపాయాల్లేక పంట చేతికొచ్చాక పాడైపోయే ఆలుగడ్డలు మొత్తం ఉత్పత్తిలో 10–15 శాతం ఉంటాయని అంచనా. మరోపక్క పొటాటో చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ వంటి ప్రాసెస్డ్ ఆహారోత్పత్తులను పెద్ద ఎత్తున తయారుచేసే స్నాక్స్ కంపెనీల నుంచి తొక్కలు ఇతరత్రా రూపంలో వేల టన్నుల వ్యర్థాలు వెలువడుతుంటాయి. వీటి నుంచి జీవ ఇంధనాన్ని (బయో ఫ్యూయల్–ఇథనాల్) ఉత్పత్తి చేసే టెక్నాలజీని సిమ్లాలోని సెంట్రల్ పొటాటో రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సీపీఆర్ఐ) రూపొందించింది. ల్యాబ్ పరీక్షలు కూడా పూర్తి కావడంతో, ఈ టెక్నాలజీని టెస్ట్ చేయడం కోసం పైలట్ ప్లాంటును నెలకొల్పేందుకు సన్నాహాలు చేస్తోంది.బంగాళాదుంప తొక్కలు, వ్యర్థాల నుంచి ఇథనాల్చెరకు, మొక్కజొన్నతో పాటు..దేశంలో ప్రస్తుతం చెరకు, మొక్కజొన్న నుంచి పెద్ద ఎత్తున ఇథనాల్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. వీటితోపాటు బంగాళాదుంపల వ్యర్థాలను కూడా ఇథనాల్ ఉత్పత్తికి ఫీడ్ స్టాక్‌గా ఉపయోగించేందుకు జాతీయ జీవ ఇంధన పాలసీలో ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ లభించింది. ‘ఆలుగడ్డల నుంచి గణనీయమైన వ్యర్థాలు ఉంటున్న నేపథ్యంలో ఇథనాల్ ఉత్పత్తికి వీటిని విలువైన ప్రత్యామ్నాయాలుగా పరిగణించవచ్చు’అని సీపీఆర్ఐ శాస్త్రవేత్త ధర్మేంద్ర కుమార్ పేర్కొన్నారు. దేశంలో ఏటా సగటున సుమారు 5.6 కోట్ల టన్నుల ఆలుగడ్డలు ఉత్పత్తి అవుతున్నాయి.ఇందులో 8–10 శాతం, అంటే 50 లక్షల టన్నులను పొటాటో చిప్స్, ఫ్రైస్, ఇంకా డీహైడ్రేటెడ్ ప్రాడక్టులుగా ప్రాసెస్ చేస్తున్నారు. ఆయా ప్లాంట్ల నుంచి భారీ మొత్తంలో తొక్కలు, ఇతరత్రా వ్యర్థాలు బయటికొస్తాయి. ఇక పంట చేతికొచ్చాక ఉత్పత్తి నష్టాలు 20–25 శాతం, అంటే సుమారు 1.1–1.4 కోట్ల టన్నుల మేరకు ఉంటాయని అంచనా. ప్రధానంగా సరైన నిల్వ సదుపాయాలు లేకపోవడం, సరిగ్గా రవాణా చేయకపోవడం వంటివి దీనికి కారణం. ‘అత్యధికంగా బంగాళాదుంపలను ఉత్పత్తి చేస్తున్న ఉత్తరప్రదేశ్ లేదా పశ్చిమ బెంగాల్, అలాగే భారీగా ప్రాసెసింగ్ యూనిట్లు ఉన్న గుజరాత్ వంటి చోట్ల పొటాటో ద్వారా ఇథనాల్ తయారు చేసే పైలట్ ప్లాంటును ఏర్పాటు చేయాలని ప్రతిపాదించాం’అని కుమార్ తెలిపారు.20% ఇథనాల్ బ్లెండింగ్ టార్గెట్.. క్రూడ్ ఆయిల్ దిగుమతుల భారాన్ని తగ్గించుకోవడం, కాలుష్యాన్ని నియంత్రించడం కోసం కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌లో ఇథనాల్‌ను కలిపే బయో ఫ్యూయల్ పాలసీని పక్కాగా అమలు చేస్తోంది. 2013–14 ఇథనాల్ సరఫరా సంవత్సరం (ఈఎస్‌వై)లో 38 కోట్ల లీటర్ల ఇథనాల్ (ఫ్యూయల్ గ్రేడ్) దేశంలో ఉత్పత్తి కాగా, 2020–21 నాటికి ఇది 302.3 కోట్ల లీటర్లకు చేరింది. పెట్రోల్‌లో ఇథనాల్ మిశ్రమం 1.53 శాతం నుంచి 8.17 శాతానికి పెరిగింది. ఇదే కాలంలో దేశంలో పెట్రోల్ వినియోగం 64 శాతం ఎగబాకడం గమనార్హం. 2030 నాటికి పెట్రోల్‌లో ఇథనాల్ మిశ్రమాన్ని 20 శాతానికి చేర్చాలని కేంద్ర ప్రభుత్వం తొలుత లక్ష్యంగా నిర్దేశించింది.అయితే, 2022 జూన్ నాటికే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (ఓఎంసీలు) 10 శాతం బ్లెండింగ్ లక్ష్యాన్ని చేరుకోవడంతో 2025–26 నాటికి 20 శాతం లక్ష్యాన్ని కుదించారు. 2023–24లో ఈ బ్లెండింగ్ 13 శాతంగా నమోదైంది. డీజిల్‌లో సైతం 5% ఇథనాల్‌ను కలిపే పాలసీని తీసుకొచ్చే ప్రణాళికల్లో ప్రభుత్వం ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇథనాల్ ఉత్పత్తికి మరిన్ని రకాల ఫీడ్ స్టాక్లనువినియోగించేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది.2025 కల్లా ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజన్లు తప్పనిసరి..పెట్రోలు, డీజిల్‌తో నడిచే సంప్రదాయ ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ (ఐసీఈ) వాహనాల స్థానంలో రాబోయే రోజుల్లో ఫ్లెక్సి ఫ్యూయల్ వెహికల్స్ (ఎఫ్‌సీవీ)లు పరుగులు తీయనున్నాయి. బయో ఫ్యూయల్ పాలసీకి అనుగుణంగా 2025 చివరినాటికి దేశంలో ఉత్పత్తి అయ్యే ఐసీఈ వాహన ఇంజిన్లను పెట్రోల్‌తోపాటు ఫ్లెక్స్ ఫ్యూయల్ (85 శాతం వరకు ఇథనాల్ కలిపిన పెట్రోల్–ఈ 85)కు అనుగుణంగా మార్చడాన్ని కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేయడంతో ఆటోమొబైల్ కంపెనీలు ఆ ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. -
భోపాల్‌లో విష వ్యర్థాల తొలగింపు
భోపాల్: భారత దేశ చరిత్రలో అత్యంత దారుణమైన పారిశ్రామిక ప్రమాదంగా నిలిచిన భోపాల్ గ్యాస్ లీకేజీ ఉదంతంలో 40 సంవత్సరాల తర్వాత కీలక ఘట్టం జరిగింది. విషపూరిత గ్యాస్ లీకేజీ తర్వాత ఇంకా యూనియన్ కార్బైడ్ కర్మాగారంలో మిగిలిపోయిన అత్యంత ప్రమాదకర వ్యర్థాల తొలగింపు ప్రక్రియ ఎట్టకేలకు పూర్తయింది. బుధవారం రాత్రి 9 గంటలపుడు ఏకంగా 337 టన్నుల బరువైన వ్యర్థాలను ప్రత్యేకమైన కంటైనర్లలో జాగ్రత్తగా ప్యాక్‌చేసి 250 కిలోమీటర్ల దూరంలోని వ్యర్థ్యాల దహన కర్మాగారానికి తరలించారు. గురువారం తెల్లవారుజామున నాలుగు గంటలకు ఈ ట్రక్కులన్నీ ధర్ జిల్లాలోని పీతంపూర్ పారిశ్రామిక వాడకు చేరుకున్నాయని ధర్ ఎస్పీ మనోజ్ సిన్హా చెప్పారు. వ్యర్థాలను దహనం చేసి అందులో ఏరకమైన విష పదార్థలు లేవని నిర్ధారణ చేసుకున్నాకే మిగిలిన అవశేషాలను నేలలో పాతిపెట్టనున్నారు. 1984 డిసెంబర్ రెండో తేదీ రాత్రి భోపాల్‌లోని యూనియన్ కార్బైడ్ పురుగుమందుల కర్మాగారం నుంచి అత్యంత విషపూరితమైన మిథైల్ ఐసోసైనేట్ గ్యాస్ లీక్ అయింది. అది ఎక్కడి జనాన్ని అక్కడే విగతజీవులుగా మార్చేసిన దారుణోదంతం తెల్సిందే. విష వాయువులు పీల్చి దాదాపు 5,480 మంది అక్క డిక్కడే చనిపోయారు. వేలాది మంది వికలాంగులయ్యారు. విషవాయువును పీల్చిన ఆనాటి తరం వాళ్లకు ఈ నాలుగు దశాబ్దాల కాలంలో లక్షలాది మంది వైకల్యంతో జన్మించారు. ఇంకెందరో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారు. ప్రపంచంలోని అతిపెద్ద పారిశ్రామిక విపత్తులలో ఒకటిగా ఇది నిలిచిపోయింది. అంబులెన్సులు, పోలీసు వాహనాలు, అగ్నిమాపక దళాల ప్రత్యేక పర్యవేక్షణలో వ్యర్థాల తరలింపు ప్రక్రియ జరిగింది. ఇందుకోసం 250 కిలోమీటర్ల పొడవునా గ్రీన్ కారిడార్‌ను ఏర్పాటుచేశారు. విషపూరిత వ్యర్థాలలో మట్టి, పురుగుమందుల అవశేషాలు, తయారీ ప్రక్రియల్లో మిగిలిపోయిన రసాయనాలతో సహా ఐదు రకాల ప్రమాదకరమైన పదార్థాలు ఉన్నాయి. మందలించిన హైకోర్టురాష్ట్ర రాజధానిలోని ఈ కర్మాగారం నుంచి వ్యర్థాలను తొలగించాలని సుప్రీంకోర్టు గతంలోనే పలుమార్లు ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ అధికారులు చర్యలు తీసుకోలేదు. ఫ్యాక్టరీని ఖాళీ చేయకపోవడంపై మధ్యప్రదేశ్ హైకోర్టు ఇటీవల అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ ఉదాసీనత కొత్త విషాదానికి దారి తీస్తుందని కోర్టు పేర్కొంది. వ్యర్థాలను తొలగించడానికి నాలుగు వారాల గడువు విధిస్తూ డిసెంబర్ మూడో తేదీన తీర్పునిచ్చింది. వ్యర్థాలను 2025 జనవరి ఆరో తేదీలోపు పూర్తిగా తొలగించాలని హైకోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాలను పాటించకుంటే కోర్టు ధిక్కార చర్యలు తీసుకుంటామని ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ఈ మేరకు ప్రభుత్వం తరలింపు చర్యలు చేపట్టింది. అత్యంత భద్రత మధ్య..వ్యర్థాలను సురక్షితంగా తరలించేందుకు విస్తృత ఏర్పాట్లు చేశారు. కర్మాగారంలో 337 మెట్రిక్ టన్నుల విష వ్యర్థాలున్నాయి. ఆదివారం నుంచే వీటిని మూటలు కట్టే పనులు మొదలుపెట్టారు. వీటిని ప్రత్యేకంగా రూపొందించిన 12 కంటైనర్లలో లోడ్ చేశారు. ప్రతి కంటైనర్‌లో సుమారు 30 టన్నుల వ్యర్థాలను నింపారు. రసాయన చర్యలను నివారించడానికి అత్యంత మందంగా ఉండే పాలిథీన్ సంచుల్లో ప్యాక్ చేశారు. వ్యర్థాల తరలింపుకోసం కర్మాగారం చుట్టూతా 200 మీటర్ల పరిధిలో ఎవరూ రాకుండా నిషేధం విధించారు. సుమారు 200 మంది కార్మికులు ఈ ప్రక్రియలో నిమగ్నమయ్యారు. పీపీఈ కిట్లు ధరించి కట్టుదిట్టమైన భద్రతా ప్రమానాలను పాటిస్తూ వ్యర్థాలను కంటైనర్లలో నింపారు. బుధవారం రాత్రి 9 గంటలకు 12 కంటైనర్ ట్రక్కులు కర్మాగారం నుంచి బయలుదేరాయి. 50 మంది పోలీసులు కంటైనర్లకు రక్షణ కల్పిస్తున్నారు. అత్యున్నత భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా వ్యర్థాలను తరలిస్తున్నామని పోలీసు కమిషనర్ తెలిపారు.పీతంపూర్లో దహన కర్మాగారం..పీతంపూర్లోని వ్యర్థాల దహన కర్మాగారం రాష్ట్రంలోని ఏకైక అత్యాధునిక కర్మాగారం. దీనిని కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డ్ మార్గదర్శకాల ప్రకారం రాంకీ ఎన్విరో ఇంజనీర్స్ నిర్వహిస్తోంది. 2015లో ట్రయల్‌రన్‌లో భాగంగా గంటకు 90 కిలోల వ్యర్థాల చొప్పున 10 టన్నుల యూనియన్ కార్బైడ్ వ్యర్థాలను ప్రయోగాత్మకంగా దహనం చేశారు. ఇది విజయవంతం కావడంతో మిగిలిన వ్యర్థాలను కాల్చేయనున్నారు. భూమికి 25 అడుగుల ఎత్తులో నిర్మించిన ప్రత్యేక వేదికపై వ్యర్థాలను కాల్చనున్నారు. ఈ ప్రక్రియ కోసం కఠినమైన శాస్త్రీయ ప్రోటోకాల్స్‌ను అనుసరిస్తారు. గంటకు 90 కిలోల వ్యర్థాల చొప్పున మొత్తం 337 టన్నుల వ్యర్థాలను కాల్చడానికి సుమారు 153 రోజులు పడుతుంది. ఈ వేగాన్ని గంటకు 270 కిలోలకు పెంచితే 51 రోజుల్లో పూర్తిగా వ్యర్థాలను కాల్చేయొచ్చు.12 trucks carrying 337 tonnes of toxic waste from the Union Carbide factory in Bhopal, stored for 40 years, left at 9:05 p.m. for Pithampur near Indore. The waste is expected to arrive early on January 2nd, following a 250-km green corridor with heavy security. 📹@MehulMalpani pic.twitter.com/zU78cVRE85— The Hindu (@the_hindu) January 1, 2025స్థానికుల నుంచి వ్యతిరేకత2015లో పీతంపూర్లో 10 టన్నుల యూనియన్ కార్బైడ్ వ్యర్థాలను ప్రయోగాత్మకంగా కాల్చివేయడం వల్ల సమీప గ్రామాల మట్టి, భూగర్భ జలాలు, నీటి వనరులు కలుషితమయ్యాయని స్థానికులు ఆందోళన తెలిపారు. ఈ నేపథ్యంలో వ్యర్థాల తరలింపునకు స్థానిక ప్రజల నుంచి తీవ్ర నిరసన ఎదురవుతోంది. ఆదివారం పెద్ద సంఖ్యలో ప్రజలు నిరసన ప్రదర్శన చేపట్టారు. వ్యర్థాలను పీతంపూర్కు బదులు విదేశాలకు పంపాలని డిమాండ్ చేస్తూ 10కి పైగా సంస్థలు గురువారం బంద్‌కు పిలుపునిచ్చాయి. తగిన ట్రయల్స్ లేకుండా వ్యర్థాల తొలగింపు ప్రక్రియను ప్రశ్నిస్తూ ఇండోర్‌లోని మహాత్మాగాంధీ మెమోరియల్ హాస్పిటల్ పూర్వ విద్యార్థుల సంఘం వైద్యులు పిటిషన్ దాఖలు చేశారు. అయితే అన్ని అభ్యంతరాలను పరిశీలించిన తర్వాతే వ్యర్థాలను కాల్చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు భోపాల్ ఘటన సహాయక, పునరావాస విభాగ డైరెక్టర్ స్వతంత్ర కుమార్ సింగ్ తెలిపారు. అన్నీ సవ్యంగా జరిగితే, మూడు నెలల్లో వ్యర్థాలను కాల్చివేస్తామని చెప్పారు. ఏదైనా ఆటంకం జరిగితే తొమ్మిది నెలల వరకు పట్టవచ్చ న్నారు. కాల్చిన తర్వాత, వ్యర్థాల బూడిదలో ఏదైనా హానికరమైన మూలకం మిగిలి ఉందా లేదా అని పరిశీలిస్తామని పేర్కొన్నారు. విషపూరిత మూలకాల జాడలు లేవని నిర్ధారించాక బూడిదను భూగర్భజలంతో కలవని రీతిలో భూమిలో పాతిపెడతామన్నారు. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అధికారుల పర్యవేక్షణలో నిపుణుల బృందం ఈ ప్రక్రియను నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.ఇది కూడా చదవండి: బోరుబావి ప్రమాదాలు.. ఒకసారి విఫలం.. మరోసారి సఫలం -
వారి చేతుల్లో.. వ్యర్థాలు కూడా బొమ్మలవుతాయి..
ఈ మహిళల చేతిలో రూపుదిద్దుకున్న బొమ్మలు ఒక్కోటి ఒక్కో కథ చెబుతుంటాయి. బొమ్మల శరీరాలు కాటన్ కాన్వాస్‌తో విభిన్న రంగులతో సాంస్కృతిక వైవిధ్యంతో ఆకట్టుకుంటాయి. మూస దోరణులకు భిన్నంగా స్త్రీల చేతుల్లో తల్లీ–బిడ్డలు, భార్యాభర్తలు, పిల్లల బొమ్మలు రూపుదిద్దుకుంటాయి. న్యూఢిల్లీలోని అఫ్ఘాన్ శరణార్థ మహిళలకు హస్తకళల్లో నైపుణ్యాలకు శిక్షణ ఇస్తూ ఫ్యాబ్రిక్ వ్యర్థాలతో అందమైన బొమ్మలు, గృహాలంకరణ వస్తువులను రూపొందిస్తుంది ఐరిస్ స్ట్రిల్. శరణార్థులకు స్థిరమైన ఆదాయవనరుగా మారడమే కాదు పర్యావరణ హితంగానూ తనదైన ముద్ర వేస్తోంది.భారతదేశంలో నివసిస్తున్న ఫ్రెంచ్ డిజైనర్ ఐరిస్ స్ట్రిల్. టెక్స్టైల్, క్రాఫ్ట్ పరిశ్రమలో విస్తృతమైన అనుభవం ఉన్న సీనియర్ క్రియేటివ్ డిజైనర్. ఆమె భర్త బిశ్వదీప్ మోయిత్రా ఢిల్లీవాసి. కళాకారుల ప్రతిభను పెంపొందించడం, మహిళా సంఘాలనుప్రోత్సహించడం, ట్రెండ్‌ను అంచనా వేయడం, అట్టడుగు హస్తకళాకారుల కోసం వారి సామర్థ్యాన్ని పెంపొందించే కార్యక్రమాలను అమలు చేయడంలో ఐరిస్ విస్తృత స్థాయిలో పని చేస్తుంది. దేశంలోని హస్తకళాకారులతో ఆమెకు మంచి పరిచయాలు ఉన్నాయి. అందమైన ఇండియన్ ఫ్యాబ్రిక్ వ్యర్థాలు, వస్త్రాల తయారీలో మిగిలి పోయిన వస్త్రాల గుట్టలను చూస్తూ ఉండేది.పర్యావరణ అనుకూలమైన ఆలోచన..‘‘ఈ వ్యర్థాలను ఎలా సద్వినియోగం చేసుకోవాలో కొన్నాళ్లు పాటు ఆలోచించాను. అదే సమయంలో అఫ్ఘాన్ మహిళా శరణార్థులను శక్తిమంతం చేయాల్సిన అవసరాన్ని కూడా గుర్తించాను. ఇక్కడ డిజైన్ పని చేస్తున్న సమయంలో తరచూ భారతీయ గ్రామీణ మహిళలకు వారి సంప్రదాయ నైపుణ్యాలను ప్రపంచ మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని ఉత్పత్తులను అభివృద్ధి చేయడంలో శిక్షణ ఇచ్చే ప్రాజెక్ట్‌లను చేయడం మొదలుపెట్టాను.ఆ విధంగా అనేకమంది హస్తకళాకారులతో నాకు పరిచయం ఏర్పడింది. యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఫర్ రెఫ్యూజీస్ (యుఎన్హెచ్సిఆర్) జీవనోపాధి కార్యక్రమాలలో భాగమైన ఆప్ఘన్ శరణార్థ మహిళలతో కలిసి అనేక శిక్షణా కార్యక్రమాలలో పాల్గొన్నాను. అలా నాలో శరణార్థులతో కలిసి పనిచేయాలనే ఆలోచన కలిగింది. ఆ ఆలోచన నుంచే ‘సిలైవాలి’ సంస్థ పుట్టింది. పర్యావరణ అనుకూలమైన, స్థిరమైన, వ్యర్థ పదార్థాలను ఉపయోగించి చేతి వృత్తుల ఉత్పత్తులను తయారు చేయడం ద్వారా జీవనోపాధిని పొందడంలో అట్టడుగున ఉన్న కళాకారులకు సహాయపడే ఒక సామాజిక సంస్థను నెలకొల్పాను. బొమ్మలు శరణార్థ మహిళల ప్రత్యేకతగా మారినప్పటికీ, ఇతర గృహోపకరణాలు కూడా వారు తయారుచేస్తారు.స్థిరమైన ఆదాయం..మా ఉత్పత్తులు పూర్తిగా పర్యావరణ అనుకూలమైనవి. వీటికి సరైన ధరలను నిర్ణయించి, వాటి ద్వారా కళాకారుల సంఘాలను ఏర్పాటు చేయడానికి సహాయపడేందుకు ఒక స్థిరమైన ఆదాయానికి కల్పిస్తున్నాం. అభివృద్ధి చెందిన దేశాలలో స్థిరపడాలనే ఉద్దేశంతోనూ, వారి స్వదేశంలో అస్థిరత కారణంగా పారిపోతున్న అఫ్ఘాన్ శరణార్థులకు న్యూఢిల్లీ ఒక ఇల్లుగా చెప్పవచ్చు.సిలైవాలి సంస్థ ద్వారా 70 మంది మహిళా శరణార్థులకు స్థిరమైన ఆదాయం లభిస్తోంది. శరణార్థుల ఇళ్లకు కూతవేటు దూరంలో పరిశుభ్రమైన పని వాతావరణం, పిల్లలను కూడా పనిలోకి అనుమతించడం వల్ల ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కావడం లేదు. ఈ సంస్థ ద్వారా తయారైన బొమ్మలు, ఇతర అలంకార వస్తువులు ప్రపంచవ్యాప్తంగా 100కి పైగా కాన్సెప్ట్ స్టోర్లలో అమ్మకానికి ఉన్నాయి. దేశరాజధానిలో సొంత స్టోర్‌తో పాటు వెబ్సైట్ ద్వారా కూడా అమ్మకాలను జరుపుతున్నాం.కళాత్మక వస్తువులను క్లాత్‌తో రూపొందించడం వల్ల ఫ్యాషన్ దృష్టిని ఆకర్షిస్తున్నాం. వేస్ట్ ఫ్యాబ్రిక్‌ను అందమైన స్మారక చిహ్నాలు, గృహాలంకరణలో హ్యాండ్ క్రాఫ్ట్ వస్తువుల తయారీకి మూడు గంటల వర్క్‌షాప్ నిర్వహిస్తున్నాం. దీనితో కళాకారుల నుంచి మహిళలు కుట్టుపని, ఎంబ్రాయిడరీ వంటివి నేర్చుకుంటున్నారు.సోషల్ మీడియా ద్వారా మా ఉత్పత్తులను ప్రజల ముందుకు తీసుకెళుతున్నాం. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సంవత్సరం గ్యారెంటీడ్ ఫెయిర్ ట్రేడ్ ఎంటర్‌ప్రైజ్‌గా వరల్డ్ ఫెయిర్ ట్రేడ్ ఆర్గనైజేషన్ సర్టిఫికెట్ ను కూడా పొందింది. మా సంస్థ ద్వారా గుడ్డ బొమ్మలు, బ్యాగులు, ఆభరణాలు తయారు చేస్తాం’’ అని వివరిస్తారు ఈ క్రియేటర్.ఇవి చదవండి: పక్షులను స్వేచ్ఛగా ఎగరనిద్దాం.. -
జీరో-వేస్ట్ వెడ్డింగ్: పర్యావరణ హితంగా పూర్వీ పరిణయ వేడుక
పెళ్లి అనంగానే ఎంత ఆర్భాటంగా జరుగుతుందో అంతే రేంజ్లో వేస్ట్ వస్తుంది. ముఖ్యంగా ప్లాస్టిక్ వేస్టేజ్ ఎక్కువగానే ఉంటుంది. మంచినీళ్ల బాటిళ్ల దగ్గర నుంచి భోజనాల వరకు ప్లాస్టిక్ వేస్టేజ్ ఎక్కువగానే వస్తుంది. అలాంటి వాటికి చోటివ్వకుండా శభాష్ అనేలా ఎకో ఫ్రెండ్లీగా పెళ్లి చేసుకుంది ఓ జంట. ఒకరకంగా చెప్పాలంటే 'జీరో వేస్ట్ వెడ్డింగ్'కి అసలైన నిర్వచనంగా నిలిచింది ఆ దంపతుల పెళ్లి.బెంగుళూరులోని వధువరులు అందరికీ ఆదర్శంగా నిలిచేలా జీరో వేస్ట్ వెడ్డింగ్‌ని జరుపుకుంది. ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ వేదికగా వధువు డాక్టర్ పూర్వీ భట్ షేర్ చేసుకుంది. ఇది తన కల అని, కేవలం తన కుటుంబం సహకారం వల్లే సాధ్యమయ్యిందని ఆనందంగా చెప్పుకొచ్చింది. భూమాతను కాలుష్యం కోరల నుంచి రక్షించుకునేందుకే తాను ఇలాంటి వివాహం చేసుకోవాలనుకున్నట్లు తెలిపింది. ముఖ్యంగా తన తల్లి సహకారంతోనే ఇలా జీరో వేస్ట్ వివాహాన్ని చేసుకోగలిగానని అంటోంది. అంతేగాదు ఆ పెళ్లి తంతుకు సంబంధించిన వీడియోని కూడా షేర్ చేసింది. ఆ వీడియోలో పెళ్లి మండపాన్ని చెరకు గడలతో నిర్మించారు. డెకరేషన్‌కి మామిడి ఆకులు, కొబ్బరి ఆకులను వినియోగించారు. భోజనాలను అరటి ఆకుల్లో వడ్డించగా, వధువరుల దండలను పువ్వులు, పత్తిదారలతో రూపొందించినవి ఉపయోగించారు. అలాగే రిటర్న్ గిఫ్ట్‌గా కూడా జ్యూట్ బ్యాగ్‌లను ఇచ్చారు. ఎక్కడ ఇసుమంత ప్లాస్టిక్ గానీ, పేపర్ని గాని వినియోగించలేదు. పైగా ఈ తంతు ముగిసిన వెంటనే ఆ పెళ్లి మండపానికి ఉపయోగించిన చెరుకుగడలను గోవులకు తినిపించగా, మిగతా ఆకుల వేస్ట్ అంతా పోలాలకు ఉపయోగపడేల కంపోస్ట్ ఎరువుగా మార్చారు. అలాగే పెళ్లిలో పెద్ద ఎత్తున వినియోగించే వాటర్ వేస్ట్‌ని చెట్లకు వెళ్లేలా మళ్లించారు. ఎక్కడా..నీళ్ల దగ్గర నుంచి ప్రతి వస్తువు తిరిగి భూమిలోనే ఇంకిపోయేలా ఉండే ఎకోఫ్రెండ్లీ వస్తువులనే ఉపయోగించారు ఆ వధువరుల తల్లిదండ్రులు. ఇలాంటి వివాహాన్ని జరిపించినందుకు వధువు డాక్టర్ భట్ తన తల్లిని అభినందించి కూడా. ఇంకెందుకు ఆలస్యం ఆ వీడియోని మీరు కూడా వీక్షించండి. View this post on Instagram A post shared by Dr.Poorvi Bhat | Nutrition & Wellness (@herbeshwari)(చదవండి: చింత వద్దిక.. చింత చిగురు ఉందిగా..) -
గుట్ట గుట్టలుగా ప్లాస్టిక్ వ్యర్థాలు : ఈ పాపంలో మనం కూడా!
మానవాళి ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్లలో ఒకటి కాలుష్య భూతం. ముఖ్యంగా భూమి మీద గుట్టలుగుట్టలుగా పేరుకు పోతున్న ప్లాస్టిక్ వ్యర్థాలపై కీలక సర్వే మరింత ఆందోళన రేపుతోంది. ఏటా టన్నుల కొద్దీ వ్యర్థాలు పోగవుతున్నాయని తాజా రిపోర్టులో వెల్లడైంది. ప్రపంచంలో ఈ ఏడాది ఉత్పత్తి అయిన 22 కోట్ల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలలో దాదాపు 7 కోట్ల టన్నులను ప్రపంచ దేశాలు శుద్ధి చేయకుండా వదిలివేశాయని ‘ఈఏ ఎర్త్ యాక్షన్’ సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది. ప్లాస్టిక్ వ్యర్థాలతో పర్యావరణానికి చేటు కలుగుతోంది. ఇది ప్రపంచానికే పెను సవాల్‌గా మారింది. భూగోళానికి మరింత ప్రమాదకరంగా తయారైన ప్లాస్టిక్ వ్యర్థాలపై చర్యలు చేపట్టాలని పర్యావరణవేత్తలు కోరుతూనే ఉన్నారు. తాజా ఎర్త్ యాక్షన్ సర్వేలో కీలక విషయాలు వెలుగు చూశాయి. మొత్తంగా పోగవుతున్న ప్లాస్టిక్ వ్యర్థాలలో సగానికి పైగా అంటే దాదాపు 60 శాతం వ్యర్థాలకు కారణం కేవలం 12 దేశాలేనని తేలింది. ఈ జాబితాలో భారత దేశం పేరు కూడా ఉండటం గమనార్హం.అయితే, మిగతా దేశాలతో పోలిస్తే మన దేశంలో ఉత్పత్తి అయ్యే వ్యర్థాలు తక్కువని చెప్పింది. కెనడాలోని ఒట్టావాలో ఐక్యరాజ్యసమితి ఇంటర్‌గవర్నమెంటల్ నెగోషియేటింగ్ కమిటీ (INC) నాల్గవ సమావేశానికి ముందు ఈ రిపోర్ట్ వెలుగులోకిచ్చింది. అమెరికా, చైనా, భారత్ సహా ఈ జాబితాలో అమెరికా, చైనా, భారత్, రష్యా, బ్రెజిల్, మెక్సికో, పాకిస్థాన్, ఇరాన్, ఈజిప్ట్, ఇండినేషియా, టర్కీ, వియత్నాం దేశాలున్నాయి. అయితే ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లో శుద్ధి చేయని ప్లాస్టిక్ వ్యర్థాలు 8 కిలోలు మాత్రమే. ఇది అమెరికా వ్యర్థాల్లో మూడోవంతు, చైనా వ్యర్థాల్లో ఐదో వంతు కన్నా తక్కువే. ప్లాస్టిక్ మిస్ మేనేజ్మెంట్లో చైనా టాప్‌లో ఉందని పేర్కొంది. తర్వాతి స్థానంలో అమెరికా ఉంది. -
‘వ్యర్థాలతో’ జాతీయ రహదారులు
సాక్షి, అమరావతి: పర్యావరణ కాలుష్యానికి అడ్డుకట్ట వేసేందుకు జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ (ఎన్హెచ్ఏఐ) ప్రయత్నాలు ఆరంభించింది. దేశంలోని వివిధ నగరాలు, పట్టణాల్లో గుట్టలు, గుట్టలుగా వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. ఈ వ్యర్థాలను దేశంలో భారీ స్థాయిలో నిర్మిస్తున్న జాతీయ రహదారుల నిర్మాణం కోసం భూమిని ఎత్తు చేసేందుకు ఉపయోగించుకోవాలని ఎన్హెచ్ఏఐ నిర్ణయించింది. ఇందుకోసం చేపట్టిన పైలట్ ప్రాజెక్టులు విజయవంతమవడంతో దేశవ్యాప్తంగా ఈ విధానాన్ని అమలు చేయాలని చూస్తోంది. స్వచ్ఛ భారత్ మిషన్ కార్పొరేషన్ సమన్వయంతో కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేసింది. వ్యర్థాలను జాతీయ రహదారుల నిర్మాణం కోసం సద్వినియోగం చేసుకోవడాన్ని ఎన్హెచ్ఏఐ పైలట్ ప్రాజెక్ట్ కింద చేపట్టింది. ఢిల్లీ–ముంబై ఎక్స్‌ప్రెస్ హైవే, ఢిల్లీ–ఎన్సీఆర్ హైవేల నిర్మాణంలో ఈ వ్యర్థాలను ఉపయోగించింది. జాతీయ రహదారుల నిర్మాణం కోసం మార్కింగ్ చేసిన మార్గంలో భూమిని కొంత వరకు ఎత్తు పెంచిన అనంతరం కొత్త రహదారులను నిర్మిస్తారు. ఇందుకోసం ఇప్పటి వరకు మట్టి, కంకరలను ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు వాటితోపాటు నగరాలు, పట్టణాల్లో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్లలోని సాలిడ్ వేస్ట్‌ను ఉపయోగించనున్నారు. కొత్తగా నిర్మించే జాతీయ రహదారుల్లో ఈ వ్యర్థాలను ఉపయోగించాలని ఎన్హెచ్ఏఐ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. దేశంలోని నగరాలు, పట్టణాల్లోని 2,304 డంపింగ్ యార్డుల్లో ప్రస్తుతం 170 మిలియన్ టన్నుల సాలిడ్ వేస్ట్ అందుబాటులో ఉందని స్వచ్ఛ భారత్ మిషన్ అంచనా వేసింది. దాదాపు 10వేల హెక్టార్ల మేర ఉన్న డంపింగ్ ప్రదేశాల్లో ఆ వ్యర్థాలన్నీ గుట్టలుగా పడి ఉన్నాయి. వాటిని జాతీయ రహదారుల నిర్మాణం కోసం ఎన్హెచ్ఏఐకు అందించాలని స్వచ్ఛ భారత్ మిషన్ ఆదేశించింది. ఇందుకోసం డంపింగ్ యార్డ్ల వద్ద బయోమౌనింగ్ యంత్రాలను ఎన్హెచ్ఏఐ సమకూర్చనున్నది. తద్వారా దేశంలోని వ్యర్థాలను సక్రమ నిర్వహణ, సరైన రీతిలో సద్వినియోగానికి సాధ్యపడుతుందని ప్రభుత్వం కూడా భావిస్తోంది. మరోవైపు పర్యావరణ కాలుష్య సమస్యకు కూడా సరైన పరిష్కారంగా పరిగణిస్తోంది. -
ఎదుగుదల వాయిదా!
బాపట్లకు చెందిన చిట్టిబాబు ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగి. వయసు 40 దాటడంతో ఆరోగ్యంపై దృష్టిపెట్టాలనుకున్నాడు. ‘రేపటి నుంచి మార్నింగ్ వాక్ చేయాలి’.. అని నిర్ణయం తీసుకుని ఉదయం 5 గంటలకు అలారం పెట్టుకున్నాడు. తెల్లారింది.. అలారం మోగడం మొదలైంది. నిద్రమత్తులోనే చిట్టిబాబు అలారాన్ని ఆపి.. ఈ రోజు గురువారం.. అటూఇటు కాకుండా ఈ రోజే మొదలెట్టాలా? సోమవారం నుంచైతే ఓ క్రమపద్ధతిలో ఉంటుంది కదా అనుకుని.. వచ్చే సోమవారానికి వాయిదా వేసుకుని మళ్లీ ముసుగుతన్నాడు. సోమవారం ఉదయాన్నే అలారం మోగడంతో భారంగా నిద్రలేచాడు. వాకింగ్‌కు సిద్ధమవుతున్న తరుణంలో అతడి మెదడులో తళుక్కున ఓ ఆలోచన మెదిలింది..ఎటూ మూడు రోజుల్లో ఈ నెల ముగిసిపోతుంది. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి వాకింగ్ ప్రారంభిస్తే ఎలా ఉంటుందబ్బా.. అని ఆలోచించాడు. తన ఆలోచన కరక్టే అనిపించింది. ఒకటో తేదీ అయితే లెక్కించుకోడానికి కూడా సులువుగా, అనువుగా ఉంటుందనుకుంటూ.. వాకింగ్‌కు వెళ్లే ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. ఒకటో తేదీ కూడా రానే వచి్చంది.. ఆ రోజు బుధవారం. మరీ వారం మధ్యలో ఎందుకు? సోమవారం నుంచి నడుద్దాంలే.. అని వాయిదా వేశాడు. మళ్లీ సోమవారం రాగానే.. ఆపై సోమవారానికి వాయిదా. ఇలా రెండేళ్లుగా వాయిదాల పరంపర కొనసాగుతూనే ఉంది గానీ.. మార్నింగ్ వాక్కు మాత్రం అడుగు ముందుకు పడలేదు. వాకింగ్ మొదలెడదామనుకున్న రోజు రాగానే ఏదో ఒక కారణాన్ని వెతుక్కోవడం.. ఆ సాకుతో వాయిదా వేసుకుని, ఆ క్షణానికి హమ్మయ్యా.. అని ఊపిరిపీల్చుకోవడం పరిపాటిగా మారింది. – తమనంపల్లి రాజేశ్వరరావు, ఏపీ సెంట్రల్ డెస్క్ ఒక్క చిట్టిబాబు విషయంలోనే కాదు.. దాదాపు అందరి జీవితంలోనూ ఏదో ఒక సందర్భంలో ఇలాంటి వాయిదా ఘటనలు ఉండే ఉంటాయి. ఒక్కసారి ఈ వాయిదా సంస్కృతికి అలవాటు పడితే.. మన ఎదుగుదలను, అభివృద్ధిని వాయిదా వేసుకున్నట్టే లెక్క. విలువైన కాలాన్ని హరించి వేస్తుంది. వాయిదా వేయడం.. ఆ సమయానికి ఎంతో రిలీఫ్‌నిస్తుంది. చేయాల్సిన పనిని ‘తర్వాత చేద్దాంలే..’ అనుకోవడం ఆ క్షణానికి ప్రశాంతతనిస్తుంది. కానీ ఆ వాయిదా తాలూకు పర్యావసానం నష్టాన్ని కలిగించినప్పుడు తల పట్టుకుని కుమిలిపోతుంటారు. ఇలా డిప్రెషన్లోకి వెళ్లిపోయే ప్రమాదమూ లేకపోలేదని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. చూద్దాంలే.. చేద్దాంలే.. అనేవి జీవితాన్ని వెనక్కి లాగే విషయాలని, వీటి నుంచి ఎంత త్వరగా బయటపడగలిగితే అంత మంచిదంటున్నారు. మనం ఇలా ఆలోచిస్తే.. మెదడు అలా ఆదేశిస్తుంది.. సాధారణంగా మనకు ఒత్తిడి కలిగించేవాటిని వాయిదా వేయమని మెదడు చెబుతుంది. పరీక్షల కోసం చదవడం, ఉదయాన్నే లేచి నడవడం వంటివి మానసికంగా భారంగా ఉండే పనులు. ఎక్కువగా ఇలాంటి వాటినే వాయిదా వేయాలని మెదడు చెబుతూ ఉంటుంది. ఇలాంటి వారిలో ఎక్కువ మంది డిప్రెషన్, మానసిక ఆందోళనల బారిన పడే ప్రమాదం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఫోన్లో మునక నుంచి బయటి కొద్దాం.. ఏ పనినైనా అనుకున్న సమయానికి పూర్తిచేయాలంటే ఫోన్‌కు దూరంగా ఉండటం మంచిది. ఫోన్ అనేది మనకు తెలియకుండానే సమయాన్ని హరిస్తుంది. మనలో అంతులేని బద్దకానికి కారణమవుతుంది. ఫోన్ చేతిలో ఉందంటే చాలు.. ఇక ఏపనైనా ‘ఆ చేయొచ్చులే..’ అనిపించే నీరసం, ‘ఇప్పుడే చేయాలా..’ అనేంత బద్దకం, ‘చేయలేక చస్తున్నా..’ అనుకునేంత నిస్తేజం మనల్ని ఆవహించేస్తాయి. అందుకే ఫోన్‌కు దూరంగా ఉంటే ఈ వాయిదా అలవాటు నుంచి బయటపడే అవకాశం ఉంది. అందరిలో ఉండే లక్షణమే గానీ.. పనులు వాయిదా వేయడం అనేది టైం మేనేజ్మెంట్ సమస్య అని చాలామంది అనుకుంటారు. వాస్తవానికి ఇది ఎమోషనల్ రెగ్యులేషన్ సమస్య. ఏదైనా ఒక పని మనలో ఒత్తిడిని కలిగిస్తే.. మెదడులోని దానికి సంబంధించిన భాగం ఆ పనిని వాయిదా వేయాలని ప్రేరేపిస్తుంది. దీంతో మనం ఆ పనిని వాయిదా వేస్తాం. అందుకే వాయిదా వేయడాన్ని ఓ డిఫెన్స్ మెకానిజంగా పరిగణించవచ్చు. ఇది అందరిలో ఉండే లక్షణమే గానీ, ఇది క్రానిక్‌గా మారినప్పుడు మాత్రం సైకాలజిస్టులను సంప్రదించాల్సి ఉంటుంది. కాగి్నటివ్ బిహేవియర్ థెరపీ, మైండ్ ఫుల్నెస్ ట్రైనింగ్, బిహేవియర్ షేపింగ్, ఎపిసోడిక్ ఫ్యూచర్ థింకింగ్ వంటి పద్ధతులు ఉపయోగించి వాయిదా వేసే లక్షణాన్ని సైకాలజిస్టులు తగ్గిస్తారు. – బి.కృష్ణ, సైకాలజిస్ట్ మహిళల కంటే పురుషుల్లోనే ఎక్కువ పనులు వాయిదా వేయడం అనేది మెదడులోని లింబిక్ సిస్టం, ప్రీ ఫ్రొంటల్ కార్తెక్స్ మధ్య ఘర్షణతో సంభవిస్తుందని న్యూరో సైన్స్ చెప్తుంది. ఈ లక్షణం విద్యార్థుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్‌లో 81 శాతం మంది పనులు వాయిదా వేస్తున్నారని ఒక సర్వేలో తేలింది. పనులు వాయిదా వేయడానికి కొన్ని మానసిక కారణాలున్నాయి. మోటివేషన్ లేకపోవడం, ఓటమి భయం, ఒత్తిడి, స్వీయ విమర్శలు తదితరాలు ఓ వ్యక్తి పనులు వాయిదా వేయడానికి కారణమవుతాయి. వాయిదా లక్షణం మహిళల కంటే పురుషుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ వాయిదా వేసే లక్షణం దైనందిక జీవితానికి ఇబ్బంది కలిగించే స్థాయికి చేరుకుంటే మానసిక నిపుణులను సంప్రదించడం మంచిది. – బి.అనితజ్యోతి, సైకాలజిస్ట్ ‘వాయిదా’పై నిపుణులు ఏమంటున్నారంటే.. ఒక పనిని వాయిదా వేయడానికి ముఖ్య కారణం ఆ పని చేయడానికి ఆసక్తి లేకపోవడంతో పాటు ఉత్సాహ లేమిని కూడా ఓ కారణంగా చెప్పొచ్చు. మనం ఇంతకు ముందు చెప్పుకొన్నట్టు ఆ పని మనకు ఒత్తిడి కలిగించేది, లేదా మానసికంగా భారంగా అనిపించేదై ఉంటుంది. ఒక పనిని ఒక్కసారి వాయిదా వేశామంటే.. మళ్లీ మళ్లీ వాయిదా వేసేందుకే మన మెదడు మొగ్గు చూపుతుంది. బద్దకం, సోమరితనం కూడా ఈ వాయిదా పరంపరకు ప్రధాన కారకంగా నిలుస్తున్నాయి. అసలు ఎలాంటి కారణం లేకుండా కూడా పనులు వాయిదా వేస్తూ అదో రకమైన మానసిక ఆనందాన్ని పొందుతుంటాం. చాలా కోల్పోతున్నాం వాయిదా వేసిన పనిని పూర్తిచేయలేక దాని తాలూకు నష్టాన్ని మూటగట్టుకుంటాం. వాయిదాల వల్ల తరచూ ఇలానే జరగడంతో ఆందోళన, భయానికి లోనవుతాం. మనమీద మనకు నమ్మకం సన్నగిలి.. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతాం. ఇది మన నిద్రను ప్రభావితం చేస్తుంది. మనకు నిద్రలేని రాత్రులను మిగులుస్తుంది. ఫలితంగా మానసిక, శారీరక ఆరోగ్యం దెబ్బతింటుంది.. ఇలా అధిగమిద్దాం.. ఒక పనిని చేయడంలో హాయిని అనుభవించాలి గానీ.. ఒత్తిడిని దరిచేరనీయ కూడదు. ఈ వాయిదా వేయడం అనే దాన్ని మన ఎదుగుదలను నియంత్రించే రుగ్మతగా భావిస్తూ.. దాని బారిన పడకుండా ఉండాలంటూ మనసుకు ఆదేశాలిచ్చుకుంటూ.. మనసును పూర్తిగా మన నియంత్రణలో ఉంచుకోవాలి. ఏదన్నా పని మొదలెట్టామంటే.. దానికి అంకితమైపోవాలి. అది పూర్తయిందాకా వెనకడుగు వేయకూడదు. వాయిదా సంస్కృతి అనేది మన ఉన్నతిని, ఎదుగుదలను నిలువరించే ఓ సోమరిపోతు. ఈ జీవన పరుగు పందెంలో తోటివారితో పాటు మన అడుగుల్ని ముందుకు పడనీయకుండా అనుక్షణం వెనక్కి లాగుతూ.. మనల్ని ఓ మాయా ప్రపంచంలోని నిష్క్రియా స్థితికి తీసుకెళ్లే ఓ మత్తుమందు. దీని విషయంలో మనం అప్రమత్తంగా, అనుక్షణం జాగరూకతతో ఉండాలి. పనిని విభజించుకోవాలి. ఓ టైం టేబుల్ వేసుకుని ఆ సమయానికి ఎట్టి పరిస్థితుల్లో ఆ పనిని పూర్తిచేసి తీరాలి. ఒక సామెత చెప్పినట్టు.. రేపు మనం చేయాలనుకుంటున్న పనిని ఈ రోజే.. ఈ రోజు ఏం చేయాల్సి ఉందో దానిని ఇప్పుడే చేసెయ్యాలి. పోషకాహారం తీసుకోవడంతో పాటు క్రమం తప్పకుండా యోగా లేదా వ్యాయామం, ధ్యానం చేయాలి. -
‘ప్లాస్టిక్ అడవి’లో ఏనుగులు
ఎటు చూసినా ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్తా చెదారం మధ్య ఏనుగుల గుంపు కనిపిస్తోందా? అంతటి కలుషిత, ప్రమాదకర పదార్థాల మధ్య ఆ ఏనుగులు ఆహారాన్ని వెతుక్కుంటున్నాయి. అభివృద్ధితోపాటు వస్తున్న కాలుష్య ప్రమాదానికి ఇదో సంకేతమని పర్యావరణ నిపుణులు అంటున్నారు. ప్లాస్టిక్, ఇతర వ్యర్థ పదార్థాలను తీసుకెళ్లి అడవుల సమీపంలో డంపింగ్ చేస్తుండటం కేవలం పర్యావరణానికి మాత్రమేకాదు వన్య ప్రాణులకు ఎంతో చేటు చేస్తున్న దారుణ పరిస్థితిని ఇది కళ్లకు కడుతోంది. శ్రీలంకలోని తూర్పు ప్రావిన్స్‌లో లలిత్ ఏకనాయకే అనే ఫొటోగ్రాఫర్ ఈ చిత్రాన్ని తీశారు. నేచర్ ఇన్ఫోకస్ సంస్థ ఇచ్చే ఫొటోగ్రఫీ అవార్డుల్లో ‘కన్సర్వేషన్ ఫోకస్’ విభాగంలో ఇది ఉత్తమ చిత్రంగా నిలిచింది. –సాక్షి సెంట్రల్ డెస్క్ -
ఆస్పత్రుల వ్యర్థాలపై నిఘా
లబ్బీపేట (విజయవాడ తూర్పు): ఆస్పత్రులలోని వ్యర్థాల (బయో మెడికల్స్) సేకరణ, నిర్వీర్యంపై ప్రభుత్వం నిబంధనల్ని కఠినతరం చేసింది. ఆస్పత్రి నుంచి సేకరించిన వ్యర్థాలు కంపెనీకి తీసుకెళ్లి నిర్వీర్యం చేసేవరకూ నిరంతరం నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఎక్కడా బయో మెడికల్ వ్యర్థాలను బయట వేయకుండా.. కచ్చితంగా వాటిని నిర్వీర్యం చేసేలా వ్యవస్థను పటిష్టం చేశారు. వాహనాలకు జీపీఎస్ సిస్టమ్ అమర్చారు. ఆస్పత్రిలో వ్యర్థాలను సేకరించినప్పుడు, కంపెనీకి తరలించిన తర్వాత బ్యాగ్‌లను స్కాన్ చేసేలా బార్ కోడింగ్, కంపెనీ వద్ద ఆన్లైన్ ఎమిషన్ మోనిటరింగ్ సిస్టమ్ ఏర్పాటు వంటి విధానాలను అమలు చేస్తున్నారు. ప్రస్తుతం ఉమ్మడి కృష్ణాజిల్లాలో 17,200 బెడ్స్ ఉండగా.. నిత్యం 5 వేల బెడ్స్‌పై రోగులు చికిత్స పొందుతుంటారని కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) లెక్కలు చెబుతున్నాయి. ప్రతి రోజూ 1.20 టన్నుల నుంచి 1.40 టన్నుల బయో మెడికల్ వ్యర్థాల సేకరణ, నిర్వీర్యం జరుగుతున్నట్టు పీసీబీ అధికారులు చెపుతున్నారు. తరలింపు.. నిర్వీర్యంపై నిఘా బయో మెడికల్ వ్యర్థాలను సంబంధిత కంపెనీకి ఖచ్చితంగా తరలించేలా ప్రభుత్వం నిఘా పటిష్టం చేసింది. ప్రతి బ్యాగ్‌కు బార్ కోడింగ్ ఏర్పాటు చేశారు. ఆస్పత్రి నుంచి సేకరించేటప్పుడు బార్ కోడింగ్‌ను స్కాన్ చేయడంతో పాటు కంపెనీకి తరలించిన తర్వాత దానిని స్కాన్ చేయాల్సి ఉంది. అప్పుడే దానిని నిర్వీర్యం చేసేందుకు తరలించినట్టు నిర్థారణ అవుతుంది. ఆస్పత్రి యాజమాన్యాలకు మొబైల్ యాప్ ప్రవేశ పెట్టారు. ఈ యాప్‌లో ప్రతిరోజూ ఆస్పత్రిలో ఎన్ని పడకలపై రోగులు ఉన్నారు. ఆ రోజు వ్యర్థాలు ఎంత ఉన్నాయి అనే విషయాలను యాప్‌లో అప్లోడ్ చేయాల్సి ఉంది. బయో మెడికల్ వ్యర్థాలను తరలించే ప్రతి వాహనానికి జీపీఎస్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. ఆస్పత్రి నుంచి సేకరించిన వ్యర్థాలు కంపెనీ వద్దకు వెళ్లాయా లేదా ఇతర ప్రాంతాలకు వెళ్లాయా అనే దానిపై నిఘా వేస్తారు. జగ్గయ్యపేట సమీపంలో బయో వ్యర్థాల నిర్వీర్యం ప్లాంట్ ఉంది. ఆ ప్లాంట్‌లో వ్యర్థాల నిర్వీర్యం ప్రక్రియను నిరంతరం ఆన్లైన్ ఎమిషన్ మోనిటరింగ్ సిస్టమ్ ద్వారా పరిశీలిస్తుంటారు. అక్కడ ఎంత డిగ్రీల్లో నిర్వీర్యం చేస్తున్నారు. ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వీర్యం సమయంలో వచ్చే పొగలో ఏమైనా రసాయనాలు ఉన్నాయా, హానికర కాలుష్యం వస్తోందా అనే అంశాలను పరిశీలిస్తారు. వ్యర్థాలకు కలర్ కోడింగ్ ఆస్పత్రిలోని వ్యర్థాలకు కలర్ కోడింగ్‌ను ఏర్పాటు చేశారు. పసుపు, ఎరుపు, బ్లూ, తెలుపు నాలుగు రంగుల్లో ఉన్న బ్యాగుల్లో నిర్ధేశించిన వ్యర్థాలను ఆస్పత్రి సిబ్బంది వేసేలా ఇప్పటికే అవగాహన కల్పించారు. పసుపు బ్యాగుల్లో మానవ శరీర సంబంధమైన వ్యర్థాలు, జంతు శరీర సంబంధమైన వ్యర్థాలు, మాయ, కలుషిత దూది, డ్రెస్సింగ్ క్లాత్, విషపూరిత వ్యర్థాలు, గడువు ముగిసిన మందులు, మాస్‌్కలు వేస్తారు. వీటిని కంపెనీకి తరలించి 1,200 డిగ్రీల వద్ద నిర్వీర్యం చేస్తారు. ఎరుపు బ్యాగుల్లో సిరంజీలు, ఐవీ సెట్, కాథెటర్, గ్లౌజులు, బ్లడ్ బ్యాగ్స్, యూరిన్ బ్యాగ్స్, డయాలసిస్ కిట్, ఐవీ బాటిల్స్ వేసేలా ఏర్పాట్లు చేశారు. తెలుపు బ్యాగ్స్‌లో సూదులు, స్థిర సూదులు, సిరంజిలు, బ్లేడ్లు, శస్త్ర చికిత్స బ్లేడ్లు వేస్తారు. బ్లూ బ్యాగ్స్ గ్లాసుతో చేసిన ఇంజెక్షన్ బాటిల్స్, గాజు సీసాలు, ల్యాబ్ స్లైడ్స్, ఇంప్లాంట్స్, కత్తెరలు వేసేలా అవగాహన కల్పించారు. అవగాహన కలిగిస్తున్నాం ప్రతి ఆస్పత్రిలో వ్యర్థాలను నిబంధనల మేరకు కలర్ కోడింగ్ ఆధారంగా వేరు చేయాలని యాజమాన్యాలకు అవగాహన కల్పిస్తున్నాం. వ్యర్థాల తరలింపు, నిర్వీర్యం వంటి వాటిపై నిరంతర నిఘా ఏర్పాటు చేశాం. – పి.శ్రీనివాసరావు, ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్, కాలుష్యనియంత్రణ మండలి -
బీర్ వ్యర్థాలతో..బిస్కెట్లు, చిక్కిలు, లడ్డులా..
కొంతమంది ఆకలితో అలమటిస్తుంటే, మరోపక్క టన్నులకొద్దీ ఆహారం వివిధ రకాలుగా వ్యర్థాల రూపంలో మట్టిపాలవుతోంది. ఈ మధ్య కాస్త అవగాహన రావడంతో ఫంక్షన్లలో మిగిలిన ఆహారాన్ని ఆశ్రమాలకు దానంగా ఇస్తున్నారు. అయితే వండిన ఆహారమే కాకుండా, కొన్నిరకాల పదార్థాలు, పానీయాలు తయారయ్యాక ఎన్నో పోషకాలున్న పదార్థాలు చెత్తలోకి వెళ్లి పోతున్నాయి. వీటిని మనం చక్కగా వినియోగించుకుంటే...బిస్కెట్లు, బ్రెడ్, రోటీలు చేసుకోవచ్చని చెబుతోంది ఎలిజబెత్ యార్క్. బీర్ తయారవగా మిగిలి పోయిన వ్యర్థాలతో చిక్కి, లడ్డు, నూడుల్స్ తయారు చేసి మరీ రుచి చూపెడుతోంది ఎలిజబెత్. బెంగళూరుకు చెందిన ఎలిజబెత్ యార్క్ ఒక చెఫ్. మణిపాల్‌లో డిగ్రీ చేసిన ఎలిజబెత్ తరువాత మైసూర్‌లోని సెంట్రల్‌ఫుడ్ టెక్నలాజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో రీసెర్చ్ చేసింది. అందులో భాగంగా దేశంలో ఎన్నో రకాలుగా భారీ ఎత్తున ఆహార వృథా జరుగుతోందని గ్రహించింది. ఆహారం వ్యర్థం కాకుండా ఎలా ఆపాలా... అని ఆలోచించింది. ఈ క్రమంలోనే 2016లో కాలిఫోర్నియాలోని బ్రెడ్ స్పెషలిస్ట్, ఫుడ్ హిస్టోరియన్ విలియం రెబెల్ దగ్గర ఇంటర్న్‌గా చేరింది. రుబెల్ ద్వారా... ‘‘వందల ఏళ్ల నాడే పానీయాల తయారీ దారు, (బ్రీవర్స్), రొట్టె, బ్రెడ్స్ తయారీదార్లు (బేకర్స్) కలిసి పనిచేసే వారని తెలిసింది. కొన్నిసార్లు ఆర్థికంగా ప్రతికూల పరిస్థితులు ఏర్పడినప్పుడు మిగిలిపోయిన బ్రెడ్‌ను బ్రీవర్స్, గింజలు, ఈస్ట్‌ను బ్రీవర్స్ బేకర్స్ ఇచ్చి పుచ్చుకునేవాళ్లు. అలా వాళ్లు పదార్థాలు వృథా కాకుండా, తక్కువ ఖర్చులో ఆహారాన్ని తయారు చేసేవారు’’ అని ఎలిజబెత్ తెలుసుకుంది. భారత్‌లో కూడా ఇలా చేసి ఫుడ్ వేస్ట్ కాకుండా చూడవచ్చు అనుకుంది. సేవింగ్ గ్రెయిన్స్ లాక్డౌన్ సమయంలో కాస్త ఎక్కువ సమయం దొరకడంతో ఎలిజబెత్ వ్యర్థాల నుంచి ఫుడ్ తయారు చేయాలని నిర్ణయించుకుంది. బీర్ తయారైన తరువాత పడేసే వ్యర్థాలను రుచికరమైన ఆహారంగా మార్చాలనుకుని 2021లో ‘సేవింగ్∙గ్రెయిన్స్’ ప్రారంభించింది. బీర్ తయారవగా మిగిలిన పిప్పిని పిండిగా మార్చి, తరువాత ఆ పిండితో బ్రెడ్, రోటీలు, గ్రనోలా, కుకీస్, టీ బిస్కెట్స్, లడ్డులు, చిక్కీలు తయారు చేసి విక్రయిస్తోంది. పిప్పినుంచి తయారు చేసినవే అయినా ఇవి ఎంతో రుచిగా ఉండడం విశేషం. సేవింగ్ గ్రెయిన్స్ ఉత్పత్తులు ఆఫ్‌లైన్‌లోనేగాక, ఆన్‌లైన్‌లోకూడా లభ్యమవుతున్నాయి. స్థానిక బేకరీ భాగస్వామ్యంతో సేవింగ్ గ్రెయిన్స్ను విస్తరిస్తోంది ఎలిజబెత్. రోజుకి పన్నెండు వేల కేజీలు.. ‘‘రకరకాలుగా ఫుడ్ వేస్ట్ అవడం చాలా బాధగా అనిపించేది. రుబెల్‌ను కలిసాక ఈ సమస్యకు చక్కటి పరిష్కారం దొరికింది. దాంతోనే ‘సేవింగ్ గ్రెయిన్స్’ను ప్రారంభించాను. బీర్, ఆల్కహాల్‌ను తయారు చేసేందుకు గోధుమలు, ఓట్స్, బార్లీలను నానబెట్టి మొలకలు వచ్చిన తరువాత, చక్కెరతో ఉడికి స్తారు. తరువాత మెత్తగా రుబ్బి రసాన్ని వేరు చేసి బీర్, ఆల్కహాల్స్‌ను తయారు చేస్తారు. పానీయం వేరు చెయ్యగా మిగిలిన పిప్పిని పశువులకు దాణాగా వేస్తుంటారు. పశువులు తిన్నప్పటికీ, ఎక్కువ మొత్తంలో వ్యర్థంగా పోతుంది. ఒక్క బెంగళూరులోనే రోజుకి పన్నెండు వేలకేజీల ధాన్యాలను పానీయాల తయారీలో వాడుతున్నారు. రోజుకి ఇంత అంటే ఇక ఏడాదికి చాలా ఎక్కువ అవుతుంది. దేశవ్యాప్తంగా ఉన్న బ్రీవరీలు లక్షల కేజీల ధాన్యాలను ఉపయోగిస్తున్నాయి. ఇలా ఉత్పన్నమయ్యే పిప్పిని ఫుడ్‌గా మార్చడం వల్ల ధాన్యాలు వ్యర్థంగా పోవు. సేవింగ్ గ్రెయిన్స్ ద్వారా ఎంతోమంది ఆకలి కూడా తీర్చవచ్చు’’ అని ఎలిజబెత్ చెబుతోంది. (చదవండి: బీర్‌ని బేషుగ్గా తాగొచ్చట! అందులో ప్రోటీన్, విటమిన్ బి) -
‘ప్లాస్టిక్ మ్యాన్ ఆఫ్ ఇండియా’ ఎవరు? రూ.1400 కోట్ల ఆఫర్ వద్దని, భారత్‌కు ఏమి చేశారు?
మన చుట్టూ ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలు పర్యావరణానికి, మనకు ఎంతో హానికరం అనే విషయం అందరికీ తెలిసిందే. ప్లాస్టిక్ వ్యర్థాలు పర్యావరణాన్ని కలుషితం చేయడమే కాకుండా జీవరాశుల మరణానికి కారణంగా మారుతున్నాయి. అయితే ప్లాస్టిక్ వ్యర్థాలను తిరిగి వినియోగించేలా రీసైకిల్ చేసేందుకు విరివిగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ దిశగా ముందడుగు వేసిన తమిళనాడులోని మదురైలోగల టీసీఈ ఇంజినీరింగ్ కళాశాల ప్రొఫెసర్ ప్లాస్టిక్ వ్యర్థాలతో ప్రపంచమంతటా రోడ్లు వేయాలనే ఆలోచనను అందించారు. ఫలితంగా ఆయన ‘ప్లాస్టిక్ మ్యాన్ ఆఫ్ ఇండియా’గా పేరొందారు. అతని కృషిని గుర్తించిన భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. ప్లాస్టిక్ వ్యర్థాలతో రోడ్లను రూపొందించిన ఈ ప్రొఫెసర్ పేరు రాజగోపాలన్ వాసుదేవన్. మధురైలోని టీసీఈ ఇంజినీరింగ్ కాలేజీలో కెమిస్ట్రీ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. 2002 సంవత్సరంలో త్యాగరాజర్ కళాశాల ఆవరణలో ప్లాస్టిక్ వ్యర్థాలతో రహదారిని నిర్మించడంలో వాసుదేవన్ తొలిసారి విజయం సాధించారు. వాసుదేవన్ చేస్తున్న కృషికి గుర్తింపు రావడానికి చాలా కాలం పట్టింది. దాదాపు పదేళ్ల కృషి అనంతరం అప్పటి ముఖ్యమంత్రి జయలలిత వద్దకు తన ప్రాజెక్టు తీసుకెళ్లడంతో ఈ సాంకేతికతకు గుర్తింపు వచ్చిందని ఆయన తెలిపారు. జయలలిత తన కృషిని మెచ్చుకున్నారని, సహాయం చేయడానికి ముందుకు వచ్చారని వాసుదేవన్ తెలియజేశారు. వాసుదేవన్ తన ఆలోచనను ప్రపంచంతో పంచుకోవడంతో, దీనిని అతని నుంచి దక్కించుకునేందుకు పలువురు ప్రయత్నించారు. అయితే ఇందుకు వాసుదేవన్ నిరాకరించారు. తన సాంకేతికతను ఆయన ఉచితంగా భారత ప్రభుత్వానికి అప్పగించారు. ఫలితంగా ప్లాస్టిక్ వ్యర్థాలతో వేల కిలోమీటర్ల రోడ్లు నిర్మితమయ్యాయి. వాసుదేవన్ తయారు చేసిన ఈప్రాజెక్టు కొనుగోలుకు అమెరికా సుమారు రూ. 1400 కోట్లు ఆఫర్ చేసిందని అంటారు. అయితే అతను ఈ ఆఫర్‌ను తిరస్కరించారు. తన ఈ ఆవిష్కరణను భారత ప్రభుత్వానికి ఉచితంగా అందించారు. ఫలితంగా దేశంలో రోడ్ల నిర్మాణంలో విప్లవం వచ్చింది. వాసుదేవన్ అందించిన సాంకేతికతను నేడు పంచాయతీలు, మునిసిపాలిటీలు సైతం ఉపయోగిస్తున్నాయి. అలాగే రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ కూడా పెద్ద ఎత్తున వ్యర్థ ప్లాస్టిక్‌ను ఉపయోగించాలనే మిషన్‌ను ప్రారంభించింది. ఈ నేపధ్యంలో దేశవ్యాప్తంగా దాదాపు 26 వేల మందిని అనుసంధానం చేసి ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణపై అవగాహన కల్పించి, రోడ్డు నిర్మాణంలో వినియోగించేందుకు అనువుగా వ్యర్థ ప్లాస్టిక్‌ను సేకరిస్తున్నారు. వివిధ దేశాలకూ వాసుదేవన్ సాంకేతికత భారతదేశంలో ఇప్పటికే దాదాపు 100,000 కిలోమీటర్ల మేర ప్లాస్టిక్ రోడ్లు తయారయ్యాయి. పలు ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి. భారతదేశంలోనే కాదు వాసుదేవన్ అందించిన సాంకేతికతను ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు అమలు చేస్తున్నాయి. ఇండోనేషియాలో బాలి, సెర్బియా, బెకాసి, మకస్సర్ తదితర ప్రదేశాలతో ప్లాస్టిక్-తారు మిశ్రమాలను ఉపయోగించి ప్లాస్టిక్ రోడ్లు నిర్మితమవుతున్నాయి. నెదర్లాండ్స్ ఈశాన్య భాగంలో సైక్లిస్టుల కోసం డచ్ కంపెనీ వెర్కర్ సెల్.. ప్లాస్టిక్ రోడ్లు నిర్మించింది. ఈ క్రమంలో ప్లాస్టిక్ రోడ్ టెక్నాలజీని పరీక్షించేందుకు యునైటెడ్ కింగ్డమ్ 1.6 మిలియన్ పౌండ్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. ‘ప్లాస్టిక్ మ్యాన్ ఆఫ్ ఇండియా’ రాజగోపాలన్ వాసుదేవన్ ప్రతిభను ప్రపంచం మెచ్చుకుంటోంది. ఇది కూడా చదవండి: ఈ నగరంలో నిత్యం శబ్ధాలు ఎందుకు వినిపిస్తాయి? -
ఉపగ్రహం మీ నెత్తిన పడితే..
సపోజ్.. ఫర్ సపోజ్.. ఉపగ్రహం లేదా దానిలోని ఓ భాగం మీ నెత్తిన పడితే ఏం చేస్తారు? పోనీ.. మీ నెత్తిన కాదు.. మీ ఇంటిపై పడితే ఏం చేస్తారు?పిచ్చిలేచిందా.. ఇదేం తిక్క ప్రశ్న అనేగా మీ ఫీలింగు.. మీ ఫీలింగును మేము ఫీలయ్యేలోపు.. ఓసారి ఈ ఫొటో చూడండి.. ఇది భూమి కక్ష్యకు సంబంధించి నాసా రూపొందించిన కంప్యూటర్ జనరేటెడ్ ఫొటో... ఇక్కడ కొన్ని కోట్ల సంఖ్యలో భూమి చుట్టూ వేగంగా తిరుగుతున్నాయే.. వీటిల్లో పనిచేస్తున్న ఉపగ్రహాలు మినహాయిస్తే.. మిగతాదంతా కేవలం చెత్త.. అంటే అంతరిక్ష వ్యర్థాలు.. ప్రస్తుతం ఇక్కడ ఉన్నదాంట్లో 95% అదే.. ఇవి అడపాదడపా.. అక్కడక్కడా వచ్చి పడుతుంటాయి... గత నెల్లో భారత్‌కు చెందిన అంతరిక్ష శిథిలం ఒకటి ఆస్ట్రేలియాలో పడింది కూడా.. ఈ నేపథ్యంలో అసలు అంతరిక్ష వ్యర్థాలు అంటే ఏమిటి? పడితే పరిహారంలాంటిది చెల్లించాలా? అసలు దీనికి సంబంధించిన అంతర్జాతీయ చట్టాలేం చెబుతున్నాయి? లాంటి పెద్ద విషయాలతోపాటు అస లు మన నెత్తిన లేదా ఇంటిపై పడే చాన్సుందా.. పడితే.. మనకూ పరిహారం లాంటిదేమైనా ఇస్తారా వంటి చిన్నపాటి వివరాలు కూడా తెలుసుకుందాం.. అంతరిక్ష వ్యర్థం అంటే.. ♦ స్పేస్‌లో మిగిలిపోయిన, పనికి రాని భాగాలు.. అది కాలపరి మితి ముగిసిన ఉపగ్రహం కావచ్చు లేదా రాకెట్ ప్రయోగ దశలోని భాగాలు కావచ్చు. వ్యోమ గాములు వాడిన గ్లవ్స్లాంటివి కావచ్చు. లక్ష్యాలను పూర్తిచేసు కుని పనికిరానివిగా మిగిలిపోయి నవి ఏవైనా కావచ్చు. ♦ నాసా లెక్క ప్రకారం ఒక మిల్లీమీటర్ కంటే చిన్నవున్న అంతరిక్ష వ్యర్థాలు 10 కోట్లు ఉంటే.. సాఫ్ట్ బాల్ సైజు కన్నా పెద్దవిగా ఉన్నవి 23 వేలు ఉన్నాయి. కొన్నిటిని శాస్త్రవేత్తలే ఎలాంటి ఇబ్బంది లేకుండా.. నియంత్రిత పద్ధతిలో సము ద్రంలో కూలేలా చేస్తుంటారు. ఒకవేళ అలా కాకున్నా.. సాధా రణంగా ఎక్కువ శాతం వ్యర్థాలు సముద్రంలో పడి పోతుంటాయి. ఎందుకంటే.. భూమ్మీద నీటి శాతమే ఎక్కువ గనుక.. కొన్ని ఎడారులు, అడవుల్లాంటి నిర్మానుష్య ప్రదేశాల్లో పడుతుంటాయి. చిన్నసైజు వ్యర్థాలు భూ వాతావరణంలోకి రాగానే మండిపోతాయి. కొంచెం పెద్దగా ఉండేవి కిందకు వస్తాయి. ఒకవేళ అలా వస్తే.. పైసా నికాలో.. అంతరిక్ష వ్యర్థాల వల్ల పర్యావరణానికి లేదా భూమిపై పడినప్పుడు ఆ ప్రదేశంలో ఏదైనా నష్టం వాటిల్లితే.. దాన్ని ప్రయోగించిన దేశం(లాంచింగ్ కంట్రీ) బాధ్యత వహించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి అంతర్జాతీయంగా కొన్ని నిబంధనలు ఉన్నాయి. 1967 నాటి ఔటర్ స్పేస్ ట్రీటీ, 1972 నాటి స్పేస్ లయబి లిటీ కన్వెన్షన్ ప్రకారం.. నష్టం జరిగిందని బాధిత దేశం కోరితే.. పరిహా రం చెల్లించాల్సి ఉంటుంది. గతంలో ఎవరైనా చెల్లించారా? ఒక్కసారి జరి గింది. 1978లో కెనడా అప్పటి సోవి యట్ యూనియన్ నుంచి పరిహారాన్ని కోరింది. సోవియట్ ఉపగ్రహ భాగం కెన డాలో పడింది. అది కొంచెఅణు ధార్మికత వెదజల్లిందంటూ కెనడా పరిహా రాన్ని డిమాండ్ చేసింది. కొంచెం ఎక్కు వే అడిగినప్పటికీ.. సోవి యట్ యూనియన్రూ.18 కోట్లే(ప్రస్తుత లెక్క ప్రకారం) చెల్లించింది. మన దేశం విషయానికొస్తే.. పశ్చిమ ఆస్ట్రేలియాలో పడిన అంతరిక్ష వ్యర్థం పీఎస్ఎల్వీ రాకెట్ మూడో స్టేజ్‌కు సంబంధించినదని ఇస్రో నిర్ధారించింది. అది సముద్రంలో పడి.. తర్వాత కొంత కాలానికి తీరానికి కొట్టుకొచ్చి ఉంటుందని తేల్చారు. ఈ సంఘటనలో ఆస్ట్రేలియా పరిహారం కోరితే మనం చెల్లించాల్సి ఉంటుంది. అయితే.. తొలుత దీని నుంచి ఏమైనా విష రసాయనాలు లీకై ఉంటాయనే అనుమానాలు వ్యక్తమైనా.. తర్వాత అలాంటిదేమీ జరగలేదని శాస్త్రవేత్తలు తేల్చారు. దీన్ని బట్టి.. మన దేశం ఎలాంటి పరిహారాన్ని చెల్లించాల్సిన అవసరం లేదు. అలాగే.. యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఫర్ ఔటర్ స్పేస్ ఎఫైర్స్ ప్రకారం.. తమ దేశంలో పడ్డ..విదేశీ అంతరిక్ష భాగాన్ని యాజమాన్య దేశానికి తిరిగి అప్పగించాల్సి ఉంటుంది. సాధారణంగా మిషన్ అనాలసిస్ కోసం వీటిని తిరిగి తీసుకుంటారు. అయితే.. ఇక్కడ ఈ పరికరం వల్ల పెద్దగా ఉపయోగం ఉండబోదని ఆస్ట్రేలియా స్పేస్ ఏజెన్సీ ప్రతినిధి చెబుతున్నారు. భారత్‌కు ఇది అక్కర్లేకుంటే.. స్కైల్యాబ్ ఉంచిన.. మ్యూజియంలోనే దీన్ని కూడా పెడతామని చెబుతున్నారు. స్కైల్యాబ్ గుర్తుందిగా.. అమెరికా అంతరిక్ష పరిశోధన కేంద్రం. 1979లో ఇది కూలిపోతుందని చెప్పి.. ఇక ప్రపంచం అంతమే అన్నట్లు.. అదే ఇక చివరి రోజు అన్నట్లు ఆస్తులు అమ్మి విందులు వినోదాలు చేసుకున్నారు.. చాలామందికి స్కైల్యాబ్ పేరిట పిల్లలకు పేర్లు కూడా పెట్టారు. ఆ మధ్య తెలుగులో సినిమా కూడా వచ్చింది. ఆ స్కైల్యాబ్ భాగాలు కూడా పశ్చిమ ఆస్ట్రేలియా ప్రాంతంలోనే కూలాయి. ఇక మన విషయానికొస్తే... ♦నిజంగానే మన మీదో లేక మన ఇంటి మీదో పడిందనుకోండి.. మనమేమీ చేయనక్కర్లేదు. మన తరఫున మన దేశమే.. అది ఏ దేశానిదైతే.. ఆ దేశం నుంచి పరిహారాన్ని కోరుతుంది. ఇప్పిస్తుంది కూడా.. అయితే.. ఇప్పటివరకూ ఏ లెక్క ప్రకారం చూసినా.. అలా పడే అవకాశాలు దాదాపు లేవనే చెప్పాలి. అయినా.. ఏమో గుర్రం ఎగరావచ్చు.. ఎగిరి కింద పడనూవచ్చు.. న్యూటన్ చెప్పింది గుర్తుందిగా.. పైకి వెళ్లే ప్రతీది కిందకు రావాల్సిందే.. బీ కేర్‌ఫుల్ మరి.. – సాక్షి, సెంట్రల్ డెస్క్ -
వ్యర్థాల ద్వారా ఏటా 65 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి!
న్యూఢిల్లీ: భారీ మొత్తంలో వెలువడుతున్న వ్యర్థాలను వినియోగించుకుని భారత్ వార్షికంగా 65 గిగావాట్ల (జీడబ్ల్యూ) విద్యుత్ ఉత్పత్తిని సాధించగలదని ఈ రంగంలో నిపుణులు అంచనావేస్తున్నారు. ఇది 2030 నాటికి 165 గిగావాట్లకు, 2050 నాటికి 436 గిగావాట్లకు పెరిగే అవకాశాలు ఉన్నాయని కూడా వారు విశ్లేషించారు. వేస్టేజ్ నిర్వహణపై ఇక్కడ రెండు రోజుల వర్క్‌షాపు జరిగింది. వర్క్‌షాపులో వెల్లడైన అంశాల ప్రకారం, భారతదేశంలో ప్రతి సంవత్సరం 65 మిలియన్ టన్నుల వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి. ఈ పరిమాణం 2030 నాటికి 165 మిలియన్ టన్నులకు, 2050 నాటికి 436 మిలియన్ టన్నులకు పెరుగుతుంది. మునిసిపల్ చెత్తలో 75–80 శాతమే సమీకరణ జరుగుతోంది. ఇందులో 22 నుండి 28 శాతం మాత్రమే ప్రాసెస్ జరిగి, శుద్ధి అవుతోంది. తగిన రీతిన వేస్ట్ నుంచి విద్యుత్ ఉత్పత్తి జరిగే వ్యవస్థ రూపొందితే.. పర్యావరణ పరిరక్షణలో ఉపాధి అవకాశాలు కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది. -
నిత్యం మురుగు పరుగు
సాక్షి, సిటీబ్యూరో: విశ్వ నగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ మహా నగరంలో డ్రైనేజీల నుంచి మురుగు పొంగి పొర్లుతోంది. దుర్వాసన వెదజల్లుతుండటంతో జనం అవస్థలు పడుతున్నారు. సగం వరకు పగిలి, సరిగ్గా మూతల్లేని, చెత్తాతో నిండిన మ్యాన్‌హోళ్ల నుంచి నిత్యం మురుగు నీరు పొంగి రోడ్లపైకి వస్తుండటంతో వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడుతున్నారు. కాలనీల్లోనే కాదు... నిత్యం రద్దీగా ఉండే ప్రధాన రహదారులపై కూడా ఇదే పరిస్థితి ఉంది. జలమండలి యంత్రాంగం, డ్రైనేజీ పైప్లైన్ల, మ్యాన్‌హోల్స్ మరమ్మతులు, నిర్వహణ పేరుతో పనులు కొనసాగిస్తున్నా... మురుగునీరు రోడ్లపై రాకుండా శాశ్వత పరిష్కారం మాత్రం లభించడం లేదు. కొన్ని చోట్ల చిన్న వర్షం పడ్డా డ్రైనేజీ మ్యాన్‌హోళ్లు పొంగి ముగురు నీరు ఇళ్లలోకి వస్తుండగా, కొన్నిచోట్ల తాగునీటి పైప్‌లోకి మురుగు వస్తోంది. నిత్యం సమస్యలే.. మహానగరంలో మ్యాన్‌హోళ్ల నిర్వహణ జలమండలికి పెద్ద ప్రహసనంగా మారింది. నిత్యం వందల ప్రాంతాల్లో మ్యాన్‌హోళ్లు పొంగడం, లేదంటే వాహనాల బరువుతో మూతలు పగలడం, భూమిలోకి కుంగిపోవడం లాంటి సమస్యలు ఉత్పన్నమవుతూనే ఉన్నాయి. ప్రజల నుంచి అధికారులకు నిత్యం వందల సంఖ్యలో ఫిర్యాదులు వస్తుంటాయి. చిన్న వర్షం పడితే ఫిర్యాదుల సంఖ్య మూడింతలు పెరుగడం సాధారణంగా తయారైంది. ఎక్కడ చూసినా.. ఇవే సమస్యలు. నగరంతోపా టు శివార్లలో సైతం మ్యాన్‌హోళ్ల పరిస్ధితి అధ్వానంగా తయారైంది. ప్రతిచోట మ్యాన్‌హోళ్లపై సిబ్బందితో నిఘా పెట్టడం కష్ట సాధ్యమే. ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తే కానీ, స్పందించని పరిస్థితి ఉంది. 12 వేల చదరపు కిలో మీటర్ల మురుగు నీటి వ్యవస్థ... మహానగరంలో సుమారు 12 వేల చదరపు కిలోమీటర్లకు పైగా మురుగు నీటి వ్యవస్థ విస్తరించి ఉంది. వీటిపై సుమారు నాలుగు లక్షల వరకు మ్యాన్‌హోళ్లు ఉన్నాయి. ప్రధాన రోడ్డు మార్గాల్లో లక్ష వరకు మ్యాన్‌హోళ్లు ఉంటాయన్నది అంచనా. వీటిలో సుమారు 20 వేలకు పైగా లోతైనవి ఉంటాయి. నగరంలోని సుమారు 450 ప్రాంతాల్లో నిత్యం డ్రైనేజీ సమస్య ఉత్పన్నమవుతోంది. చిన్న వర్షానికే పొంగిపర్లుతుంటాయి. మరోవైపు వ్యర్థాలు, చెత్తా పేరుకుపోవడంతో మురుగు వెళ్లక మ్యాన్‌హోళ్ల నుంచి పొంగడం సర్వసాధారణంగా తయారైంది. నిజాం కాలం నుంచే.. నిజాం కాలం నుంచే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్ధ కొనసాగుతోంది. అప్పట్లో వరద నీళ్లు పోయేందుకు నాలాలు, నివాసాలు, ఇతర నిర్మాణాల నుంచి వెలువడే మురుగునీటిని తరలించేందుకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేశారు. అప్పటి జనాభాకు ఐదు రెట్లు జనం పెరిగినా కూడా సీవరేజ్ పైపులైన్లు పనిచేసేలా పక్కా ప్లానింగ్‌తో నిర్మాణాలు చేపట్టారు. అయితే అప్పటికీ ఇప్పటికీ నగర జనాభా 25 రెట్లు పెరిగినా పాత కాలం నాటి డ్రైనేజీలే ఇప్పటికీ వినియోగంలో ఉన్నాయి. అవి చాలా చోట్ల దెబ్బతినడం, పెరిగిన జనాభాకు అనుగుణంగా సామర్థం లేకపోవడంతో మురుగునీరు రోడ్లపై పారుతోంది. పైప్లైన్లను కొన్ని ప్రాంతాల్లో రీస్టోర్ చేసినా.. క్లీనింగ్ యంత్రాలతో మ్యాన్‌హోళ్లను శుభ్రం చేసినా పెద్దగా ఫలితం ఉండటంలేదు. తాగునీటి పైపుల్లోకి.. కొన్ని ప్రాంతాల్లో డ్రైనేజీ పైపుల పక్కనే తాగునీటి పైపులు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. డ్రైనేజీలు దెబ్బతిని లీకవడంతో ఆ నీళ్లు తాగునీటి పైపుల్లోకి చేరుతోంది. పాతబస్తీలో ఈ సమస్య ఎక్కువగా ఉంది. సీవరేజీ నీళ్లు తాగునీటిలో కలుçవడంతో మంచినీరు కలుషితమవుతోంది. సంబంధిత సిబ్బంది తాత్కాలిక మరమ్మతులతో చేతులు దులిపేసుకుంటున్నారు. -
వనరుల పొదుపు..కాలుష్యం అదుపు.. సర్క్యులర్ ఎకానమీ! అంటే తెలుసా?
టవల్ మసి గుడ్డగా మారడం... వంటింట్లో వ్యర్థాలు మొక్కలకు పోషకాలుగా వినియోగించడం... అవసరం మేరకే విద్యుత్, నీరు, సామాన్లు వాడటం.. ఇలాంటి వాటికి మనం పెట్టుకునే పేరు.. పొదుపు. ఆ తరహా పనులే ప్రపంచం మొత్తం మీద అన్ని రంగాల్లో చేపడితే..? అదే.. సర్క్యులర్ ఎకానమీ! -కంచర్ల యాదగిరిరెడ్డి ప్రపంచం మొత్తం మీద ఏటా వినియోగిస్తున్న వస్తువులు 10,000 కోట్ల టన్నులు. ఇందులో ఒకసారి మాత్రమే వాడగలిగిన ప్లాస్టిక్, లోహాలు, కలప, కాంక్రీట్, రసాయనాలు ఏకంగా 92 శాతం. కాంక్రీట్‌ను పక్కనబెడితే మిగిలినవన్నీ చెత్తకుప్పల్లోకి చేరి మనల్ని ఇబ్బంది పెట్టేవి, ఆరోగ్యాన్ని సైతం నాశనం చేసేవే. ఈ విపత్కర పరిస్థితికి తరుణోపాయం సర్క్యులర్ ఎకానమీ అని నిపుణులుఅంటున్నారు. భూమి మీద ముడి చమురు, ఫాస్పరస్ వంటి రసాయనాలు, సాగుభూమి, తాగునీరు ఇలా అన్నీ పరిమితమైనవే. కానీ మనం ఈ వనరులను వృధా చేస్తున్నాం. ఎంత వృ«థా అంటే.. అవసరానికి మించి 1.6 రెట్లు వాడేస్తున్నామని ప్రపంచ ఆర్థిక వేదిక స్పష్టం చేసింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తు తరాలకు అన్నిరకాల ఇబ్బందులూ తప్పవని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఉన్న వనరులను జాగ్రత్తగా వాడుకునేందుకు సర్క్యులర్ ఎకానమీ దోహదపడుతుంది. వాడుకుని వదిలేయకుండా.. ఇప్పటివరకు మనం వస్తువులను తయారు చేసి వాడుకున్న తర్వాత వదిలేయడం అనే సూత్రాన్ని అనుసరిస్తున్నాం. ఇంగ్లిషులో దీనిని ‘లీనియర్ ఎకానమీ మోడల్’అని పిలుస్తారు. దీనివల్ల ఎన్నో సమస్యలు ఎదురవుతున్నాయని, కాలుష్యం పెరుగుతోందని, వనరుల దుర్వినియోగం జరుగుతోందని 1970 దశకంలోనే కొంతమంది ఆర్థిక వేత్తలు, నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. దానికి విరుగుడుగా సర్క్యులర్ ఎకనామీ మోడల్‌ను ప్రతిపాదించారు. ఎలన్ మెకార్థర్ ఫౌండేషన్ వంటివి ఈ ఆలోచనకు మరింత పదునుపెట్టి అన్ని రంగాల్లోనూ అమలు చేసేందుకు ప్రయత్ని స్తున్నాయి. కొత్త సర్క్యులర్ ఎకానమీ మోడల్‌ను అమలు చేస్తే కేవలం కాలుష్యం, పర్యావరణ సమస్యలకు పరిష్కారం లభించడం మాత్రమే కాకుండా, ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికీ దోహదపడుతుందని నిపుణులు చెబుతున్నారు. తక్కువ వనరుల వినియోగం.. ఎక్కువ మన్నిక సర్క్యులర్ ఆర్థిక వ్యవస్థలో వస్తువులను వీలైనంత తక్కువ వనరుల వినియోగంతో తయారు చేస్తారు. వ్యర్థాలను, కర్బన ఉద్గారాలను వీలైనంతగా తగ్గించడం అనేది వీటి రూపకల్పనలో ముఖ్యాంశం. పైగా ఏ వస్తువైనా వీలైనంత ఎక్కువ సమయం ఉపయోగపడేలా ఉంటుంది. కొత్త మోడల్ వచ్చి నప్పుడల్లా పాత స్మార్ట్ఫోన్లను పడేసినట్లు కాకుండా.. చెడిపోతే మరమ్మతు చేయడం, డిజైన్లను మార్చడం ద్వారా సదరు వస్తువు జీవితకాలం పెంచడం, పూర్తిగా పనికిరాకుండా పోయిన తర్వాత రీసైకిల్ చేయడం సర్క్యులర్ ఎకానమీలో భాగం. ఉదాహరణకు.. యూరప్ దేశాలు ఏటా సుమారు 250 టన్నుల వ్యర్థాలను ఉత్పత్తి చేస్తున్నాయి. వీటిని మళ్లీ వాడుకునేలా చేయడం ద్వారా కొత్త వాటిని కొనుక్కునే అవసరాన్ని తప్పిస్తారన్నమాట. ఇలా చేయడం వల్ల బోలెడు డబ్బు ఆదా అవుతుంది. అలాగే అవి తిరిగి పనిచేసేలా తయారు చేసేందుకు, మరమ్మతులు చేసేందుకు మానవ వనరులు అవసరమవుతాయి. అంటే కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయన్నమాట. ఇది ప్రపంచ వ్యాప్తంగా అమల్లోకి వస్తే 2030 నాటికి సర్క్యులర్ ఎకానమీ విలువ దాదాపు 4.5 లక్షల కోట్ల డాలర్లుగా ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇంకోరకంగా చెప్పాలంటే 4.5 లక్షల కోట్ల డాలర్ల మొత్తాన్ని ఆదా చేయవచ్చని వారు చెబుతున్నారు. వ్యవస్థ మొత్తం మారితేనే.. ఇందుకోసం వ్యవస్థ మొత్తం మారాలి. వినియోగదారులు, వ్యాపారవేత్తలు, రాజకీయ నేతలు అందరూ తమవంతు పాత్ర పోషించాలి. సులువుగా రీసైకిల్ చేయగలిగేలా, విడదీసేలా వస్తువులను డిజైన్ చేయడం ఒక పద్ధతి. దీనివల్ల తయారీకి ముడిసరుకులు తక్కువగా అవసరమవుతాయి. ఫెయిర్ ఫోన్ అనే స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఓ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్‌ను తయారు చేసింది. పాడైపోయిన భాగాలను తీసేసి కొత్తవి వేసుకోవడం ఈ స్మార్ట్‌ఫోన్‌లో సాధ్యమవుతుంది. కేవలం వాడుకున్నందుకే డబ్బులు..! కొత్తరకం బిజినెస్ మోడల్ ద్వారా కూడా సర్క్యులర్ ఎకానమీ అమలు చేసేందుకు వీలవుతుందని నిపుణులు చెబుతున్నారు. ల్యాప్‌టాప్, మోటార్‌సైకిల్, ఏసీ, ఫ్రిజ్ వంటి వాటిని కొనడం కాకుండా.. కేవలం వాడుకునేందుకు మాత్రమే కంపెనీలకు డబ్బులు చెల్లించడం ఈ కొత్తరకం బిజినెస్ మోడల్‌కు ఒక ఉదాహరణ. ఈ మోడల్లో ఆయా వస్తువుల జీవితకాలం ముగిసిన తర్వాత సదరు కంపెనీ వెనక్కి తీసుకుంటుంది. వాటిల్లోని పరికరాలను రీసైకిల్ చేస్తుంది. ఉపయోగపడే వస్తువులన్నింటినీ మళ్లీ మళ్లీ వాడుతుంది. వాడి పారేసే ప్లాస్టిక్ వాడకాన్ని 2040 నాటికల్లా దశలవారీగా తగ్గించాలని ఫ్రాన్స్ నిర్ణయించింది. ఈ క్రమంలోనే పునర్వినియోగాన్ని, రీసైక్లింగ్‌నూ ప్రోత్సహించడం ద్వారా ఈ రంగంలో సర్క్యులర్ ఎకానమీని అమల్లోకి తెచ్చింది. వ్యర్థాల మోతాదు తగ్గాలి ఈ ఏడాది ఫ్రిబవరిలో ప్రపంచవ్యాప్తంగా సర్క్యులర్ ఎకానమీ అమలుపై ఒక నివేదిక వెలువడింది. ‘ద సర్క్యులేటరీ గ్యాప్ రిపోర్ట్’గా పిలిచే ఈ నివేదిక ప్రకారం.. 1970తో పోలిస్తే మన వస్తు వినియోగం మూడు రెట్లు అంటే ఏడాదికి 10,000 కోట్ల టన్నులకు పెరిగింది. ఈ నేపథ్యంలో పూర్తిస్థాయిలో సర్క్యులర్ ఎకానమీని కనుక అమలు చేయగలిగితే ఇందులో మూడొంతుల మేరకు వస్తు వినియోగాన్ని తగ్గించవచ్చు. సర్క్యులర్ ఎకానమీ అమల్లో ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యం మరింత పెరగాలని, అన్ని రకాల పరిశ్రమల్లో వ్యర్థాల మోతాదును తగ్గించేందుకు ప్రయత్నాలు జర గాలని నివేదిక సూచించింది. నియోమ్‌లో వ్యర్థాలన్నీ రీసైకిల్ సౌదీ అరేబియా కడుతున్న సరికొత్త నగరం ‘నియోమ్’లో సముద్రపు నీటిని మంచినీటిగా మార్చే అత్యాధునిక డీశాలినేషన్ ప్లాంట్లను ఉపయోగించనున్నారు. ఆ దేశంలో ఇది కొత్త కాదు కానీ.. నియోమ్‌లోని ప్లాంట్ల వ్యర్థాల నుంచి విలువైన రసాయనాలను వెలికితీసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుండటం విశేషం. బ్యాటరీల్లో వాడే లిథియంతో పాటు పొటా షియం, సోడియం వంటి అనేక లవణాలు, ఖనిజాలు సమ్రుదపు నీటిలో ఉంటాయన్నది తెలిసిన విషయమే. నియోమ్ ప్లాంట్ల వ్యర్థాల నుంచి జిప్సమ్‌ను వేరు చేసి దాన్ని సిమెంట్ తయారీలో వాడాలన్న ఆలోచన సాగుతోంది. కాగా నియోమ్‌లో వ్యర్థాలన్నింటినీ పూర్తిగా రీసైకిల్ చేయనున్నారు. ఘన వ్యర్థాల రీసైక్లింగ్ ద్వారా ఎరువులు, మురుగునీటి లోంచి నైట్రోజన్, ఫాస్పరస్ (సబ్బులు, డిటర్జెంట్ల వాడకంతో కలుస్తుంటాయి) వంటి వనరులను వెలికితీయనున్నారు. వాడేసిన వంట నూనెలతో వాహనాల పరుగు ఇంగ్లండ్‌లోని బౌర్న్మౌత్ ప్రాంతంలో చెత్తను సేకరించే వాహనాలన్నీ వాడేసిన వంటనూనెలతో నడుస్తున్నాయి. ఈ నూనెలను రీసైకిల్ చేసి తయారు చేసిన హైడ్రోట్రీటెడ్ వెజిటబుల్ ఆయిల్ (హెచ్‌వీఓ)ను ఉపయోగిస్తున్నారు. ఆమ్స్టర్డ్యామ్లో మెక్‌డొనాల్డ్స్ కేంద్రాల్లో వాడేసిన నూనెలను రీసైకిల్ చేసి చెత్త సేకరించే వాహనాలకు, స్విగ్గీ, జొమాటో వంటి ఆహారం సరఫరా చేసే కంపెనీలకు అందిస్తున్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలను ప్రత్యేక రసాయనాల ద్వారా విడగొట్టి ఆ ద్రావణాన్ని కొత్త ప్లాస్టిక్ తయారీకి వాడేలా సింగపూర్ ఇటీవలే ప్రయత్నాలు మొదలుపెట్టింది. -
మంచి మాట: వర్తమానమే జీవితం
మనిషి బతకాల్సింది గతంలోనో, భవిష్యత్తులోనో కాదు వర్తమానంలో. కానీ శోచనీయంగా చాలమంది గతంలోనో, భవిష్యత్తులోనో బతుకుతూ ఉంటారు. గతంలో జరిగిన వాటిని తలుచుకుంటూ వర్తమానాన్ని గడిపేస్తూ ఉంటారు. భవిష్యత్తులో ఇవి చేద్దాం, అవి చేద్దాం అనుకుంటూ వర్తమానాన్ని జారవిడుచుకుంటూ ఉంటారు. ఈ తీరు పెనుతప్పు మాత్రమే కాదు, బతుకును గుట్టుగా కాల్చేసే కనిపించని నిప్పు కూడా. ‘మనలో చాలమంది వర్తమానంలో పూర్తిగా ఉండరు. ఎందుకంటే తమకు తెలియకుండానే వాళ్లు ఈ క్షణం కన్నా తరువాతి క్షణం ముఖ్యమైందని నమ్ముతారు. అలా ఉంటే నువ్వు నీ పూర్తి జీవితాన్ని కోల్పోతావు...’ అని జర్మన్ తాత్విక అధ్యాపకుడు ఎక్‌హార్ట్ టోల్ చెబుతారు. ఒక మనిషి వర్తమానం లో బతకక పోవడం అనే మానసిక దోషానికి విశ్వాసం అనేది లేకపోవడం ప్రధాన కారణం. ఏ వ్యక్తికైనా కాలం మీద, ప్రయత్నాల మీద విశ్వాసం ఉండాలి. అష్టావక్రగీత ఒక సందర్భంలో విశ్వాసాన్ని అమృతం అంటూ‘విశ్వాసామృతాన్ని తాగి సుఖివిగా ఉండు’ అని మనిషికి ముఖ్యమైన సూచనను ఇచ్చింది. సుఖంగా ఉండాలంటే మనిషికి విశ్వాసం అనేది ఉండాలి; ముఖ్యంగా ఆత్మవిశ్వాసం ఉండాలి.‘నిన్ను నువ్వు విశ్వసించడం విజయంలోని తొలి రహస్యం‘ అని గౌతమ బుద్ధుడు తెలియజెప్పాడు. దట్టమైన చీకటిలో ఎగిరే లేదా ఎగరగలిగే పక్షికి ఆత్మవిశ్వాసం ఉంటుంది. తనకు ఆత్మవిశ్వాసం ఉంది అనే భావన పక్షికి ఉండకపోవచ్చు. అంతేకాదు, చీకట్లో ఎగిరే పక్షికి గతం గురించి, భవిష్యత్తు గురించి తలపు లు ఉండవు. వర్తమానంలో పక్షి ఎగురుతోంది; వర్తమానంలో ఎంత చీకటి ఉన్నా అంత చీకటిలోనూ పక్షి ఎగర గలుగుతుంది. ఎందుకంటే పక్షి వర్తమానంలో బతుకుతూ ఉంటుంది. పక్షి మనిషికి ఆదర్శం కావాలి. ‘మనిషి బాధపడడం సుఖం అనుకుంటున్నాడు, సుఖపడడానికి బాధపడుతున్నాడు’ కాబట్టే వర్తమానంలో ఉండీ గతంలోకో, భవిష్యత్తులోకో దొర్లిపోతూ ఉంటాడు. మనిషి ఈ స్థితికి బలి అయిపోకూడదు. మనిషి ఈ స్థితిని జయించాలి.‘గతంలోని శోకంతో పనిలేదు; భవిష్యత్తు గురించి చింతన చెయ్యక్కర్లేదు; వర్తమానంలోని పనుల్లో నిమగ్నం అవుతారు వివేకం ఉన్నవాళ్లు’ అని విక్రమార్క చరిత్ర చక్కగా చెప్పింది. గతంలో సంతోషం ఉండి ఉన్నా, శోకం ఉండి ఉన్నా అవి ఇప్పటివి కావు కాబట్టి గతాన్ని తలుచుకుంటూ ఉండిపోతే మన వర్తమానం వృథా అయిపోతుంది. వర్తమానం వృథా అయిపోతే భవిష్యత్తు కూడా వృథా అయిపోతుంది. గతం గడిచిపోయింది కాబట్టి, వర్తమానం వచ్చేసింది కాబట్టి వర్తమానంలో ఉన్న మనిషి గతంలోనో, భవిష్యత్తులోనో కాకుండా వర్తమానంలోనే ఉండాలి. ‘నీ హృదయం ఒక సముద్రం అంతటిది. వెళ్లి నిన్ను నువ్వు కనుక్కో మరుగున ఉన్న దాని లోతుల్లో’ అని ఫార్సీ తాత్విక కవి రూమీ చెప్పారు. గతంలో భవిష్యత్తు ఉండదు. భవిష్యత్తు గతంలా ఉండకూడదు. మనిషి వర్తమానంలో బతకడం నేర్చుకోవాలి. వర్తమానంలో బతకడం నేర్చుకున్న మనిషి భవిష్యత్తు ఉన్నతంగా ఉంటుంది. ఉన్నతమైన భవిష్యత్తు కోసం, ఉన్నతమైన జీవితం కోసం మనుషులమైన మనం వివేకంతో వర్తమానంలో నిమగ్నమవ్వాలి. వర్తమానంలో ఉన్న మనిషి తన హృదయపు లోతుల్లోకి వెళ్లి తనను తాను కనుక్కోవాలి. అలా తనను తాను కనుక్కోవాలంటే మనిషి గతంలోనో, భవిష్యత్తులోనో పడిపోతూ ఉండకూడదు. మనిషి వర్తమానంలో మసలాలి; మనిషి వర్తమానంతో మెలగాలి. హృదయపు లోతుల్లోకి వెళ్లి తనను తాను కనుక్కోగలిగిన వ్యక్తి మానసిక దోషాలకు అతీతంగా వర్తమానంలో వసిస్తాడు. – శ్రీకాంత్ జయంతి -
ప్రజారోగ్యంతో చెలగాటం.. చేపలకు మేతగా కుళ్లిన కోళ్లు
సాక్షి ప్రతినిధి, ఏలూరు: కుళ్లిన కోడిగుడ్లు, కోడి పేగులు, ఈకలు, పాడైపోయిన అన్నం ఇవి కొల్లేరు ప్రాంత ఫంగస్ చేపల సాగు కోసం చెరువుల్లో వేస్తున్న ఆహారం. ఈ చేపలను మనం తింటే ఏమవుతుంది. వ్యర్థ పదార్థాలను సైతం వృథా కానివ్వకుండా చేపలకు మేతగా వేస్తున్నారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. ఏలూరు జిల్లా పరిధిలో ఇటీవల పట్టుబడుతున్న వ్యర్థ పదార్థాల వాహనాల కేసులు ఇందుకు నిదర్శనంగా మారాయి. ఈ ఏడాది నవంబరు 14న కలెక్టరు వి.ప్రసన్న వెంకటేష్ వ్యర్థాల నివారణకు మండల స్థాయిలో టాస్క్ఫోర్సు కమిటీల పర్యవేక్షణకు జీవో విడుదల చేశారు. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాలో 2,50,045 ఎకరాల విస్తీర్ణంలో ఆక్వా సాగు విస్తరించింది. వ్యాధులకు తట్టుకుని, ఎలాంటి మేతనైనా జీర్ణం చేసుకునే గుణాలు కలిగిన ఫంగస్ చేపల సాగు దాదాపు 12,000 ఎకరాల్లో జరుగుతోంది. సాధారణంగా చేపల పెంపకానికి డీవోబి, వేరుశెనగ చెక్క, పిల్లెట్లు మేతగా ఉపయోగిస్తారు. పిల్లెట్లతో ఫంగస్ చేపలు త్వరగా బరువు పెరగవు. పైగా ఖర్చు ఎక్కువ. అందుకే వాటి స్థానంలో కోళ్ల వ్యర్థాలు, కుళ్ళిన కోడిగుడ్లు చెరువులో వేస్తున్నారు. టాస్క్ఫోర్సు కమిటీలు రాష్ట్ర చేపల రైతుల సంఘం ఫిర్యాదుతో 2016లో అప్పటి మత్స్యశాఖ కమిషనరు చేపల చెరువుల్లో కోడి వ్యర్థాల మేతను నిషేధిస్తూ జీవో నెంబరు 56 ద్వారా కఠిన నిబంధనలు విధించారు. అప్పట్లో నిషేధిత క్యాట్ ఫిష్ సాగు చేసేవారు. ఆ సాగును కేంద్రం నిషేధించింది. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యర్థాలను ఫంగస్ సాగులో వేస్తున్నారు. ఫంగస్ సాగు చేసే అందరి రైతులు వ్యర్థాలను వేయడం లేదు. ఈ ఏడాది నవంబరులో జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ నిషేధిత జీవోను పటిష్టంగా అమలు చేయాలని ఆయా శాఖాలకు ఆదేశించారు. మండల స్థాయిలో తహసీల్దారు, వీఆర్ఓ, వెహికల్ ఇన్స్పెక్టర్, ఎస్ఐ, మత్స్య అభివృద్ధి అధికారి(ఎఫ్‌డీవో)లతో టాస్క్ఫోర్సు కమిటీని ఏర్పాటు చేశారు. పట్టుబడిన వ్యర్థాలను నాశనం చేయడం, వాహన డ్రైవర్ల లైసెన్సు రద్దు, వ్యర్థాలతో సాగు చేస్తున్న చెరువుల ఆక్వాకల్చర్ రిజిస్ట్రేషన్లు రద్దు వంటి చర్యలను టాస్క్ఫోర్సు చేస్తోంది. అక్రమ రవాణా ఇలా.. వ్యర్థాల అక్రమ రవాణాకు వేస్ట్ఫుడ్ మాఫియా బరితెగిస్తుంది. తెలంగాణ, విజయవాడ, గుడివాడ, ఏలూరు వంటి పలు ప్రాంతాల్లో చికెన్ షాపుల నుంచి కిలో రూ.ఐదు చొప్పున వ్యర్థాలను కొనుగోలు చేసి వాటిని పెంపకందారులకు రూ.10 చొప్పున విక్రయిస్తున్నారు. ఆయా దుకాణాల వద్ద డ్రమ్ములను ఏర్పాటు చేసి ఒక్కొక్కటి సేకరించి వ్యాన్లలో చెరువుల వద్దకు తరలిస్తున్నారు. హోటల్స్ నుంచి మిగిలిన అన్నం, కూరలను సేకరిస్తున్నారు. ఈ దందా రాత్రి వేళల్లో గుట్టుచప్పుడు కాకుండా జరుగుతోంది. జిల్లాలో పెదపాడు, ఉంగుటూరు, మండవల్లి, కైకలూరు మండలాల్లో కోడి వ్యర్థాలను ఫంగస్ సాగులో ఉపయోగిస్తున్నారు. మండవల్లి మండలం నుచ్చుమిల్లి, కైకలూరు మండలం కొట్టాడ గ్రామాల్లో కోడి వ్యర్థాల వినియోగంపై కేసులు నమోదయ్యాయి. కఠిన చర్యలు తప్పవు కోడి వ్యర్థ్యాలను చెరువుల్లో ఉపయోగించడం వల్ల నీరు, నేల కలుషితమవుతాయి. ఇలాంటి చేపల సాగు మొత్తం ఆక్వాకల్చర్ పేరును పాడుచేస్తోంది. కొట్టాడ గ్రామంలో 12 క్వింటాల కోడి వ్యర్థాల వ్యాన్‌ను పట్టుకున్నాం. చెరువు యజమాని, వాహనదారుడిపై కేసులు నమోదు చేశాం. – ఎన్.భవిత, మత్స్యశాఖ అభివృద్ధి అధికారి, కైకలూరు ప్రజారోగ్యానికి ముప్పు కుళ్లిన వ్యర్థాలతో సాగు చేసిన చేపలను మనుషులు తింటే ఆరోగ్యం పాడవుతోంది. ముఖ్యంగా దీని ప్రభావం మెదడుపై పడుతోంది. నరాల వ్యాధులు వస్తాయి. ఉదర కోశ వ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉంది. చేపలకు మేతగా పెట్టిన వ్యర్థాల్లో కలుషిత రసాయనాలు శరీరంలోకి చేరుతాయి. ఇవి ఎంతో ప్రమాదకరం. – బి.శంకర్, కొల్లేటికోట పీహెచ్సీ డాక్టరు, కైకలూరు మండలం -
హైదరాబాద్‌ను ఆగం చేస్తున్న బయో వ్యర్థాలు.. రోగాల కుంపటిగా..!
సూదిమందు.. వాడిపడేసిన కాటన్.. టానిక్ సీసా.. ఇతరత్రా ఆస్పత్రి వ్యర్థాలు మహానగరాన్ని ముంచెత్తుతున్నాయి. వాటిలోని బ్యాక్టీరియా, వైరస్లు వాతావరణంలో కలిసి నగరాన్ని రోగాల కుంపటిగా మారుస్తున్నాయి. ఇప్పటికీ అనేక ఆస్పత్రులు తమ వ్యర్థాలను ఆరు బయట తగులబెడుతుండడంతో అనేక మంది అంటురోగాల బారిన పడుతున్నారు. అత్యాధునిక వైద్యానికి, అనేక అరుదైన చికిత్సలతో మెడికల్ హబ్‌గా గుర్తింపు పొందిన గ్రేటర్‌ను ప్రస్తుతం ఆస్పత్రి వ్యర్థాలు దడ పుట్టిస్తుండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. తాజాగా గ్రేటర్ జిల్లాల పరిధిలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్యారోగ్య శాఖ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో విస్తుపోయే అంశాలు వెలుగుచూశాయి. మెజారిటీ క్లినిక్‌లు, నర్సింగ్ హోమ్‌లకు పీసీబీ అనుమతులు, జీవ వ్యర్థాల నిర్వహణ సర్టిఫికెట్లు లేకపోవడం గమనార్హం. సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ పరిధిలోని మూడు జిల్లాల్లో ఉన్న 3,919 ఆస్పత్రుల్లో 60 వేలకుపైగా పడకలు ఉన్నట్లు అంచనా. ఒక్కో పడక నుంచి సగటున రోజుకు 300 నుంచి 400 గ్రాముల వరకు జీవవ్యర్థాలు వెలువడుతున్నట్లు పీసీబీ లెక్కవేసింది. గ్రేటర్ నుంచి నిత్యం 35 టన్నులు, శివారు పురపాలికల నుంచి మరో 15 టన్నుల వరకు ఆస్పత్రి వ్యర్థాలు వెలువడుతున్నట్లు అంచనా వేసింది. ఈ వ్యర్థాలను కార్పొరేట్ ఆస్పత్రులు మినహా ఇతర ఆస్పత్రులు శాస్త్రీయ పద్ధతిలో కాకుండా సాధారణ చెత్తతో పాటే పడవేస్తుండడంతో బ్యాక్టీరియా, వైరస్లు గాలిలో కలిసి వివిధ రకాల వ్యాధులకు కారణమవుతున్నట్లు వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సాధారణ చెత్తతోనే వ్యర్థాలు ఆస్పత్రి వ్యర్థాల నిర్వహణ చట్టం– 1998 ప్రకారం ఆస్పత్రుల్లో రోజువారీ ఉత్పత్తయ్యే చెత్తను వేర్వేరు రంగుల డబ్బాల్లో నింపాలి. 48 గంటలకు మించి ఆస్పత్రుల్లో నిల్వ ఉంచరాదు. వీటిని శాస్త్రీయ పద్ధతిలో రీసైక్లింగ్ చేసేందుకు ప్రత్యేకంగా నెలకొల్పిన కేంద్రాలకు తరలించాలి. రవాణాలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి. ఆచరణలో ఈ నిబంధనలు అమలు కావడంలేదు. గాందీ, ఉస్మానియా, కోఠి ప్రసూతి ఆస్పత్రి, నిమ్స్ సహా పలు ఆస్పత్రుల యాజమాన్యాలు సాధారణ చెత్తతో పాటే ఆస్పత్రి వ్యర్థాలను గుట్టలుగా పోగుచేసి తగులబెడుతుండడంతో వాతావరణం కలుషితమవుతోంది. ఈ పొగ పీల్చుకున్న వారిలో 20 శాతం మంది అస్వస్థతకు గురవుతున్నారు. విదేశాల్లో ఇలా.. అమెరికా, ఆ్రస్టేలియా, ఇంగ్లాడ్ తదితర విదేశాల్లో ఆస్పత్రి వ్యర్థాలను పర్యావరణానికి హాని కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జీవ వ్యర్థాల వల్ల ఉత్పన్నమయ్యే ప్రమాదకర రసాయనాలు, ఇతర ఉద్గారాలు గాలిలో కలువకుండా ఎప్పటికప్పుడు దహనం చేస్తున్నారు. వ్యర్థాలను వేర్వేరు డబ్బాల్లో నింపి వాటిని నిర్వహణ కేంద్రాలకు జాగ్రత్తగా తరలిస్తున్నారు. అక్కడ ఆటో క్లీనింగ్, మైక్రోవేవింగ్, కెమికల్ ట్రీట్ మెంట్ నిర్వహించి వ్యర్థాల్లో బ్యాక్టీరియా, వైరస్ వంటి సూక్ష్మజీవులు లేకుండా చేస్తున్నారు. ఆ తర్వాత భూమిపై పెద్ద గుంత తీసి వాటిలో పూడుస్తున్నారు. ప్రస్తుతం మన కార్పొరేట్ ఆస్పత్రులు ఈ విధానాన్ని సొంతంగా అమలు చేస్తుండగా..మిగతావారు ఈ అంశాన్ని పట్టించుకోకపోవడంతోనే అనర్థాలు తలెత్తుతున్నట్లు పర్యావరణ నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. వ్యర్థాలతో అనర్థాలివే: హెచ్ఐవీ రోగులు వాడిపడేసిన సూదులు, బ్లేడులు ఆరుబయట పడేయడంతో ఇవి ఇతరులకు గుచ్చుకున్నప్పుడు వారికి ఆయా రోగాలు సోకే ప్రమాదం ఉంది. హెపటైటిస్ బి వంటి రోగాలు ప్రబలుతాయి. చీము తుడిచిన కాటన్‌ను వథాగా పడవేస్తుండడంతో అందులోని ఫంగస్ ఇతరులకు వ్యాపిస్తుంది. ఆస్పత్రి వ్యర్థాల్లోని బ్యాక్టీరియా, వైరస్ ఇతరులకు త్వరగా వ్యాపించి జీర్ణకోశ, శ్వాసకోశ, చర్మ వ్యాధులు ప్రబలుతాయి. ప్రజారోగ్యానికి పెద్ద ముప్పు రోగుల రక్తంతో తడిసిన దుప్పట్లు, సర్జికల్ డ్రెస్సులు నగరంలోని శివారు చెరువుల్లో శుభ్రం చేస్తుండటంతో చెరువుల్లోని నీరు కలుషితమవుతోంది. వాతావరణ కాలుష్యానికి కారణమవుతూ ప్రజారోగ్యాన్ని దెబ్బతీస్తున్న ఆస్పత్రులను గుర్తించి, చర్యలు తీసుకున్న దాఖలాలు కూడా లేకపోవడంతో పలు ప్రైవేటు ఆస్పత్రులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. గతంలో ఇదే అంశంపై ప్రభుత్వానికి, గవర్నర్‌కు ఫిర్యాదు చేశాం. అయినా జీవ వ్యర్థాల నిర్వహణ విషయంలో మార్పు కనిపించడం లేదు. – ఎం.పద్మనాభరెడ్డి, కార్యదర్శి, ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ (చదవండి: మద్యం ‘మత్తు’లో ఎవరెవరు?) -
టన్నుల కొద్ది వ్యర్థాలతో కోట్లు గడిస్తూ...వరుసగా ఆరోసారి తొలిస్థానం దక్కించుకున్న నగరం
భారతదేశంలోనే స్వచ్ఛ నగరంగా ఇండోర్ వరుసగా ఆరోసారి తొలిస్థానం దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఐతే ఇండోర్ నగరమే ఎందుకు ఆ ఘనతను దక్కించుకోగలిగందంటే..ఎక్కడైన పొడిచెత్తను, తడిచెత్తను విభజించడం సర్వసాధారణం. కానీ ఇండోర్‌లో మాత్రం చెత్త సేకరణ వద్దే ఆరు విభాగాలుగా విభజిస్తారు. మధ్యప్రదేశ్ రాష్ట్ర వాణిజ్య రాజధానిగా పిలిచే ఇండోర్ సుమారు 35 లక్షల జనాభా కలిగిన అతి పెద్ద నగరం. ప్రతిరోజు దాదాపు 1200 టన్నుల పొడి చెత్త, సుమారు 700 టన్నుల తడి చెత్తను విడుదల చేస్తున్నప్పటికీ చెత్త డబ్బాల్లో చెత్త మాత్రం కనిపించదు. ఎందుకంటే... అక్కడ దాదాపు 850 వాహనాలతో గృహాలు, వ్యాపార సంస్థలను నుంచి సేకరించే వేస్ట్‌ను ఆరు విభాగాలు విభజించి ఎప్పటికప్పుడూ తరలిస్తారని ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్ సూపరింటెండెంట్ ఇంజనీర్ మహేష్ శర్మ తెలిపారు. వాహానాల్లోని వ్యర్థాలకు సంబంధించి ప్రత్యేక కంపార్ట్మెంట్లు ఉంటాయి. దీంతో సేకరణ ప్రారంభంలోనే సమర్ధవంతంగా ఆ వేస్ట్‌ని ప్రాసెస్ చేసేందుకు సులభంగా ఉంటుంది. ప్రధానంగా సేకరించిన తడి చెత్త కోసం బయో సీఎన్జీ(కంప్రెషన్ నేచురల్ గ్యాస్) ప్లాంట్ ఏర్పాటు చేశారు. ఈ ప్లాంట్ ఆసియాలోనె అతిపెద్దది. ఈ ఏడాది ఫిబ్రవరి 19న ప్రధాని నరేంద్ర మోదీ 150 కోట్లతో ఏర్పాటు చేసిన ఈ ప్లాంట్‌ని ప్రారంభించారు. ఈ ప్లాంట్ రోజుకు 550 మిలియన్ టన్నుల పొడి చెత్తను ప్రాసెస్ చేయడమే కాకుండా సుమారు 17 వేల నుంచి 18 వేల కిలోల బయో సీఎన్జీ తోపాటు దాదాపు 10 టన్నుల సేంద్రీయ ఎరువును ఉత్పత్తి చేయగలదు. ఈ సీఎన్జీతో దాదాపు 150 సీటీ బస్సులు నడుపుతోంది. దీని ధర వాణిజ్య సీఎన్జీ కంటే రూ. 5లు తక్కువ కూడా. గత ఆర్థిక సంవత్సరంలో వ్యర్థాల తొలగింపుతో సుమారు రూ. 14 కోట్లు ఆర్జించింది. అందులో కార్బన్ క్రెడిట్ అమ్మకం ద్వారానే దాదాపు రూ. 8 కోట్లు కాగా, బయో సీఎన్జీ ప్లాంట్‌కి వ్యర్థాలను సరఫరా చేసినందుకు ప్రైవేట్ కంపెనీ నుంచి వార్షిక ప్రీమియం సుమారు రూ. 2 కోట్లు ఆర్జించింది. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో ఈ వ్యర్థాల తొలగింపుతో దాదాపు రూ. 20 కోట్లు ఆర్జించాలని పౌర సంఘం లక్ష్యంగా పెట్టుకుందని సూపరింటెండెంట్ మహేష్ శర్మ చెప్పారు. అంతేకాదు నగరంలో విడుదలయ్యే మరుగు నీటిని సైతం ప్రత్యేక ప్లాంట్లలో శుద్ధి చేసి సుమారు 200 పబ్లిక్ గార్డెన్లు, పొలాలు, నిర్మాణ కార్యకలాపాలకు తిరిగి ఉపయోగిస్తారని ఉద్యానవన అధికారి చేతన్ పాట్ తెలిపారు. (చదవండి: దేశంలోనే స్వచ్ఛ నగరంగా మళ్లీ ‘ఇండోర్’.. విజయవాడకు నాలుగో స్థానం) -
ఇంట్లో చెడిపోయే పండ్ల వాసన పసిగట్టే గాడ్జెట్!
ఆహార పదార్థాల వృథా ప్రపంచవ్యాప్త సమస్య. దీనిని అరికట్టాలంటూ అంతర్జాతీయ సంస్థలు ఎంతగా ప్రచారం చేస్తున్నా, ఫలితం నామమాత్రం. కూరగాయలు, పండ్లు వంటివి ఎప్పట్లోగా చెడిపోతాయో ముందుగా గుర్తించే పరిస్థితులు లేకపోవడం ఇందుకు కొంతవరకు కారణం. అయితే, ఆహార వృథాను అరికట్టడానికి ‘స్నూట్’ పేరిట కృత్రిమ నాసికను బ్రిటన్‌కు చెందిన నార్తంబ్రియా యూనివర్సిటీ విద్యార్థి హారియట్ ఆల్మండ్ రూపొందించాడు. ఇది కూరగాయలు, పండ్లు, పాలు, వెన్న, పెరుగు వంటి పదార్థాల నుంచి వెలువడే వాయువుల ఆధారంగా అవి తాజాగా ఉన్నాయో, చెడిపోయే పరిస్థితుల్లో ఉన్నాయో ఇట్టే చెప్పేస్తుంది. అంతేకాదు, ఈ పరికరం వంపు తిరిగిన చోట మూతిలా తెరుచుకున్న భాగం ఉంటుంది. ఇందులోంచి వాసన చూసిన పదార్థాలతో అప్పటికప్పుడు తయారు చేసుకోగల రెసిపీలను ముద్రించి మరీ అందిస్తుంది. హారియట్ ఆల్మండ్ ఆటవిడుపుగా తయారు చేసిన ఈ పరికరం ఇంకా మార్కెట్లోకి రాలేదు. -
వంటింటి చెత్తను ఎరువుగా మార్చే డస్ట్ బిన్! ధర ఎంతంటే!
చూడటానికి ఇదేదో కొత్తరకం పీపాలా ఉంది కదూ! అటూ ఇటుగా పీపా ఆకారంలోనే ఉన్న చెత్తబుట్ట ఇది. అలాగని సాదాసీదా చెత్తబుట్ట కాదు, హైటెక్ చెత్తబుట్ట. వంటింటి వ్యర్థాలను ఇది గంటల వ్యవధిలోనే ఎరువుగా మార్చేస్తుంది. ఇందులో రెండులీటర్ల పరిమాణం వరకు వంటింటి ఆహార వ్యర్థాలను వేసుకోవచ్చు. దీని వేగాన్ని ఎంపిక చేసుకునేందుకు నాలుగు బటన్లు, లోపల ఎంతమేరకు ఖాళీ ఉందో తెలుసుకోవడానికి వీలుగా ఎల్సీడీ డిస్ప్లే, ట్రాన్స్పరెంట్ మూత ఉంటాయి. స్టాండర్డ్ మోడ్ ఎంచుకుంటే, నాలుగు గంటల్లోనే ఇందులో వేసిన చెత్తంతా ఎరువుగా తయారవుతుంది. హైస్పీడ్ మోడ్ ఎంచుకుంటే, రెండు గంటల్లోనే పని పూర్తవుతుంది. ఫెర్మెంట్ మోడ్ ఎంచుకుంటే, ఎరువు తయారీకి దాదాపు ఆరుగంటల సమయం పడుతుంది. అయితే, ఈ మోడ్ ఎంపిక చేసుకుంటే, విద్యుత్తు తక్కువ ఖర్చవుతుంది. ఇందులో తయారైన ఎరువును పెరటి మొక్కల కోసం వాడుకోవచ్చు. తక్కువ ధరకు బయట ఎవరికైనా అమ్ముకోవచ్చు. ఈ హైటెక్ చెత్తబుట్ట ఖరీదు 269 డాలర్లు (రూ.21,336). -
చెత్త ఏరిన స్టార్ హీరోయిన్.. వీడియో వైరల్
Parineeti Chopra Collects Plastic Waste While Scuba Diving: బాలీవుడ్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది ముద్దుగుమ్మ పరిణీతి చోప్రా. వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ అమ్మడు తాజాగా నెటిజన్ల ప్రశంసలు పొందుతుంది. స్కూబా డైవింగ్ అంటే ఇష్టమున్న పరిణీతి చోప్రా డైవింగ్ చేస్తూ ఓ మంచి పని చేసింది. స్కూబా డైవింగ్ చేస్తూ సముద్రంలోని చెత్తను సేకరించింది. ఈ చెత్తను సేకరించే వీడియోను సోషల్ మీడియాలో 'సరదాగా డైవింగ్ చేశాను. అలాగే చెత్తను సేకరించడం వల్ల ఓ మంచి పని చేయగలిగా. సముద్రాన్ని క్లీన్ చేయడానికి నాతో చేరండి' అనే క్యాప్షన్‌తో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో వైరల్ కావడంతో చెత్త సేకరించిన పరిణీతి చోప్రాపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. 'పరిణీతి మీరు చాలా గొప్ప పని చేస్తున్నారు', 'మిమ్మల్ని చూస్తే గర్వంగా ఉంది', 'సూపర్', 'సూపర్ స్టార్స్ కూడా ఇలాంటి పనులు చేసి భూమిని రక్షించేలా అందరికీ అవగాహన కల్పించాలి' అంటూ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. చదవండి: థియేటర్లో అందరిముందే ఏడ్చేసిన సదా.. వీడియో వైరల్ ఆ హీరోలా ఎఫైర్స్ లేవు.. కానీ ప్రేమలో దెబ్బతిన్నా: అడవి శేష్ సైలెంట్‌గా తమిళ హీరోను పెళ్లాడిన తెలుగు హీరోయిన్.. View this post on Instagram A post shared by Parineeti Chopra (@parineetichopra) -
మంచి మాట: వర్తమాన జీవితం
చాలామంది భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటారు. భవిష్యత్తు ఎలా ఉండబోతోందో అని చింతిస్తూ, దాని బాగుకోసం అనేక రకాలుగా మానసికంగా చింతిస్తూ ఉంటారు. మరి కొంతమంది గతంలో తాము చేసిన తప్పిదాల గురించి ఆలోచిస్తూ బాధపడుతూ, తమ చుట్టూ ఉన్నవారిని కూడా బాధ పెడుతూ ఉంటారు. ఈ రెండు అవస్థల మధ్య వారు వర్తమానంలో బతకలేరు. పైగా వర్తమానంలో బతకడం అదేదో గొప్ప నేరంగా భావించి దాని జోలికి వెళ్ళనుగాక వెళ్ళరు. గతం గురించి ఆలోచించడం అవసరమే. అలాగే, భవిష్యత్తు గురించి ఆలోచించడం కూడా అవసరమే. అయితే ఇలా గతం, భవిష్యత్తుల కోసం ఆలోచిస్తూ, వర్తమానాన్ని పట్టించుకోకపోతే జీవితం వృథా అయిపోతుంది. ఒక వ్యక్తి జీవన సరళి అతను చూసే దృష్టి మీద ఆధారపడి ఉంటుంది. ఆ క్రమంలో వర్తమాన పరిస్థితుల మీద దృష్టి కేంద్రీకరిస్తే చాలా వరకు సమస్యల నుంచి తప్పించుకున్న వాడవుతారు. నిశ్శబ్దాన్ని వినగలగాలి. సూర్యోదయాన్ని ప్రేమించగలగాలి. సూర్యాస్తమయాన్ని ఆస్వాదించగలగాలి. అన్నింటికన్నా ముఖ్యమైంది – ఈ క్షణాన్ని జారిపోకుండా చూసుకోగలగాలి. ఈ విషయాలపై అవగాహన రానంత సేపూ సంతోషం అంటే ఏమిటో తెలియకుండా పోతుంది. మరోవైపు సంతోషం గురించి తెలియడానికి చాలా కాలం పడుతుంది. ఫలితంగా జీవించడం తెలియకుండా పోతుంది. జీవించడం తెలియకపోతే అసలు ఈ బతుకుకే అర్థం లేకుండా పోతుంది. కనుక జీవితంలో సంతోషంగా ఉండాలంటే వర్తమానంలో బతకాలి. వర్తమానంలో నివసించాలి. గతం భవిష్యత్తూ ముఖ్యమైనవే. అయితే వర్తమానం అంతకన్నా ముఖ్యమైనది. వర్తమానంలో జీవించడం అవసరం అంటే వర్తమానంలో మాత్రమే జీవించమని కాదు. గతం నుంచి పాఠాలు నేర్చుకోవాలి. భవిష్యత్తు గురించి ప్రణాళికలు రచించాలి. వర్తమానంలో జీవించాలి. ఒక పశువు తనకు తిండి దొరికేవరకూ వెతుకుతుంది. దొరకగానే తినడం మొదలు పెడుతుంది. అంటే రోజు మొత్తంలో కొంతసేపైనా వర్తమానంలో బతుకుతోందన్నమాట. అలాగే ఒక పిల్లి .. స్వేచ్ఛగా తిరుగుతుంటుంది. ఆకలేస్తే.. ఎలుకను నోటకరచుకుని తిని ఏ నీడ పట్టునో సేదదీరుతుంది. అదీ వర్తమానంలో జీవిస్తోంది. ఇలా పశువులు, పక్షులు, జంతువులు తోటిపశువులతో, తోటిపక్షులతో కలిసి ఆనందంగా రాగద్వేషాలకతీతంగా జీవిస్తున్నాయి. వర్తమానానికి విలువనిస్తున్నాయి. కానీ.. లౌకిక జ్ఞానం ఉన్న మనిషి మాత్రం వర్తమానంలో జీవించలేక పోతున్నాడు. పశు పక్ష్యాదులకు మనసు, బుద్ధి, ధర్మం వంటివి లేవు. అయినప్పటికీ అవి వర్తమానంలోనే జీవిస్తూ వర్తమానంలోనే ఆనందాన్ని వెదుక్కుంటున్నాయి. అయితే మనిషి మాత్రం తన కోసం జీవించలేకపోతున్నాడు. భవిష్యత్తు కోసం అతివిలువైన వర్తమానాన్ని చేతులారా నాశనం చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో భవిష్యత్ గురించి ఆలోచిస్తూ, తాను బతకడం లేదు సరికదా తన తోటివారిని కూడా బతకనివ్వడం లేదు. ఫలితంగా రేపటి కోసం ఆలోచిస్తూ, రేపటి భవిష్యత్ కోసమే దాచుకుంటూ, వర్తమానంలోని ఆనందాన్ని తనకు తానే నాశనం చేసుకుంటున్నాడు. వర్తమాన జీవితం కంటే భావి జీవితం పైనే నమ్మకం, ఆశ ఉండడం వల్లనే మనిషి అలా ప్రవర్తిస్తున్నాడు. దీనికి సంబంధించి మహాభారతంలో ఒక ప్రస్తావన ఉంది. వనపర్వంలో యక్షుడు ధర్మరాజును ‘కిమాశ్చర్యమ్’.. అంటే ‘ఏది ఆశ్చర్యం’ అని ప్రశ్నంచగా.. ‘‘ప్రతిరోజూ యమలోకానికి ఎందరో వెళుతున్నారు. మిగిలినవారు మాత్రం పోయిన వారిపట్ల సానుభూతి చూపుతూ తాము శాశ్వతం అనుకుంటారు. ఇంతకంటే ఆశ్చర్యం ఏముంది?’’ అని దీని అర్థం. నేటి వర్తమాన జీవితంలో ప్రతి ఒక్కరి జీవన విధానం ఇలానే ఉంది. తాము శాశ్వతం అనుకుంటూ, ఎప్పుడూ రేపటి గురించే ఆలోచిస్తారు. తమ కడుపు కాల్చుకొని తమ భార్యాపిల్లల కోసం దాచి పెడుతున్నారు. తాము పోయినా తమ వాళ్ళు సుఖంగా ఉండాలని తప్పుడు ఆలోచనలతో వర్తమానంలో మనం ఆనందించాల్సిన రోజులను పక్కన పెట్టి, వారి కోసం మన శ్రమనంతటినీ ధారాదత్తం చేస్తున్నాÆ. ఈ ప్రక్రియలో మన సంతానానికి స్వతంత్రంగా బతకడమూ నేర్పడం లేదు. మరి దీనికి పరిష్కార మార్గం ఏమిటన్న ప్రశ్నకు సంతృప్తికరంగా జీవించడమేనన్న సమాధానం లభిస్తుంది. చాలామంది గతంలో జరిగిన సంఘటనల గురించి, రాబోయే విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఈ ఆలోచనల్లో పడి వర్తమానంలో నివసించడం మానేస్తారు. భవిష్యత్ మనకు భావి జీవితాన్నిస్తు్తంది కానీ వర్తమానం ఎప్పటికప్పుడు ఆనందాన్ని అందిస్తుంది. వర్తమానంలో బతకడం గొప్ప అనుభవం. ఈ అనుభవాన్ని పొందడం అంత సులువు కాదు. దీన్ని కొంత సాధన చేసి అలవర్చుకోవాలి.. భవిష్యత్ గురించి ఆలోచించడం ఎంత ముఖ్యమో అలాగే, వర్తమానంలో జీవించడం కూడా అంతే ముఖ్యమని తెలుసుకున్న నాడు జీవితంలోని ఆనంద మకరందాలన్నీ స్వయంగా ఆస్వాదించే వెసులుబాటు కలుగుతుంది. తృప్తి అనేది మనిషికి ఒక వరం. తృప్తి కలిగి జీవిస్తే ధనికుడికి, పేదవాడికి తేడా అనేదే ఉండదు. అలాంటి తృప్తిని పొందడం కోసం ప్రతి ఒక్కరూ వర్తమానంలో జీవించాలి. ఆ వర్తమానం నుంచి వచ్చిన ఆనందమే తృప్తిని కలిగించి మనకు పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని సొంతం చేస్తుంది. ఇలా పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందినపుడే నూరువసంతాల ఆనందకరమైన జీవితాన్ని ఆస్వాదించగలం. ధనం, కీర్తి జీవితానికి ఉప ప్రయోజనాలు కావాలి కానీ అవే పరమలక్ష్యం కాకూడదన్న నిజాన్ని గుర్తించాలి. అలాగే పిల్లలకీ భవిష్యత్తుపై శ్రద్ధను కలుగజేయాలి కానీ, భవిష్యత్ ముఖ్యమని నూరిపోయకూడదు. భవిష్యత్ అవసరమే కానీ, భవిష్యత్ లోనే అంతా ఉందని వారికి నూరిపోస్తే, వర్తమానంలో ఉన్న ఆనందాన్ని ఆస్వాదించలేకుండా పోతాం. – దాసరి దుర్గా ప్రసాద్ -
ఆహారం ‘వృథా’లో టాప్ టెన్ దేశాలివే..
సాక్షి సెంట్రల్ డెస్క్: భూమ్మీద మనుషులందరికీ సరిపోయేంత ఆహారం ఉత్పత్తి అవుతున్నా అందరికీ అందని దుస్థితి. ఓ వైపు రెండు పూటలా తిండి దొరకనివారు కోట్లాది మంది ఉంటే.. మరోవైపు మరోవైపు కోట్ల మందికి సరిపడా ఫుడ్ వృథా అవుతున్న పరిస్థితి. అసలు పండించే దగ్గరి నుంచి వండాక పడేసేదాకా ఆహారం వృథాకు ఎన్నో లెక్కలున్నాయి. అవేంటో తెలుసుకుందామా? చదవండి: రోడ్డు పక్కన డబ్బుల సంచి.. కుర్రాడు చేసిన పనికి ఫిదా! ♦భూమ్మీద ఏటా ఉత్పత్తి అవుతున్న పండ్లు, కూరగాయల్లో దాదాపు సగం మేర ఏదో ఓ రూపంలో వృథా అవుతూనే ఉన్నాయి. ♦మనుషులు తినేందుకు వీలుగా తయారు చేసిన/వండిన ఆహారంలో దాదాపు మూడో వంతు వరకు.. కిందపడిపోవడం/చెడిపోవడం/పడేయడం ద్వారా ఏటా సుమారు 1,300 టన్నులు వృథా అవుతోంది. ♦ఏటా ప్రపంచవ్యాప్తంగా వృథా అవుతున్న ఆహారంలో కనీసం పావు వంతును వినియోగించుకోగలిగినా.. సుమారు 87 కోట్ల మంది ఆకలి తీర్చవచ్చట. ‘వృథా’.. రెండో పెద్ద దేశం ఆహారం ఉత్పత్తి కావడానికి ఎన్నో వనరులు అవసరం. మొక్కలకైతే పొలాలు, తోటలను సిద్ధం చేయడం నుంచి ఎరువులు, పురుగు మందులు, ఇతర ఖర్చులదాకా ఎంతో కావాలి. కోళ్లు, పశువులు, చేపలు వంటి వాటికోసం ఎంతో వ్యయం అవుతుంది. ప్రతిదానికి మానవ శ్రమ, కరెంటు, పెట్రోలియం ఉత్పత్తుల వాడకంతో లింకు ఉంటుంది. అందుకే అంతర్జాతీయంగా ఇలాంటి అవసరాలు, వ్యయాలన్నింటినీ ‘కర్బన ఉద్గారాల (గ్రీన్‌హౌజ్ గ్యాస్) విడుదల’తో లెక్కిస్తారు. దీని ప్రకారం.. వృథా అయ్యే ఆహారాన్ని లెక్కిస్తే.. ప్రపంచంలో చైనా తర్వాత మనది అతిపెద్ద దేశం అవుతుందట. అక్కడ అలా.. ఇక్కడ ఇలా.. ఆహారం వృథా విషయంలో రెండు భిన్నమైన కోణాలు ♦పంటలు పండించడం నుంచి రవాణా, మార్కెటింగ్, విక్రయం వరకు ఉన్న దశల్లో అభివృద్ధి చెందుతున్న, పేద దేశాల్లో వృథా ఎక్కువగా ఉంటోంది. పంటలు పండించడం, నిల్వ, ఇతర అంశాల్లో సరైన సౌకర్యాలు, టెక్నాలజీ అందుబాటులో లేకపోవడమే దీనికి కారణమని ఐక్యరాజ్యసమితి తమ నివేదికలో పేర్కొంది. ♦వండిన, తినడానికి సిద్ధంగా ఉన్న ఆహారం విషయంలో అభివృద్ధి చెందిన, ధనిక దేశాల్లో వృథా చాలా ఎక్కువ. తమ సంపాదనలో ఆహారానికి అయ్యే ఖర్చు తక్కువగానే ఉండటం, ఆహారాన్ని ఎక్కువగా ప్రాసెస్ చేయడం, అవసరానికి మించి కొనుగోలు చేస్తుండటం వంటివి కారణమని పేర్కొంది. ♦యూరప్, ఉత్తర అమెరికా ఖండాల్లోని దేశాల్లో సగటున ఒక్కోవ్యక్తి ఏటా 100 కిలోల ఆహారాన్ని వృథా చేస్తారని అంచనా. ఇది ఆఫ్రికా, దక్షిణాసియా దేశాలతో పోలిస్తే పదింతలు ఎక్కువ కావడం గమనార్హం. కోట్ల కిలోమీటర్ల మేర వృథా ఏటా భారీ ఎత్తున ఆహారం వృ«థా అవుతోంది కదా. మరి దానంతటినీ ఉత్పత్తి చేయడానికి వాడుతున్న భూమి విస్తీర్ణం ఎంతో తెలుసా?.. ఏకంగా 1.35 కోట్ల చదరపు కిలోమీటర్లు. -
తెలంగాణ: నష్టాల ఆర్టీసీలో దుబారా..!
సాక్షి, హైదరాబాద్: దుబారాను నియంత్రించటంలో ఆర్టీసీ బరాబర్ అశ్రద్ధ వహిస్తోంది. ఫలితంగా అప్పులకుప్పగా మారిన రుణాలపై ఏడాదికి రూ.250 కోట్ల వడ్డీ చెల్లిస్తోంది. మూడు నాలుగు నెలల్లో ఆర్టీసీ లాభాల్లోకి రాని పక్షంలో ప్రైవేటీకరించటానికి వెనకాడనని సీఎం కేసీఆర్ హెచ్చరించారంటూ రెండు రోజుల కింద ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్ పేర్కొన్న నేపథ్యంలో ఇప్పుడు ఈ దుబారా అంశం చర్చకు వచ్చింది. డీజిల్ ఖర్చు, జీతాలు, విడిభాగాల వ్యయం తప్పనిసరిగా భరించాల్సినవే. కానీ, దుబారాను అరికట్టడం అధికారుల చేతుల్లో పని. దుబారా ఇలా.. హైదరాబాద్–3 డిపోలో 27 గరుడ బస్సులున్నాయి. వీటి కోసం డ్రైవర్లు, కండక్టర్లు పోను 50 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. డిపో కరెంటు బిల్లు నెలకు రూ.70 వేల వరకు వస్తోంది. ఈ డిపోలో ఉన్నవన్నీ దూరప్రాంతాలకు వెళ్లే ఏసీ బస్సులే. ఇవి డిపోల వద్ద ప్రయాణికులను ఎక్కించుకోవు. 15 కి.మీ. నుంచి 30 కి.మీ.మేర ఖాళీగా ప్రయాణించి బీహెచ్ఈఎల్, మియాపూర్, ఇమ్లీబన్ బస్స్టేషన్లలో ప్రయాణికులను ఎక్కించుకుంటాయి. నిత్యం బస్స్టేషన్ల వరకు ఖాళీగా వెళ్లటం, అక్కడి నుంచి ఖాళీగా తిరిగి రావటంతో ఒక్కో బస్సు అనవసరంగా రూ.2 వేలకుపైచిలుకు డీజిల్‌ను కాలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ బస్సులను మియాపూర్, బీహెచ్ఈఎల్ లాంటి డిపోలకే కేటాయిస్తే వృథా వ్యయాన్ని అరికట్టవచ్చు. సికింద్రాబాద్ జూబ్లీబస్టాండ్ పక్కనే పికెట్ డిపో ఉంటుంది. ఈ డిపోలో ఆర్టీసీ సొంత బస్సులు 30, అద్దె బస్సులు 40 ఉన్నాయి. అద్దె బస్సుల నిర్వహణ వాటి యజమానులదే అయినందున డిపోలోకి అవి రావు. సొంతంగా ఉన్న 30 బస్సుల కోసం ఓ పెద్ద భవనం, డిపో మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్, ఇలా డ్రైవర్లు, కండక్టర్లు కాకుండా 50 మంది సిబ్బంది పని చేస్తున్నారు. భవనానికి కరెంటు బిల్లు నెలకు రూ.80 వేల వరకు వస్తోంది. హైదరాబాద్–2 డిపోలో సొంత బస్సులు 39 ఉంటే 42 అద్దె బస్సులు న్నాయి. ఈ బస్సులకు డ్రైవర్లు, కండ క్టర్లు పోను 50 మంది సిబ్బంది ఉన్నారు. కరెంటు బిల్లు రూ.80 వేలు వస్తోంది. ఇలాంటి చిన్న డిపోలను ఎత్తేసి ఆ బస్సులను వేరే డిపో ల్లో కలిపేస్తే ఈ వృథా వ్యయం ఉండదు. ఈ డిపోలు లేకపోతే వాటిల్లోని పెద్ద పోస్టులు రద్దవుతాయి. జీతాలు, కరెంటు బిల్లు వంటి భారాలు ఉండవు. డిపో భవనాలను ప్రైవేటు సంస్థలకు అద్దెకిస్తే ఆర్టీసీకి అదనపు ఆదాయం సమకూరుతుంది. అనవసరపు ట్రిప్పులతో.. రాష్ట్రంలోని కొన్ని చిన్న పట్టణాల నుంచి హైదరా బాద్‌కు 45 నిమిషాలకో బస్సు తిప్పు తున్నారు. కానీ, ఆయా బస్సులు సిటీ చేరేటప్పటికీ 90% మేర ఖాళీగా ఉంటున్నాయి. అలాంటప్పుడు సిటీ ట్రిప్పులను గంటన్నరకు ఒకటి చొప్పున పెడితే ఈ ఖాళీ ట్రిప్పుల దుబారా ఉండదు. కరీం నగర్, సిద్దిపేట, వరంగల్, ఖమ్మం, కొత్త గూడెం, నిజామాబాద్, మెదక్, మహ బూబ్‌నగర్, కల్వకుర్తి, నల్లగొండ, సూర్యాపేట లాంటి పట్టణాల్లో ఈ సమస్య ఉంది. హైదరాబాద్‌కు వెళ్లేందుకు కరీంనగర్, వరంగల్ లాంటి బస్టాండ్లలో ఒకేసారి పలు డిపోల బస్సులు వచ్చి ప్లాట్‌ఫారమ్‌లలో నిలబడుతున్నాయి. ఇవన్నీ 70 శాతం లోపు ఆక్యుపెన్సీ రేషియోతోనే నడుస్తున్నాయి. నాన్‌స్టాప్ బస్సుల్లో అయితే ఇక సిటీకి వచ్చే వరకు మధ్యలో ఎక్కడా ప్రయాణికులు ఎక్కే వీలు ఉండటం లేదు. ఇది ప్రస్తుతం ఆర్టీసీలో పెద్ద దుబారాగా మారింది. పండగలు లాంటి ప్రత్యేక సందర్భాలు, వారాంతాల్లో తప్ప మిగతారోజుల్లో ఈ ట్రిప్పులకు డిమాండ్ ఉండటం లేదు. అయినా అనవసరంగా తిప్పుతున్నారు. -
కొడుకు కోసం చెత్తని పోగుచేస్తే.. అదే అదృష్టంగా మారింది
చెట్టంత కొడుకు పనీపాటా లేకుండా ఇంట్లోనే కూర్చొని తింటూంటే ఏ తల్లిదండ్రులైనా ఏం చేస్తారు? చీవాట్లు పెట్టి బుద్ది చెపుతారు. పని వెదుక్కొని ఇంటి అవసరాలకు చేదోడువాదోడు అవమని కోరతారు. కానీ సౌత్‌కొరియాలో.. ఓ తండ్రి మాత్రం అలాంటి బద్ధకిస్టు కొడుకు మీద నిరసనగా ఇంటి నిండా చెత్తను పోగు చేయటం ప్రారంభించాడు. అది కూడా దశాబ్దంపాటు. అలా పోగైన చెత్త వాసనకు అతని భార్య అనారోగ్యం పాలయింది. డాక్టర్ల సలహా మేరకు వెంటనే ఆ చెత్తను తొలగించాల్సిన పరిస్థతి వచ్చింది. అందులో భాగంగా ఆ చెత్తనంతా అమ్మితే అతనికి రూ. 36 కోట్లు లభించాయి. అదంతా చూసిన చుట్టుపక్కల వాళ్లు ‘కొడుకు కోసం చెత్తనే ఆస్తిగా పోగుచేసినట్లుందే’ అని బుగ్గలు నొక్కుకున్నారట. నిజానికి ఆ తండ్రి అనుకున్నదొకటి.. అయినది ఇంకొకటి. ఇంట్లో చెత్తను పేర్చితే భరించలేక కొడుకు బయటకు వెళ్లి ఏదైనా పని చేసుకుంటాడని ఆ తండ్రి ఆలోచన! ఏదైతేనేం పనిచేయని కొడుక్కి చెత్తతో ఆస్తిని సంపాదించి పెట్టాడు. ఇది దక్షిణకొరియాలో చోటు చేసుకుంది. -
వ్యర్థాలతో అనర్థాలు.. చెత్తలోకి కాలం చెల్లిన మందులు
సాక్షి, అమరావతి: కాలం చెల్లిన మందులు.. ఆస్పత్రుల నుంచి వచ్చే వ్యర్థాలు కొత్త సమస్యలు తీసుకొస్తున్నాయి. వీటిని సక్రమంగా నిర్వీర్యం చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో ప్రజారోగ్యాన్ని, పర్యావరణాన్ని పణంగా పెట్టాల్సి వస్తోంది. చాలామంది రిటెయిలర్లు ఎక్స్పెయిర్ అయిన మందుల్ని చెత్తలో వేస్తున్నారు. మందుల షాపులతో పాటు ఇళ్లల్లోంచి కూడా రకరకాల మాత్రలు, సిరప్లు, ఆయింట్మెంట్లు మునిసిపాలిటీ చెత్త డబ్బాలు లేదా మురుగు కాలువల్లో పడేస్తున్నారు. కొన్ని ఆస్పత్రులు రోగుల నుంచి వెలువడే ఫ్లూయిడ్స్‌ను.. ఎలాంటి సీవరేజీ ట్రీట్మెంట్ చేయకుండానే డ్రైనేజీలోకి వదులుతున్నారు. 200 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతల్లో నిర్వీర్యం చేయాల్సిన మందులు డంపింగ్ యార్డుల్లో కుళ్లిపోతే అనేక దుష్పరిణామాలు ఎదురవుతున్నాయి. వాతావరణం, జలాలు కలుషితమవడంతో అనారోగ్యాలు ప్రబలుతున్నాయి. హెపటైటిస్ వంటి వ్యాధులు విజృంభిస్తున్నాయి. మందులు కుళ్లిపోతే వచ్చే సమస్యలు యాంటీబయోటిక్స్ మందులు కుళ్లిపోవడం వల్ల ఆ వ్యర్థాల నుంచి కొత్తరకం బ్యాక్టీరియా పుట్టుకొస్తోంది. ఈ బ్యాక్టీరియా వల్ల కొత్తరకం జబ్బులు సోకుతున్నాయి. సామర్థ్యం కలిగిన యాంటీబయోటిక్స్ వాడినా ఈ జబ్బులు పూర్తిగా తగ్గడంలేదు. మందులు చెత్త కుప్పల్లో కుళ్లిపోవడం వల్ల వాయుకాలుష్యం తీవ్రమవుతోంది. గాలి ద్వారా వ్యాప్తిచెందే జబ్బుల ప్రభావం పెరుగుతోంది. భూగర్భ జలాలు విషతుల్యమవుతున్నాయి. ఈ నీటిని తాగడం వల్ల మనుషులతోపాటు జంతువులకు కూడా మూత్రపిండాలు, కాలేయ సమస్యలు, హెపటైటిస్–బి వంటి జబ్బులు వస్తున్నాయి. ఆస్పత్రుల్లో రంగుల డబ్బాలు కాలం చెల్లిన మందులే కాదు.. ఆస్పత్రుల్లో ఉత్పన్నమయ్యే వివిధ రకాల బయో వ్యర్థాల నిర్వహణకు ప్రత్యేక మార్గదర్శకాలున్నాయి. వీటిని సేకరించడానికి కూడా ప్రత్యేక రంగులను నిర్ణయించారు. ఆయా వ్యర్థాలను నిర్దేశించిన రంగు ఉన్న డబ్బాల్లోనే వేయాలి. హ్యూమన్ అనాటమిక్ వేస్ట్: రోగినుంచి వచ్చిన బాడీ ఫ్లూయిడ్స్, డ్రెస్సింగ్ వేస్ట్, బ్యాగ్‌లు, రక్తంతో ఉన్న వేస్ట్, ఎక్స్‌పెయిరీ మందులు వంటివి. వీటిని పసుపు రంగు డబ్బాల్లో మాత్రమే వేయాలి. అనంతరం వీటిని అత్యధిక ఉష్ణోగ్రతలో నిర్వీర్యం చేయాలి. కంటామినేటెడ్ వేస్ట్: రోగి శరీరంలో అమర్చి ఆ తర్వాత పడేయాల్సిన ట్యూబ్‌లు, యూరినల్ బ్యాగ్స్, సిరంజిలు, నీడిల్స్ వంటివి. వీటిని ఎరుపురంగు డబ్బాలో మాత్రమే వేయాలి. ఈ వ్యర్థాలను ఆటోక్లావింగ్ లేదా మైక్రోవేవింగ్ హైడ్రోక్లావింగ్ పద్ధతుల్లోనే నిర్వీర్యం చేయాలి. ఇందులో కొన్ని రీసైక్లింగ్ చేసినవి రోడ్డు నిర్మాణంలో వాడతారు. వీటిని లైసెన్సు ఉన్న కాంట్రాక్టరుకే ఇచ్చి రీ సైక్లింగ్ చేయాలి. పదునైన పరికరాలు: నీడిల్స్, సిరంజిలు, నీడిల్ కట్టర్లు, బర్నర్లు, బ్లేడ్లు ఇలా ఏవైనా విషపూరితమైనవి, పదునైనవి. వీటిని లీకేజీలేని తెలుపు రంగు డబ్బాలో మాత్రమే వేయాలి. ఈ వ్యర్థాలను ఆటోక్లావింగ్ లేదా డ్రైహీట్ స్టెరిలైజేషన్ పద్ధతిలో కాల్చేయాలి. కాలుష్య నియంత్రణ మండలి గుర్తింపు ఉన్న సంస్థ ద్వారా నిర్వీర్యం చేయాలి. గ్లాస్‌వేర్ వేస్ట్: విషపూరిత గాజు వస్తువులు, మందుల వయెల్స్, మెడిసిన్ వయెల్స్ వంటివి. వీటిని నీలం రంగు డబ్బాలో మాత్రమే సేకరించాలి. వీటిని తిరిగి ఉపయోగించాలంటే డిటర్జంట్ లేదా సోడియం హైపోక్లోరైడ్ ద్రావణంతో శుభ్రం చేయాలి. బయో వ్యర్థాల నిర్వీర్యానికి కాలుష్య నియంత్రణ మండలి నిబంధనలు ►బయో వ్యర్థాలను తీసుకెళ్లే వాహనాలకు విధిగా జీపీఎస్ ఉండాలి. ►ఏ ఆస్పత్రిలో ఎంత బయో వ్యర్థాలు సేకరించిందీ కాంట్రాక్ట్ సంస్థ విధిగా వెబ్సైట్లో ఉంచాలి. ►వ్యర్థాలను సేకరించే పనివారికి ఖచ్చితంగా వ్యాక్సిన్ వేయించాలి. ►వారికి గ్లౌజులు, ఎన్–95 మాస్కులు ఉండేలా చూసుకోవాలి. ►ఆయా వ్యర్థాలను తీసుకెళ్లే సంస్థలపై కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) అధికారుల పర్యవేక్షణ ఉండాలి ►వ్యర్థాలను నిర్వీర్యం చేసే ప్లాంట్లను నిరంతరం అధికారులు పర్యవేక్షించాలి. ►సేకరించిన వ్యర్థాలను 48 గంటల్లోగా నిర్వీర్యం చేయాలి. కొత్త పాలసీ తీసుకొస్తాం ఎక్స్‌పెయిరీ మందులు చెత్తడబ్బాల్లోకి వెళ్లకుండా ఖచ్చితమైన నిర్వీర్య ప్రక్రియ చేపట్టేలా కొత్త పాలసీ తీసుకొస్తాం. దీనిపై వివిధ మాన్యుఫాక్చరింగ్, హోల్‌సేల్, రీటెయిలర్లతో మాట్లాడుతున్నాం. వీలైనంత త్వరలో కొత్త పాలసీని తీసుకొస్తాం. – రవిశంకర్‌నారాయణ్, డైరెక్టర్ జనరల్, ఔషధ నియంత్రణశాఖ -
కంపుకొడుతున్న చెరువుకట్ట.. కారణం ఏంటంటే!
సాక్షి, సిరిసిల్ల(కరీంనగర్): సిరిసిల్ల మున్సిపల్ పరిధి చంద్రంపేటలోని ఈదుల చెరువు కట్ట పరిసర ప్రాంతాల్లో చెత్త, కోళ్ల వ్యర్థాలను పడవేస్తున్నారు. చెరువు చుట్టు పక్కల ప్రాంతంలో దుర్గంధం వెదజల్లుతుందోని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలోని చెత్తచెదారాన్ని, చికెన్‌సెంటర్ నిర్వాహకులు కోళ్ల వ్యర్థాలను చెరువుకట్ట చుట్టూ పక్కల డంప్ చేస్తున్నారని వారు పేర్కొన్నారు. ఈదుల చెరువు మత్తడి దూకడానికి సిద్ధంగా ఉందని, చెరువు పరిసర ప్రాంతాల్లో చెత్తను డంప్ చేయకుండా, నీరు కలుషితం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. -
కృష్ణా జలాలు సముద్రం పాలు
సాక్షి, అమరావతి: తెలంగాణ సర్కారు శ్రీశైలం, పులిచింతల ప్రాజెక్టుల్లో అక్రమంగా నిరంతరాయ విద్యుదుత్పత్తి చేస్తుండటంతో ప్రకాశం బ్యారేజీ నుంచి ఆదివారం మరో టీఎంసీ నీరు సముద్రంలో కలిసింది. గత వారం రోజుల్లో ప్రకాశం బ్యారేజీ నుంచి 6.944 టీఎంసీలు వృథాగా కడలి పాలయ్యాయి. తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా విద్యుదుత్పత్తి చేయకుండా ఉంటే.. ఈ నీటితో రాష్ట్రంలో 45 వేలు, తెలంగాణలో 25 వేల ఎకరాల్లో రైతులు పంటలు పండించుకునే అవకాశం ఉండేదని నీటి పారుదలరంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. తెలంగాణ సర్కార్ దందుడుకు వైఖరి వల్ల రెండు రాష్ట్రాలకూ నష్టం వాటిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శ్రీశైలంలోకి వచ్చే ప్రవాహం ఆదివారం పూర్తిగా నిలిచిపోయింది. నీటిమట్టం 809.65 అడుగులకు తగ్గిపోయింది. అయినా తెలంగాణ సర్కార్ ఎడమ గట్టు కేంద్రంలో యథేచ్ఛగా విద్యుదుత్పత్తి చేస్తూ శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 7,063 క్యూసెక్కులను తోడేస్తోంది. దాంతో ప్రాజెక్టులో నీటి నిల్వ 34.04 టీఎంసీలకు పడిపోయింది. నిరంతరాయంగా విద్యుదుత్పత్తి చేయడం వల్ల సాగర్‌లో నీటి మట్టం 529.30 అడుగులకు పడిపోగా నీటి నిల్వ 177.76 టీఎంసీలకు తగ్గిపోయింది. ఎడమ కాలువ ఆయకట్టు పరిధిలోని ఆ రాష్ట్ర ఆయకట్టు రైతులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో తెలంగాణ సర్కార్ విద్యుదుత్పత్తిని తాత్కాలికంగా ఆపేసింది. కృష్ణా డెల్టాకు నీటి అవసరాలు లేకపోయినా సరే.. పులిచింతల ప్రాజెక్టులో విద్యుదుత్పత్తిని నిర్విరామంగా కొనసాగిస్తోంది. పులిచింతల నుంచి వదిలేస్తున్న 5,600 క్యూసెక్కులకు, స్థానికంగా కురిసిన వర్షాల వల్ల 73,50 క్యూసెక్కులు వెరసి 12,950 క్యూసెక్కులు ప్రకాశం బ్యారేజీలోకి చేరుతున్నాయి. బ్యారేజీ నీటి నిల్వ సామర్థ్యం 3.07 టీఎంసీలే కావడంతో మిగులుగా ఉన్న 11,479 క్యూసెక్కులను 20 గేట్లను అర్ధ అడుగు మేర ఎత్తి వృథాగా సముద్రంలోకి వదిలేస్తున్నామని ఈఈ స్వరూప్ తెలిపారు. -
బయో మెడికల్ భయం!
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ సెకండ్ వేవ్ భారత్‌ను ఆరోగ్య, ఆర్థిక, పర్యావరణ అంశాల్లో తీవ్ర ప్రభావానికి గురిచేసింది. దేశవ్యాప్తంగా పెద్దసంఖ్యలో కరోనా కేసులు వెల్లువెత్తడంతో వివిధ రూపాల్లో జాగ్రత్తల కోసం ఉపయోగించి పారేసిన బయో మెడికల్ వ్యర్థాలు (బీఎండబ్ల్యూ) పర్యావరణం, ఆరోగ్య సంబంధిత అంశాలపై ఏ మేరకు ప్రభావితం చేస్తాయోనని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారీగా కేసుల పెరుగుదలతో కరోనా పేషెంట్లతో ఆసుపత్రులన్నీ నిండిపోవడంతో, మునుపెన్నడూ లేనివిధంగా పీపీఈ కిట్లు, మాస్క్‌లు, ఫేస్‌షీల్డ్‌లు, గ్లౌజులు, సిరంజీలు, హెడ్, షూ కవర్లు తదితర వస్తువుల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. 2 నెలల్లో 50 శాతం వృద్ధి.. : ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లోనే మన దేశంలో బీఎండబ్ల్యూ దాదాపు 50% అధికంగా ఉత్పత్తి అయినట్లు ‘సెంటర్ ఫర్ సైన్స్ ఎన్విరాన్మెంట్–స్టేట్ ఆఫ్ ఇండియాస్ ఎన్విరాన్మెంట్ ఇన్ ఫిగర్స్–2021’ నివేదికలో వెల్లడైంది. ఏప్రిల్‌లో రోజుకు 139 టన్నుల వ్యర్థాలు ఉత్పత్తి కాగా, మేలో 203 టన్నులకు పెరిగింది. గత నెల 10న అత్యధిక స్థాయిలో రోజుకు 250 టన్నుల వ్యర్థాల ఉత్పత్తి అయింది. వ్యర్థాల నిర్వహణ, చికిత్స, నాశనం చేయడానికి సంబంధించి కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ వ్యర్థాలను శుద్ధి చేసి పర్యావరణానికి హాని కలగకుండా బయటికి వదిలేందుకు దేశవ్యాప్తంగా 198 కామన్ బయో మెడికల్ వేస్ట్ ట్రీట్మెంట్ అండ్ డిస్పోజల్ ఫెసిలిటీస్ (సీబీడబ్ల్యూటీఎఫ్) ఉన్నాయి. రాష్ట్రంలో రోజుకు సగటున 6.3 టన్నులు.. సీపీసీబీ మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్రంలోని వివిధ శుద్ధి ప్లాంట్లు, ఫెసిలిటీస్ ద్వారా సమర్థవంతంగా ఎప్పటికప్పుడు బీఎండబ్ల్యూ ఉత్పత్తులను ట్రీట్మెంట్ చేస్తున్నట్టు తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (టీపీసీబీ) అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో కోవిడ్ ట్రీట్మెంట్ అందిస్తున్న ఆసుపత్రుల నుంచి ప్రతిరోజు వివిధ ఏజెన్సీల ద్వారా బయో మెడికల్ వ్యర్థాలను సేకరిస్తున్నారు. 2021 మే నెలలో సగటున రోజుకు 6.3 టన్నుల దాకా వ్యర్థాలు ఉత్పత్తి అయ్యాయి. ఏప్రిల్‌లో రోజుకు 2.8 నుంచి 3 టన్నుల దాకా వచ్చేది. మే నెలతో పోల్చితే ప్రస్తుతం క్రమంగా తగ్గుతూ... జూన్‌లో సగటున 4 టన్నుల దాకా బీఎండబ్ల్యూ వస్తోంది. గతేడాది కోవిడ్ మొదటి దశలో సగటున రోజుకు 2 వేల టన్నుల దాక వ్యర్థాలు ఉత్పత్తి అయ్యాయి. గతేడాది కరోనా తీవ్ర స్థాయికి వెళ్లినప్పుడు కొన్ని రోజులు రోజుకు 4.5 టన్నుల దాకా ఈ వ్యర్థాలు ఉత్పత్తి అయ్యాయి. సెకండ్ వేవ్‌లో తెలంగాణలో.. ఈ ఏడాది మార్చి నుంచి జూన్ 20 వరకు (గత మూడున్నర నెలల్లో) మొత్తం 382 టన్నుల బీఎండబ్ల్యూ ఉత్పత్తి అయ్యింది. ఈ కాలంలో సగటున రోజుకు 5.2 టన్నుల చొప్పున మెడికల్ వ్యర్థాలొచ్చాయి. ప్రస్తుతం రోజూ సరాసరి 3.8 నుంచి4 టన్నుల దాకా వస్తోంది. ఇప్పుడు క్రమంగా తగ్గుతోంది. దేశవ్యాప్తంగా చూస్తే.. మే నెలలో సెకండ్ వేవ్ ఉధృతంగా ఉన్న కేరళ, గుజరాత్, మహారాష్ట్ర, ఢిల్లీ, కర్ణాటక నుంచే 50 శాతం బయో మెడికల్ వేస్ట్ ఉత్పత్తి అయ్యింది. గత నెలలో రెండోదశ తీవ్ర స్థాయికి చేరుకున్న దశలో దేశవ్యాప్తంగా రోజుకు 2 లక్షల కేజీలకు పైగా బీఎండబ్ల్యూ ఉత్పత్తి అయ్యేది. గత 3 నెలల్లో రోజు వారి బీఎండబ్ల్యూని ఓసారి పరిశీలిస్తే.. మార్చిలో 75 వేల కేజీలు, ఏప్రిల్‌లో 1.39 లక్షల కేజీలు, మేలో 2.03 లక్షల కేజీల వ్యర్థాలు ఉత్పత్తి అయ్యాయి. దేశంలో ఉత్పత్తి అయ్యే నాన్ కోవిడ్ బయోమెడికల్ వేస్ట్‌తో పోలిస్తే మేలో ఉత్పత్తి అయిన బీఎండబ్ల్యూ మూడో వంతుగా ఉంది. 2020 జూన్ నుంచి 2021 మే 10 మధ్యలో మొత్తం 45,308 టన్నుల కోవిడ్ బీఎండబ్ల్యూ ఉత్పత్తి అయినట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. భారత్‌లోని ఆసుపత్రి వ్యర్థాల్లో 12 శాతం వరకు శుద్ధి చేయకుండానే వదిలేస్తున్నారు. ఈ విషయంలో బిహార్, కర్ణాటక అథమ స్థాయిలో ఉన్నాయి. ప్రధానంగా ఆసుపత్రుల నుంచి సేకరించిన బీఎండబ్ల్యూనే ట్రీట్ చేస్తున్నారు. కోవిడ్‌కు అనేక మంది ఇళ్లలోనే ఉంటూ చికిత్స తీసుకున్నారు. మాస్క్‌లు, గ్లౌజులు, ఫేస్‌షీల్డ్‌లు వంటి వాటి వ్యక్తిగత వినియోగం కూడా గణనీయంగా పెరిగింది. వీటిని ఉపయోగించాక ఏ మేరకు సురక్షితంగా వాటిని పారవేశారనేది ప్రశ్నార్థకమే. ముఖ్యంగా గ్రామాల్లో బీఎండబ్ల్యూ నిర్వహణ ఏ విధంగా ఉంది అన్నదానిపై పూర్తిస్థాయిలో గణాంకాలు, సమాచారం అందుబాటులో లేదు. రోడ్లపై అక్కడక్కడ మాస్క్‌లు, ఇతర వ్యర్థాలు నిర్లక్ష్యంగా పారేసిన దృశ్యాలు మనకు తరచుగా కనిపిస్తున్న విషయం బహిరంగ రహస్యమే. ఈ వ్యర్థాలు బాధ్యతారహితంగా పడవేయకుండా, పర్యావరణానికి నష్టం కలగని విధంగా క్రమపద్ధతిలో వాటిని శుద్ధిచేసే కార్యాచరణలో అన్నిస్థాయిల్లో ప్రజలను భాగస్వాములను చేయాలి. – ప్రీతి బంతియా మహేశ్, చీఫ్ ప్రోగ్రామ్ కో–ఆర్డినేటర్, టాక్సిన్ లింక్ ఎన్విరాన్మెంట్ గ్రూప్ -
ఏదో చేయాలి.. ఏం చేద్దాం.. ‘కొబ్బరి చిప్పలను ఏం చేస్తున్నారు’
‘మనసుంటే మార్గమూ ఉంటుంది’ అనే నానుడి మరోసారి నిజమైంది. కేరళ, త్రిశూర్ అమ్మాయి మారియా కురియాకోస్ ఎంబీఏ చేసింది. ముంబయిలో ఒక సోషల్ ఎంటర్ ప్రైజ్‌లో ఉద్యోగం చేసింది. ‘తనకు తానుగా ఏదో ఒకటి ఆవిష్కరించలేకపోతే జీవితానికి పరమార్థం ఏముంటుంది?’ అని కూడా అనుకుంది. ఉద్యోగం మానేసి సొంతూరు త్రిశూర్కి వచ్చేసింది. ఏదో చేయాలని ఉంది, కానీ ఏం చేయాలనే స్పష్టత రావడం లేదు. ఊరికే ఇంట్లో కూర్చుంటే ఆలోచనలు ఎలా వస్తాయి? అలా ఊరంతా తిరిగి నలుగురిని చూస్తే కదా తెలిసేది... అనుకుంది. త్రిశూర్‌లో ఏమున్నాయి? ఏమి లేవు అనేది కూడా తెలుసుకోవాలి కదా! అనుకుంటూ త్రిశూర్‌లోని రోడ్లన్నీ చుట్టిరావడం మొదలుపెట్టింది. తనకు తెలిసిన ఊరే అయినా, ఇప్పుడు కొత్తగా తెలుస్తోంది. ఒక కొబ్బరి నూనె మిల్లు కనిపించింది. కేరళ అమ్మాయికి కొబ్బరి నూనె మిల్లును చూడడం కొత్తేమీ కాదు. అయితే ఈసారి ఆమె దృష్టిని ఆకర్షించింది కొబ్బరి నూనె కాదు, నూనె కోసం కొబ్బరి వలిచిన తర్వాత మిగిలిన ఖాళీ కొబ్బరి చిప్పలు. రాశులుగా ఉన్నాయి. వాటిని ఏం చేస్తారని అడిగింది. పొయ్యిలో వంటచెరకుగా వాడతారు, ఇటుకలను కాల్చడానికి బట్టీల్లో వాడతారని తెలుసుకుంది. అంత గట్టి మెటీరియల్ బొగ్గుగా కాలిపోవడమేంటి? వీటిని ఉపయోగించే తీరు ఇది కాదు, మరింత ఉపయుక్తంగా ఉండాలని ఆలోచించింది మారియా. కోకోనట్ కప్ కొబ్బరి చిప్పలు కిందపడినా పగలవు. ఇంకేం! సెంటెడ్ క్యాండిల్ తయారు చేయడానికి గాజు కుండీలకంటే కొబ్బరి పెంకులే మంచి బేస్ అనుకుంది మారియా. సూప్ తాగడానికి కూడా పింగాణీ కప్పుల కంటే కొబ్బరి పెంకు కప్పులే సేఫ్. అంతే కాదు, హ్యాంగింగ్ గార్డెన్‌కి కూడా కొబ్బరి కుండీలే. ఫోర్క్‌లు, స్పూన్లు కూడా. మన్నిక ఓకే, మరి కొబ్బరి పెంకును అందంగా తీర్చిదిద్దడం ఎలా? తండ్రి మెకానికల్ ఇంజనీర్. రిటైరయ్యాడు కాబట్టి ఆయన కూతురికి అవసరమైన యంత్రాన్ని రూపొందించడంలో నిమగ్నమయ్యాడు. పూర్వం స్టీలు గరిటెలు, గిన్నెలు లేని రోజుల్లో గరిటలుగా కొబ్బరి చిప్పలనే వాడేవారని తెలుసుకున్న తర్వాత మారియా ఆ వృత్తి పని వారి కోసం అన్వేషణ మొదలుపెట్టింది. ఇప్పుడు ఆ పని అన్నానికి భరోసా ఇవ్వకపోవడంతో వాళ్లు ఇతర ఉపాధి పనులకు మారిపోయారు. త్రిశూర్, కొట్టాయం, వయనాడుల్లో విస్తృతం గా సర్వే చేసి, ఆ వృత్తిదార్లను సమీకరించింది. ఇప్పుడామెతో కలిసి పదిమంది పని చేస్తున్నారు. గతంలో అయితే కొబ్బరి చిప్పలను ఉలి సహాయంతో చేత్తోనే నునుపుగా చేయాల్సి వచ్చేది. ఇప్పుడు మారియా డిజైన్ చేయించుకున్న మెషీన్‌తో రకరకాల వస్తువులను తయారు చేస్తున్నారు. ‘తెంగ’ పేరుతో ఆమె రిజిస్టర్ చేసుకున్న పరిశ్రమ ఇప్పుడు స్థిరమైన రాబడినిస్తోంది. తెంగ ఉత్పత్తులకు కేరళతోపాటు తమిళనాడు, కర్నాటక నుంచి కూడా ఆర్డర్లు వస్తున్నాయి. కస్టమర్లకు పేర్లు ముద్రించి ఇవ్వడం ఆమె ఎంచుకున్న మరో చిట్కా. అమెజాన్ ద్వారా జర్మనీలో అమ్మకాలకు కూడా రంగం సిద్ధమైంది. కేరళలో కొబ్బరి వలిచిన ఖాళీ కొబ్బరి చిప్పలు సూప్ బౌల్స్‌గా జర్మనీకి చేరనున్నాయి. తండ్రితో మారియా కురియాకోస్ -
Milk Wasted: 2 వేల లీటర్లు నేల‘పాలు’
దొడ్డబళ్లాపురం: నాణ్యత లేదనే సాకుతో దొడ్డ పట్టణంలోని పాల శీతలీకరణ కేంద్రంలో 2 వేల లీటర్ల పాలను మురుగుకాలువలో పారబోశారు. బమూల్ సిబ్బంది చర్యను పాల రైతులు తీవ్రంగా ఖండించారు. దొడ్డ తాలూకాలో రైతుల నుండి తీసుకుంటున్న పాలలో నాణ్యత లోపించిందని సిబ్బంది చెప్పారు. ఎస్ఎన్ఎఫ్ 8.5 కంటే తక్కువైతే పాలపొడి తయారీకి పనికిరావన్నారు. పొదుగువాపు రోగం ఉన్న ఆవుల నుండి తీసిన పాలు, పాచి కట్టిన క్యాన్లలో తీసుకువచ్చే పాలు వేస్తుండడం వల్ల పాలు నాణ్యత లోపిస్తున్నాయన్నారు. నేలపాలు చేయడానికి బదులు కరోనా కష్టకాలంలో ప్రజలకు ఉచితంగా అందజేసినా బాగుండేదని రైతులు అన్నారు. -
షాపింగ్ బ్యాగులతో వినూత్నంగా డ్రెస్సులు
షాపింగ్‌కు నుంచి వచ్చేటప్పుడు వెంట అక్కడి బ్యాగ్ కూడా మనతో పాటు వచ్చేస్తుంది. అలా ఒక్కోటిగా పేరుకుపోయిన బ్యాగులను మూలన పడేయడం లేదా చెత్తబుట్ట పాలు చేయడం సాధారణంగా చూస్తుంటాం. 22 ఏళ్ల టీచా ఏరియల్ మాత్రం వినూత్నంగా ఆలోచించింది. రకరకాల షాపింగ్ బ్యాగులతో డిజైనర్ డ్రెస్సులను రూపొందిస్తుంది. ఆ డ్రెస్సులను ధరించి, సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. ఆమె ఆలోచనను యూజర్స్ తెగ ప్రశంసిస్తున్నారు. వేస్టేజ్‌ను ఎలా తిరిగి వాడుకోవచ్చో ఈ విధానం భేషుగ్గా తెలియజేస్తుందని లైక్‌ల మీద లైకులు ఇస్తున్నారు. ఏరియల్ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ విద్యార్థి. తను చేసిన ఆలోచన మాత్రం ప్రపంచమంతా ఆకట్టుకునేలా ఉంది. షాపింగ్ బ్యాగుల నుండి అధిక మొత్తంలో ఫ్యాషన్ దుస్తులను సృష్టించిన ఘనత ఏరియల్ సొంతం. ఆమె తన స్నేహితులతో మాట్లాడుతున్నప్పుడు సరదాగా వచ్చిన ఆలోచనను ఇలా ఆచరణలో పెట్టేసింది. ఆధునిక కాలంలో వస్తున్న మార్పులకు తగ్గట్టు చేసే ఆలోచనల్లో షాపింగ్ బ్యాగ్ డ్రెస్సులు క్లిక్ అయ్యాయి. ఒక్కో బ్యాగ్ కట్ చేసి.. వినూత్నంగా డ్రెస్సులు తయారు చేయడానికి ఇంట్లో స్టోర్ రూమ్‌లో ఉంచిన బ్యాగ్‌లను బయటకు తీసుకువచ్చింది. లాక్డౌన్ టైమ్ ఈ సృజనకు కొంత ఊతమిచ్చింది. ‘మొదట్లో ఖాళీ సమయం బాగా విసుగ్గా అనిపించేది. ఎప్పుడైతే షాపింగ్ బ్యాగుల నుండి ఫ్యాషన్ డ్రెస్సులను తయారుచేయాలనే ఆలోచన వచ్చిందో అప్పటి నుంచి సమయమే తెలియలేదంటుంది’ ఏరియల్. డ్రెస్సుల కోసం వాల్‌మార్ట్, టార్గెట్, వేన్స్, ట్రేడర్ జో బ్రాండ్ బ్యాగ్‌లను ఉపయోగించింది. ఆమె తన ఫ్రెండ్‌తో కలిసి ప్రతి సంచిని జాగ్రత్తగా కట్ చేసి, అమరిక ప్రకారం కుట్టింది. మిగిలిన సంచుల మెటీరియల్ నుండి అందమైన ఉపకరణాలనూ తయారు చేసింది. మనం ఉపయోగించి, పడేసే వస్తువులను తిరిగి ఎన్నిసార్లు వాడదగినవి రూపొందించుకోవచ్చో తన ప్రయత్నంతో తెలియజేస్తుంది. ఏరియల్ డ్రెస్ డిజైన్స్ చూసినవారు తాము కూడా అలాంటి దుస్తులు డిజైన్ చేస్తామని తెలిపారు. ఈ షాపింగ్ సంచుల నుండి కర్టెన్లు, రగ్గులు, ఇతర వాడదగిన వస్తువులను ఎలా ఉపయోగించాలో ప్రజలు నేర్చుకోవాలని ఈ అమ్మాయి కోరుతుంది. -
మరో వివాదంలో కరణ్ జోహార్
పనాజీ: బాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ధర్మ ప్రొడక్షన్స్ సిబ్బంది గత వారం గోవాలోని ఓ గ్రామంలో షూటింగ్ చేశారు. ఈ క్రమంలో పోగయిన చెత్తని ఆ గ్రామంలో పడేసి వెళ్లారు. ఈ ఘటన ఉత్తర గోవా నిరుల్‌లో చోటు చేసుకుంది. ప్రాంత వాసులు తమ ఏరియాలో చెత్త పడేయటాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. దాంతో ఇంత బాధ్యతారహితంగా ప్రవర్తించినందుకు క్షమాపణలు చెప్పాల్సిందిగా గోవా ప్రభుత్వం కరణ్ ధర్మ ప్రొడక్షన్స్‌కి నోటీసులు జారీ చేసింది. అలానే విషయం తెలుసుకున్న ప్రభుత్వ ఎంటర్టైన్మెంట్ సొసైటీ ఆఫ్ గోవా ధర్మ ప్రొడక్షన్స్ లైన్ ప్రొడ్యూసర్ దిలీప్ బోర్కర్‌కి మంగళవారం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో గోవా వ్యర్థ పదార్థాల నిర్వహణ మంత్రి మైఖేల్ లోబో మాట్లాడుతూ... ‘ధర్మ ప్రొడక్షన్స్ సిబ్బంది ఈ స్థలంలో చెత్త పడేసి తమ దారిన తాము పోయారు. శుభ్రం చేయలేదు. ఇందుకు గాను వారు రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలి. ఫేస్బుక్ ద్వారా తమ తప్పును ఒప్పుకోవాలి.. క్షమాపణలు కోరాలి. లేకపోతే వారికి జరిమానా విధిస్తాం’ అని హెచ్చరించారు. ఈ చెత్తలో తారాగణం, సిబ్బంది ఉపయోగించిన పీపీఈ కిట్లు కూడా ఉన్నాయి. (చదవండి: మీడియాపై ఆగ్రహం.. కరణ్‌కు మద్దతు) ఇక ఈ సంఘటనపై లైన్స్ ప్రొడ్యూసర్ దిలీప్ బోర్కర్ స్పందించారు. ‘మేము నిరుల్ ప్రాంతంలో ఓ సినిమా షూటింగ్ చేశాం. ప్రతి రోజు చెత్తను సేకరించి స్థానిక పంచాయతీ తెలిపిన ప్రదేశంలో పడేసేవాళ్లం. కాంట్రాక్టర్ క్రమం తప్పకుండా చెత్తను సేకరిస్తాడు. కానీ ఆదివారం మాత్రం తీసుకెళ్లలేదు. దాంతో అది అక్కడే ఉంది. దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు అని తెలిపాడు. ఈ చిత్రంలో దీపికా పదుకోనె ప్రధాన పాత్రలో నటించిందని సమాచారం. -
వ్యర్థం.. కానుంది ‘అర్థం’!
నగరంలో నాలాలు పొంగిపొర్లడానికి ప్రధాన కారణం వాటిల్లో నీరు పారే దారి లేకుండా పేరుకుపోయిన వ్యర్థాలు. ఈ వ్యర్థాల్లో కన్స్ట్రక్షన్ అండ్ డిమాలిషన్ (సీ అండ్ డీ) వేస్ట్ ఎక్కువగా ఉంటోంది. నాలాల సమస్యే కాదు.. రోడ్లపైనే వేస్తుండటం ప్రమాదాలకు కారణమవుతోంది. నడిచే బాటలు తగ్గిపోతున్నాయి. ఈ సమస్యల పరిష్కారానికి త్వరలో సీఅండ్‌డీ వేస్ట్ రీసైక్లింగ్ ప్లాంట్ ప్రారంభం కానుంది. ఈ రీసైక్లింగ్ నుంచి వెలువడే ఉత్పత్తులను వివిధ అవసరాలకు వినియోగించవచ్చు. ఇలా రెండు రకాలుగా ప్రయోజనం ఉండటంతో జీహెచ్ఎంసీ దీనిపై దృష్టి సారించింది. నగరంలో రోజుకు 2 వేల మెట్రిక్ టన్నుల సీఅండ్‌డీ వేస్ట్ వెలువడుతున్నట్లు అంచనా. దీని రీసైక్లింగ్‌కు 500 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో పనిచేసే నాలుగు ప్లాంట్లకు టెండర్లు పిలిచారు. వీటిని దక్కించుకున్న రాంకీ ఎన్విరో ఇంజనీర్స్ సంస్థ (హైదరాబాద్ సీఅండ్‌డీ వేస్ట్ ప్రైవేట్ లిమిటెడ్) 2 ప్రాంతాల్లో పనులు చేపట్టింది. జీడిమెట్ల ప్లాంట్ దాదాపు పూర్తయింది. శుక్రవారం ప్లాంట్ పనితీరును జీహెచ్ఎంసీ ఇంజనీర్లు, రాంకీ ప్రతినిధులు వివరించారు. ప్రాజెక్ట్ వ్యయం రూ.15 కోట్లు.. ►జీడిమెట్ల పారిశ్రామిక వాడలో ప్రభుత్వం 17 ఎకరాల స్థలం కేటాయించగా, 2018, జనవరి నుంచి పనులకు శ్రీకారం చుట్టారు. ప్రాజెక్ట్ అంచనా వ్యయం రూ.15 కోట్లు. ►శాస్త్రీయ పద్ధతిలో వ్యర్థాలను రీసైక్లింగ్ చేసి గ్రీన్ అండ్ ఎకో ఫ్రెండ్లీగా తిరిగి వినియోగించుకునేలా చేస్తారు. ►వేస్ట్ ప్రాసెసింగ్, ప్రొడక్షన్.. ఇలా రెండు విభాగాలుగా పనులు చేస్తున్నారు. రీసైక్లింగ్‌తో ఇటుకలు, పేవర్ బ్లాక్‌లు తయారు చేస్తారు. వ్యర్థాలను క్రషింగ్ ద్వారా కంకరగా, కోర్, ఫైన్ ఇసుకగా మారుస్తారు. ఈ కంకరను రోడ్ల లెవెల్ ఫిల్లింగ్‌కు, ఇసుకను రోడ్డు పనుల్లో పీసీసీగా, ల్యాండ్ స్కేపింగ్ పనులకు వాడొచ్చు. టోల్‌ఫ్రీ నంబర్, యాప్ అందుబాటులోకి బిల్డర్లు, ప్రజలు సీ అండ్ డీ వేస్ట్‌ను తరలించేందుకు సంబంధిత నంబర్‌కు ఫోన్ చేస్తే సంస్థ వాహనాల ద్వారా తరలిస్తారు. ప్లాంట్ ప్రారంభమయ్యాక టోల్‌ఫ్రీ నంబర్, ప్రత్యేక యాప్ అందుబాటులోకి తెస్తారు. ప్రస్తుతం జీహెచ్ఎంసీ కాల్‌సెంటర్ నంబర్ 040–21111111, మై జీహెచ్ఎంసీ యాప్, జీహెచ్ఎంసీ పోర్టల్ ద్వారా సమాచారమిచ్చినా తరలిస్తున్నారు. దీనికిగాను ప్రస్తుతం టన్నుకు రూ.256 వసూలు చేస్తున్నారు. ప్లాంట్ ప్రారంభమయ్యాక టన్నుకు రూ.342 చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ వ్యర్థాలను సొంతంగానే తరలిస్తే ఖర్చు తగ్గుతుంది. అయితే వీటిని తరలించే వాహనాలు తప్పనిసరిగా జీహెచ్ఎంసీ ఎం ప్యానెల్ జాబితాలో నమోదై ఉండాలి. లేకపోతే భారీ జరిమానాతోపాటు వాహనాలనూ సీజ్ చేస్తారు. ప్రయోజనాలు... ►ఎక్కడ పడితే అక్కడ సీఅండ్‌డీ వ్యర్థాలుండవు. ►రీసైక్లింగ్‌తో పేవర్ బ్లాక్‌లు, కెర్బ్ స్టోన్లు, ఇసుక, ఇటుకలు తదితరమైనవి ఉత్పత్తి చేసి పునర్వినియోగించడం వల్ల సహజ వనరులు వృథాకావు. ఠి కాలుష్యం తగ్గుతుంది. కలెక్షన్ పాయింట్ల ఏర్పాటు... స్వచ్ఛ సర్వేక్షణ్‌లో భాగంగా నగరంలో నిర్మాణ వ్యర్థాలను ప్రాసెసింగ్ చేసి వివిధ రకాల మెటీరియల్‌ను ఉత్పత్తి చేసే లక్ష్యంతో జీడిమెట్లలో సీ అండ్ డీ వేస్ట్ ప్లాంట్ ఏర్పాటు చేసినట్లు బల్దియా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఈఈలు శ్రీనివాస్‌రెడ్డి, మోహన్‌రెడ్డి, రాంకీ ఎన్విరో బయోమెడికల్ వేస్ట్ బిజినెస్ హెడ్ ఎ.సత్య తెలిపారు. సీ అండ్ డీ వేస్ట్ సేకరించేందుకు నగరంలోని వివిధ ప్రాంతాల్లో కలెక్షన్ పాయింట్లను ఏర్పాటు చేస్తామన్నారు. -
ఆస్పత్రి వ్యర్థాలతో డేంజర్ బెల్స్!
సాక్షి, అమరావతి: మున్సిపాలిటీల్లో మురుగు కాల్వల ద్వారా వెళ్లాల్సిన నీటిలో ఆస్పత్రుల నుంచి వెలువడే వ్యర్థ విష జలాలు కలిసి భయంకర వ్యాధులకు కారణమవుతుండటం కలకలం రేపుతోంది. ఇలాంటి పరిస్థితులు ప్రజారోగ్యానికి ఏమాత్రం క్షేమం కాదని.. తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని.. లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) హెచ్చరిస్తున్నా ఫలితం ఉండటం లేదు. చిన్న చిన్న ఆస్పత్రులే కాకుండా చివరకు వేయి పడకలు ఉన్న ఆస్పత్రుల్లోనూ సీవరేజీ ట్రీట్మెంటు ప్లాంట్లు లేవు. దీంతో ఆస్పత్రులు వ్యర్థాలను శుద్ధి చేయకుండా నేరుగా మురుగు కాల్వల్లోకి పంపిస్తున్న తీరు భయాందోళన రేకెత్తిస్తోంది. ఇప్పటికే ఒకవైపు ఘన వ్యర్థాలను నిర్వీర్యం చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న ఫిర్యాదులు ఉన్నాయి. వీటిపై చర్యలు తీసుకోవాల్సిన కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) చేష్టలుడిగి దిక్కులు చూస్తోంది. మరోవైపు ఆస్పత్రుల్లో రోజూ వందల లీటర్లలో రోగుల నుంచి రకరకాల జల వ్యర్థాలు వస్తుంటాయి. మున్సిపాలిటీలలో ఇలాంటి వ్యర్థాలన్నిటినీ నేరుగా మురుగు కాల్వల్లోకి వదులుతుండటం వల్ల జబ్బులు తగ్గకపోగా కొత్త జబ్బులు వెంటాడుతున్నాయి. జాతీయ హరిత ట్రిబ్యునల్, కాలుష్య నియంత్రణ మండలి వంటి వాటి ఆదేశాలను ప్రభుత్వమే పట్టించుకోకపోతే ఇక ప్రైవేటు ఆస్పత్రుల్లో పరిస్థితి ఎలా ఉంటుందో అంచనా వేయొచ్చు. సీవరేజీ ట్రీట్మెంట్ ప్లాంట్ల ద్వారా శుద్ధి చేసి.. ప్రతి పెద్దాస్పత్రిలో నిబంధనల ప్రకారం.. విధిగా సీవరేజీ ట్రీట్మెంట్ ప్లాంట్ ఉండాలి. రోగులకు శస్త్రచికిత్సలు చేసినప్పుడు, మహిళలు ప్రసవించినప్పుడు ఎక్కువగా ద్రవ వ్యర్థాలు విడుదలవుతాయి. ఈ వ్యర్థాలను నేరుగా మురుగు కాల్వల్లోకి వదలకూడదు. సీవరేజీ ట్రీట్మెంట్ ప్లాంట్ల ద్వారా శుద్ధి చేసి ఆ తర్వాతే నీటిని మురుగు కాల్వల్లోకి వదలాలి. అయితే పెద్ద పెద్ద ఆస్పత్రుల్లోనే సీవరేజీ ట్రీట్మెంట్ ప్లాంట్లు లేవు. ఉదాహరణకు.. రాజధాని అమరావతిలో సచివాలయానికి సమీపంలో ఉండే గుంటూరు పెద్దాస్పత్రిలోనే సీవరేజీ ట్రీట్మెంట్ ప్లాంట్ లేదు. రాజధాని నగరంగా భావించే విజయవాడలోనూ ఇదే దుస్థితి. కర్నూలు, విశాఖపట్నం, అనంతపురం, తిరుపతి, కాకినాడ వంటి కార్పొరేషన్ల పరిధిలో ఉన్న ఏ పెద్దాస్పత్రిలోనూ ఈ ప్లాంట్లు లేకపోవడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. గత కొంతకాలంగా సీవరేజీ ట్రీట్మెంట్ ప్లాంట్లను నిర్మిస్తున్నామంటూ ప్రభుత్వం.. జాతీయ హరిత ట్రిబ్యునల్‌కు చెబుతూనే ఉన్నా ఎక్కడా నిర్మాణాలు పూర్తికాలేదు. దీంతో ఆ వ్యర్థాలతో జబ్బులను కొనితెచ్చుకుంటున్నామని నిపుణులు చెబుతున్నారు. ఇలా రోగుల నుంచి వెలువడే జల వ్యర్థాలు అత్యంత ప్రమాదకర జబ్బులకు కారణమవుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తో పాటు ఇతర సంస్ధలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. -
రాజీ
అస్సామీ మూలం : భాబేంద్రనాథ్ సైకియా అనువాదం: టి.షణ్ముఖరావు ఊతకర్రతో నడుస్తున్న గుడ్డివాడు హఠాత్తుగా తన పక్కనే ఏదైనా గలాటా వినపడగానే ముందుగా తన చేతికర్రని గట్టిగా పట్టుకుంటాడు. ఆ తర్వాతే అసలేం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. సరిగ్గా అదేవిధంగా ఆ ప్రాంతంలోని మహిళలు ఏ చిన్న సంఘటకైనా ప్రతిస్పందిస్తారు.సాధారణంగా వీరు తమ పిల్లల ఉనికిని పట్టించుకోరు. ఆకలి వేస్తే చాలు పిలవకుండానే ఇళ్లకు వస్తారని వారికి తెలుసు. కాని ఈరోజు గడబిడ వినగానే మహిళలంతా వారి గుడిసెల నుంచి పరుగులతో బయటకు వచ్చారు. తత్తరపాటుతో అటూ ఇటూ తిరుగుతూ తమ పిల్లలను పేర్లు పెట్టి పిలవడం మొదలుపెట్టారు. ప్రతి స్త్రీ తన పిల్లవాడు ఆ గుంపులో ఉన్నాడో లేడో దూరం నుంచే చూసి గుర్తు పట్టగలదు. కానీ అంతటితో తృప్తి పడదు. వాడి వద్దకు పరుగున వెళ్లి వాడి రెక్క పట్టుకుని గుంజుతుంది. గుంపు నుంచి దూరంగా లాక్కొనిపోయి నిలబెడుతుంది. ఆ తర్వాతనే అక్కడి కోలాహలానికి కారణం తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. ఆ రోజు కూడా అక్కడ ఏదో జరిగింది. కొద్ది నిమిషాల్లోనే తల్లులందరూ తమ పిల్లల్ని పోగేసుకున్నారు. వారి పేర్లతో బిగ్గరగా పిలవడమూ ఆగిపోయింది. ఒక్క చీమోతీచీ అనే పిల్లవాడి తల్లి గొంతు మాత్రమే కీచుగా వినిపిస్తోంది. బిగ్గరగా పైకి లేస్తోంది. అక్కడి జనాల రణగొణ ధ్వనుల మధ్య నుంచి కూడా ఆమె సన్నని గొంతు స్పష్టంగా వినిపిస్తోంది.మొదట ఆమె ‘మోతీ... మోతీ’ అని అరిచింది. ఆందోళనతో పరుగులు పెట్టింది. ‘ఇప్పటి వరకు మోతీ మాతోనే ఇక్కడే ఉన్నాడు’ అని మోతీ తోటి పిల్లలు చెప్పారు. కానీ ఎక్కడ? ఏడీ మరి?అందరూ మోతీ ఇప్పుడే ఇక్కడే ఈ బరువైన బస్తాల పోగు వద్దనే ఉండే వాడని ముక్తకంఠంతో చెప్పారు.అది గౌహతీ పట్టణానికి శివారు ప్రాంతం. అక్కడ వేలాది జనాభాకు సరిపడే తిండిగింజలు, నిత్యావసరాలు నిల్వ చేసే గిడ్డంగులు ఉన్నాయి. అసంఖ్యాకమైన లారీలూ ట్రక్కులూ బస్తాలతో నిండుగా వచ్చి ఖాళీగా వెళతాయి. ఖాళీగా వచ్చి బస్తాలతో నిండుగా వెళతాయి. అక్కడొక ప్రధాన రహదారి ఉంది. దాన్ని ఆనుకుని గిడ్డంగులకు దారితీసే చిన్న సందులున్నాయి. వాటిని రోడ్లనడానికి వీల్లేదు. కొన్నిసార్లు ట్రాఫిక్ జామ్ అవుతుంది. పరిసరాలు క్లీనర్ల అరుపులతో కలుషితమవుతాయి. ఆ ప్రాంతంలో ఒక ఖాళీ ప్రదేశం ఉంది. సుమారు సగభాగం నల్లని ఆకుపచ్చని బురద నీటితో నిండి ఉంది. పిల్లలు మురికి పట్టిన వారి శరీరాల్ని ఆ నీటితోనే కడుక్కుంటూ ఉంటారు. ఆ ప్రదేశం చుట్టూ వెదురు, మట్టి, గోనెసంచులు, అట్టపెట్టెలతో నిర్మించిన గుడిసెలున్నాయి. ఒకప్పుడు ఆ గుడిసెల్లో కళాసీలు ఉండేవారు. ఇప్పుడు మాత్రం కొందరు స్త్రీలు వారి పిల్లలతో కలిసి వాటిలో నివసిస్తున్నారు. వారంతా కూలీ నాలీ లేక భిక్షాటన చేస్తుంటారు. మోతీ తల్లి వంటి కొద్దిమంది తప్ప మిగిలిన వారంతా వయసు మళ్లిన స్త్రీలే. పిల్లలు కూడా రోడ్ల పక్కనే తిరుగుతుంటారు. ఆడుకుంటూ ఉంటారు. జామ్‌లో నిలిచిన ట్రక్కుల అడుగు భాగంలోని గింజలను తుడిచి తల్లులకు ఇస్తారు. లేదా చిన్న ఇనుపరాడ్లతో లారీల్లోని బస్తాలకు రంధ్రాలు చేస్తారు. బియ్యం, చక్కెర, పప్పులు వెలికితీసి సేకరిస్తారు.క్లీనర్లు అదిలించినట్లయితే దూరంగా పారిపోతారు. వారు ఏమరుపాటుగా ఉంటే తిరిగి చేరి తమ పని చేసుకుంటారు. పిల్లలు ఎల్లప్పుడూ ట్రాఫిక్ జామ్ కావాలనే ప్రార్థిస్తూ ఉంటారు.నిజానికి ఈరోజు జామ్ అంత పెద్దది కాదు. రెండు లారీలూ ఎదురెదురుగా వచ్చి నిలిచిపోయాయి. కొంతసేపు ఇద్దరు డ్రైవర్లూ నీది తప్పంటే నీది తప్పని వాదించుకున్నారు. తన లారీ కదిలించనంటూ భీష్మించుకు కూర్చున్నారు.రెండోవైపు నుంచి బియ్యం బస్తాలతో వస్తున్న మరో లారీ తాలూకా ఎడమ చక్రం బురదలో దిగబడిపోయింది. లారీ కూడా ఒకవైపు ఒరిగిపోయింది. దానిపైనున్న బస్తాలు నేలమీద పడసాగాయి. ఈ హఠాత్పరిణామానికి అక్కడున్న పిల్లలు బురదనీటి మీదుగానే దూరంగా పారిపోయారు. మోతీ చావుకేక మాత్రం దొర్లిపోతున్న బస్తాల శబ్దంలో కలిసిపోయింది. వాడిపైన బస్తాలు ఒకదాని తరువాత ఒకటిగా పడిపోయాయి.ప్రధాన రహదారి నుంచి జనం వచ్చి ఘటనాస్థలం వద్ద గుమిగూడారు. మోతీ తల్లి ఏడుపు విన్న వారంతా పిల్లవాడి గురించి వాకబు చేయడం మొదలుపెట్టారు. బస్తాల్ని ఒక్కొక్కటీ తొలగించడం ప్రారంభించారు. మొదట మోతీ పాదాలు కనపడ్డాయి. చివరి బస్తా కూడా తీసేసరికి అక్కడి మనుషులు ఆ దృశ్యాన్ని చూడలేకపోయారు. ఇక ఆరోజు రవాణా ఆగిపోయింది. అప్పటికే సాయంకాలమైంది. ప్రధాన రహదారి మీద కూడా లారీలు వరుసగా నిలిచిపోయాయి. నుజ్జు నుజ్జయిన మోతీ ఎముకల్నీ మాంసాన్నీ పోగు చేసిన పోలీసులు వాటిని ఒక బస్తాలో వేసి హాస్పిటల్‌కు తరలించారు. మోతీ తల్లి వెర్రిగా రోదిస్తుండగా చుట్టూ ఉన్న స్త్రీలు ఆమెను గట్టిగా పట్టుకున్నారు. ఆమె స్పృహ తప్పిపోయింది. ఎవరూ చాలా రాత్రి వరకు నిద్రపోలేకపోయారు. కొందరైతే నెత్తీ నోరూ కొట్టుకుని రోదిస్తున్న మోతీ తల్లి వద్దనే ఉండిపోయారు. ఆలస్యంగా నిద్రపోయినప్పటికీ ఉదయాన్నే తొందరగా లేచారు. పెద్దవారంతా సూది మొనగల ఇనుప కడ్డీలూ బుట్టలూ పట్టుకొని బస్తాల వద్దకు చేరిపోయారు. వీలైనంత వరకు బియ్యం పప్పులూ చక్కెరా సేకరించుకున్నారు. మోతీ రక్తంతో తడిసిన బస్తాను మాత్రం ఎవరూ ముట్టుకోలేదు.రెండోరోజు కొద్దిమంది దర్జా దుస్తులు ధరించిన వ్యక్తులు ఘటనాస్థలానికి వచ్చారు. వారు ఏ నిర్ణయం తీసుకున్నారో ఎవరికీ తెలీదు. పడి ఉన్న బస్తాల్ని కూలీల చేత ఎత్తించారు. ఇద్దరు కూలీలు మోతీ రక్తపు మరకలున్న బియ్యపు బస్తాని మోసుకొచ్చి మోతీ తల్లి పాకలో పెట్టారు. బహుశా మోతీ ప్రాణం ఖరీదు ఒక బియ్యపు బస్తాగా ఆ పెద్దలు నిర్ధారించారు. ఆమె వెర్రిదానిలా లేచి ఏడుస్తూ ‘వద్దు... వద్దు... నాకీ బస్తా వద్దు’ అని అరవడం మొదలుపెట్టింది. ఆ బస్తా మీద పడి రోదించసాగింది. కూలీలు రక్తపు మరకలున్న భాగాన్ని గోడవైపు పెట్టారు. ఆరోజంతా ఆమె తన నులకమంచం మీదనే కూర్చుని ఏడవసాగింది. ఆ బస్తా వైపు చూడలేకపోయింది. తిండి తినలేదు.నిద్రపోలేదు. చాలారోజుల వరకు ఆమె ఏడుస్తూనే ఉంది. ‘నాకే బస్తా వద్దు. తీసుకుపొండి... తీసుకుపొండి’ అని అరుస్తూనే ఉంది. మోతీ తల్లికి తన పల్లెలో తల్లిదండ్రులెవరూ లేరు. ఆమె తన పినతండ్రి వద్ద పెరిగింది. అతనికి పప్పుధాన్యాలు పండించడంలో సహాయపడేది. ఒక వ్యక్తి ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించి లేవదీసుకొచ్చాడు. కాని ఆమె గర్భవతిగా ఉన్నప్పుడే ఆమెను విడిచిపెట్టి ఎక్కడికో వెళ్లిపోయాడు. తిరిగి రాలేదు. మోతీ పుట్టిన ఇన్ని సంవత్సరాలుగానూ అతని కోసం ఎదురు చూస్తూనే ఉంది. లారీల వారికి మురీమిక్చర్ అమ్ముతూ పొట్ట పోషించుకుంటోంది. ఒంటరి స్త్రీ కనుక డ్రైవర్లూ క్లీనర్లూ పరాచికాలాడేవారు. ‘వాడు మరి రాడు. మాలో ఎవర్నైనా ఎంపిక చేసుకో’ అనేవారు. మిగిలినవారు నవ్వేవారు. కానీ మోతీ తల్లి స్పందిచేది కాదు. కోపంగా చూసేది.నిజానికి అలా ఒంటరిగా జీవించడానికి ఆమె దిగులు పడుతూ ఉండేది. చుట్టూ ఉన్న మగవారన్నా భయపడేది. మోతీ తలను గుండెకు హత్తుకుని నిద్రపోయేది. మోతీయే ఆమె ఆశ. ఆమోతీయే ఆమె ప్రాణం.కొడుకు మగనికన్నా విలువైన వాడు. ఆమె చెవికి అమ్మా అనే పిలుపు ఎప్పుడూ వినపడుతూ ఆసరాగా ఉంటుందని భావించింది. ఆ ఆశ ఇప్పుడు అడియాస అయింది.మోతీ దుర్మరణంతో ఒక విచిత్రమైన నిశ్శబ్దం ఆ పాకను ఆవరించింది. ఆమెలో ఒక భయానకమైన శూన్యం ఏర్పడింది. పిచ్చిదానిలా ప్రవర్తించసాగింది. మొదట్లో ఆ బస్తా వైపు చూస్తూ నెమ్మదిగా ఏడ్చేది. ఇప్పుడు మౌనంగానే రోదిస్తోంది. ఇరుగు పొరుగువారు బిచ్చమెత్తి తెచ్చిన గింజల్ని ఇచ్చేవారు. కొన్నిసార్లు ఏదో వండుతుంది. కానీ తినదు. కొన్నిసార్లు వంటే చెయ్యదు. అసలు ఆమెకు ఆకలే లేకుండాపోయింది. ఏ లారీ నుంచి బస్తాలు మోతీ మీద పడ్డాయో ఆ లారీ క్లీనరు తరచుగా ఆమెను చూడటానికి వచ్చేవాడు. తినుబండారాలనూ తెచ్చేవాడు. చనువుగా మాట్లాడబోయేవాడు. కానీ మోతీ తల్లి అతనితో ముభావంగా ఉండేది.ఎక్కువగా మాట్లాడేది కాదు. రోజులు గడుస్తున్నాయి. ఆమె ఎప్పుడూ ఆకలితోనే ఉంటోంది. ఇరుగు పొరుగు వారి సహాయమూ ఆగిపోయింది. ఒక రోజు ఎలుకలు ఆ బస్తాకు రంధ్రం చేసినట్టు ఆమె గుర్తించింది. ప్రతిరోజూ ఉదయం కొంచెం బియ్యం గింజలు బస్తా పరిసరాల్లో పడి ఉంటున్నాయి. ఆ బియ్యాన్ని ఆమె చీపురుతో తుడిచేది. అప్పుడు ఆమె కళ్లు కన్నీళ్లతో తడిసేవి.ఒకరోజు ఆమెకు ఆకలి దహిస్తోంది. మంచం మీద అదే పనిగా అశాంతిగా దొర్లసాగింది. కొంతసేపటి తర్వాత లేచింది. ఒక వెదురు చేటను ఆ బస్తా వద్ద పెట్టింది. ఎలుకలు చేసిన రంధ్రం గుండా తన చూపుడు వేలిని చొప్పించి నెమ్మదిగా కదిలించింది.గుప్పెడు బియ్యం పోగవడానికి చాలాసేపు పట్టింది. ఆ బియ్యంతోనే ఆ పూట గడిచింది. అప్పడప్పుడూ క్లీనరు వస్తూనే ఉన్నాడు. ఏదో తెస్తూనే ఉన్నాడు. కానీ తీసుకోవడానికి ఆమె అంత ఇష్టపడేది కాదు.ఎలుక వల్లనో, ఆమె వేలి వల్లనో బస్తాకున్న రంధ్రం పెద్దదయింది. బియ్యమూ ఎక్కువ మొత్తంలో కింద పడ్డాయి. ఆ విధంగా బియ్యాన్ని వృథా చేయడం ఆమెకు నచ్చలేదు. బస్తాపై ఒక గుడ్డను కప్పి రంధ్రాన్ని మూసివేసింది. కొన్నిసార్లు క్లీనరు అనేవాడు ‘ఒక్క బియ్యంతో ఎలా బతుకుతావు? పప్పులూ కూరగాయలూ కూడా నన్ను తేనివ్వు’. కానీ మోతీ తల్లి ఏమీ జవాబు చెప్పేది కాదు. రోజులు గడుస్తున్నాయి.బస్తాకున్న రంధ్రం అవసరం లేకుండానే బియ్యం చేతికి అందుతున్నాయి. బస్తా చిన్నదైపోయింది. ఒకరోజున ఆమె భుజాల వరకు చేతిని చొప్పించింది. కానీ చాలినన్ని బియ్యం రాలేదు. ఉన్న కొద్దిపాటి బియ్యమూ బస్తా కుట్లలో ఇరుకున్నాయి. అప్పుడామె బస్తా మూతి వద్ద ఉన్న కుట్లను విప్పింది. బస్తాని తిరగేసి దులిపింది. సాయంత్రం తిండికి సరిపడా గింజలు రాలాయి. వాటిని చీపురుతో తుడిచింది. చేటతో చెరిగి చెత్తను తీసేసింది.ఖాళీ గోనె సంచిని ఎండలో పెట్టింది. రక్తపు మరకల భాగాన్ని నేలవైపు ఉంచింది. సాయంత్రం ఆ బస్తాను దులిపి తను పడుకునే నులకమంచం మీద పరుచుకుంది.కొంచెం ఎంగిలిపడి మంచంపైకి చేరింది. వాతావరణంలో చలి గుడిసెలోనికి చొచ్చుకొస్తోంది. గత కొద్దిరోజులుగా చలి మరింత తీవ్రమవుతోంది. గతంలో మోతీ ఆమెను హత్తుకుని పడుకునేవాడు. కాబట్టి ఆమెకు చలి బాధ తెలిసేది కాదు. కింద పరుపుగా ఉన్న గోనెసంచి కూడా చలి నుంచి కొద్దిగానే రక్షిస్తోంది.కానీ ఆమె మనసు వికలమవుతోంది. ఒంటరితనం గుండెల్లో దిగులు పుట్టిస్తోంది. ఆలోచనలు పరిపరి విధాలుగా పోతున్నాయి.అంతలోనే ఒక ఎలుక గతంలో బస్తా ఉన్న చోటికి రావడం ఆమె గమనించింది. ఆ ఎలుకను అదిలించడానికి మోతీ ఆమె పక్కన ఇప్పుడు లేడు. మోతీ లేని లోపం బాధగా మారిఆమెను మరింతగా దహించేస్తోంది. ఆమె ఏడుపు ఆపుకోలేకపోతోంది. ఏమైనా ఆమెకొక ఓదార్పు కావాలి. ఆమె జీవితానికొక ఆశాజ్యోతి కావాలి. వార్ధక్యానికి ఆసరా కావాలి. ఆ దశలోనే ఆమె ఇలా అనుకుంది.. ‘ఈసారి ఆ క్లీనరు వచ్చి బియ్యం పప్పులూ ఇస్తానంటే వద్దనను. తెచ్చివ్వమనే అంటాను. అది కూడా మరో మోతీ కోసమే... మోతీ కోసమే..’ -
‘వ్యర్థాల నుంచి విద్యుత్’పై రామ్కీ ఫోకస్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రామ్కీ గ్రూప్ కంపెనీ... రామ్కీ ఎన్విరో ఇంజనీర్స్ ‘వేస్ట్ టు ఎనర్జీ’ ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టనుంది. వ్యర్థాల నుంచి విద్యుత్‌ను ఉత్పత్తి చేసే విషయంలో ఇప్పటికే కంపెనీ దేశీయంగా 45 మెగావాట్ల ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేసి నిర్వహిస్తోంది. ఇవి హైదరాబాద్, ఢిల్లీ తదితర నగరాల్లో ఉన్నాయి. ఈ ప్రాజెక్టులపై సంస్థ రూ.600 కోట్లు వ్యయం చేసింది. మరో 105 మెగావాట్లకు సమానమైన ప్లాంట్లు నిర్మాణ దశల్లో ఉన్నాయని రామ్కీ ఎన్విరో ఇంజనీర్స్ ఎండీ ఎం.గౌతమ్ రెడ్డి ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధితో చెప్పారు. హైదరాబాద్, ఢిల్లీలో మరిన్ని ప్రాజెక్టులు రానున్నాయని, వీటి కోసం సుమారు రూ.1,800 కోట్లు పెట్టుబడి పెట్టనున్నామని ఆయన తెలియజేశారు. 2021 నాటికి ఇతర విభాగాలపై కంపెనీ మరో రూ.700 కోట్లు ఖర్చు చేయనుంది. కొత్త మార్కెట్లకు.. కేకేఆర్‌కు వాటా విక్రయించటం ద్వారా వచ్చిన నిధులను అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో అడుగుపెట్టడానికి వినియోగించనున్నట్లు గౌతమ్ రెడ్డి తెలియజేశారు. ‘ప్రస్తుతం సింగపూర్, యూఏఈ, ఒమన్, కువైట్, జోర్డాన్, సౌదీ అరేబియాలో కంపెనీ సేవలందిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి 30% ఆదాయం సమకూరుతోంది. 2021 నాటికి ఇది 35– 36 శాతానికి చేరనుంది. ఆఫ్రికా, ఆగ్నేయాసియా దేశాల్లో విస్తరిస్తాం. మొత్తంగా భారత మార్కెట్ రానున్న రోజుల్లో కంపెనీ వృద్ధిని నడిపిస్తుంది. క్లీన్ ఇండియా లక్ష్యంతో రామ్కీ గ్రూప్ చైర్మన్ అయోధ్య రామిరెడ్డి కృషి చేస్తున్నారు. కేకేఆర్ తోడవడంతో అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పర్యావరణ సంబంధ సేవలు అందించేందుకు కలిసి పనిచేస్తాం’ అని వివరించారు. మూడేళ్లలో ఉద్యోగుల సంఖ్య 18,000కు... ప్రముఖ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సంస్థ కేకేఆర్... రామ్కీ ఎన్విరో ఇంజనీర్స్‌లో 60 శాతం వాటాను కొనుగోలు చేస్తోంది. డీల్ విలువ సుమారు రూ.3,670 కోట్లు. విక్రయం అనంతరం సంస్థలో రామ్కీ గ్రూప్ చైర్మన్ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి వాటా 40 శాతానికి పరిమితమవుతుంది. తాజా డీల్‌లో భాగంగా ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ ప్రైవేట్ ఈక్విటీ, స్టాండర్డ్ చార్టర్డ్‌లు కంపెనీలో తమకున్న 11 శాతం వాటాను కేకేఆర్‌కు విక్రయించాయి. ఇక రామ్కీ ఎన్విరో ఎండీగా గౌతమ్‌రెడ్డి కొనసాగుతారు. కేకేఆర్ టీమ్ సభ్యులు కంపెనీ బోర్డులోకి వస్తారు. కంపెనీలో ప్రస్తుతం 10,000 పైచిలుకు ఉద్యోగులున్నారు. మూడేళ్లలో ఈ సంఖ్య 18,000 దాటనుంది. భారత్‌లో 20 నగరాల్లో రామ్కీ ఎన్విరో కార్యకలాపాలు నిర్వర్తిస్తోంది. కంపెనీ ఏటా 35 లక్షల టన్నుల మున్సిపల్ వ్యర్థాలు, 10 లక్షల టన్నుల పారిశ్రామిక వ్యర్థాలను నిర్వహిస్తోంది. 20,000 పైచిలుకు ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాలకు సేవలందిస్తోంది. -
అనేసిన మాట
మనుషులం కదా.. తెలియకుండానే ముల్లు దిగబడిపోతుంది. లేదా, ముల్లులా మనమే ఎవరికో దిగబడిపోతాం. మాటను వెనక్కి తీసుకోవడం గురించి ఇంతవరకు పరిశోధనలేం జరగలేదు. వృధా ప్రయాస. అన్నవీ, విన్నవీ మర్చిపోయేలా శాస్త్రజ్ఞులు పరీక్ష నాళికల్లో ఏవైనా రసాయనాలు కలిపి, మనిషి చేత తాగిస్తే.. ఉన్నవి కూడా కొట్టుకునిపోయే ప్రమాదం ఉంటుంది. మనసును నొప్పించిన, మనసు నొచ్చుకున్న మాటలతో పాటు మనసు పొరల్లో జ్ఞాపకాలుగా ఉండిపోయిన మంచి మాటలు కూడా కిల్ అయిపోతే ఏం లాభం మనిషి మెదడు అంతగా క్లీన్ అయిపోయి! లేదంటే బాధించిన ఆ ఫలానా మాటను మాత్రమే ఏరిపారేసే బయోటెక్నాలజీని కనిపెట్టాలి. కనిపెట్టి, ఆ మాటను తూలినవారి నుంచి, ఏళ్లు గడుస్తున్నా ఆ మాటను తట్టుకోలేకపోతున్నవారి నుంచి.. రెండు చోట్ల నుంచీ ఏకకాలంలో తీసేయాలి. అక్కడితో అయిపోతుందా! మళ్లీ ఏదో ఒకటి అంటాం. ఏదో ఒకటి అనిపించుకుంటాం. ఎంత పెద్ద శాస్త్రమైనా వచ్చినదానికి విరుడుగు కనిపెట్టగలదేమో కానీ, ఊహించనిదానికి ముందే మందు తయారు చేసి ఉంచలేదు. అయితే శాస్త్రంతో జరగనివి కొన్ని సంస్కారంతో సాధ్యం అవుతాయి. ‘నొప్పించక, తానొవ్వక’ తిరగడం అలాంటి సంస్కారమే. మరి ఎంతకాలం తిరుగుతాం.. ఒకర్ని ఒక మాట అనకుండా, ఒకరి చేత ఒక మాట అనిపించుకోకుండా! మనుషులం కదా.. తెలియకుండానే ముల్లు దిగబడిపోతుంది. లేదా, ముల్లులా మనమే ఎవరికో దిగబడిపోతాం. తప్పును దిద్దుకోడానికి మాటను వెనక్కు తీసుకునే ప్రయత్నంలో మళ్లీ ఏ ముల్లునో గుచ్చేసే ప్రమాదం ఉంది కాబట్టి, మాటను దాటుకుని ముందుకు వెళ్లిపోవడమే మనిషి చేయగలిగింది. అనేసిన మాటలాగే, మీద పడిపోతున్న వయసును కూడా వెనక్కు తీసుకోలేం. అయితే మాటను వెనక్కు తీసుకోవడం వరకు ఈ థియరీ కరెక్టే కానీ, వయసును వెనక్కు తీసుకోవడం కష్టం కాదని కేశవ్‌సింగ్ అనే ప్రొఫెసర్ అంటున్నారు! యు.ఎస్.లోని అలబామా యూనివర్సిటీలో ఈయన, మరికొందరు శాస్త్రవేత్తలు కలిసి మనిషి వయసును వెనక్కు తెచ్చే పరిశోధనల్లో మునుపెన్నడూ లేనంతగా ముందుకు వెళ్లిపోయారు! వయసు మీద పడుతోందనడానికి కనిపించే రెండు ప్రధాన సూచనలు.. జుట్టు రాలిపోవడం, చర్మం ముడతలు పడడం. జన్యువుల్లో కలిగే మార్పుల కారణంగా జీవ కణానికి ప్రాణం అయిన ‘మైటోకాండ్రియా’ (జనరేటర్) శక్తిని కోల్పోతున్నప్పుడు వృద్ధాప్యం మొదలౌతుంది. ఈ అలబామావాళ్లేం చేశారంటే.. యవ్వనంలో ఉన్న ఎలుకల్లో మైటోకాండ్రియాను శక్తిహీనం చేసి చూశారు. కొన్ని వారాలకు వాటి చర్మం మీద వార్ధక్యపు ముడతలు వచ్చేశాయి. జుట్టు రాలడం మొదలైంది. ఆ తర్వాత కొన్ని వారాలకు అవే ఎలుకల్లోని మైటోకాండ్రియాను క్రియాశీలం చేసి చూశారు. నెమ్మదిగా మళ్లీ జుట్టు రావడం మొదలైంది. చర్మం కూడా నున్నగా తయారైంది!! ఆశ్చర్యపోయారు. మనిషిలో కూడా మైటోకాండ్రియాను శక్తిమంతంగా ఉంచేందుకు జన్యు పరివర్తనను కట్టడి చేయగలిగితే.. వయసుని మళ్లీ వెనక్కి తెచ్చేసుకోవచ్చని శాస్త్రవేత్తల భావన. ఇది సాధ్యం అవొచ్చు. కాకపోవచ్చు. ఒక ప్రయత్నం అయితే జరిగింది. ఒకవేళ సాధ్యమే అయితే.. దీని పర్యవసానం ఏమిటన్నది ఏ ముందు తరాలకో తెలుస్తుంది. అప్పటికి మనం ఈ కాలాన్ని దాటిపోతాం. వెనక్కు రప్పించుకున్న వయసు సుఖవంతమైనా, దుఃఖభరితమైనా ఆ ముందు తరాలే పడతాయి. మనిషి మాటకు మాత్రం ఇంత ‘మహద్భాగ్యం’ ఉండకూడదనిపిస్తుంది. ఏదో అనేశాం. అన్నదాన్ని వెనక్కు తీసుకోలేం. అలాగని ముందుకు వెళ్లకుండా అన్నమాట దగ్గరే వెనకే ఉండిపోతే ఎలా? ‘సారీ’తో స్థిమితపడే దారి ఎలాగూ ఉంది. అదృష్టం ఏంటంటే.. ‘సారీ’ అనేది శాస్త్రవేత్తల బీకరుల్లో తయారయ్యే మాట కాదు. - మాధవ్ శింగరాజు -
నేను పుట్టింది నీ కోసం...
ఉర్దూ గజళ్లలో భాషా సౌందర్యం కవిత్వంతో పెనవేసుకుని ఉంటుంది. గాలిబ్ భాషా సౌందర్యాన్ని దాశరథి మాటల్లో చెప్పాలంటే, ‘ప్రతిదీ సులభమ్ముగా సాధ్యపడదులెమ్ము, నరుడు నరుడౌట యెంతొ దుష్కరమ్ము సుమ్ము’ వంటì ది. భాషలోని అతి లలిత పదాలని భావానికి తగినట్లుగా ఎన్నుకోవడమే గజల్ ప్రక్రియలోని ప్రతిభ. ప్రేయసి మీద విరహంతో తిరుగాడే ప్రేమికుల్ని గురించి ఒకే అక్షరాన్ని సైతం పదునుపెట్టిన బాణంలా వదలగలిగిన భాషా దురంధరుడు దాశరథి. గజల్ ప్రక్రియలో ‘షేర్’అనేది ముఖ్యం. రెండు పాదాలుండే షేర్ అంటే ‘పూలు’ అని అర్థం. అందుకే గులాబీపూవును దాశరథి ఈ పాటలో కవితా వస్తువుగా తీసుకున్నారు. అటువంటి ఒక అద్భుత గజల్‌ను తెలుగు సినిమాకు ఆయన రాయడం, ఆ గజల్‌ను హిందోళరాగంలో మా నాన్నగారు (మాస్టర్ వేణు) స్వరపరచి ఘంటసాలగారి మధురగళంలో రికార్డు చేయడం... అన్నింటికీ మించి ఎప్పుడూ మా నాన్నగారి రికార్డింగుకి వెళ్లని నేను ఆ పాట రికార్డింగుకు వెళ్లడం... అదే ఘంటసాలగారు పాటలు పాడిన చివరి సినిమా కావడం యాదృచ్ఛికం. ఘంటసాల గారు స్వయంగా మా ఇంటికి వచ్చి, నాన్నగారి దగ్గర కూర్చుని ఈ పాట నేర్చుకున్నారు. ఆ రోజులలో కమిట్మెంట్ అలా ఉండేది. ‘మధురమైన ఈ మంచి రేయిని వృథా చేయకే సిగ్గులతో’ అనే చరణంలో కాని, ‘మధువు పుట్టింది నా కోసం, నేను పుట్టింది నీ కోసం’ అనే చరణంలో కాని కొన్ని అన్య స్వరాలు అనివార్యమైనా, వాటి ఛాయలు కనపడనీయకుండా, ‘హిందోళ’ రాగంలో అద్భుతంగా స్వరపరచడం మాస్టర్వేణుగారి ప్రతిభకు తార్కాణం అని నేను భావిస్తాను. తెలుగు చలనచిత్రసీమకు పరిచయం కాని తొలిరోజుల్లో బొంబాయిలో మేస్ట్రో నౌషాద్ అలీ వద్ద గడపడం, బేగమ్ అఖ్తర్, మెహదీ హసన్‌ల గజల్ ప్రక్రియలను దగ్గరగా పరిశీలించడం నాన్నగారికి గజల్ ప్రక్రియ మీద మోజును పెంచింది. తెలుగులో గజళ్లు వినిపించగలిగే అవకాశం వారికి రాలేదు. యువ నిర్మాతలు మహమ్మద్ రంజాన్ అలీ, మహమ్మద్ ఖమరుద్దీన్లు హాస్యనటుడు పద్మనాభం దర్శకత్వంలో నిర్మించిన ‘మా ఇంటి దేవత’ చిత్రంతో ఆ ఆశ తీరింది. దురదృష్టవశాత్తు ఈ చిత్ర నిర్మాణం ఒడిదొడుకులకు లోనైంది. 1973లో మొదలుపెట్టిన సినిమా 1980 దాకా విడుదలకు నోచుకోలేదు. ఘంటసాల 1974లో కాలం చేసిన తరవాత ఆరేళ్లకు గానీ ఈ సినిమా విడుదల కాలేదు. కలర్ సినిమాలు ఊపందుకున్న తరవాత ఈ సినిమా విడుదల కావడంతో దీనికి గుర్తింపు రాలేదు. ఇది హిందీ సినిమా కాజల్‌కు రీమేక్. దాశరథి రచించిన ఈ పాటలో పల్లవితోనే అడుగడుగునా మీర్జాగాలిబ్ కళ్లలో మెదలుతాడు. ‘విందులు చేసే నీ అందాలు నా మదిలోనే చిందాలి’ అంటూనే ‘నీ లేత గులాబీ పెదవులతో కమ్మని మధువును తాకాలి’ అంటాడు. కానీ ‘తాగాలి’ అనడు. అదే దాశరథి సున్నితమైన కవితా దృక్కోణం. ‘చంద్రుని ముందర తార వలె నా సందిట నీవే వుండాలి’ అంటూ ‘ఈ మధువంతా నీ కోసం, పెదవుల మధువే నా కోసం’ అని మధువును, మగువను ఏకదృష్టితో సంబోధిస్తాడు. ఇటువంటి అద్భుత రచనకు సంగీతం నిర్వహించే అదృష్టం నాన్నగారికి దక్కడం అదృష్టమే. నిర్మాతలు ఉర్దూ సంప్రదాయాలు తెలిసినవారు కావడం, గజల్ సంస్కృతి మీద మక్కువ వుండడం ఈ పాట సృష్టికి దోహదం చేసిన అంశాలు. మరో చరణంలో ‘మధువు పుట్టింది నా కోసం, నేను పుట్టింది నీకోసం’ అంటారు దాశరథి. ఇది ఒక అద్భుతమైన పోలిక. అందుకే గజల్ భాషా సంపద గొప్పది. అటువంటి పాట తెలుగులో రాసిన దాశరథి కూడా గొప్పవారు. అంతటి గొప్ప పాటకు స్వరపరచిన మా నాన్నగారు అదృష్టవంతులు. అందుకే ఈ పాట నాకు చాలా ఇష్టమైనది. సినిమా విజయవంతం కాకపోవడంతో ఈ పాట మరుగున పడిన మణిపూసైపోయింది. ఈ చిత్రానికి నిర్మాతలు రిజిస్టర్ చేసిన అసలు పేరు ‘కంటికి కాటుక – ఇంటికి ఇల్లాలు’. విడుదల ఆలస్యం కావడం వలన దానిపేరు ‘మా ఇంటి దేవత’ గా మారిపోయింది. కృష్ణ నటించిన ఆఖరి బ్లాక్ అండ్ వైట్ చిత్రమిది. హరనాథ్ తను కోల్పోయిన స్టార్‌డమ్‌ను తిరిగి సాధించేందుకు హాస్యనటుడు పద్మనాభం, కృష్ణ, జమునల సహకారంతో నిర్మాతలు వెనక ఉండి నటించిన చిత్రం. జాతీయాలు ఉంగరాల చేతి మొట్టికాయ ఎవరైనా పిడికిలి బిగించి నెత్తి మీద లాగిపెట్టి మొట్టికాయ వేస్తే నొప్పి పుడుతుంది. మామూలు చేతి మొట్టికాయకే అంత నొప్పి పుడితే, అలాంటిది వేళ్ల నిండా ఉంగరాలు తగిలించుకున్న ధన మదాంధుడెవడైనా కసిదీరా మొట్టికాయ వేశాడనుకోండి ఆ దెబ్బకి ఎలాంటి వాళ్లకైనా కళ్లు బైర్లు కమ్ముతాయి. ఉంగరాల తాకిడికి నెత్తి బొప్పి కడుతుంది. సాదాసీదా మనుషులు ఎవరైనా ధనబలం, అధికార బలం గల వారితో అనవసర వైరం పెట్టుకుని, వాళ్ల ద్వారా కీడు కొని తెచ్చుకునే సందర్భాల్లో ఉంగరాల చేతి మొట్టికాయలు తిన్నారనడం పరిపాటి. ఐదు పది చేయడం ఐదు పది చేయడమంటే ఐదో ఎక్కం చదవడం కాదు. ఒక్కో చేతికి ఐదు వేళ్లు ఉంటాయి. రెండు చేతులూ జోడిస్తే రెండు చేతుల వేళ్లూ కలిపి పది వేళ్లవుతాయి. ఇలా రెండు చేతులూ జోడించడాన్నే ఐదు పది చేయడం అంటారు. గౌరవంతోనో, భక్తి ప్రపత్తులతోనో చేతులు జోడించే సందర్భాల్లో ఈ మాట అనరు. ప్రత్యర్థి బలవంతుడైనప్పుడు, అధికార నిరంకుశుడైనప్పుడు వానితో తలపడటం సాధ్యం కాదని తలచినప్పుడు, లొంగుబాటే శరణ్యమనే పరిస్థితుల్లో చేతులు జోడించినప్పుడే ఐదు పది చేశాడంటారు. కాకదంతపరీక్ష కాకులకు దంతాలు ఉండవు. లేని దంతాలను పరీక్షించాల్సిన అగత్యం కూడా ఎవరికీ ఉండదు. అయితే, తమను తాము మేధావులుగా తలచే కొందరు ఏమీ లేని విషయమై గంభీర పరిశోధనలు సాగిస్తుంటారు. ఫలితమివ్వని పరీక్షలు చేస్తూ అనవసరంగా ప్రయాస పడుతూ అందరిలో నవ్వుల పాలవుతుంటారు. పనికి మాలిన విషయమై ఎవరైనా గంభీరంగా పరీక్షలు, పరిశోధనలు చేస్తున్నట్లు కనిపిస్తే, అలాంటి వాళ్లను కాకదంత పరీక్షలు చేస్తున్నారంటూ ఎద్దేవా చేస్తుంటారు. – సంభాషణ: డా. పురాణపండ వైజయంతి -
చెత్త పుస్తకం
శుభశ్రీ పరమేశ్వరన్ ఇంజనీరింగ్ చదివారు. ఐటీ రంగంలో పది సంవత్సరాలు పనిచేశారు. ‘లెట్స్ టాక్ ట్రాష్’ పుస్తకం ద్వారా జీరో వేస్ట్ గురించి ప్రచారం చేస్తున్నారు. వృథాను అరికట్టడానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా ప్రవర్తించాలని ఆచరణ ద్వారా చూపుతున్నారు. ‘‘మనమంతా పరిశుభ్రమైన వాతావరణంలో ఆరోగ్యంగా జీవించడానికి అనుసరించవలసిన మార్గాలను అందరికీ తెలియచేయాలని సంకల్పించాను. బొమ్మల ద్వారా తేలికగా అర్థం చేసుకోగలుగుతారని భావించాను. చిన్న చిన్న బొమ్మలు వేసి, వాటి కిందే ఆ బొమ్మలకు సంబంధించిన సందేశం రాసి, పుస్తకంగా తయారు చేశాను’’ అన్నారు శుభశ్రీ సంగమేశ్వర. రెండేళ్లుగా బొమ్మల సందేశం బెంగళూరుకు చెందిన శుభశ్రీ రెండు సంవత్సరాల క్రితం ఉద్యోగరీత్యా హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డారు. మన ముందు ముందుతరాల వారు ఏయే మార్గాల ద్వారా చెత్తను తగ్గించేవారో బొమ్మల ద్వారా చూపుతున్నారు ఆమె. ‘లెట్స్ టాక్ ట్రాష్’ అనే తన పుస్తకంలోని బొమ్మల్ని, సందేశాలను పిల్లలకు, పెద్దలకు అందరికీ అర్థమయ్యే రీతిలో వేశారు శుభశ్రీ. ‘‘నేను బి.టెక్ పూర్తి చేశాక, ఐటీ శాఖలో దశాబ్దకాలం పనిచేశాను. ఇంత చదువుకుని, యాంత్రికంగా జీవించడం నాకు నచ్చలేదు. నా వల్ల సమాజానికి ఎంతో కొంత ఉపయోగం ఉండాలని భావించాను. ‘జీరో వేస్ట్’ గురించి ప్రచారం చేయాలని నిశ్చయించుకున్నాను. ఇందుకు సంబంధించి రెండు సంవత్సరాలుగా బొమ్మలు వేయడం ప్రారంభించాను’’ అని చెప్పారు శుభశ్రీ. అందులో ఆమె వృథాను అరికట్టేందుకు ప్రతిరోజూ తనకు వచ్చే చిన్న చిన్న ఆలోచనలను బొమ్మలుగా వేశారు సీసాల్లో తెచ్చుకునేవారు ఈ పుస్తకం ద్వారా తాను పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలని కాని, తనను తాను ప్రదర్శించుకోవాలని కాని అనుకోవట్లేదంటారు శుభశ్రీ. ‘‘సుమారు ముప్పై సంవత్సరాల క్రితం వరకు ప్రతి ఇల్లు జీరో వేస్ట్‌గా ఉండేది. అంటే.. వీసమెత్తు కూడా వృథా ఉండేది కాదు. ఈ విషయం నేటితరం వారికి తెలియకపోవచ్చు కాని, నాటితరం పెద్దవాళ్లకి బాగా తెలిసి ఉంటుంది. పాలను గాజు సీసాలలో అమ్మేవారు. మన దగ్గర ఉండే ఖాళీ సీసాలను పాల కేంద్రంలో ఇచ్చి, అక్కడి నుంచి నిండు సీసాలు తెచ్చుకునేవారు. ప్లాస్టిక్ బ్యాగులలో చెత్తను తీసుకువెళ్లడమనేది ఆ రోజుల్లో ఎవ్వరికీ తెలియదు. ఏ ఇంట్లోనూ బయట పడేసేంత చెత్త కనిపించేది కాదు. మార్కెట్‌కి వెళ్లేటప్పుడు వారి వెంట సంచి తప్పనిసరిగా ఉండేది. ప్లాస్టిక్ కవర్లు కనిపించేవి కాదు. ఆ రోజుల్లో జీవన విధానం అంత శుభ్రంగా ఉండేది’’ అంటారు శుభశ్రీ. ఏదీ వృథా అయ్యేది కాదు గతంలో వస్త్రాలతో చేసిన సంచీలు, మళ్లీమళ్లీ వాడుకునేలాంటి వస్తువులనే ఎక్కువగా ఉపయోగించేవారు. గాజు సీసాలలో, స్టీలు పాత్రలలో వస్తువులను నిల్వ చేసుకునేవారు. పాతబడిపోయిన వస్త్రాలను ఇల్లు శుభ్రం చేయడానికి వినియోగించేవారు. బొగ్గులు కాలిన బూడిదతో గిన్నెలు తోముకునేవారు. వేప పుల్లలతో పళ్లు తోముకునేవారు. వాడకానికి పనికిరావు అనుకునే వస్తువులను మాత్రమే బయట పడేసేవారు. ఇంత పద్ధతిగా మన పూర్వీకులు జీరో వేస్ట్ జీవితాలను గడిపారు.. అంటూ తను గతంలో అమ్మమ్మల ఇంట్లో చూసిన విశేషాల గురించి చెప్పారు శుభశ్రీ. ‘చెత్త’గా మారిపోయాం రోజులు మారాయి. ఇళ్లన్నీ ప్లాస్టిక్ వస్తువులతో నిండిపోతున్నాయి. ఒక్క ఫోన్ కాల్ లేదా ఒక్క యాప్ ద్వారా ప్లాస్టిక్ కవర్లలో భోజనం ఇంటికి వస్తోంది. భోజనం పూర్తయ్యాక అన్ని కవర్లను బయట పడేస్తున్నారు. ప్రస్తుతం పట్టణాలలో ప్రతి మనిషి రోజుకి ఒకటిన్నర కిలోల చెత్తను బయటపడేస్తున్నారని సర్వేలు చెబుతున్నాయి. దీని గురించే చెబుతూ‘‘పది లక్షల జనాభా ఉన్న పెద్ద నగరాలలోని విషయం ఇది. చెత్త పెరగకుండా నియంత్రించడంలో నగరాలు చురుకుగా వ్యవహరించడం లేదు. వాతావరణం కలుషితమవడం గురించి అందరూ బాధ్యతగా ఆలోచించాలి’’ అంటున్న శుభశ్రీ... భూమిని కాపాడటానికి తనవంతు బాధ్యతగా ‘లెట్స్ టాక్ ట్రాష్’ తో తొలి అడుగు వేశారు. పాత పద్ధతులే ఆరోగ్యం ‘‘చిన్నప్పటి నుంచి మా అమ్మ, అమ్మమ్మ వాళ్లు ‘జీరో వేస్ట్’తో ఎంత సాధారణ జీవితాన్ని గడిపేవారో గమనించాను. స్టీలు క్యానుల్లో నూనె తెచ్చేవారు. పాత హార్లిక్స్ సీసాలు, బోర్న్‌విటా సీసాలను సరుకులు వేయడానికి ఉపయోగించేవారు. ఆ సీసాలు సుమారు 40 సంవత్సరాలుగా ఇంట్లో ఉండటం గమనించాను. ఆ పద్ధతులనే ఈ తరం వారు కూడా అనుసరించి పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి’’ అంటున్నారు శుభశ్రీ. అమెరికన్ సింగర్ లారెన్ నిర్వహిస్తున్న బ్లాగ్‌ను రెండు సంవత్సరాలుగా ఫాలో అవుతున్నారు శుభశ్రీ. ‘‘లారెన్, బెన్ జాన్సన్‌ల నుంచి ప్రేరణ పొందాను’’ అంటున్న శుభశ్రీ, తన ప్రణాళికకు ‘‘స్కెచ్ బుక్ ప్రాజెక్ట్’’ విధానం అనుసరిస్తున్నారు. ‘‘జీరో వేస్ట్‌ను ప్రతిబింబించేలా క్యారికేచర్లు వేయడం ద్వారా ప్రజలలో చైతన్యం తీసుకురావొచ్చనే ఉద్దేశంతో ఈ విధానం ఎంచుకున్నాను’’ అంటున్నారు. – వైజయంతి పురాణపండ మూడు సూత్రాలు ప్లాస్టిక్ సీసాలలో నీళ్లు తాగడం మానేయాలి, ప్లాస్టిక్ స్ట్రాలు నిషేధించాలి, ప్లాస్టిక్ బ్యాగులను తిరస్కరించాలి. బాత్రూమ్, కిచెన్, వార్డ్రోబ్ వంటి ప్రదేశాలలో ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయం చూడాలి. ప్రయాణాలలో పసిపిల్లలకు సంబంధించిన వస్తువులను కూడా జీరో వేస్ట్‌గా చూసుకోవాలి. ముఖ్యంగా డిస్పోజబుల్ డయాపర్స్, ప్లాస్టిక్ బొమ్మలను నివారించాలి. మా అమ్మాయి కూడా..! నా వరకు నేను వేస్ట్‌ను బాగా తగ్గిస్తున్నాను. ఇంటికి ఏ ప్లాస్టిక్ వస్తువు తేవాలన్నా బాగా ఆలోచిస్తాను. స్ట్రాలు, ప్లాస్టిక్ కవర్లు తీసుకోను, బిస్కెట్లు, చిప్స్ వంటివి అస్సలు కొనను. ఎక్కడకు వెళ్లినా నా వెంట వాటర్ బాటిల్ ఉంటుంది. ప్రయాణాల్లో నా పరంగా ఎక్కువ చెత్త రాకుండా జాగ్రత్తపడుతున్నాను. మా నాలుగేళ్ల అమ్మాయి కూడా నన్ను అనుసరిస్తోంది. -
మొక్కల వ్యర్థాలతో ప్లాస్టిక్, నైలాన్!
వృధాగా పడేసే మొక్కల వ్యర్థాల నుంచి విలువైన ప్లాస్టిక్, నైలాన్, జీవ ఇంధనాల తయారీకి ఉపయోగపడే ఎంజైమ్‌లను అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం ఒకటి గుర్తించింది. యునైటెడ్ కింగ్డమ్తో పాటు అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు మొక్కల్లో ప్రధాన భాగమైన లిగ్నెన్లపై పరిశోధనలు చేస్తున్నారు. కేవలం కొన్ని బ్యాక్టీరియా, ఫంగస్ల ద్వారా మాత్రమే నాశనమయ్యే ఈ లిగ్నెన్లలో మనకు ఉపయోగపడే అనేక రసాయనాలు ఉన్నాయి కాని వీటిని సమర్థంగా విడగొట్టడం మాత్రం ఇప్పటివరకూ సాధ్యం కాలేదు. తాజాగా ఓ వినూత్నమైన పద్ధతి సాయంతో ప్రొఫెసర్ మెక్‌గీహన్ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం దీన్ని సాధ్యం చేసింది. ఈ క్రమంలో లిగ్నెన్లో ఉండే కొన్ని ఎంజైమ్లతో జీవ సంబంధిత పాలిమర్లు అంటే నైలాన్, ప్లాస్టిక్ వంటివి తయారు చేసేందుకు పనికొస్తాయని వీరు గుర్తించారు. దీంతో ఇప్పటివరకూ వ్యర్థంగా పడేస్తున్న లిగ్నెన్లతో విలువైన పదార్థాలను తయారు చేయవచ్చునని స్పష్టమైంది. ముడిచమురుపై ఆధారపడకుండా సహజసిద్ధంగా నశించిపోగల ఈ తరహా ప్లాస్టిక్, నైలాన్లతో పర్యావరణానికి కూడా మేలు జరుగుతుందని మెక్‌గీహన్ అంటున్నారు. సైటోక్రోమ్ పీ450 అనే ఈ ఎంజైమ్‌లు చాలారకాల మూలకాలతో సులువుగా కలిసిపోగలవని, ఫలితంగా కొన్ని కొత్త కొత్త పదార్థాలను తయారుచేయడం వీలవుతుందని అంచనా. మరిన్ని పరిశోధనల ద్వారా ఈ ఎంజైమ్‌తో మరింత వేగంగా చర్యలు జరిపించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. -
అమెరికాలో ఆహార వృథా ఇంతింత కాదు!
అన్నం పరబ్రహ్మ స్వరూపమనే భావన మనది. కానీ అమెరికాలో పరిస్థితి మాత్రం చాలా భిన్నమని ఇటీవల జరిగిన ఒక అధ్యయనం స్పష్టం చేస్తోంది. వెర్మోంట్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు 2007 – 2014 మధ్య కాలంలో అమెరికా మొత్తం మీద రోజూ 1.5 లక్షల టన్నుల ఆహారం వృథా అవుతున్నట్లు గుర్తించింది. ఈ లెక్కన చూస్తే అమెరికాలోని ప్రతి వ్యక్తి రోజూ అర కిలో వరకూ వృథా చేస్తున్నారన్నమాట. ఇంత భారీ మొత్తంలో ఆహారం పండించాలంటే కనీసం మూడు కోట్ల ఎకరాల భూమి అవసరమవుతుందని, 420 లక్షల కోట్ల లీటర్ల సాగునీరు ఉపయోగించాల్సి ఉంటుందని లెక్కకట్టింది. ప్ల్లస్ వన్ జర్నల్‌లో ప్రచురితమైన ఈ అధ్యయనం ప్రకారం అమెరికన్లు వృథా చేసే ఆహారంతో 32 కోట్ల మంది కడుపు నింపవచ్చు. ఆరోగ్యం కోసం రకరకాల పండ్లు, కాయగూరలు తినే నెపంతోనూ వృథా పెరుగుతోందని చెబుతున్నారు. సూపర్ మార్కెట్లలో కాయగూరలు, పండ్లన్నీ ఒకే సైజు, రంగులో ఉండేలా చేసేందుకు కొంచెం అటుఇటుగా ఉండే వాటిని చెత్తబుట్టలోకి చేర్చేస్తున్నారని, ఈ విషయంలో ప్రజలలో అవగాహన పెంచాల్సిన అవసరముందంటున్నారు. నాణ్యమైన ఆహారం కోసం జరుగుతున్న వృథాను అంచనా వేసేందుకు వెర్మోంట్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు, అమెరికా వ్యవసాయ శాఖ ‘వాట్ వీ ఈట్ ఇన్ అమెరికా’ పేరుతో అధ్యయనం చేపట్టింది. 2015లో సేకరించిన వివరాల ఆధారంగా ఆహార వృథాపై మదింపు చేసినట్లు అంచనా. -
వంద దేశాలకెళ్లిన వేస్ట్ డీ కంపోజర్!
వంద దేశాల్లో సేంద్రియ వ్యవసాయ విస్తరణకు ఇతోధికంగా దోహదపడుతున్న వేస్ట్ డీ కంపోజర్ ద్రావణంపై ఎటువంటి అపోహలకూ తావీయవద్దని కేంద్ర వ్యవసాయ శాఖకు అనుబంధంగా ఉన్న జాతీయ సేంద్రియ వ్యవసాయ కేంద్రం(ఎన్.సి.ఓ.ఎఫ్.) సంచాలకులు డాక్టర్ క్రిషన్ చంద్ర రైతులకు సూచించారు. ఏకలవ్య ఫౌండేషన్, అక్షయ్ కృషి పరివార్‌లతో కలసి హైదరాబాద్‌లోని ఐఐసీటీ ఆవరణలో ఈ నెల 24, 25 తేదీల్లో ‘భూమి సుపోషణ’ ఆవశ్యకతపై నిర్వహించిన కార్యశాలలో ఆదివారం ఆయన పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. తదనంతరం ‘సాక్షి సాగుబడి’తో మాట్లాడుతూ వేస్ట్ డీ కంపోజర్‌పై రైతులకు ఎటువంటి అపోహలూ అవసరం లేదన్నారు. వేస్ట్ డీ కంపోజర్‌ను వాడొద్దని పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయ పితామహుడు సుభాష్ పాలేకర్ ఇటీవల సోషల్ మీడియా ద్వారా రైతులకు సందేశాలను పంపారు. దీనిపై డా. క్రిషన్ చంద్ర స్పందిస్తూ.. ‘వేస్ట్ డీ కంపోజర్‌ను మన దేశంలో 30–40 లక్షల మంది సేంద్రియ వ్యవసాయదారులతోపాటు వందకు పైగా దేశాల్లో సైతం రైతులు వాడుతున్నారు. భూసారం పెరుగుతోంది. తక్కువ ఖర్చుతో, తక్కువ శ్రమతో రైతులు అధిక దిగుబడులు పొందగలుగుతున్నారు. ఫలితాలు రాలేదని ఏ ఒక్క రైతూ చెప్పలేదు. అయినా, కొందరు తప్పుడు అభిప్రాయాలను ప్రచారం చేస్తుండటం దురదృష్టకరం. పదేళ్లుగా జీవామృతం, పంచగవ్య వాడుతున్న రైతులు కూడా వేస్ట్ డీ కంపోజర్‌తో చాలా సంతృప్తిగా ఉన్నారు.. సేంద్రియ/ప్రకృతి వ్యవసాయంలో రకరకాల పేర్లతో 19 పద్ధతులు చలామణిలో ఉండటం వల్ల గందరగోళం నెలకొంది. పద్ధతి ఏదైనా ఆవు మూత్రం, పేడ, పప్పుధాన్యాల పిండి, బెల్లం తదితరాలతోనే ఉత్పాదకాలను తయారు చేసుకుంటున్నారు. జీవామృతం, పంచగవ్య వాడినప్పుడు పొలంలో పంట/పశువుల వ్యర్థాలను, ఆకులు, అలములను కుళ్లబెట్టే ప్రక్రియే చోటు చేసుకుంటుంది. పూర్తి ఫలితాలు రాబట్టుకోవడానికి రైతులు ఆరు నెలలు వేచి ఉండాల్సి వస్తున్నది. ఆవు పేడ నుంచే సంగ్రహించిన ఎంజైమ్లతో తయారైన వేస్ట్ డీ కంపోజర్ వాడితే 40 రోజుల్లోనే కుళ్లబెట్టే ప్రక్రియ పూర్తవుతూ వేగంగా పంటలకు పోషకాలు అందుబాటులోకి వచ్చి దిగుబడులు పెరుగుతున్నాయి. జీవామృతం తయారు చేసిన డ్రమ్ముల్లో అడుగున 13–14 కిలోల వ్యర్థాలు కుళ్లకుండా మిగిలే ఉంటున్నాయి. జీవామృతం తయారీలో నీటికి బదులుగా వేస్ట్ డీ కంపోజర్ ద్రావణాన్ని వాడితే.. వ్యర్థాలు 2 కిలోలకు మించి మిగలవు. వడకట్టుకోవడం కూడా సులభమవుతుంది. కూలీల కొరతతో సతమతమవుతున్న రైతులకు వేస్ట్ డీ కంపోజర్ సంజీవనిలా ఉపకరిస్తున్నది’ అన్నారు. గడ్డీ గాదాన్ని వేస్ట్ డీ కంపోజర్ అతివేగంగా కుళ్లబెట్టేయడం వల్ల సమస్యలు వస్తాయి కదా అన్న ప్రశ్నకు బదులిస్తూ.. ఎక్కువ ఆకులు, పంట వ్యర్థాలను, పశువుల పచ్చి పేడను సైతం ఆచ్ఛాదనగా వేయాలని తామూ రైతులకు చెబుతున్నామన్నారు. సదస్సు నేడు: కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరు గ్రామంలోని స్వర్ణభారత్ ట్రస్టు ఆడిటోరియంలో ఈనెల 27న ఉదయం 10 గంటలకు వేస్ట్ డీ కంపోజర్‌ను ఉపయోగించే పద్ధతులపై ఉచిత రైతు సదస్సు జరగనుంది. డా. క్రిషన్ చంద్ర, డా. ప్రవీణ్‌కుమార్ ముఖ్య వక్తలు. వివరాలకు.. 94902 35031, 91003 07308, 91003 07308, 95428 62345. -
బాబుపై మరో బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు
గుంటూరు : టీడీపీ నాయకులపై బీజేపీ నేతల మాటల దాడి కొనసాగుతోంది. తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపైనే బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. గుంటూరులో విలేకరులతో మాట్లాడుతూ.. టీడీపీ నేతలు ప్రత్యేక విమానాల్లో తిరుగుతూ వృధా ఖర్చులు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని మరింతగా అప్పులపాలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. రాజధాని కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 2,500 కోట్లు ఇచ్చినా చిన్న నిర్మాణం కూడా మొదలు పెట్టలేదని విరుచుకుపడ్డారు. ఇచ్చిన సొమ్ముకు లెక్కా, పత్రాలు లేవని, కనీసం డీపీఆర్ ఇవ్వకుండా నిధులు ఇవ్వమంటే ఎలా ఇస్తారని ప్రశ్నించారు. సినిమా డైరెక్టర్లతో డిజైన్లు వేయించడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. ఇదివరకే బీజేపీ నేత సోము వీర్రాజు టీడీపీ అక్రమాలపై బహిరంగా విమర్శలు చేసిన సంగతి తెల్సిందే. తాజాగా కన్నా లక్ష్మీనారాయణ కూడా చేరడంతో టీడీపీ నేతలకు ఏంచేయాలో తోచడం లేదు. -
ఒక్క పరిశ్రమనూ తేలేని దద్దమ్మ బాబు
చిత్తూరు: చిత్తూరు జిల్లాలో పుట్టి ఈ జిల్లాకు ఒక్క పరిశ్రమ తేలేని దద్దమ్మ చంద్రబాబు అని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా ధ్వజమెత్తారు. సొంత జిల్లాను పట్టించుకోని ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఏం చేస్తాడని ప్రశ్నించారు. శుక్రవారం ఇక్కడ విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో విజయం వైసీపీదేనని స్పష్టం చేశారు. రాష్ట్రంలో మోసపూరిత పాలన జరుగుతోందని, నిరుద్యోగులకు భృతి ఇస్తామని చెప్పి చంద్రబాబు మోసం చేశారని, ప్రత్యేక హోదా తీసుకురాలేక కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారని విమర్శించారు. ఓటుకు నోటు కేసులో తప్పించుకునేందుకు ఏపీని బాబు తాకట్టు పెట్టాడన్నారు. రాష్ట్రంలో జన్మభూమి కార్యక్రమాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారన్నారు. జయంతికి, వర్ధంతికి తేడా తెలీని పప్పుకి మంత్రి పదవి ఇచ్చారని ఎద్దేవా చేశారు. సోది సోమిరెడ్డి, కలెక్షన్ కింగ్ నారాయణలు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు.. దొడ్డిదారిలో మంత్రులైన వీరు పార్టీకి పెట్టిన పెట్టుబడులను ప్రజల నుంచి తిరిగి దోచుకుంటున్నారని ఆరోపించారు. నారాయణ విద్యాసంస్థల్లో విద్యార్థుల ఆత్మహత్యలు దారుణమని, వీరిపై కేసులు నమోదు చేయకుండా పోలీసులు అమ్ముడుపోతున్నారని అన్నారు. క్షుద్రపూజలు చేసి మళ్ళీ గెలవాలని చూస్తే ప్రజలు ఒప్పుకోరని చంద్రబాబును రోజా హెచ్చరించారు. -
ఎవరిదీ పాపం
- రసాయనిక వ్యర్థాల ఫలితం ... బాలికకు శాపం - వేలల్లో వైద్య ఖర్చులు ... ముందుకు రాని యాజమాన్యాలు - అభం,శుభం తెలియని చిన్నారి నరకయాతన కాళ్లు కాలుస్తున్న కెమికల్ వ్యర్థాలు బీచ్ రోడ్డుపై యథేచ్ఛగా డంపింగ్ అనారోగ్యాల బారిన ప్రజలు చోద్యం చూస్తున్న అధికారులు ఎవరో చేసిన నిర్లక్ష్య వ్యవహారానికి పన్నెండేళ్ల బాలిక నరక యాతన అనుభవిస్తోంది. పారిశ్రామిక వ్యర్థాలను తిరుగాడే ప్రదేశాల్లో పారబోయడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కాకినాడ బీచ్ రోడ్డులో సూర్యారావు పేట సమీపంలో ఉండే రెండు రసాయనిక పరిశ్రమలు తమ వ్యర్థాలను ఆరుబయటే పారేస్తుండడం ఎప్పటినుంచో జరుగుతోంది. ఈ నెల 8వ తేదీన తన స్నేహితులతో అటుగా వెళ్లిన ఈ బాలిక రెండు కాళ్లు కాలిపోయాయి. ఏదో చిన్నదేలా అనుకునే సమయంలోనే మోకాలి వరకు బొబ్బలెక్కడంతో ఆసుపత్రిలో చేర్చారు. ఇప్పటి వరకు సంబంధిత యాజమాన్యం బాధ్యత తీసుకోలేదు. వైద్య ఖర్చుల కోసం వేల రూపాయలవుతోందని...పేద కుటుంబం ... ఎలా ముందుకు సాగేదని వాపోతోంది ఆ బాలిక తల్లిదండ్రులు. సూర్యారావుపేట (కాకినాడ రూరల్) : పారిశ్రామిక, ఆయిల్ రిఫైనరీల వ్యర్థాలను నిర్వాహకులు బీచ్ రోడ్డులో డంపింగ్ చేయడంతో ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారు. ఒక పక్క పరిశ్రమల నుంచి విడుదలవుతున్న కాలుష్యంతో తీరప్రాంత గ్రామాల ప్రజలు కాలుష్య కోరల్లో చిక్కుకుపోతుంటే మరో పక్క కెమికల్ వ్యర్థాలను బీచ్‌రోడ్డు, ఖాళీగా ఉన్న నివాస స్థలాల వద్ద పారవేయడంతో రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నారు. భద్రతా ప్రమాణాలు పాటించని కంపెనీలపై చర్యలు తీసుకోవాల్సిన పొల్యూషన్ అధికారులు చోద్యం చూస్తున్నారు. డంపింగ్ యార్డుగా బీచ్‌రోడ్డు.. కాకినాడ రూరల్ మండల పరిధిలోని తీరప్రాంత గ్రామం సూర్యారావుపేటలో సుమారు 5,600 మంది జనాభా నివసిస్తున్నారు. ఇక్కడ నివసించేవారందరూ మత్స్యకారులు. పారిశ్రామికాభివృద్ధిలో భాగంగా ప్రభుత్వం తీరప్రాంతానికి ఆనుకుని సూర్యారావుపేట, వాకలపూడి, పెనుమర్తి పంచాయతీల పరిధిలో తీరానికి ఆనుకుని సుమారు 18 ఆయిల్ రిఫైనరీ ఫ్యాక్టరీలు, క్రూడ్ ఆయిల్ మరిగిస్తున్న ఫ్యాక్టరీ, చక్కెర తయారు చేస్తున్న ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఇందులో ఆయిల్ రిఫైనరీ, క్రూడాయిల్ మరిగించడానికి, ఘగర్ తయారు చేసిన తర్వాత వచ్చిన కెమికల్ వ్యర్థాలను ఫ్యాక్టరీలు నిబంధనల మేరకు నిల్వ చేయకుండా, నేరుగా కెమికల్ వ్యర్థాలను ట్యాంకర్ల ద్వారా తీసుకొచ్చి బీచ్‌రోడ్డులో ఆరుబయట పారబోయిస్తున్నారు. ముఖ్యంగా బీచ్‌లో ఖాళీగా ఉన్న ప్రదేశాలు పోలవరం, నేమాం, సూర్యారావుపేట, శివాలయం, సూర్యారావుపేట లైట్ హౌస్ సమీపాన రాత్రి, తెల్లవారుజామున స్థానికుల సంచారం లేని సమయాల్లో వ్యర్థాలను తీసుకువచ్చి పారబోస్తున్నారు. దీంతో బీచ్‌రోడ్డులో రాకపోకలు సాగించే సమయంలో వ్యర్థాల నుంచి వస్తున్న ధూళి, దుర్వాసనకు అనారోగ్యాల బారిన పడుతున్నారు. రోడ్డుకు అడ్డంగా వేస్తున్న వ్యర్థాలపై మోటార్‌బైక్‌లపై వెళ్తున్న ప్రజలు జారిపోయి ప్రమాదాల బారిన పడుతున్నారు. ఈ విషయమై అధికారులకు ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఘగర్ వ్యర్థాలతో ప్రమాదాలు.. ఘగర్ వ్యర్థాలతో వాహనచోదకులు రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారు. ఘగర్ నుంచి వచ్చిన వ్యర్థ ఊటను నిర్వాహకులు ట్యాంకర్లతో తీసుకొచ్చి బీచ్‌రోడ్డు, నేమాం, పోలవరం రహదారులపై పారబోస్తున్నారు. నాలుగు రోజుల క్రితం పోలవరం, నేమాంలకు చెందిన ప్రయాణీకులు బైక్‌పై నుంచి జారి పడిన ఘటనలో ముగ్గురు గాయాలబారిన పడ్డారు. పి.రమేష్,పోలవరం. కాళ్లు కాలిపోతున్నాయి. పరిశ్రమల నుంచి వచ్చే కెమికల్ వ్యర్థాలను ప్యాక్టరీలో నిల్వ చేయకుండా, ట్యాంకర్లతో బయటకు తీసుకొచ్చి బీచ్‌రోడ్డు, ఖాళీస్థలాల్లో పారబోస్తున్నారు. కంపెనీ నిర్వాహకులు స్థానికుల కంట పడకుండా తెల్లవారుజాము సమయంలో కెమికల్ వ్యర్థాలను ట్యాంకర్లతో తీసుకొచ్చి లైట్‌హౌస్ సమీపాన ఖాళీ స్థలంలో వేస్తున్నారు. బూడిద, మట్టి రంగులో ఉంటున్న రసాయన వ్యర్థాల్లో పొరపాటున నడిస్తే కాళ్లు కాలిపోయి, చర్మం అంతా ఎలర్జీ వస్తోంది. ఎస్.సత్తిబాబు, తమ్మవరం. నా కుమార్తె రెండు కాళ్లు కాలిపోయాయి నాకుమార్తె మరియ స్నేహితులతో కలసి బయటకు వెళుతున్న సమయంలో బూడిద రంగులో ఉన్న మట్టిలో నడవడంతో రెండు కాళ్లూ తీవ్రంగా కాలిపోయాయి. చికిత్స కోసం ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించగా రూ.30 వేలు వ్యయమవుతాయని వైద్యులు తెలిపారు. కెమికల్ వ్యర్థాలు ఇక్కడ వేయకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలి. మర్రి శ్రీను, బాధితురాలి తండ్రి, సూర్యారావుపేట. ఘగర్ వ్యర్థాలతో ప్రమాదాలకు గురవుతున్నాం ఘగర్ కంపెనీ నిర్వాహకులు ఘగర్ కోసం వినియోగించిన వ్యర్థాలను తీసుకొచ్చి నేమాం–పోలవరం రోడ్డు వేసేస్తున్నారు. ఘగర్ నుంచి వచ్చిన నూనెలా ఉన్న మడ్డును తీసుకొచ్చి రోడ్డుపై పారబోయడం వల్ల తెల్లవారుజామున బైక్‌లపై వెళ్తున్నవారు జారిపోయి కిందపడడం వల్ల నలుగురు వాహనచోదకులు గాయాలతో ఆస్పత్రి పాలయ్యారు. ఈ విషయమై అధికారులు తగిన చర్యలు తీసుకోవాలి. ఎం.రమణ, తమ్మవరం. విచారణ నిర్వహించి తగిన చర్యలు తీసుకుంటా కెమికల్ వ్యర్థాలను బీచ్‌రోడ్డులో పారబోయడంపై విచారణ నిర్వహించి తగిన చర్యలు తీసుకుంటా. పారిశ్రామిక వ్యర్థాలను ఆరు బయట వేయరాదు. ప్రజల అనారోగ్యాలకు కారణమవుతున్న నిర్వాహకులకు నోటీసులు జారీ చేస్తాం. రవీంద్రబాబు, ఈఈ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, రమణయ్యపేట. -
వృథా చేయడం ఆడంబరమా?
ఆత్మీయం వేటినైనా అవసరానికి మించి పోగు చేసి, వాడుకోకుండా పాడు చేయడమే వృథా. కొందరికి వృథా చేయడం అలవాటు. కొందరు సమయాన్ని వృథా చేస్తే, కొందరు డబ్బును వృథా చేస్తారు. నగరాలలో ఒక పక్క మంచినీటిని సరఫరా చేసే పైపులైన్లకు రంధ్రాలు పడి నీళ్లు వృథాగా పోతుంటాయి. మరోపక్క బిందెడు నీటికోసం వీధికుళాయిల వద్ద యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి. ధనవంతుల ఇళ్లల్లో జరిగే వేడుకలలో ఆహార పదార్థాలు, లైటింగ్‌కు ఎంతో విద్యుత్తు వృథా అయిపోతుంటుంది. పెళ్ళిళ్లు, పేరంటాలు, విందువినోదాలలో ఆహారపదార్థాలు వృథా అవుతుంటాయి. ఆడంబరానికి పోయి అనేకరకాలైన పదార్థాలను తయారు చేయించడం, వడ్డించడం వల్ల అతిథులు సగం తిని సగం వదిలేస్తుంటారు. ఓ పక్క తిండి లేక ఆకలితో అలమటించే వాళ్లు... మరో పక్క లెక్కకుమించి వండి పారేసేవాళ్లు. ఆడంబరానికి పోయి వనరులను వృథా చేయడం క్షమించరాని నేరం. రమణ మహర్షికి, గాంధీ మహాత్ముడికి దేనినైనా వృథా చేయడమంటే ఇష్టం ఉండేది కాదు. గాంధీ మహాత్ముడు పెన్సిల్‌ను పూర్తిగా అరిగి పోయేదాకా వాడేవారట. రాసేసిన నోటు పుస్తకాలలో పంక్తికీ పంక్తికీ మధ్య ఉన్న సందులలో రాసుకునేవారట. మన వద్ద వృథాగా పడి ఉన్న వస్తువు లేదా ఉపకరణం మరొకరి అవసరం తీర్చే పెన్నిధి కావొచ్చేమో ఎవరికి తెలుసు? -
జిల్లాలో 418 సాలిడ్ వేస్ట్‌మేనేజ్‌మెంట్ యూనిట్లు
వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఏర్పాటు సాలిడ్ వేస్ట్‌మేనేజ్‌మెంట్ డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ మేనేజర్ శాస్త్రి కడియం (రాజమహేంద్రవరం రూరల్) : జిల్లాలో వచ్చే ఆర్థిక సంవత్సరంలో 418 యూనిట్లు ఏర్పాటు చేయనున్నట్టు సాలిడ్ వేస్ట్‌మేనేజ్‌మెంట్ డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ మేనేజర్ శాస్త్రి తెలిపారు. మండలంలోని దుళ్ల పంచాయతీలో నిర్మిస్తున్న యూనిట్‌ను సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం జిల్లాలో 118 యూనిట్లు మంజూరు కాగా, 51 యూనిట్లు వర్మికంపోస్టును ఉత్పత్తి చేస్తున్నాయన్నారు. నెలాఖరుకు మిగిలిన వాటిలో కూడా ఉత్పత్తి ప్రారంభమవుతుందని చెప్పారు. యూనిట్లు విజయవంతంగా నడవాలంటే ప్రజల సహకారంతో ఎంతో అవసరమన్నారు. తడి, పొడి చెత్త సేకరణకు అవసరమైన చెత్తబుట్టలను ఎవరికి వారు కొనుగోలు చేసి ప్రోత్సహించడం ద్వారా గానీ, ఆయా గ్రామాల్లోని దాతల సహకారంతో గానీ సమకూర్చుకోవచ్చునన్నారు. పంచాయతీ నిధులతో కొనుగోలు చేసి ఆ సొమ్మును ప్రజల నుంచి వసూలు చేసుకునేందుకు కూడా అవకాశం ఉందని చెప్పారు. ఈ మూడు పద్ధతుల్లో ఏది వీలుంటే దాని ద్వారా చెత్తసేకరణ బుట్టలు సమకూర్చేందుకు ఆయా పంచాయతీలు కృషి చేయాలని సూచించారు. ఆయన వెంట డిస్ట్రిక్ట్ రీసోర్స్ పర్సన్ ఆర్మ్‌స్ట్రాంగ్, ఉపాధి పథకం సిబ్బంది నాగేశ్వరరావు, సర్పంచి గుర్రపు సత్యనారాయణ తదితరులు ఉన్నారు. -
అభాసుపాలైన సంక్రాంతి చంద్రన్న కానుక
-
వేస్టేజ్ ఈజ్ మస్ట్!
హ్యూమర్ ఈమధ్య రాంబాబుగాడు వృథా చేయవద్దనే అంశం మీద అనర్గళంగా మాట్లాడుతున్నాడు. వాడు మాట్లాడినంత కాలం ఏం పర్లేదు. వాడి వరకు ఆచరించినా ఓకే. కానీ దాన్ని విచిత్రంగా అందరిచేతా ఆచరణలో పెట్టిస్తున్నాడంటూ వాళ్ల అమ్మగారు కళ్లనీళ్లు పెట్టుకున్నారు. సాధారణంగా వాడు నార్మల్‌గా ఉండటమే జరగదు. తన వాదనలతో వాడు అందరినీ ఇబ్బంది పెట్టడం మామూలే. ఇందులో ప్రత్యేకంగా వాడు ఇతరులను ఇక్కట్లు పెట్టడం ఏముందని నా అభిప్రాయం. ఆ ఉద్దేశంతోనే...‘‘వృథా చేయకపోవడం మంచిదేగా. ఇందులో ఇబ్బందేముంది? ఏం చేస్తున్నాడు వాడు’’ అడిగాను నేను. ‘‘వృథా చేయకూడదని మాకు కూడా తెలుసు కదా నాయనా. పొద్దున్నే టిఫిన్ చేసే టైమ్‌లో ఉప్మాలో మిరపకాయలను వదిలేయకుండా తినాలంటూ వాళ్ల నాన్న చేతా, నా చేతా వాటిని తినిపిస్తున్నాడు. పిండిన నిమ్మకాయలనే మళ్లీ మళ్లీ పిండిస్తున్నాడు. అంతెందుకు... నిమ్మకాయల్లో ఉన్న గింజలను వృథా చేయకూడదంటూ... వాటిని ఏరి ప్రత్యేకంగా పెరట్లో నాటిస్తున్నాడు. అదేదో వాడు చేయవచ్చు కదా... కాదంట. ఆపిల్స్ అంటే తొక్కతో తినవచ్చు. కానీ అరటిపండ్లకు కూడా అదే న్యాయమంటే ఎలా?’’ అంటూ తన బాధ వెళ్లగక్కుకుంది ఆవిడ.‘‘నేను చూస్తా పదండి’’ అంటూ ఆమెను సమాధాన పరచి పంపించా. సరిగ్గా మధ్యానం భోజనాలప్పుడు వచ్చాడు రాంబాబు గాడు.‘‘రారా నువ్వు కూడా తిందువుగానీ’’ అంటూ పిలిచా. ఆ పిలుపే నా పాలిట శాపమవుతుందని ఆ టైమ్‌లో తెలియదు.సరిగ్గా ఆవకాయ ముక్క పెట్టించుకుని, దాన్ని తినే టైమ్‌లో హితోక్తులు మొదలు పెట్టాడు. ‘‘ఒరేయ్... టెంక ముక్కను ఉయ్యకూడదు. దాన్ని విపరీతంగా నములు. అలా నములుతూ ఉండగా కమ్మటి ఊట వస్తుంది. అలా ఊరే దాన్ని మింగు’’ అంటూ ఆదేశాలు ఇస్తున్నాడు.‘‘అలాగేలేరా... నాకు తెలియదా’’ అంటూ నములుతున్న నోటితోనే అన్నాను.‘‘కాదురా... ఇంకాసేపు నములు’’ అంటూ ఉమ్మనివ్వడం లేదు వాడు.‘‘ఒరేయ్... టెంక ముక్క అంతా టేస్ట్‌లెస్‌గా అయిపోయింది. ఇక పిప్పి తప్ప ఏమీ లేదురా. ఇంక ఉయ్యనివ్వు’’ అంటూ దీనంగా అర్థించినా వినలేదు వాడు.నోరు నొప్పి పెట్టి నొప్పి పెట్టి... ఇక తప్పక... డైనింగ్ టేబుల్ దగ్గర్నుంచి పారిపోయి బయటకు వెళ్లి ఉమ్మేయ్యాల్సి వచ్చింది. నా వరకు నాకే అంత ఇబ్బందిగా ఉంటేl... పొద్దస్తమానం ఇంట్లో వీడితోనే వేగాల్సి వచ్చే వాడి అమ్మానాన్నా ఎంత వేదన పడుతున్నారో అనిపించింది. ఇదే మాటే వాళ్ల నాన్న దగ్గర ఎత్తితే ఆయన ఇంకా ఎన్నో బాధలు చెప్పుకున్నాడు.నేను ఎక్స్పెక్ట్ చేసింది రైటే. కూరలోని కరివేపాకుల్నీ తినమంటూ ఒకటే పోరట. ‘అరే... వాటి నుంచి వచ్చే సారం ఆల్రెడీ కూరలోకి ఊరుతుంది. ఆ ఆకుల్ని తినలేమం’టూ బదులిస్తేl... ‘అలా కుదరదు. కరివేప ఆకుల్ని నమిలి తింటే క్యాన్సర్కూడా తగ్గుతుందం’టూ బలవంతంగా తినిపిస్తున్నాడట. అంతేకాదు... వాడి పిచ్చి ఎంతవరకూ వచ్చిందంటే లవంగం మొగ్గలనూ వదలకుండా బలవంతంగా నమిలేలా చేస్తున్నాట్ట. అలా చేయడం వల్ల కూరలోని రుచిపోయి నాలుక భగ్గుమంటోందన్నా వినడం లేదట. వీడి బాధ పడలేక... ఆ లవంగాలూ, దాల్చినచెక్క లాంటి వాటిని నమలకుండా బలవంతంగా మింగేయాల్సి వస్తోందట. ఇది చెప్పుకొని ఎంతో బాధపడ్డాడా పెద్దాయన.‘‘నేను వాడికి చెబుతాలెండి’’ అంటూ అప్పటికి వచ్చేశాను. సరిగ్గా మర్నాడు పొద్దున్నే వాడి దగ్గరకు బయల్దేరా.‘‘ఒరేయ్... కాసేపు ఆగు. స్నానం చేసి వస్తా’’ అంటూ టవల్ తీసుకొని బయల్దేరాడు. ‘‘ఒరేయ్ రాంబాబూ! నువ్వు నాకొక మాట ఇవ్వాల్రా’’ అన్నాను వాడితో.‘‘ఏమిట్రా’’ అడిగాడు.‘‘అయితే... ఒక్క బొట్టు కూడా కింద పడకుండా... అంతా ఒంటి మీదే పడేలా స్నానం చేయ్’’ అన్నా.‘‘అదెలా సాధ్యం?’’ అడిగాడు వాడు.‘‘అంతే... అలాగే చేయ్’’ అన్నాను మొండిగా నేను.‘‘కుదరదు’’కరాఖండిగా అన్నాడు వాడు.‘‘పారబోయడానికీ... పారేయడానికీ... పారించడం అన్న విషయాలు తెలుసుకుంటే వృథా విషయంలో వేస్ట్ ఆఫ్ టైమ్కూ రెస్ట్కూ తేడా అవగతమవుతుంది’’ అంటూ వచ్చేశా.వాడికి అర్థమైందనే అనుకుంటా. – యాసీన్ -
నిమజ్జనం వ్యర్థాల వెలికితీత షురూ
మహా నిమజ్జన పర్వం ముగిసింది. ఈసారి హుస్సేన్‌సాగర్‌లో సుమారు 51 వేల గణేష ప్రతిమలు నిమజ్జనం అయినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ట్యాంక్‌బండ్ వైపు శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల వరకు నిమజ్జనాలు కొనసాగాయి. ఈలోపు పెద్ద విగ్రహాల నిమజ్జనం పూర్తయిన ఎన్టీఆర్ మార్గ్‌లో వ్యర్థాల వెలికితీత పనులను వేగవంతం చేశామని అధికారులు తెలిపారు. శుక్రవారం సాయంత్రం వరకు మొత్తం 3,456 మెట్రిక్ టన్నుల వ్యర్థాలను వెలికితీసినట్లు చెప్పారు.శనివారం మధ్యాహ్నం నాటికి ఎన్టీఆర్ మార్గంలో వ్యర్థాల తొలగింపు ముగిస్తుందని చెప్పారు. ఆ తర్వాత ట్యాంక్‌బండ్ పక్క వెలికితీత పనులు మొదలు పెట్టనున్నారు. ఇనుప, చెక్క ఫ్రేంలు, కొబ్బరి పీచు తదితర వ్యర్థాలు ఎక్కడికక్కడ జలాశయంలో కుప్పలు తెప్పలుగా దర్శనమిస్తున్నాయి. వీటిని ఆంఫిబియస్ ఎక్స్కవేటర్ ద్వారా ఒడ్డుకు చేర్చి అక్కడి నుంచి జేసీబీల ద్వారా వాహనాల్లో నింపుతున్నారు. గతేడాది 4,500 టన్నుల వరకు వ్యర్థాలు రాగా.. ఈసారి 5000 టన్నులకు చేరేఅవకాశం ఉందని తెలిపారు. ఈ ఏడాది 4 అడుగుల పైబడి విగ్రహాల సంఖ్య పెరిగిందని పోలీసుల రికార్డుల ప్రకారం తెలుస్తోంది. 500 టన్నుల ఇనుము, 240 టన్నుల కలప, 200టన్నుల పీఓపీ సాగరంలో కలిశాయని పీసీబీ అంచనా వేస్తోంది. ఇందులో ఇనుము, కలప, కొబ్బరిపీచును 4500 టన్నుల మేర తొలగించినా..పీఓపీ, ఇతర హానికారక రసాయనాలు, రంగులు నీళ్లలో కలిసిపోవడంతో హుస్సేన్‌సాగర్ మరింత గరళసాగరం కానుందని పర్యావరణ వేత్తలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కాగా, శుక్రవారం సాయంత్రం రెండు గంటల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం.. వ్యర్థాల తరలింపునకు ఆటంకం కలిగించింది. వాహనాల రాకపోకలు ఎన్టీఆర్ మార్గంలో నెమ్మదించడంతో వ్యర్థాలను డంప్ యార్డ్‌కు తరలించే టిప్పర్లు ముందుకు వెళ్లేందుకు గగనంగా మారింది. దీంతో తరలింపు పనులను కొద్ది సేపు నిలిపివేయాల్సి వచ్చిందని హెచ్ఎండీఏ ఈఈ జే.కృష్ణారావు, డీఈఈ దయాకర్‌రెడ్డి తెలిపారు. -
ఇదేమి ‘కృష్ణా!’
చాంద్రాయణగుట్ట: ఫలక్‌నుమా రైల్వే బ్రిడ్జి పక్కన ఉన్న కృష్ణా పైప్‌లైన్ మరోసారి పగిలింది. దీంతో పెద్ద ఎత్తున మంచినీరు వృథాగా పోయింది. భారీ లీకేజీ ఏర్పడటంతో తాగునీరు ఫౌంటె న్లా విరజిమ్మింది. ఉదయం 8 నుంచి 10 గంటల వరకు లీకైన నీరు పక్కనే అ ల్ జుబేల్ కాల నీలోని ఇళ్లలోకి చేరుకోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. రైల్వే పట్టాలపై కూడా నీరు చేరింది. సమాచారం అందుకున్న జలమండలి అధికారులు ఎట్టకేలకు సరఫరా నిలిపివేయడంతో లీకేజీకి తెరపడింది. అనంతరం అధికారులు, సిబ్బంది వచ్చి మరమ్మతులు చేపట్టారు. -
పుష్కర పనుల్లో వృథా ఖర్చు
* ప్రణాళిక లేక ఖాళీగా దర్శనమిచ్చిన పుష్కరనగర్లు * కొన్ని చోట్ల ఇప్పటికీ కొనసాగుతున్న రోడ్ల నిర్మాణాలు సాక్షి, అమరావతి బ్యూరో: పుష్కరాల ప్రభుత్వం కోట్ల రూపాలయ సొమ్ము వృథా చేసింది. భక్తులకు ఉపయోగపడతాయా లేదా అని ఆలోచించకుండా జిల్లాలో పుష్కర నగర్లను ఏర్పాటు చేసింది. ఘాట్‌కు పుష్కరనగర్లను దూరంగా ఏర్పాటు చేసి వాటిని అలంకారప్రాయంగా ఉంచారు. వీటి కాంట్రాక్టులన్నీ అధికార పార్టీ నేతలే దక్కించుకున్నారు. జిల్లా తాడేపల్లిలోని మోడల్æడెయిరీ, రిథం, కృష్ణాకెనాల్ రైల్వేస్టేషన్, నులకపేట కల్యాణ మండపం, మంగళగిరిలోని ఎయిమ్స్, ఉద్దండరాయునిపాలెం, పెనుమూడి, అమరరావతిలోని గుంటూరు, విజయవాడ, సత్తెనపల్లె రోడ్డులో మూడు, గుంటూరు సమీపంలో (ట్రాన్సిట్ పాయింట్), పొందుగుల, దైద, విజయపురిసౌత్‌లో 14 చోట్ల ఏర్పాటు చేశారు. పేరుకు మాత్రమే.. గుంటూరుకు సమీపంలో రూ.2 కోట్లతో గోరంట్ల వద్ద (ట్రాన్సిట్) పుష్కర నగర్ ఏర్పాటు చేశారు. దీన్ని భక్తులెవరూ ఉపయోగించుకోలేదు. అక్కడ అధికారులు మాత్రమే కనిపించారు. మరుగుదొడ్లు, స్టాల్స్, క్లాక్ Sరూమ్, భారీ ఎల్ఈడీ స్కీన్లు, సాంస్కృతిక కార్యక్రమాలు, మినరల్ వాటర్ ప్లాంట్ల కోసం దాతల నుంచి కార్పొరేషన్ అధికారులు రూ.20 లక్షలు వసూలు చేశారు. ఇవన్నీ వృథాగా మారాయి. ఈ పనులను అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించే ఓ కంపెనీకి కట్టబెట్టారు. వ్యవహారం మొత్తం చినబాబు కనుసన్నల్లో జరిగినట్లు సమాచారం. ఇవి కాకుండా జిల్లాలో 13 చోట్ల రూ.20 లక్షల నుంచి రూ.50 లక్షలు ఖర్చు చేసి పుష్కర నగర్లను ఏర్పాటు చేశారు. పొందుగుల, కృష్ణవేణి, అమరావతిలోని సత్తెనపల్లె, విజయవాడ రోడ్డులో ఏర్పాటు చేసిన, ఎయిమ్స్ మంగళగిరి, పెనుమూడి, ఉద్దండరాయునివాళెం, తాడేపల్లె ఏర్పాటు చేసిన పుష్కర నగర్లు వెలవెలబోయాయి. పుష్కరాలు ముగిసినా కొనసాగుతున్న పనులు తెనాలి రూరల్: ప్రాంతాల ప్రాధాన్యాన్ని బట్టి ఘాట్లను ఏ, బీ, సీ విభాగాలుగా విభజించారు. ఒక్క పెనుమూడిలోనే వీఐపీ ఘాట్ ఏర్పాటు చేశారు. తెనాలి డివిజన్లో ఏ కేటగిరీ ఘాట్లు లేవు. ఈ ఘాట్లలో టైల్స్ వేయడం, అందంగా తీర్చిదిద్దాల్సి ఉంది. బీ, సీ కేటగిరీల్లో ఘాట్లను నిర్మించి, రంగులు వేసి, నదీ జలాలు లేని చోట జల్లు స్నానాలకు ఏర్పాట్లు చేయాలి. నదిలో కిందికి వదిలే నీళ్లు లేకపోవడంతో జల్లు స్నానాలతో మమ అనిపించారు. కొన్ని ఘాట్లలో ఒక్కరు కూడా పుష్కర స్నానాలు చేయలేదు. పుష్కరాలు ముగిసినా పనులు సా..గుతూనే ఉన్నాయి. ఇవన్నీ ఒకెత్తయితే పుష్కరాలకు సంబంధించిన పనులు ఇంకా కొనసాగుతుండడం విశేషం. కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో కరకట్ట నుంచి నది వరకు అప్రోచ్ రోడ్డు నిర్మించాలి. తెనాలి డివిజన్ కొల్లిపర మండల పరిధిలో అవసరం ఉన్నా, లేకపోయినా 12 ఘాట్లను నిర్మించారు. వీటికి సంబంధించి కరకట్ట నుంచి అప్రోచ్ రోడ్డు వేసేందుకు రూ. 2.65 కోట్ల అంచనాలతో అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. పుష్కరాలకు కేవలం 40 రోజుల ముందే కాంట్రాక్టరుతో ఒప్పందం ఖరారైంది. కొన్ని ఘాట్ల వద్ద అప్రోచ్ రోడ్డుకు మట్టి పని చేయాలి. సుమారు ఐదడుగుల మేర ఎత్తు వరకు మట్టి రోడ్డు వేసి, దానిపై డస్ట్, కంకర పోసి రోలర్లతో తొక్కించి, అనంతరం సిమెంటు రోడ్డు లేదా, బీటీ రోడ్డు వేయాలి. అయితే కొల్లిపరలో ఇప్పటికీ ఒక్క ఘాట్‌కూ అప్రోచ్ రోడ్డు నిర్మాణం జరగలేదు. కేలవం కరకట్ట నుంచి ఘాట్ వరకు డస్ట్, కంకర వేసి రోలర్‌తో తొక్కించకుండా వదిలేశారు. ఒప్పందం ప్రకారం కాంట్రాక్టరుకు 90 నుంచి 180 రోజుల సమయం ఉంది. దీంతో పుష్కరాలు పూర్తయినా, ఇప్పటికీ పనులు చేస్తున్నారు. కొల్లూరు మండలంలో 10 ఘాట్లకుగాను రూ. 2.55 కోట్లు కేటాయించారు. ఈపూరు, చిలుమూరు ఘాట్లకు ప్రస్తుతం అప్రోచ్లను నిర్మిస్తున్నారు. కమిషన్ల కోసమే ఘాట్లు నిర్మించారని ప్రజలు విమర్శిస్తున్నారు. -
హైదరాబాద్ మురుగుంతా మనకే..
వలిగొండ : మండల కేంద్రంలో మంగళవారం, బుధవారాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. దీంతో చెరువులు, కాల్వలు నీటితో కళకళలాడుతున్నాయి. ఇక ఇటీవల హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షంతో మూసీ కళకళలాడుతోంది. మండలంలోని సంగెం భీమలింగం కత్వ వద్ద ప్రారంభమయ్యే మూసీ భీమలింగం కత్వ మీదుగా పొంగిపొర్లుతూ ప్రవíß స్తోంది. కాగా హైదరాబాద్‌లోని డ్రెయినేజీ, రసాయనాలు వర్షం నీటితో కలిసి రావడంతో నీరు నల్లగా పారడమే కాకుండా , దుర్వాసన వెదజల్లుతోంది. వర్షం...రైతుల హర్షం మండలంలోని పలు గ్రామాల్లో ఇటీవల కురుస్తున్న వర్షాలు రైతులకు ఊరటనిస్తున్నాయి. మండలంలో సుమారు 5386 హె క్టార్లలో వరి, 856 హె క్టార్లలో అపరాల పంటలు, 5136 హెక్టార్లలో పత్తి సాగు చేస్తున్నారు. ఇక జూన్‌లో 88 మీ.మీ, జూలైలో 157 మీ.మీ, ఆగస్టులో 124 మీ.మీ కురిసింది. సాధారణ వర్షపాతం కంటే ఎక్కువ శాతం నమోదు కావడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
చెత్త తరలింపునకు ఈ– ఆటోలు
విజయవాడ సెంట్రల్ : పుష్కరాల సందర్భంగా నగరంలో చెత్త వేగంగా ట్రాన్స్ఫర్ స్టేషన్‌కు తరలించేందుకు ఈ– ఆటో వెహికిల్, ట్రైసైకిళ్లను అందుబాటులోకి తెచ్చారు. మంగళవారం బంగ్లాలో కమిషనర్ వీటిని స్వయంగా నడిపి చూశారు. ఆయన మాట్లాడుతూ సాధారణ ఆటోల కంటే వేగంగా, కాలుష్యరహితంగా ఈ– ఆటోల్లో చెత్తను తరలించవచ్చని చెప్పారు. వాహనాలు బ్యాటరీలో నడవడం వల్ల కాలుష్యం తగ్గుతోందన్నారు. హైడ్రాలిక్ సిస్టంలో రివర్స్‌గేర్ కలిగి ఉన్న వాహనాలు చెత్త తరలింపునకు ఉపయోగంగా ఉంటాయన్నారు. ఒక్కో ఆటోలో 350 కిలోల చెత్తను తరలించవచ్చని చెప్పారు. -
టీఆర్ఎస్ గాలి పార్టీ
పోలీసులు గులాబీ కండువాలు కప్పుకున్నట్లున్న ఉంది.. కాంగ్రెస్ జిల్లా ఇన్చార్జ్, మాజీ మంత్రి శ్రీధర్‌బాబు వైరా : రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ గాలి పార్టీ అని కాంగ్రెస్ పార్టీ జిల్లా ఇన్చార్జ్, మాజీ మంత్రి డి.శ్రీధర్‌బాబు విమర్శించారు. శనివారం వైరాలో జరిగిన నియోజకవర్గ సమావేశంలో కార్యకర్తలనుద్దేశించి ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ నియంతృత్వ ధోరణి అవలంభిస్తున్నారని, 2019లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీదే అధికారమన్నారు. టీఆర్ఎస్ అధికారాన్ని ఎదిరించిన ఒక్క కాంగ్రెస్సేనని నొక్కివక్కాణించారు. రాష్ట్రంలో పోలీసులు గులాబీ కండువాలు కప్పుకున్నట్లుగా ఉందని, అధికార పార్టీకి పోలీసులు పని చేస్తున్నారన్నారు. పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవని, ప్రభుత్వాలు వస్తాయి.. పోతాయి.. అధికారులు మాత్రం ఒకే పార్టీకి కొమ్ము కాస్తే రాబోయే రోజుల్లో ఇబ్బందులు పడతారన్నారు. ప్రాజెక్ట్‌ల పేరుతో దోపిడీ .. ప్రాజెక్ట్‌ల పేరుతో టీఆర్ఎస్ దోపిడి చేస్తోందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. మంత్రి తుమ్మలకు కాంగ్రెస్‌ను విమర్శించే అర్హత లేదన్నారు. ఒక చెడ్డవాడు ఉంటేనే మంచివాడి విలువ తెలుస్తుందన్నారు. స్థానిక ఎమ్మెల్యే మదన్‌లాల్ మనవాడేనని, గత ఎన్నికల్లో కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఆయనకు ఓట్లు వేశారన్నారు. త్వరలో పది వేల మందితో నియోజకవర్గ సమన్వయ సమావేశం నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు అయితం సత్యం, జిల్లా అ«ధికార ప్రతినిది పువ్వాళ్ల దుర్గాప్రసాద్, రాష్ట్ర అధికార ప్రతినిధి కట్ల రంగారావు, మహిళా అధ్యక్షురాలు మణి, జిల్లా నాయకులు ఎన్.రాంబాబు, వీరయ్య, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు రామస్వామి, మైనార్టీ జిల్లా అధ్యక్షుడు తాజుద్దీన్, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు బాలాజీ, మండల అధ్యక్షుడు పసుపులేటి మోహనరావు, నాయకులు వెంకటనర్సిరెడ్డి, దానియేలు, హరినాథ్, గోవిందరావు, తదితరులు పాల్గొన్నారు. -
వ్యర్థాలతో అపురూపాలు
-
వ్యర్థాలనుంచి కంపోస్ట్ ప్రచారంలో అమితాబ్
న్యూఢిల్లీః బాలీవుడ్ స్టార్ అమితాబచ్చన్ స్వచ్ఛభారత్ మిషన్ ప్రచారానికి సన్నాహాలు చేస్తున్నారు. పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ అభ్యర్థన మేరకు 'వేస్ట్ టు కంపోస్ట్' ( వ్యర్థాలనుంచి ఎరువులు) ప్రచారంలో ప్రధాన పాత్రను పోషించనున్నారు. చెత్తను సేకరించి ఎరువుల కంపెనీలకు అమ్మకాలు చేపట్టడం, వ్యర్థాలనుంచి ఎరువుల తయారీ వంటి విషయాలపపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు బిగ్ బీ ముందుకొచ్చారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛభారత్ మిషన్ ప్రచార కార్యక్రమంలో అమితాబచ్చన్ ప్రధాన పాత్ర వహించనున్నారు. కార్యక్రమంలో భాగంగా నగరాల్లో పేరుకునే వ్యర్థాలను ఎరువులుగా మార్చి పొలాలకు ఉపయోగించే ప్రక్రియపై ప్రజల్లో అవగాహన పెంచనున్నారు. ఈ సందర్భంలో నగరాల్లోని చెత్తను కంపోస్ట్ గా మార్చే కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళేందుకు మీరు అంగీకరించడం ఎంతో ఆనందంగా ఉందని, అందుకు మీకు కృతజ్ఞతలు అంటూ జూన్ 20న పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ బిగ్ బీ కి ప్రత్యేక లేఖ ద్వారా కృతజ్ఞతలు తెలిపింది. చెత్తను కంపోస్ట్ గా మార్చి, ఇళ్ళలోని గార్డెన్లలో వినియోగించేందుకు ప్రజలకు, నర్సరీల యజమానులకు, ఉద్యానవన సంస్థలు, ఏజెన్సీలకు రేడియో, టీవీ ప్రకటనలు పోస్టర్ల ద్వారా అవగాహన కల్పించడంలో వ్యక్తిగతంగానూ, వాయిస్ ద్వారానూ భాగం పంచుకొంటూ.. స్వచ్ఛభారత్ ప్రచారంలో అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నందుకు కృతజ్ఞతలు అంటూ మంత్రిత్వ శాఖ సదరు లేఖలో తెలిపింది. అత్యధిక చెత్త ఏర్పడే అవకాశం ఉన్న హోటల్స్, విద్యా సంస్థల ప్రాంగణాల్లో ప్రత్యేక పరికరాలను ఏర్పాటుచేసి సేంద్రీయ వ్యర్థాలను విడివిడిగా వేయాలన్న విజ్ఞప్తుల ద్వారా పౌరులను ప్రోత్సహించడంలోనూ, బహుళ వేదికల ద్వారా సమాచార ప్రచారాన్ని చేరవేయడంలోనూ అమితాబ్ క్రియాశీలక పాత్ర పోషించేందుకు మంత్రిత్వ శాఖ ప్రణాళికలు చేస్తోంది. ఐదేళ్ళ గడువులోగా దేశం మొత్తం పరిశుభ్రంగా ఉండాలన్న ఉద్దేశ్యంతో 2014 అక్టోబర్ 2న ప్రధాని నరేంద్ర మోదీ స్వచ్ఛభారత్ అభియాన్, క్లీన్ ఇండియా మిషన్ కార్యక్రమాలను ప్రారంభించిన విషయం తెలిసిందే. -
పట్టాలపై వ్యర్థాలు వేస్తే భారీ జరిమానా
న్యూఢిల్లీ: రైలు పట్టాలపై వ్యర్థాలను వేసే వారిపై కఠిన చర్యలు ఎందుకు తీసుకోవడంలేదని జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ) రైల్వే శాఖపై మండిపడింది. వ్యర్థాలను వేసే వారిపై రూ.5 వేల జరిమానా విధించాలని ఆదేశించింది. ‘పట్టాల పక్కన భారీగా వెలసిన మురికివాడలతోపాటు శాశ్వత కట్టడాల్లోని వారు గార్బేజ్ వ్యర్థాలను పట్టాలపై విసిరేయడాన్ని ఎందుకు అనుమతిస్తున్నారని మండిపడింది. కఠినంగా జరిమానాలు విధిస్తే దీన్ని నియంత్రించవచ్చంది. రైలు పట్టాలపై వ్యర్థాలను వేసే వారిని ట్రిబ్యునల్ హజరు పరచాలని సూచించింది. -
వేస్ట్ ఫెలోస్
బాధ్యత అవసరం కంటే ఎక్కువ పెట్టుకోవడం వేస్ట్ కాదా! అవసరం కంటే ఎక్కువ వడ్డించడం వేస్ట్ కాదా! అవసరం కంటే ఎక్కువ తినడం వేస్ట్ కాదా! ఆ తర్వాత అజీర్తికనీ, షుగర్ అనీ, సకల జబ్బులకు సర్వం ధారపోయడం వేస్ట్ కాదా! రైతు కష్టాన్ని గౌరవించకపోవడం వేస్ట్ కాదా! పేదవాడి కడుపుకొట్టడం వేస్ట్ కాదా! పంచుకోవాల్సింది పారేయడం వేస్ట్ కాదా! పిల్లలకు వేస్ట్ ఎగ్జాంపుల్‌గా నిలిచేవాళ్లు వేస్ట్‌ఫెలోస్ కాదా! కాదా!? అన్నం పరబ్రహ్మ స్వరూపం. బ్రహ్మ అంటే సృష్టి. సృష్టి అంటే శక్తి. ఆహారాన్ని వృథా చేస్తున్నామంటే శక్తిని, మన ఉత్పాదకతను వృథా చేస్తున్నామనే అర్థం. ఈ పాఠం రతన్‌టాటా లాంటి పారిశ్రామిక దిగ్గజానికి జర్మనీకి వెళితే కాని అర్థం కాలేదు. చాలా ఏళ్ల కిందట రతన్ టాటా ఏదో పని మీద జర్మనీ వెళ్లారు. అప్పటి వరకు ఆయన జర్మనీ చాలా ధనిక దేశమని, అక్కడి ప్రజలంతా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారని అనుకుంటూ ఉండేవారు. ఒకరోజు ఆయన స్నేహితుడితో కలిసి హేమ్బర్గ్కి వెళ్లాడు. లంచ్ టైమ్ అయింది. ‘ఆకలి దంచేస్తోంది. ముందు ఏదైనా రెస్టారెంట్‌కి వెళదాం.. తర్వాతే ఇంకో పని’ అన్నాడు స్నేహితుడితో. ఆ స్నేహితుడు అక్కడికి దగ్గర్లో ఉన్న ఓ రెస్టారెంట్‌కి తీసుకెళ్లాడు. మూలన ఒక యువజంట, ఇంకో చోట యాభైఏళ్లు పైబడిన ఓ మహిళల గుంపు మినహా రెస్టారెంట్ అంతా ఖాళీగానే ఉంది. ‘ఇదేం హోటల్‌రా బాబూ.. అంతా ఖాళీగా ఉంది.. మంచి ఫుడ్ ఉంటుందా?’ సందేహం వెలిబుచ్చుతూ లోపలంతా పరికించి చూడసాగాడు. మూలన కుర్చున్న యువజంట ముందు ఓ రెండు కూరలతో మాత్రమే భోజనం ఉంది. ‘ఇంత సాధారణ భోజనంతో రొమాంటిక్ లంచా? గర్ల్‌ఫ్రెండ్‌కి మంచి లంచ్ కూడా ఆర్డర్ చేయని ఆ పిసినారి బాయ్‌ఫ్రెండ్‌ని ఆ పిల్ల ఎంతోకాలం భరించదు’ అనుకుంటూ నవ్వుకున్నారు రతన్‌టాటా. యాభై పైబడిన ఆడాళ్ల బృందమేమో ఆర్డర్ చేసుకొన్న డిష్‌ను కొసరి కొసరి వడ్డించుకుంటున్నారు. ప్లేట్లలో ఉన్న ఆహార పదార్థాలన్నిటినీ మిగల్చకుండా తినేస్తున్నారు. వాళ్లను చూసి అంత కక్కుర్తి ఏమిటా అనుకున్నారాయన. ఇప్పుడు ఆర్డర్ చేయడం వీళ్ల వంతైంది. ఉన్నది ఇద్దరే అయినా చాలా రకరాల వెరైటీలను ఆర్డర్ చేశారు రతన్‌టాటా. తినగలిగినంత తిని మిగిలినది ప్లేట్లలో వదిలేశారు. అది చూసి పక్కనే ఉన్న బృందంలోని మహిళ... ‘మిస్టర్.. భోజనాన్ని అలా వదిలేశారెందుకు?’ అంటూ కోప్పడింది. ఆ మాటకు రతన్‌టాటా స్నేహితుడికి చిర్రెత్తింది. ‘మా డబ్బు.. మా భోజనం.. మా ఇష్టం. తింటాం.. వదిలేస్తాం.. మీకెందుకు?’ అంతే కోపంగా సమాధానమిచ్చాడు. ఆ జవాబుకి కనుబొమలు ముడివేసిన ఆ మహిళ వెంటనే రిసెప్షన్‌లోకి వెళ్లి ఎవరికో ఫోన్ చేసి వచ్చింది. కొద్ది క్షణాల్లోనే అక్కడి సోషల్ సెక్యురిటీ యూనిఫామ్‌లో ఉన్న నలుగురు వ్యక్తులు ప్రత్యక్షమయ్యారు. ఈ మిత్రుల టేబుల్ దగ్గరకు వచ్చి ‘ప్లేట్లలో వదిలేసిన ఆహారానికి యాభై యూరోలు ఫైన్ కట్టండి’ అంటూ ఓ రిసీట్ ఇచ్చారు. తెల్లబోయారిద్దరూ. ‘అదేంటి? ఈ ఫుడ్ మేం డబ్బుకట్టి ఆర్డర్ చేసిందే’ అన్నాడు రతన్‌టాటా స్నేహితుడు. ‘డబ్బు మీదే కాని వనరులు మీవి కావు. మీవి కాని రీసోసెర్సెస్ను వేస్ట్ చేసే హక్కు మీకు లేదు. దానికే ఈ ఫైన్’ అని వాళ్ల దగ్గర యాభై యూరోలు తీసుకొని వెళ్లిపోయారు. అప్పటిదాకా ఆ ధనిక దేశమ్మీద రతన్‌టాటాకు ఉన్న అపోహలు తొలగిపోయాయి. అంత సంపద ఉన్న దేశమే ప్రకృతి సంపదను ఎంతో జాగ్రత్తగా వాడుకుంటుంటే అతి తక్కువ వనరులన్న మన దేశం ఎంతెంత ఆహారాన్ని వృథా చేస్తోంది ...అని చింత పడ్డారు. అప్పటినుంచి ఒక్క ఆహారపు గింజను కూడా వృథా చేయనని ఒట్టేసుకోవడమే కాదు, చిత్తశుద్ధితో ఆచరించడమూ మొదలెట్టారట. మన ఇళ్లల్లో.. ఇలాంటి సంఘటనలు మన ఇళ్లల్లో, మన హోటళ్లల్లో కనిపించవు. కానీ తిన్నంత తిని వదిలేసినంత వదిలేసే అలవాట్లు మాత్రం పుష్కలంగా ఉంటాయి. ఇద్దరున్న ఇంట్లో నలుగురి వంట; నలుగురు ఉన్న ఇంట్లో ఆరుగురి వంట; ఇక పదిమంది ఉన్న ఇంట్లో పదిహేను మంది వంట చెత్తకుండీల్లోకి చేరుతుంది. అదే చెత్తకుండీ పక్కన అన్నమో రామచంద్రా అంటూ డొక్కలు అతుక్కుపోయిన అన్నార్తులూ కనిపిస్తుంటారు. ఒక ఇంట్లో అతివృష్టి... ఒకడి ఒంట్లో అనావృష్టి. అయినా ఆహారం విలువ తెలియదు. దానికి ఉదాహరణ మన దగ్గర జరిగే అట్టహాసపు ఆర్భాటపు పెళ్లిళ్లు, పెరంటాళ్లే! ఈ వేడుకల్లో టన్నుల కొద్దీ ఆహారం వృథాపాలవుతోంది. ఇలా వృథా చేస్తున్న ఏ ఒక్కరికైనా దేశంలో జరుగుతున్న రైతుల ఆత్మహత్యలు గుర్తొస్తున్నాయా? చెత్తలో కలుపుతున్న ఈ ఆహారధాన్యాలను పండించడానికి రైతు తన సర్వస్వం ధారపోస్తున్నాడు. తాను నమ్ముకున్న నేల కోసం ఇంటినీ, భార్య ఒంటి మీది నగలను తాకట్టు పెట్టి పంటకు పెట్టుబడి తెస్తున్నాడు. అయినా అనుకున్న రాబడి రాక అప్పులు మిగిలి తన ప్రాణాల్నే తీసుకుంటున్నాడు. అతని కుటుంబం ఈ గింజలే కరువై రోడ్డున పడుతోంది. మన ఒక్క ఇంట్లో ఒక ముద్దే కదా వృథా అవుతోంది అనుకుంటాం... అలా కొన్ని వందల ఇళ్లల్లో వందల ముద్దలు వృథా అయి కొన్ని వందల మంది నోటి దగ్గరి ముద్దలను లాక్కున్న వాళ్లమవుతున్నాం. అంటే అన్ని వందలమంది అన్నార్తులను సృష్టించిన నేరస్తులమవుతున్నాం. ఎంతోమంది రైతులను ఆత్మహత్యలకు ఉసిగొల్పుతున్నాం. వాళ్ల కుటుంబాలను రోడ్డున పడేసిన పాపాన్ని మూటగట్టుకుంటున్నాం. బహుశా ఇలాంటి బాధను అనుభవించే కావచ్చు.. లేదా రతన్‌టాటాకు ఎదురైన అనుభవాన్ని తెలుసుకొని కావచ్చు.. దుబాయ్‌లో.. బర్‌దుబాయ్‌లోని అల్ కరామా ప్రాంతంలో అజంతా అనే హోటల్ ఉంది. ఆ హోటల్ యజమాని తన దగ్గరకి వచ్చే కస్టమర్స్‌కి 20 ధిరహామ్లకు కావల్సినంత భోజనం పెడ్తాడు. మళ్లీ మళ్లీ పెట్టించుకుంటూ కడుపునిండా తినొచ్చు. కానీ ప్లేట్లో ఒక్క మెతుకు కూడా మిగలకూడదు. మిగిలిందో, 13 ధిరహామ్స్ ఫైన్ కట్టి వెళ్లాలి. అంటే కావల్సినదానికల్లా ఎక్కువ పెట్టుకొని వదిలేస్తే భోజనం ఖరీదు 20 ధిర్హామ్స్తో పాటు అదనంగా 13 ధిర్‌హామ్స్ మొత్తం ముప్పైమూడు ధిర్‌హామ్స్ చెల్లించి వెళ్లాలి. ఒక్క ధిర్హామ్ విలువ 20 రూపాయలు. 33 ధిర్‌హామ్స్ ఇండియన్ కరెన్సీలో 660 రూపాయలు. ఎందుకీ ప్రాక్టీస్ అంటే ‘పాతికేళ్ల కిందట ఒకసారి నా హోటల్‌కి ఓ నలుగురు యువకులు వచ్చి నచ్చినవాటిని నచ్చినంత ఆర్డర్ చేశారు. కనీసం అందులో పావు భాగమైనా తినకుండా పారేసి వెళ్లిపోయారు. అప్పట్లో నేను రోజుకి యాభై మందికి మీల్స్ సర్వ్ చేసేవాడిని. ఈ నలుగురు వచ్చి వెళ్లాక వారిలో ఏడుగురికి భోజనం పెట్టలేకపోయాను. అంటే ఈ నలుగురు ఏడుగురి భోజనాన్ని వృథా చేసి వెళ్లారు. పాపం ఆ ఏడుగురూ లేబర్స్. నా రెగ్యులర్ కస్టమర్స్. ఆకలితో వెనుదిరిగి వెళ్లిపోయారు. అప్పట్లో అల్కరామాలో ఉన్న ఏకైక ఇండియన్ రెస్టారెంట్ ఇదే. వాళ్లకు ఆ పూటకు తిండే దొరకలేదు. నీకు పట్టినంత నువ్ తిను.. కాని ఇతరులు తినాల్సినదాన్ని నువ్వు వృథా చేసే హక్కు నీకు లేదు అని చెప్పడానికే ఈ రూల్ పెట్టాను ’ అని చెప్పాడు. ఇదీ కథ.. కథలాంటి నిజం. ఆహారాన్ని వృథా చేయడం ఎంత నేరమో చెప్పే గొప్ప అనుభవం. నోటి దగ్గరకు ముద్ద వెళ్లినప్పుడల్లా ప్రతి ఒక్కరికీ గుర్తుకు రావాల్సిన పాఠం. - సరస్వతి రమ -
గులాబీమయమవుతున్న యమునా నది
ఢిల్లీ : గులాబీరంగు నురుగ చూడడానికి ఎంతో ఇంపుగా కనిపిసిస్తుందనుకుంటున్నారా?.. అత్యంత ప్రమాదకర స్థాయిలో యమునా నది కలుషితం అవుతుందనడానికి నిదర్శనమీ దృశ్యం. ఉత్తర ఢిల్లీలోని వజీరాబాద్‌లో యమునా నదిలోకి వచ్చి చేరుతున్న వ్యర్థాలు ఈ రకమైన గులాబీరంగు నురగను ఉత్పత్తి చేస్తున్నాయి. బట్టల పరిశ్రమల నుంచి బయటకు వదిలేస్తున్న వ్యర్థాలలోని విషపూరితమైన రసాయనాల వల్లే ఇలాంటి పరిస్థితి నెలకొందని స్థానికులు చెబుతున్నారు. దేశ రాజధానిలో ఉన్న 19 నాలాల నుంచి వ్యర్థాలు యమునా నదిలోకి వచ్చి చేరుతున్నాయి. విషపూరిత రసాయనాల వల్ల పరిసర ప్రాంతాల్లో నివసించే ప్రజలకు తీవ్ర ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 2017 సంవత్సరం నాటికి యమునా నీటిలో ఈతకొడుతాం, యమునా నీటిని తాగుతామంటూ కేంద్ర ప్రభుత్వం ఊదరగొట్టే హామీలు ఇచ్చిన విషయం తెలిసిందే. తాగునీరు దేవుడెరుగు కాలుష్యం మరింత పెరుగకుండా చూస్తే చాలు అని అక్కడి స్థానికులు వాపోతున్నారు. -
ప్రభుత్వాస్పత్రుల్లో.. ఆ ఒక్కటీ అడక్కు..!
కానరాని పారిశుద్ధ్యం ప్రధాన ఆస్పత్రుల వార్డుల్లో దుర్వాసన గాంధీ, ఉస్మానియా, నిలోఫర్‌లోనూ అదేతీరు రూ.కోట్లు వెచ్చించినా మెరుగు పడని పరిస్థితి సిటీబ్యూరో: రోగమొచ్చి ప్రభుత్వాస్పత్రికి వస్తే.. కొత్త రోగాలు అంటుతున్నాయి. ప్రధాన గేటు నుంచి మొదలయ్యే దుర్వాసన ప్రధాన వార్డుల్లోనూ వదలడం లేదు. వార్డులు.. మరుగుదొడ్లకు పెద్ద తేడా కనిపించడం లేదు. సిరెంజీలు, ఇతర బయోమెడికల్ వ్యర్థాలు వార్డుల్లోనే కుప్పలుగా పేరుకుపోతున్నాయి. రోజుల తరబడి మరుగుదొడ్లను శుభ్రం చేయకపోవ డంతో ఉస్మానియా, గాంధీ సహా సుల్తాన్‌బజార్ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి, నయాపూల్ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి, ఈఎన్టీ, ఫీవర్, ఛాతి, మానసిక చికిత్సాలయం, సరోజినిదేవి కంటి ఆస్పత్రుల్లోని వార్డుల్లో దుర్వాసనకు రోగుల ముక్కుపుటాలు అదురుతున్నాయి. పారిశుద్ధ్యం కోసం ప్రభుత్వం వెచ్చిస్తోన్న కోట్లాది రూపాయలు వ్యర్థాల్లో మురిగిపోతున్నాయి. బుధవారం పలు ఆస్పత్రుల్లో ‘సాక్షి’ పరిశీలించగా.. అక్కడి పరిస్థితితులు దారుణంగా కనిపించాయి. నిలోఫర్.. చిన్నారులకు డర్.. రాష్ట్రలోనే అతిపెద్ద చిన్నపిల్లల ఆస్పత్రిగా ‘నిలోఫర్’కు గుర్తింపు ఉంది. చిన్నపిల్లల ఆరోగ్య విషయంలో అత్యంత జాగ్రత్త అవసరం. కానీ ఈ ఆస్పత్రిలో ఆ జాగ్రత్తలు మచ్చుకు కూడా కానరావు. నిలోఫర్‌లో పారిశుద్ధ్య నిర్వాహణకు ప్రభుత్వం నెలకు రూ.8.38 లక్షలు వెచ్చిస్తోంది. నిబంధనల ప్రకారం ప్రతి రోజూ రెండు పూటలా ఫినాయిల్‌తో వార్డులను శుభ్రం చేయాలి. కానీ ఇక్కడ అసలు ఫినాయిలే వాడటం లేదు. కేవలం తడిగుడ్డతో తుడిచేసి చేతులు కడిగేసుకుంటున్నారు. ఆస్పత్రి నుంచి వెలువడుతున్న బయె ూమెడికల్ వ్యర్థాలను వేరు చేయకుండా సిబ్బంది అన్నింటినీ ఒకే మూటలో కట్టేస్తున్నారు. ఎప్పటికప్పుడు వీటిని బయటికి తరలించాల్సింది పోయి క్యాంటీన్ సమీపంలోని ఖాళీ స్థలంలో పోగేస్తున్నారు. వీటి మూలంగా చిన్నపిల్లలకు బాక్టీరియా, ఇతర వైరస్ బారిన పడుతున్నారు. ఆస్పత్రిలో రోజుకు సగటున ఐదు నుంచి మంది చిన్నారులు మృత్యువాత పడుతున్నారు. ప్రతి 10 మందిలో ఒకరు ఇన్ఫెక్షన్ వల్లే చనిపోతున్నట్టు స్వయంగా ఆస్పత్రి వైద్యులే అంగీకరిస్తున్నారంటే ఇక్కడి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. నిబంధనల ప్రకారం శుభ్రత ఇలా ఉండాలి.. ఆస్పత్రి పరిసరాలను రోజుకు ఒకసారి శుభ్రం చేయాలి. ఓపీని రోజుకు రెండుసార్లు, జనరల్ వార్డులను మూడు సార్లు, ఆపరేషన్ ధియేటర్లను ఐదుసార్లు శుభ్రపరచాలి.ఎన్ఐసీయూ, ఇతర అత్యవసర విభాగాలను రోజుకు ఏడు సార్ల చొప్పున శుభ్రపరచాలి.{పతి 15 రోజులకోసారి గోడలు, కిటీకీలు, మంచాలు, తలుపులు శుభ్రం చేయాలి.నెలకోసారి వాటర్ ట్యాంకులను క్లీన్ చేయాలి. మరుగుదొడ్లు, మూత్ర శాలల్లో రోజుకోసారి బ్లీచింగ్ చల్లాలి. దీన్ని శానిటేషన్ ఏజెన్సీలు ఇవేవీ పట్టించుకోవడం లేదు. వార్డులను తడిగుడ్డతో ఊడ్చుతున్నారే తప్ప కనీసం ఫినాయిల్ కూడా వాడటం లేదు. వార్డుల్లో డస్ట్బిన్లు ఏర్పాటు చేయాలనే నిబంధన ఉన్నా ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. ఉస్మానియాలో అవినీతి ‘కంపు’ కాంట్రాక్టర్ల అవినీతి, అధికారుల నిర్లక్ష్యం, ప్రభుత్వ ఉదాసీనత, పర్యవేక్షణ లోపం వెరసి ‘ఉస్మానియా’ రోగుల పాలిట శాపంగా మారుతోంది. ఆస్పత్రిలో పారిశుద్ధ్యం కోసం నెలకు రూ.29 లక్షలు ఖర్చు చేస్తున్నారు. ఇక్కడ 270 మందికి 200 మందికి మించి కార్మికులు లేరు. దీంతో ఓపీతో పాటు ఇన్ పేషంట్ వార్డుల్లో చెత్త పేరుకు పోయి తీవ్ర దుర్వాసన వె దజల్లుతున్నాయి. క్యాజువాలిటీ వెనుక భాగంలోని ఎన్ఐసీయూ పక్కనే టాయిలెట్లు పొంగుతున్నాయి. వార్డుకు సమీపంలోనే మూత్ర విసర్జన చేస్తుండటంతో ఆ పరిసరాలు దారుణంగా ఉన్నాయి. అవుట్ పేషంట్ వార్డుతో పాటు కులీ కుతుబ్‌షా భవనంలో డ్రైనేజ్ లీకవుతోంది. వార్డుల్లో చుట్టూ మురుగునీరు ప్రవహిస్తోంది. ఎలుకలు, పందికొక్కులు స్వైరవిహారం చేస్తున్నాయి. వాటర్ ట్యాంక్‌లను శుభ్రం చేయక పోవడంతో నీరు తాగిన రోగులు కొత్త రోగాలు తెచ్చుకుంటున్నారు. సిరెంజ్లు, బ్లేడ్స్ వంటి క్లినికల్ వ్యర్థాలను వార్డుల్లోనే వదిలేస్తున్నారు. మారని ‘గాంధీ’ తీరు.. గాంధీ జనరల్ ఆస్పత్రిలో పారిశుద్ధ్య నిర్వహణ పనులకు ప్రభుత్వం నెలకు రూ. 23.7 లక్షలు ఖర్చు ఖర్చు చేస్తోంది. కానీ రోజుల తరబడి వ్యర్థాలను తొలగించక పోవడంతో వార్డులు చెత్త కూపాలుగా మారిపోయాయి. ఇక్కడ బయో మెడికల్ వ్యర్థాల నిర్వాహణ దారుణంగా ఉంది. ఆస్పత్రి ఆవరణలో క్లినికల్ ప్లాంట్ ఉన్నా.. అధికారుల నిర్లక్ష్యం వల్ల మూలనపడింది. లేబర్ రూమ్‌తో పాటు పలు వార్డుల్లోని పారి శుద్ధ్య నిర్వాహణ అత్యంత అద్వానంగా మారింది. ఇటీవల రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ సైతం ఆస్పత్రిలో ఆకస్మిక తనిఖీ చేసి పారిశుద్ధ్య నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సాక్షాత్తూ గవర్నర్ హెచ్చరించినా ఆస్పత్రిలోని పారిశుద్ధ్య నిర్వహణ తీరు మాత్రం మారకపోవడం గమనార్హం. ‘పేట్లబురుజు’లో నిర్లక్ష్యం.. బహదూర్‌పురా: పేట్లబురుజులోని ప్రభుత్వ ఆధునిక ప్రసూతి ఆస్పత్రిని లేబర్ రూంలో పారిశుద్ధ్యం అత్యంత దారుణంగా ఉంది. ఇక్కడ పేరుకుపోతున్న చెత్తను ఎప్పటికప్పుడు తొలగించడం లేదు. ఆవరణలోని క్యాంటీన్ బయట డ్రైనేజీ మురుగునీరు నిలిచిపోతున్నా సరిచేసే దిక్కులేదు. రోగులకు ఆహారం సరఫరా చేసే క్యాంటీన్లోనూ అపరిశుభ్రత తాండవిస్తున్నా అధికారులు మాత్రం పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ఈ ఆసుపత్రిలో శానిటేషన్ విభాగంలో 69 మంది కార్మికులు పనిచేస్తున్నారు. వీరికి ప్రతి నెల ప్రభుత్వం రూ. 15 లక్షల నిధులను ఆల్ గ్లోబల్ సర్వీసు సంస్థ కాంట్రాక్టర్‌కు చెల్లిస్తోంది. ఆసుపత్రి వ్యర్థాలు, చెత్తను తొలగించడం, ఆసుపత్రిని పరిశుభ్రంగా ఉంచడంలో కాంట్రాక్టర్ అసలు పట్టించుకోవడం లేదు. తక్కువ సిబ్బందితో పని కానిచ్చేస్తూ చేతులు దులుపుకుంటున్నాడు. ఆరోగ్యం కోసం ఆస్పత్రికి వస్తున్న గర్భిణులు, వారి సహాయకులు అపరిశుభ్ర వాతావరణంతో రోగాల బారిన పడుతున్నారు. -
మొదటి మహిళా చెత్త ట్రక్ డ్రైవర్..!
చెత్త ఏరుకోవడంతో మొదలైన ఆమె జీవితం... ఇప్పుడు ఓ నగరంలో తొలి మహిళా ట్రక్ డ్రైవర్ స్థాయికి చేరింది. ఆత్మ విశ్వాసంతో ఆమె వేసిన ప్రతి అడుగూ అభివృద్ధి పథంలో నడిపించింది. ఇరుగు పొరుగు సాయం కూడా అందడంతో లక్ష్యాన్ని చేరుకోగలిగింది. 'హసరు డాల' అనే సంస్థ కూడా ఆమెకు వెన్నుదన్నుగా నిలిచింది. హసరు డాల అనే సంస్థ బెంగళూరులో చెత్త ఏరుకునే వారి జీవితాలను బాగుచేసేందుకు పనిచేస్తోంది. ఇప్పుడు ఇదే సంస్థ బెంగళూరుకు చెందిన లక్ష్మి అనే ఓ మహిళ జీవితంలో వెలుగులు నింపింది. కెంపెగౌడ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో హౌస్ కీపింగ్ వర్కర్ గా పనిచేస్తున్న లక్ష్మికి చేయూతనిచ్చింది. చెత్తను ఏరుకొంటూ బతుకు బండిని ఈడుస్తున్న లక్ష్మికి.. ముగ్గురు పిల్లలు. చిన్న వయసులోనే వివాహం ఆమెకు వివాహం అయింది. భర్త మద్యానికి బానిస కావడంతో తీవ్ర కష్టాలను ఎదుర్కొంటుంది. కూతురు ప్రతిభ కూడ స్కూల్ డ్రాపవుట్ గా మారింది. దీంతో 15 ఏళ్ళ వయసున్న ప్రతిభను కూడ లక్ష్మి హసిరు డాలలో చేర్పించింది. అక్కడ ఆమె కుట్టు పనిలో శిక్షణ పొందుతోంది. ఇద్దరు కొడుకుల్లో పన్నెండేళ్ళ ధనుష్, పదేళ్ళ ఆకాష్ రెసిడెన్షియల్ పాఠశాలలో చదువుకుంటున్నారు. అయితే, చెత్త ఏరుకునే లక్ష్మికి ఎలాగైనా డ్రైవింగ్ నేర్చుకోవాలన్న ఆశ ఉండేది. కానీ డ్రైవింగ్ స్కూల్ కు ఫీజు కట్టలేకపోవడంతో ఆమెకు తెలిసిన ఓ మహిళ ద్వారా హసిరు డాల సంస్థలో చేరి డ్రైవింగ్ నేర్చుకోవడమే కాకుండా డ్రైవింగ్ లైసెన్స్ కూడా పొందింది. అంతేకాకుండా త్వరలో బెంగళూరు నగరంలోనే మొదటి మహిళా చెత్తలారీ డ్రైవర్‌గా మారనుండటంతో ఆమె ఎంతో సంతోషిస్తోంది. ప్రస్తుతం లక్ష్మి ఒక టన్ను బరువైన ట్రక్ నడిపేందుకు డ్రైవింగ్ లో శిక్షణ పొందింది. వాణిజ్య పరమైన వాహనాలను నడిపేందుకు అనుమతిని పొందాల్సి ఉంది. చెత్త ఏరుకునే తనకు హసరుడాల సంస్థ సహకారం అందించడం వల్లే తన కల నెరవేరిందని చెప్తోంది. బెంగళూరుకు చెందిన హసిరుడాల సంస్థ వ్యర్థ పదార్థాలను సేకరించే కార్మికులకు చేయూతనిచ్చి వారిని వేస్ట్ మేనేజ్మెంట్ ఉద్యోగులుగా మార్చేందుకు కృషి చేస్తోంది. అంతేకాదు నగరంలో వ్యర్థ పదార్థాల నిర్వహణ సేవలను కూడా అందిస్తోంది. స్థానిక కార్మికులు విభజించిన వ్యర్థాలను సేకరించి, వాటిని ప్రాసెసింగ్ యూనిట్లకు రవాణా చేస్తోంది. -
రూ.47 కోట్ల సరుకును గాలికొదిలేసారు
-
గెలిపించని సెంచరీ వృథా: రోహిత్
పెర్త్: కొన్నిసార్లు అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడినప్పటికీ... జట్టు ఓడిపోయినప్పుడు ఆటగాడికి సంతృప్తి ఉండదని తొలి వన్డేలో సెంచరీ చేసిన రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. ఇలాంటి మ్యాచ్‌ల్లో చేసిన శతకానికి పెద్దగా ప్రాధాన్యం ఉండదన్నాడు. ‘సిరీస్‌ను సానుకూల దృక్పథంతో ప్రారంభించడానికి ఓ మంచి ఇన్నింగ్స్ అవసరం. నేను కూడా అదే పని చేశాను. కానీ చివరకు మ్యాచ్ గెలవకపోవడంతో నిరాశకు గురయ్యా. గెలవనప్పుడు ఎన్ని పరుగులు చేసి ఏం లాభం. వ్యక్తిగతంగా జట్టుకు శుభారంభం ఇచ్చాననే అనుకుంటున్నా. ఇక్కడి నుంచి అదే ఊపును కొనసాగిస్తే బాగుంటుంది’ అని రోహిత్ పేర్కొన్నాడు. మెరుగైన ఆరంభం లభించాక దాన్ని చివరి వరకు బాగా కొనసాగించానని సంతృప్తి వ్యక్తం చేశాడు. -
రోగుల నోట్లో బురద!
{పభుత్వ దవాఖానాల్లో ‘మంచి’నీరు కరువు నెలల తరబడి క్లీన్ చేయని వాటర్ సంపులు ట్యాంకుల్లో నాచు, పక్షుల వ్యర్థాలు, తోక పురుగులు కుళాయిల నుంచి రంగుమారిన నీరు సరఫరా సిటీబ్యూరో: నగరంలోని ప్రధాన ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులు, వారి బంధువులు తాగేందుకు గుక్కెడు నీళ్లు కూడా సరిగా దొరకడం లేదు. అసలే రోగంతో ఆస్పత్రికి వస్తున్న వారు ఇక్కడి అపరిశుభ్రమైన నీరు తాగి మరిన్ని ఇక్కట్లకు గురవుతున్నారు. మొత్తమ్మీద వైద్యాధికారులు, కాంట్రాక్టర్లు కలిసి రోగుల నోట్లో బురద చల్లుతున్నారు. రోజుల తరబడి వాటర్ ట్యాంకులను శుభ్రం చేయక పోవడం, ట్యాంకులపై మూతల్లేకపోవడంతో దుమ్ముదూళి కణాలు నీటిలో చేరడంతో పాటు పిచ్చుకల మలవిసర్జన, తోక పురుగులు, బురద తేలిఆడుతోంది. తెలియక ఈ నీరు తాగిన వారు వాంతులు, విరేచనాలతో బాధపడుతూ మళ్లీ అదే ఆస్పత్రిలో చేరుతున్నారు. నగరంలోని ప్రతిష్టాత్మాక ఉస్మానియా, గాంధీ, నిమ్స్, నిలోఫర్, ఈఎన్టీ, సుల్తాన్‌బజార్, పేట్లబురుజు, ఫీవర్ ఆస్పత్రుల్లో నిర్వహణ లోపం వల్ల ఒక్కో నీటి సంపు అడుగు భాగంలో భారీగా బురుదనీరు పేరకపోయి కుళాయిల నుంచి రోగులకు సరఫరా అవుతోంది. ఉస్మానియా ట్యాంకుల్లో పిచ్చుకల వ్యర్థాలు ఉస్మానియా జనరల్ ఆస్పత్రి అవుట్పేషంట్ విభాగానికి ప్రతి రోజూ 2000-2500 మంది రోగులు వస్తుంటారు. ఇన్‌పేషంట్ విభాగాల్లో నిత్యం 1500 మంది చికిత్స పొందుతుంటారు. వీరికి సహాయకులుగా మరో వెయ్యిమంది ఉంటారు. వైద్య సిబ్బంది మరో రెండు వేలు ఉంటారు. రోజుకు 50 లక్షల లీటర్లకుపై గా నీరు అవసరం కాగా 29,47,640 లక్షల లీటర్లు సరఫరా అవుతోంది. వీటిని 14 ట్యాంకుల్లో నిల్వ చేస్తున్నారు. ట్యాంకులకు మూతల్లేక పోవడంతో దుమ్ము, ధూళీ వచ్చి చేరుతోంది. పావురాల మలవిసర్జన నీటిపై తేలిఆడుతోంది. మల, మూత్ర విసర్జన అవ సరాలకు మినహా ఇతర అవసరాలకు వినియోగించడం లేదు. కలుషిత నీరుతాగి మూడేళ్ల క్రితం 40 మంది నర్సింగ్ విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురైన విషయం అప్పట్లో పెద్ద సంచలనమే సృష్టించింది. ట్యాంకులను ప్రతి పదిహేను రోజులకోసారి బ్లీచింగ్‌తో శుభ్రం చే యాల్సి ఉన్నా కనీసం నెలకోసారి కూడా చేయడం లేదు. నీటి నాణ్యతను ఎప్పటికప్పుడు పరి శీలించాల్సిన ఆర్‌ఎంఓలు వాటిని పట్టించుకోవడం లేదు. గాంధీ మంచినీటి ట్యాంకుల్లో ఈ కొలి బ్యాక్టీరియా ఆసియాలోనే అతిపెద్ద ఆస్పత్రిగా గుర్తింపు పొందిన గాంధీ జనరల్ ఆస్పత్రిలో కూడా మంచినీటికి కటకటే. ఎప్పటికప్పుడు ట్యాంకులను శుభ్రం చేయకపోవడంతో నీటిపై నాచు తేలుతోంది. కుళాయిల నుంచి సరఫరా అవుతున్న నీటిలో ఈ కొలి బ్యాక్టీరియా ఉండటంతో తాగడానికి పనికిరావడం లేదు. మరుగుదొడ్లను శుభ్రం చేసేందుకు సరిపడు నీరు సరఫరా కాకపోవడంతో దుర్వాసన వెదజల్లుతున్నాయి. వైద్యులే కాదు ఎవరైనా రోగులు మందు బిల్ల వేసుకునేందుకు మంచినీరు కావాలంటే పైసలు పెట్టి కొనుక్కోవాల్సిందే. సంపులు క్లీన్ చేయకపోవడం వల్లే.. కంటి ఆస్పత్రి ఘటనపై ప్రభుత్వానికి జలమండలి నివేదిక సరోజినిదేవి కంటి ఆస్పత్రిలో ఇటీవల బురుద నీరు సరఫరా కావడం, 250కిపైగా శస్త్రచికిత్సలు నిలిచిపోవడం తెలిసిందే. బురద నీరు సరఫరా చేయడం వల్లే శస్త్రచికిత్సలు నిలిపివేసినట్లు ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. ఆ తర్వాత జలమండలి అధికారులు ఏడు ప్రాంతాల్లో శాంపిల్స్ సేకరించి, పరీక్షించగా అసలు విషయం బయట పడింది. ఆస్పత్రిలోని వాటర్ ట్యాంకులను నెలల తరబడి క్లీన్ చేయకపోవడం వల్లే ట్యాంకు అడుగు భాగంలో ఐదు ఇంచుల మేర బురద మట్టి పేరుకపోయింది. ట్యాంక్‌లోని నీరు ఖాళీ అవడంతో బురద నీరు కుళాయిల్లోకి వచ్చి చేరింది. ఎప్పటికప్పుడు ట్యాంకులను క్లీన్ చేయకపోవడమే ఈ ఘటనకు కారణమని జలమం డలి అధికారులు స్పష్టం చేశారు. ఆ మేరకు ప్రభుత్వానికి నివేదిక కూడా అందజేశారు. ఆస్పత్రుల్లో పారిశుద్ధ్య నిర్వహణ కోసం ప్రభుత్వం లక్షలు ఖర్చు చేస్తున్నప్పటికీ అధికారులు పర్యవేక్షణ లోపం వల్ల అవి బూడిదలో పోసిన పన్నీరు చందంగా మారాయి. మంచినీరు కొనాల్సిందే గోలి వేసుకుందామంటే గుక్కెడు మంచి నీళ్లు దొరకడం లేదు. దాహమేస్తే చాలు ఖాళీ సీసాలు పట్టుకుని రోడ్డువెంట పరుగెట్టాల్సి వస్తుంది. అక్కడక్కడా ఫ్రిజ్‌లు కన్పించినా తాగు నీరు దొరకడం లేదు. ఉన్న నీరు కూడా కలుషితం కావడంతో తాగేందుకు పనికి రావడం లేదు. డబ్బులు పెట్టి మంచినీళ్లను కొనుక్కోవాల్సి వస్తోంది. - జి.శ్రీనివాస్ యాదవ్, మంగళ్‌హట్ -
ఆపరేషన్ వినాయక!
యుద్ధప్రాతిపదికన హుస్సేన్‌సాగర్ ప్రక్షాళన వ్యర్థాల తొలగింపునకు రంగంలోకి హెచ్ఎండీఏ 200 మంది వర్కర్లు, 10 లారీలు, 3జేసీబీల ఏర్పాటు సిటీబ్యూరో : గౌరీ సుతుడు గంగ ఒడికి చేరడంతో నిమజ్జనోత్సవ ఘట్టం ముగిసింది. జంటనగరాల్లోని వేలాది వినాయక విగ్రహాలు సోమవారం రాత్రి 10 గంటల వరకు హుస్సేన్‌సాగర్‌లో నిక్షిప్తమయ్యాయి. వీటి తాలూకూ వ్యర్థాలను యుద్ధప్రాతిపదికన తొలగించేందుకు హెచ్ఎండీఏ చర్యలు చేపట్టింది. సాగర్‌ను జల్లెడ పట్టి నిమజ్జన వ్యర్థాలను వెలికితీసే కార్యక్రమాన్ని అధికారులు సోమవారం అర్థరాత్రి నుంచే ప్రారంభించారు. ప్రత్యేకించి ఎన్టీఆర్ మార్గ్‌లోని 9 ప్లాట్‌ఫారాల వద్ద నిమజ్జనం చేసిన గణేశ్ విగ్రహాల తాలూకు అవశేషాలు, పూలు పత్రి ఇతర చెత్తాచెదారాన్ని సమూలంగా గట్టుకు చేరుస్తున్నారు. నిమజ్జన విగ్రహాలు నీటి అడుగు భాగానికి జారిపోకుండా ఎప్పటికప్పుడు డీయూసీ, ఫ్లోటింగ్ పాంటూన్ ద్వారా వెలికితీసి కుప్పలుగా చేశారు. ఈ వ్యర్థాలను లారీల ద్వారా కవాడీగూడలోని జీహెచ్ఎంసీ డంపింగ్ యార్డుకు తరలించేందుకు పక్కాగా ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం 200 మంది కార్మికులు, 10 లారీలను వినియోగిస్తున్నట్లు సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. వ్యర్థాలను మూడు రోజుల్లోనే తొలగించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఎన్టీఆర్ మార్గ్ వైపు 4500 టన్నులు, ట్యాంకుబండ్ వైపు 6-7 వేల మెట్రిక్ టన్నుల మేర వ్యర్థాలు ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎన్టీఆర్ మార్గ్‌లోని 9 ఫ్లాట్ ఫారాల వద్ద ఇప్పటికే 1500 మెట్రిక్ టన్నుల వ్యర్థాలను తొలగించిన అధికారులు మిగిలిన వాటిని తొలగించేందుకు మూడు రోజుల పాటు షిఫ్టుల వారీగా 24 గంటలూ పనులు నిర్వహించేలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తున్నారు. బండ్‌కు భరోసా ఏదీ ? హుస్సేన్‌సాగర్‌లో ట్యాంకుబండ్, ఎన్టీఆర్ మార్గ్‌ల వైపు వినాయక విగ్రహాలను నిమజ్జనం చేస్తున్నా... ఎన్టీఆర్ మార్గ్ వైపు మాత్రమే ప్రక్షాళన పనులు చేపట్టడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ఎన్టీఆర్ మార్గ్ వైపున నిమజ్జనం చేసిన విగ్రహాలను మాత్రమే తొలగించే పనులకు హెచ్ఎండీఏ అధికారులు పరిమితమయ్యారు. హుస్సేన్‌సాగర్‌లో ట్యాంకు బండ్ వైపున నీళ్లలో పడుతున్న విగ్రహాలను వెలికితీసే విషయాన్ని ఎవరూ పట్టించుకోవట్లేదు. అది లోతైన ప్రాంతం కావడంతో పూడిక తొలగింపు వ్యవహారం అంత సులభం కాదన్న విషయాన్ని కారణంగా చెబుతూ కొన్నేళ్లుగా దాటవేస్తున్నారు. ఏటా అక్కడ పడుతున్న విగ్రహాల వల్ల పూడిక భారీగా పేరుకుపోతోంది. ఇది ట్యాంకు బండ్ ఉనికికే ప్రమాదమని, నీటి నిల్వ సామర్థ్యం కూడా గణనీయంగా తగ్గిపోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
బోరుబావులను వృథాగా వదిలేస్తే చర్యలు
చందంపేట: ఎవరైనా బోరు వేయించి.. వృథాగా వదిలేస్తే చర్యలు తీసుకుంటామని నల్లగొండ జిల్లా చందంపేట మండలం ఎస్ఐ నాగభూషణ్‌రావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆదివారం జిల్లాలోని పెద్దవూరలో ఆడుకుంటూ వెళ్ళిన చిన్నారి బోరుబావిలో పడి మృతి చెందడం బాధాకరమన్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ ఓ ప్రకటన విడుదల చేశారు. నిరుపయోగంగా ఉన్న బోరుబావులను విధిగా పూడ్చనట్లయితే బోర్‌వెల్స్ నిర్వాహకులపై, పొలంలో వేసిన రైతులపై కేసులు నమోదు చేస్తామని ఎస్ఐ నాగభూషణరావు ఈ సందర్భంగా హెచ్చరించారు. -
వ్యర్థాలతో గోదావరి కలుషితం
ఏటూరునాగారం/ములుగు: భక్తు లు గోదారమ్మకు దీప ఆరాదన కో సం తీసుకొస్తున్న అరటి తొక్కలు పూజల అనంతరం నదిలోనే వదులుతున్నారు. అలా చేయొద్దని అధికారులు చెప్పినా ఎవరూ పట్టించుకోవడంలేదు. ఫలితంగా గోదావరి నీరు కలుషితమవుతున్నారుు. ఆకట్టుకుంటున్న ప్రదర్శనలు రామన్నగూడెం ఘాట్‌లో చిందు, యక్షగాణ కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకుంటున్నారుు. జిల్లా సమాచార పౌర సంబంధాలశాఖ ఆధ్వర్యంలో గత11 రోజుల నుంచి ఘాట్ వద్ద ప్రతిరోజూ రాత్రి కళాకారులతో భాగవతం, రామాయణం, మహాభారతం నాటకాల ద్వారా భక్తులకు వివరిస్తున్నారు. అంతే కాకుండా ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, పుష్కరాల్లో భక్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను జానపద పాట ల ద్వారా వివరిస్తున్నారు. పుష్కరాల సందర్భంగా భక్తులకు వివిధ వేశ భాషలతో ప్రదర్శించడం మాకు ఎంతోసంతోషంగా ఉందని దేవ రుప్పుల మండలం అప్పరెడ్డి పల్లి గ్రామానికి చెందిన గడ్డం సమ్మయ్య తెలిపారు. -
వ్యర్థ వేదన
కొనసాగుతున్న పారిశుద్ధ్య కార్మికుల సమ్మె చెత్త కుప్పలుగా పట్టణాలు తుతూమంత్రంగా {పత్యామ్నాయ చర్యలు రంజాన్ దృష్ట్యా కొన్ని చోట్ల పట్టు సడలించిన కార్మికులు జిల్లా వ్యాప్తంగా పొంచి ఉన్న వ్యాధులు తిరుపతి నగరంతో పాటు ప్రధాన పట్టణాల్లో రోడ్లపైనే వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. పారిశుద్ధ్య కార్మికుల సమ్మె కారణంగా వీధులన్నీ దుర్గంధభరితంగా మారాయి. దీనికితోడు జిల్లాలో వర్షం కురుస్తుండడంతో చెత్త నుంచి వస్తున్న దుర్వాసనతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. చాలా ప్రాంతాల్లో ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. అంటు వ్యాధులు వ్యాపించే అవకాశం ఉందని జనం ఆందోళన చెందుతున్నారు. తిరుపతి: తిరుపతి నగరంతో పాటు జిల్లాలోని మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్య కార్మికులు వారం రోజులుగా సమ్మె చేస్తుండడంతో పారిశుధ్ధ్యంపై పెను ప్రభావం చూపుతోంది. వీధుల్లో ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోయి దుర్గంధం వ్యాపిస్తోంది. రంజాన్ పండుగను దృష్టిలో ఉంచుకుని మున్సిపల్ కార్మికులు మదనపల్లెలో రెండు రోజులపాటు సమ్మె సడలించారు. చిత్తూరు కార్పొరేషన్లో మేయర్ కఠారి అనురాధ జరిపిన చర్చలు సఫలం కావడంతో కార్మికులు విధులకు హాజరవుతున్నారు. శ్రీకాళహస్తిలో బుధవారం సాయంత్రమే సమ్మె విరమించి కార్మికులు విధుల్లో చేరారు. పలమనేరు మున్సిపాలిటీ కార్యాలయం వద్ద కార్మికులు వంట వార్పు చేసి ఆందోళన చేపట్టారు. తిరుపతి నగరంలో కార్పొరేషన్ కార్యాలయం ఎదుట గురువారం కార్మికులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. వారికి వైఎస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర రెడ్డి మద్దతు తెలిపారు. తిరుపతి నగరంలో యాత్రికులను దృష్టిలో ఉంచుకుని కొన్నిచోట్ల మాత్రమే చెత్తను తొలగిస్తున్నారు. మిగిలిన ప్రాంతాల్లో పరిస్థితి దుర్భరంగా మారింది. పుంగనూరు కార్యాలయం ఎదుట గురువారం కార్మికులు నిరసన దీక్ష చేపట్టారు. వారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజక సమన్వయకర్త పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి సంఘీభావం తెలిపారు. రెండురోజుల్లో సమస్యను పరిష్కరించపోతే పార్టీ తరపున ఆందోళన చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పుత్తూరు, నగరిలో మున్సిపల్ కార్మికులు ఆందోళనలు కొనసాగించారు. పొంచిఉన్న వ్యాధులు పేరుకుపోయిన చెత్తకు, వర్షం తోడవడంతో దోమలు వృద్ధి చెంది మలేరియా, డెంగీ వంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారులు హెచ్చరిస్తున్నారు. దీనికితోడు డ్రెయిన్లు పొంగి ప్రవహిస్తుండడంతో అతిసార, టైఫాయిడ్, విష జ్వరాల బారిన పడే అవకాశం ఉంది. ఇప్పటికే జిల్లాలోని పలు ప్రాంతాల్లో అంటువ్యాధులు, జ్వరాలతో జనం ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. -
స్వచ్ఛ సాగర్..!
హుస్సేన్‌సాగర్‌లోని నీరు సాఫీగా వెళ్లేందుకు చర్యలు తూముల్లో ముమ్మరంగా పూడికతీత అధికారికంగా ప్రారంభంకాకున్నా వేగంగా పనులు లోతట్టు ప్రాంతాలకు ముప్పు లేదంటున్న నిపుణులు సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరానికి మణిహారమైన హుస్సేన్‌సాగర్ ప్రక్షాళన పనులు ప్రారంభమయ్యాయి. ‘మిషన్ హుస్సేన్‌సాగర్’ పేరిట తలపెట్టిన కార్యక్రమం అధికారికంగా ప్రారంభం కాకున్నా పది రోజులుగా తూముల్లో పూడికతీత పనులు వేగంగా సాగుతున్నాయి. దీర్ఘకాలంగా పూడుకుపోయిన తూముల్లోని చెత్త, ఇతరత్రా వ్యర్థాల తొలగింపును అధికారులు చేపట్టారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలోని నీటిపారుదల విభాగం ఈ పనుల్ని పర్యవేక్షిస్తోంది. హుస్సేన్‌సాగర్‌లోని మొత్తం నీటిని వేసవిలోనే తోడేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించినా.. అధికారికంగా ఆ పనులు ప్రారంభం కాలేదు. నీటిని ఖాళీ చేయాలంటే ఎదురయ్యే సమస్యలు, ఇతరత్రా అంశాల్ని అంచనా వేస్తున్న అధికారులు ముందస్తు చర్యలపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా రసాయన వ్యర్థాలను సాగర్‌లోకి వదిలే ఎలక్ట్రోప్లేటింగ్ పరిశ్రమలను నగరం నుంచి శివారులోని మెదక్ జిల్లాలోకి తరలించేందుకు కాలుష్య నియంత్రణ మండలి చర్యలు చేపట్టింది. మరోవైపు సాగర్‌ను ఖాళీ చేయడానికి ముందు అందులోని నీరు దిగువకు సాఫీగా వెళ్లాలంటే చేయాల్సిన పనులపై జీహెచ్ఎంసీ దృష్టి సారించింది. వాస్తవానికి ప్రతి ఏటా నిర్ణీత వ్యవధుల్లో ఈ పనులు చేయాల్సి ఉన్నా కొంతకాలంగా అధికారులు ఈ అంశాన్ని విస్మరించారు. తూముల్లోని నీటి విడుదల.. హుస్సేన్‌సాగర్ నుంచి నీరు దిగువకు వెళ్లేందుకు మొత్తం ఆరు ప్రాంతాల్లో తూములున్నాయి. మారియట్(ఒకప్పటి వె స్రాయ్)హోటల్ వద్ద, దోబీఘాట్ వద్ద, పాత ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కార్యాలయం, జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద ఇవి ఉన్నాయి. ప్రస్తుతం మారియట్ హోటల్‌కు సమీపంలోని నాలుగు తూముల్లో పూడికతీత, వ్యర్థాలు, మట్టికుప్పలు, బండరాళ్లను తొలగించే పని చేపట్టారు. దీంతో నీరు దిగువకు ప్రవహించేందుకు కొద్దిమేర మార్గం సుగమమైంది. ప్రస్తుతం రోజుకు సగటున 250 క్యూసెక్కుల నీరు వరకు వెళుతోంది. పూడికతీత పూర్తయితే మరింత నీరు వెళ్లనుంది. వర్షాకాలంలోగా తూములన్నీ సవ్యంగా పనిచేసేలా అధికారులు ప్రస్తుతం చర్యలు చేపట్టారు. హుస్సేన్‌సాగర్‌లో గరిష్ట నీటి మట్టం (ఎఫ్టీఎల్) సామర్ధ్యం 513.41 మీటర్లు కాగా.. ప్రస్తుతం 512.5 మీటర్లుగా ఉంది. ఈ వేసవిలో జలాశయాన్ని పూర్తిగా ఖాళీ చేయడం సాధ్యం కానందున నిర్ణీత మట్టం వరకే నీటిని సహజసిద్ధంగా బయటికి వదిలేలా చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా చేపట్టిన పనులతో దిగువకు విడుదలవుతున్న నీటివల్ల లోతట్టు ప్రాంతాలు, బస్తీలకు ముప్పు లేదని ఇంజనీరింగ్ నిపుణుడొకరు చెప్పారు. త్వరలో కూకట్పల్లి నాలా మళ్లింపు పనులు.. కూకట్పల్లి, జీడిమెట్ల నాలాల నుంచి రోజువారీగా వచ్చి చే రుతున్న 400 మిలియన్ లీటర్ల పారిశ్రామిక వ్యర్థాలు సాగర్‌లోకి చేరకుండా చూసేందుకు రూ.43 కోట్ల అంచనా వ్యయంతో చేపడుతున్న కూకట్పల్లి నాలా డైవర్షన్ పనులను జలమండలి త్వరలో ప్రారంభించనుంది. మొత్తం నాలుగు ప్యాకేజీలుగా విభజించిన పనులకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ పూర్తయింది. ఎంపికైన ఏజెన్సీలకు రెండు, మూడు రోజుల్లో పనులు చేపట్టేందుకు వీలుగా వర్క్ ఆర్డర్లు ఇవ్వనున్నట్లు జలమండలి వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. ఈ నాలాల మళ్లింపు కారణంగా బల్క్ డ్రగ్, ఫార్మా కంపెనీల నుంచి వచ్చే రసాయన వ్యర్థాలు సాగర్‌లోకి చేరవు. ఈ నీటిని నేరుగా అంబర్‌పేట్‌లోని జలమండలి మురుగుశుద్ధి కేంద్రానికి తరలించి హానికారక మూలకాలను తొలగించిన అనంతరం మూసీలోకి వదలనున్నారు. సాగర్.. గతమెంతో ఘనం.. కుతుబ్‌షాహీల కాలంలో నగర ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఇబ్రహీం కులీకుతుబ్‌షా 1562వ సంవత్సరంలో హుస్సేన్‌సాగర్ జలాశయాన్ని నిర్మించారు. హజ్రత్ హుస్సేన్‌షా వలీ అనే ఇంజనీర్ పర్యవేక్షణలో అద్భుత ఇంజనీరింగ్ ప్రతిభతో జలాశయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. నిజాంల కాలంలోనూ ఈ జలాశయం నగరవాసుల దాహార్తిని తీర్చింది. అప్పట్లోనే తాగునీరు, వ్యర్థజలాల వినియోగానికి సంబంధించి రెండు పైప్‌లైన్ వ్యవస్థలు.. ట్రంక్మెయిన్ పైప్‌లైన్ 1, 2 (డ్యుయల్ పైపింగ్సిస్టమ్) ఉన్నాయి. 18వ శతాబ్దం నాటికే ప్రపంచ దేశాలకు మన నగరం ఆదర్శంగా నిలిచిందని, ప్రస్తుతం అమెరికా, జపాన్, సింగపూర్ వంటి దేశాల్లో ద్వంద్వ పైపుల వ్యవస్థ అభివృద్ధి చెందిందని ఇంజనీరింగ్ నిపుణులు తెలిపారు. నేటికీ వినియోగం.. ఈ పురాతన పైప్‌లైన్ 400 డయామీటర్ల వ్యాసార్థంలో ఉన్నట్లు జలమండలి ఇంజనీరింగ్ విభాగం అధికారులు ‘సాక్షి’కి తెలిపారు. అప్పట్లో ఆర్సీసీ(రీఇన్ఫోర్స్డ్ సిమెంట్ కాంక్రీట్)తో ఈ పైప్‌లైన్‌ను పకడ్బంధీగా రూపొందించారు. భూమట్టానికి 30 అడుగుల లోతు నుంచి ఈ పైప్‌లైన్ ఉన్నట్లు అంచనా. దీని పొడవు సుమారు 15 కిలోమీటర్లు. 19వ శతాబ్దం తొలినాళ్ల నుంచి నేటి వరకు.. అంటే సుమారు శతాబ్దకాలానికి పైగా సాగర్ జలాశయం నుంచి రావాటర్‌ను వినియోగిస్తున్న ఉద్యానవనాలు, భవంతులు, పరిశోధనశాలలు ఇతర ప్రజోపయోగ భవనాలు సుమారు 50 వరకు ఉన్నాయి. వీటికి ఇప్పటికీ రావాటర్ సాగర్ నుంచే అందుతుండటం విశేషం. ఉస్మానియా వర్సిటీ ల్యాండ్‌స్కేప్ గార్డెన్, పబ్లిక్‌గార్డెన్‌లోని హరిత తోరణం, కోఠి ఉమెన్స్ కళాశాల, హిందీ మహావిద్యాలయం, కోఠి మెడికల్ కళాశాల, అజామాబాద్ పారిశ్రామికవాడలోని పలు పరిశ్రమలు, వైఎంసీఏ, కింగ్ కోఠి ప్రాంతంలోని పలు భవంతులకు సాగర్ రావాటర్ పైప్‌లైన్ సౌకర్యం ఉండటం గమనార్హం. -
వేస్ట్ & బెస్ట్
వేస్ట్ బాటిల్స్, విరిగిపోయిన వాటర్పైప్స్, పనికిరాని టైర్స్, చెడిపోయిన సీడీస్... ఇవన్నీ చేరేది డస్ట్‌బిన్‌కి. కానీ ఆ చెత్తను సరికొత్తగా ఆవిష్కరిస్తున్నారు గచ్చిబౌలికి చెందిన నివేదిత. వాటితో గృహాలంకరణ వస్తువులు, ఇంటీరియర్ పీసెస్తోపాటు కూరగాయల సాగు చేస్తూ వ్యర్థాలకు కొత్త అర్థమిస్తున్నారు. టైంపాస్‌గా మొదలైన ఈ ఇంట్రెస్టింగ్ హాబీ కెరీర్‌గా మారిన వైనం గురించి నివేదిత చెబుతున్న ముచ్చట్లు ఆమె మాటల్లోనే... ..:: శిరీష చల్లపల్లి స్కూల్డేస్నుంచే నాకు పెయింటింగ్, గార్డెనింగ్ అంటే బాగా ఇష్టం. స్కూల్లో క్లీన్ అండ్‌గ్రీన్, మొక్కలునాటడం వంటి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేదాన్ని. అది కాస్తా అనుకోకుండా పెద్దయ్యాక హాబీగా మారిపోయింది. ఆ హాబీకి క్రియేటివిటీ జోడిస్తే ఇంట్రెస్టింగ్గా ఉంటుందనుకున్నాను. వేస్ట్బాటిల్స్, డామేజ్ మగ్గులు, క్రాక్డ్ పాట్స్, ఆయిల్ టిన్నులు, స్కూల్ షూస్, పాత స్కూల్‌బ్యాగ్స్, ఎలక్ట్రిక్ బల్బ్‌లు... ఇలా చెప్పుకుంటూ పోతే ఈ సృష్టిలో పనికి రానివంటూ ఉండవేమో అనిపిస్తుంది. మొదట పనికిరాని వస్తువులను ఎమ్సీల్తో అతికించి అందమైన బొమ్మలుగా తీర్చిదిద్దేదాన్ని. డబ్బాలపైన ముగ్గులు, హిస్టారికల్ అండ్ క్లాసికల్ బొమ్మలు వేసి డెకరేట్ చేసేదాన్ని. ఇంటికి వచ్చినవాళ్లు వాటిని చూసి వావ్ అనేవారు. అది అస్సలు పనికిరాని వస్తువులతో తయారు చేశానన్న విషయాన్ని గుర్తించలేకపోయేవారు. ఆరోగ్యం... ఆదా... వారానికోసారి మార్కెట్‌కు వెళ్లి, రసాయనాలతో పండించే హైబ్రీడ్ కూరగాయలు కొని తెచ్చి ఫ్రిజ్‌లో నిల్వ చేసి తినడంకంటే నేచురల్‌గా పండించిన కూరగాయలు ఆరోగ్యానికి మేలు. ఖర్చూ తగ్గుతుంది. అందుకే టైర్లు, పాత షూస్, మగ్గుల్లో మట్టి పోసి మొక్కలు నాటి అన్ని రకాల పంటలను ఇంటిపట్టునే పండిస్తున్నాను. టమాట, మిరపకాయలు, వంకాయ, కొత్తిమీర, అన్ని రకాల ఆకు కూరలు, రంగురంగుల పూలు, పండ్లు ఇలా కొన్ని వందల చెట్లు ఉన్నాయి. టీ చేసిన తరువాత మిగిలే టీపౌడర్, గుడ్డు పెంకులు, ఆకు కూరలు, కూరగాయలు, పండ్ల తొక్కలు వంటివన్నీ కలిపి కంపోస్ట్ తయారు చేసి... ఎరువులా ఉపయోగిస్తున్నాను. ప్రతిరోజూ ఉదయాన్ని లేచి నా గార్డెన్ అంతా ఒక లుక్ వేస్తే కళ్లకు ఇంపు, మనసుకు ఆనందం. అంతేనా రోజంతా సంతోషంగా ఉంటుంది. హాబీ టు కెరీర్... ఇంటికి వచ్చి చూసిన చుట్టాలు, ఫ్రెండ్స్ మాకూ నేర్పించమనేవారు. అలా లేడీస్క్లబ్స్, ఫ్లాట్స్‌లో ఉండే ఫ్రెండ్స్‌కి నేర్పించడం మొదలుపెట్టాను. తరువాత కిటీ పార్టీస్‌కి విస్తరించాను. ఇప్పుడు కార్పొరేట్ సెక్టార్స్‌కి కూడా ట్రైనింగ్ ఇస్తున్నాను. టైంపాస్‌గా మొదలైన హాబీ ఇప్పుడు కెరీర్‌గా మారడం మానసిక ఉల్లాసాన్నిస్తోంది. -
చెత్తకు సరికొత్త రూపం..
-
బండ్‌బారుతోంది!
పూడికతో నిండుతున్న ‘సాగర్’ మొక్కుబడిగా ప్రక్షాళన బాధ్యత తీసుకోని యంత్రాంగం భారీగా చేరుతున్న వ్యర్థాలు సాక్షి, సిటీబ్యూరో: పర్యావరణ హిత వినాయకుని తయారు చేయాలని పిలుపునివ్వడం మినహా పక్కాగా ఆంక్షలు విధించలేని ప్రభుత్వ నిస్సహాయత చారిత్రక హుస్సేన్‌సాగర్‌ను కాలుష్య కాసారంలా మార్చేసింది. మట్టి వినాయక విగ్రహాల వినియోగంపై నగరంలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగినా... అనుకున్న స్థాయిలో ఆ కార్యక్రమం విజయవంతం కాలేదు. స్వచ్ఛంద సంస్థలు, పర్యావరణ ప్రేమికులు చేసిన ప్రయత్నాలు పూర్తిగా ఫలించలేదు. పీఓపీ (ప్లాస్టర్ ఆఫ్ పారిస్)తో రూపుదిద్దుకున్న గణనాథుడి భారీ విగ్రహాల సంఖ్య ఏమాత్రం తగ్గలేదు. గత సంవత్సరం కంటే అధికంగానే పీఓపీ వినాయక విగ్రహాలు సాగర్‌లో నిమజ్జనమయ్యాయి. కృత్రిమ రంగులతో కూడిన భారీ వినాయక విగ్రహాలు అధిక సంఖ్యలో నిమజ్జనం కావడంతో హుస్సేన్‌సాగర్‌లో కాలుష్యం రెట్టింపైనట్లు పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది చిన్నా పెద్దవి కలిపి 50-55 వేల విగ్రహాలు నిమజ్జనం కాగా, ఈ ఏడాది వాటి సంఖ్య 65 వేలకు పెరిగింది. సాగర్ నుంచి వెలికి తీస్తున్న వ్యర్థాల పరిమాణం కూడా అంతే స్థాయిలో ఉండడం ఆందోళన కలిగిస్తోంది. గత ఏడాది సాగర్ నుంచి 3,723 టన్నుల నిమజ్జన వ్యర్థాలను వెలికి తీయగా, ఈసారి అది 5వేల టన్నులకు పైగా ఉండొచ్చని అధికారుల అంచనా. ఓ వైపు హెచ్ఎండీఏ రూ.370 కోట్ల వ్యయంతో సాగర్ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టినట్టు చెబుతోంది. మరోవైపు ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వంటి విష రసాయన పదార్థాలతో నిర్మితమైన గణేశ్ విగ్రహాలు వేల సంఖ్యలో వచ్చి చేరాయి. వీటిని వెలికితీసే కార్యక్రమం మాత్రం మొక్కుబడిగా సాగుతోంది. ఒకవైపే శుద్ధి నిజానికి సాగర్‌లో ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్ మార్గ్‌ల వైపు వినాయక విగ్రహాలను నిమజ్జనం చేస్తున్నా... ఎన్టీఆర్ మార్గ్ వైపు మాత్రమే ప్రక్షాళన పనులు చేపట్టడం విమర్శలకు తావిస్తోంది. అటుగా వెళ్లే ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టిలో పడితే ఇబ్బందులు వస్తాయన్న ఉద్దేశంతో వాటిని తొలగించేందుకే అధికారులు ప్రాధాన్యమిస్తున్నారు. అదే ట్యాంక్‌బండ్ వైపు అయితే.... లోతు ఎక్కువగా ఉండటం వల్ల నీళ్లలో పడిన విగ్రహాల ఆచూకీ తెలియట్లేదు. ఒక్కరోజు నీటిలో నానితే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ కరిగిపోతుండటంతో వ్యర్థాలు సాగర్ గర్భంలోకి చేరుతున్నాయి. ఇలా ట్యాంక్‌బండ్ వైపు కొన్నేళ్లుగా పూడిక పేరుకుపోతోంది. అటువైపు నిర్వహణ తమకు సంబంధం లేదని హెచ్ఎండీఏ, నీళ్లున్న ప్రాంతం తమ పరిధిలోకి రాద ని జీహెచ్ఎంసీ, ఇరిగేషన్ విభాగాల అధికారులు ఎవరికివారు తప్పించుకుంటూ ఉండడంతో ట్యాంకు బండ్ భద్రతకు భరోసా లేకుండా పోయింది. అంత పరిజ్ఞానం లేదట... వినాయక నిమజ్జనోత్సవానికి భారీ మొత్తం ఖర్చు చేసిన జీహెచ్ఎంసీ ట్యాంక్‌బండ్ వైపు నిమజ్జనమైన విగ్రహాలను వెలికితీసే విషయంలో తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోంది. లోతైన ప్రాంతం కావడంతో అటువైపు పూడిక తొలగింపు అంత సులభం కాదని, ఆ పరిజ్ఞానం కూడా తమ వద్ద లేదంటూ అధికారులు కొన్నేళ్లుగా దాటవేస్తూ వస్తున్నారు. పైపైన తేలిన విగ్రహాలను డీయూసీ, బోట్ల ద్వారా గట్టుకు చేరుస్తున్నారే తప్ప, అడుగుకు చేరుకున్న వాటి జోలికి వెళ్లట్లేదు. విగ్రహాలు కొన్నిరోజులు నీటిలో నానితే ఔట్ ఫ్లోలో కొట్టుకుపోతాయంటూ కొత్త సిద్ధాంతాన్ని చెబుతున్నారు. మరోవైపు ట్యాంక్‌బండ్ వైపు నిర్వహణ మొత్తం జీహెచ్ఎంసీ, ఇరిగేషన్ విభాగాల పరిధిలో ఉండటంతో అటువైపు పూడికతీత పనులు చేపట్టేందుకు హెచ్ఎండీఏ అధికారులు విముఖత వ్యక్తం చేస్తున్నారు. మొత్తమ్మీద ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం లేని కారణంగా సాగర్ ఉనికికే ప్రమాదం వాటిల్లిందన్న విషయం సుస్పష్టం. అసలు లోపాన్ని చక్కదిద్దకుండా సాగర్ ప్రక్షాళన పేరుతో కోట్లాది రూపాయల ప్రజాధనం వృథా చేయడం ఎంతవరకు సబబో సర్కార్కే తెలియాలి. అయ్యో.... గణేశా! సాక్షి, సిటీ బ్యూరో: వినాయక చవితి ఉత్సవాలను భక్తులు ఎంత భక్తిశ్రద్ధలతో చేస్తారో... అంతే భక్తి ప్రపత్తులతో గణేశ విగ్రహాలను నిమజ్జనం చేస్తారు. ఎటొచ్చీ నిమజ్జనానంతరం జరుగుతున్న తంతుభక్తుల మనస్సులను గాయపరుస్తోంది. 11 రోజుల పాటు నీరాజనాలందుకున్న ఖైరతాబాద్ భారీ గణేశుడు ఇప్పుడు ముక్కలు చెక్కలుగా విడిపోయి ‘సాగర్’ తీరంలో కనిపిస్తుండడాన్ని భక్తులు జీర్ణించుకోలేకపోతున్నారు. వినాయకుడు పూర్తిగా నిమజ్జనం కాకుండా సాగర్ ఒడ్డునేఅవశేషాలు ఉండడంతో దీన్ని చూస్తున్న జనం అధికారుల తీరును తప్పు పడుతున్నారు. పనులు వేగిరం: కమిషనర్ హుస్సేన్‌సాగర్‌లో వినాయక నిమజ్జన పూడికతీత పనులను నిర్దిష్ట గడువులోగా పూర్తి చేయాలని హెచ్ఎండీఏ కమిషనర్ నీరభ్ కుమార్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. సాగర్‌లో వినాయక విగ్రహాల తొలగింపు పనులను బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడి సిబ్బందితో మాట్లాడుతూ ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో కూడిన విగ్రహాల వ్యర్థాలను సత్వరం గట్టుకు చేర్చాలని, లేదంటే అవి కరిగిపోయే ప్రమాదం ఉందన్నారు. నిత్యం ప్రముఖులు రాకపోకలు సాగించే ఎన్టీఆర్ మార్గ్‌ను పరిశుభ్రంగా ఉంచాలని, ఈ విషయంలో ఎక్కడా రాజీ లేకుండా పనులు నిర్వహించాలని బీపీపీ ఓఎస్డీ వి.కృష్ణకు సూచించారు. నిమజ్జనం వ్యర్థాలు 2322 మెట్రిక్ టన్నులు సాక్షి, సిటీబ్యూరో: గణేశనిమజ్జనం సందర్భంగా జీహెచ్ఎంసీలో 2,322 మెట్రిక్ టన్నుల వ్యర్థాలను జీహెచ్ఎంసీ కార్మికులు తరలించారు. గ్రేటర్లో రోజుకు సగటున 3,800 మెట్రిక్ టన్నుల వ్యర్థాలు వెలువడుతుండగా, నిమజ్జనం సందర్భంగా ఈనెల 7,8, 9,10 తేదీల్లో అదనంగా 2,322 మెట్రిక్ టన్నుల వ్యర్థాలను జవహర్‌నగర్ డంపింగ్ యార్డుకు తరలించినట్లు జీహెచ్ఎంసీ అధికారులు పేర్కొన్నారు. 7వ తేదీన 849 మెట్రిక్ టన్నులు, 8న 321, 9న 482.5, 10న 670 మెట్రిక్ టన్నుల వ్యర్థాలు తరలించారు. -
శిథిలమైన గొడారి ఆనకట్ట
నాసిరకం మరమ్మతులతో నీరు వృథా వరదలకు కొట్టుకుపోయిన ఆఫ్రాన్ గట్లు పనుల్లో అవినీతి కారణమని రైతుల ఆరోపణ అనకాపల్లి: వేలాది ఎకరాల భూములకు సాగు నీరందించాల్సిన గొడారి ఆనకట్టకు నాణ్యత లేని మరమ్మతులు చేపట్టడంతో రెండేళ్లు కాకుండానే పరిస్థితి మొదటికొచ్చింది. దిగువ భూములకు సాగునీరు అందడం లేదు. సుమారు 5 వేల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరందిస్తున్న గొడారి ఆనకట్టపై నీటిపారుదల శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎడారవుతున్న పంట భూములు శారద నది పరీవాహక ప్రాంతంలో భాగంగా పట్టణానికి దిగువన ఉమ్మలాడ, ఎన్జీఓ కాలనీ మధ్య గొడారి ఆనకట్ట ఉంది. ఈ ఆనకట్ట పరిధిలో 4,494 ఎకరాల ఆయకట్టు ఉండగా, 2150 మంది రైతుల భూములకు సాగు నీరందిస్తోంది. ఎడమవైపున్న కృష్ణంరాజు కాలువకు సాగునీటి సరఫరాకు గొడారి ఆనకట్టే కీలకం. ఇటీవల మరోవైపు పైనుంచి వస్తున్న నీటి ప్రవాహం ఎన్జీఓ కాలనీ వైపున్న గట్టును బలహీనపరుస్తూ, గండి పడేందుకు కారణమవుతోంది. దీంతో తరచూ ఎన్జీఓ కాలనీ పరిసరాలు వరద నీటిలో చిక్కుకుంటున్నాయి. 1999లో గొడారి ఆనకట్ట ప్రాధాన్యాన్ని గుర్తించి పునర్నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు నిధులు మంజూరు చేశారు. 2002లో పునర్నిర్మాణ పనులు పూర్తవడంతో ప్రారంభోత్సవం జరిగింది. మూడు నుంచి 4 ఆఫ్రాన్లు, ఎగువగోడ, దిగువగోడ, వరద గట్లు, రీచ్‌లతో గొడారి ఆనకట్టను నిర్మించారు. 2012, 2013 సంవత్సరాల్లో సంభవించిన భారీ తుపాన్లతో కుడివైపు గట్లకు గండ్లు పడ్డాయి. గొడారి ఆనకట్టను 13.48 కోట్ల నిధులతో పటిష్టపరిచేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ శంకుస్థాపన చేశారు. ఆయన హఠాన్మరణంతో పనులకు గ్రహణం ఏర్పడింది. వైఎస్ అనంతరం వచ్చిన ప్రభుత్వాలు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించాయి. నిధుల మంజూరు చేయకపోవడంతో పనులు నిలిచిపోయాయి. వేలాది మంది రైతుల ఆశలు అడియాశలయ్యాయి. మరమ్మతుల్లో అవినీతి గొడారి ఆనకట్ట పరిధిలో వరద ఉధృతికి కొట్టుకుపోయిన అఫ్రాన్‌తో పాటు రీచ్‌ల తాత్కాలిక పనులు, కుడివైపు గట్ల పటిష్టానికి చేపట్టిన పనుల్లో అవినీతి జరిగిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సుమారు రూ.32.82 లక్షలతో నిర్మించిన ఆఫ్రాన్, రీచ్‌లు స్వల్ప వ్యవధిలోనే వరద ఉధృతికి కొట్టుకుపోయాయి. సమీపంలోని ఆనకట్ట రాళ్లతో నాసిరకం పనులు చేపట్టారని రైతులు ఆరోపిస్తున్నారు. గొడారి ఆనకట్ట నుంచి భారీగా నీరు ప్రవహించినప్పుడు ఆనకట్టకు సమీపంలోని భూములపై ఇసుక మేటలు వేయడంతో అవి భారీ ఇసుక ర్యాంపులుగా మారాయి. ఆనకట్టకు ఎగువన నీరుండాల్సి ఉన్నా లీకుల వల్ల సాగునీరు వృథాగా పోతోంది. -
వ్యర్థాలకు కార్పొరేటర్ల ‘అర్థా’లే వేరులే
చెత్త తరలింపు పేరిట దోపిడీ ప్రజాప్రతినిధుల దందా ప్రజాధనం దుర్వినియోగం సాక్షి, సిటీబ్యూరో : వ్యర్థాలంటే గ్రేటర్ కార్పొరేటర్లకు ఎంతో మోజు! ఎందుకంటే వారికి ‘అర్థ’ బలం పెంపొందించేవి అవే మరి. చెత్త, నిర్మాణ వ్యర్థాల తరలింపు పేరిట బినామీ పేర్లతో లాభాలు సాధించే సాధనాలవి. అందుకే సమస్యల గురించి ఎవరెంత మొత్తుకుంటున్నా పట్టించుకోని కార్పొరేటర్లు.. పండగలొచ్చాయంటే చాలు.. వ్యర్థాల తరలింపు పనుల పేరిట అదనపు వాహనాలు.. అదనపు ట్రిప్పుల కోసం పట్టుబడుతుంటారు. పనులు మంజూరయ్యాక అద్దె వాహనాలతో తిప్పని ట్రిప్పుల్ని తిప్పినట్లు.. వినియోగించకుండానే కార్మికులను వినియోగించినట్లు రికార్డుల్లో చూపుతూ కాసులు సంపాదించుకుంటారు. ఇలా కార్పొరేటర్లు, వారికి సహకరించే అధికారులు కుమ్మక్కవుతూ జీహెచ్ఎంసీ ఖజానాకు భారీగా గండి కొడుతున్నారు. ఈ తంతు జరుగుతున్న తీరు.. అవకతవకలు ఇలా ఉన్నాయి. అవకతవకలిలా.. వర్క్ ఆర్డర్లో ఆరు టన్నుల టిప్పర్లుగా పేర్కొన చెత్త తరలింపు వాస్తవానికి రెండు టన్నులు కూడా ఉండవు. రోజుకు ఐదు ట్రిప్పులు చేయాల్సి ఉండగా.. రెండు ట్రిప్పులే నడిపి ఐదింటికి బిల్లులు పొందుతారు. ఒక్కో వాహనానికి నలుగురు కార్మికులనూ కాంట్రాక్టు ఏజెన్సీయే నియమించాలి. కానీ.. ఇద్దరిని లేదా ఒక్కరినే నియమిస్తుంది. సాధారణ రోజుల్లోనూ ఇవే నిబంధనలున్నా.. పండుగల సందర్భాల్లో అందినకాడికి అన్నట్లుగా వారం నుంచి పది రోజుల వరకు అదనపు వాహనాలను అద్దెకు తీసుకుంటారు. ఇలా అద్దెల పేరిట తీసుకునే వాహనాల్లో చాలా వరకు కార్పొరేటర్లకు చెందినవి (బినామీ పేర్లతోనూ) లేదా వారి మనుషులకు చెందినవి.. లేదా వారు సూచించిన ఏజెన్సీలవే ఉంటాయి. సొంత వాహనాలున్న వారే అద్దెకివ్వాల్సి ఉండగా.. మరొకరి దగ్గర తక్కువ ధరకు అద్దెకు తీసుకొని.. వాటినే జీహెచ్ఎంసీకి అద్దెకిస్తున్న వారూ ఉన్నారు. జీహెచ్ఎంసీ ఒక్కో వాహనానికి పది రోజులకు 50 ట్రిప్పులకు రూ.80,900 చెల్లిస్తుంది. ఇలా ఎన్ని వాహనాలైతే అంత మొత్తం చెల్లిస్తారు. ఇంత జరిగినా అసలు లక్ష్యం నెరవేరుతుందా అంటే అదీ లేదు. రహదారుల్లోని వ్యర్థాలను నిర్దేశించిన క్వారీకి తరలించాల్సి ఉండగా అలా చేయరు. ఒక చోట నుంచి వ్యర్థాలను సమీపంలోని మరో ప్రాంతానికి చేరుస్తారు. అవే వ్యర్థాలను అక్కడి నుంచి మరో చోటుకు తరలించే పేరిట మరోమారు బిల్లు పొందుతారు. ఇలా ఓ చోట నుంచి వ్యర్థాలు మరో చోటుకు మారుతున్నాయే తప్ప సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించడం లేదు. నిర్మాణ వ్యర్థాలు వెలువడేది ఎక్కువగా పాత భవనాలను కూల్చి కొత్తవి నిర్మించేటప్పుడే. సదరు వ్యర్థాలను తరలించాల్సిన భవన యజమానుల వద్ద సొమ్ము వసూలు చేస్తూ జీహెచ్ఎంసీ వాహనాల ద్వారా తరలిస్తున్న ఘనులూ ఉన్నారు. రహదారిపై నిర్మాణ వ్యర్థాలు వేసినందుకు ఒక యజమానికి ఆరేడునెలల క్రితం రూ.లక్ష జరిమానా విధించారు. అంతే అనంతరం చర్యలు నిల్. నిర్మాణ వ్యర్థాలను రీసైక్లింగ్ చేస్తే ఎంతో ప్రయోజనం. ఆ దిశగానూ చర్యలు లేవు. చెప్పేదొకటి.. జరిగేదొకటి వాహనాల ట్రిప్పుల సంఖ్యలో అక్రమాల నివారణకు జీపీఎస్ వినియోగిస్తున్నారు. దాని ద్వారా వాహనం ఎక్కడ తిరిగిందీ తెలుస్తుందే తప్ప.. డెబ్రిస్‌ను తరలించిందీ, లేనిదీ తెలియదు. జీహెచ్ఎంసీ నిర్ణయించిన క్వారీల్లో డెబ్రిస్ వేయాల్సి ఉండగా, ఎక్కడ ఖాళీ జాగా కనపడితే అక్కడ వదిలేస్తున్నారు. వ్యర్థాలు టిప్పర్లలోకి తరలించే ముందు.. అన్లోడ్ చేసేముందు ఓ ఎస్సార్టీ ద్వారా ఫొటోలు తీయలి. కానీ అమలవడం లేదు. వ్యర్థాల బరువు తూయాల్సి ఉన్నప్పటికీ తూతూమంత్రంగా తప్ప అమలు జరగడం లేదు. వ్యర్థాల తరలింపు పనులు జరిగినట్లు స్థానిక కార్పొరేటర్ల నుంచి ధ్రువపత్రం పొందాలి. కార్పొరేటర్లకూ కావాల్సింది ఇదే. వాటాలు ముడితే పత్రాలు.. లేకుంటే కొర్రీలు. దాదాపు 40 వాహనాలను ఇటీవల మిలాద్ ఉన్ నబీ సందర్భంగా అద్దెకు తీసుకున్నారు. - బహిరంగ టెండర్లను ఆహ్వానిస్తే.. తక్కువ ధరకే వాహనాలను అద్దెకిచ్చేవారున్నా, జీహెచ్ఎంసీలోని కాంట్రాక్టర్ల సిండికేట్‌కే వీటిని నామినేషన్‌పై అప్పగించారు. - ఇందుకు దాదాపు రూ. 40 లక్షలు ఖర్చుచేశారు. - ఇలా ఏటా కోట్ల రూపాయలు వ్యర్థాల పేరిట కాంట్రాక్టర్లకు కుమ్మరిస్తున్నారు. ఏం చేయవచ్చు.. బహిరంగ ప్రదేశాల్లో డెబ్రిస్ వేసేవారిపై చర్యలు తీసుకుంటే చాలా వరకు రోడ్డపై వ్యర్థాలు తగ్గుతాయి. డెబ్రిస్ తొలగింపు కోసం జీహెచ్ఎంసీ ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నట్లు గతంలో ప్రకటించింది. అవసరమైన వారు జీహెచ్ఎంసీకి ఫోన్ చేస్తే వాహనాన్ని పంపే ఏర్పాట్లు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. తద్వారా అవసరమైన వారికి సదుపాయంతోపాటు.. జీహెచ్ఎంసీకి డెబ్రిస్ తరలింపు వ్యయం తగ్గేది. -
సాగర్ ప్రక్షాళనకు మళ్లీ బ్రేక్
=వ్యర్ధాల డంపింగ్‌పై పీసీబీ అభ్యంతరం =హెచ్ఎండీఏకు తాజాగా నోటీసులు జారీ =గుట్టలుగా పేరుకుపోతున్న వెలికి తీసిన వ్యర్థాలు సాక్షి, సిటీబ్యూరో: సాగర్ ప్రక్షాళన ప్రహసనంగా మారింది. ప్రమాణాలు పాటించకుండా సాగర్ వ్యర్థాలను క్వారీల్లో డంప్ చేయడంపై కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ఈ ప్రక్రియను తక్షణం నిలిపేయాలంటూ హెచ్ఎండీఏకు నోటీసులు జారీ చేసింది. దీనిపై వివరణ ఇచ్చేందుకు శుక్రవారం (20న) పీసీబీ కార్యాలయానికి రావాలని హెచ్ఎండీఏ అధికారులకు సూచిం చింది. ఫలితంగా సాగర్ వ్యర్థాల తరలింపు ప్రక్రియకు మళ్లీ బ్రేక్ పడింది. ఇప్పటివరకు వెలికితీసిన వ్యర్థాలు ప్రస్తుతం సంజీవయ్య పార్కులో గుట్టలు గుట్టలుగా పేరుకుపోయాయి. ఈ పరిస్థితిలో ఏం చేయాలో అర్థంకాక అధికారులు జుట్టు పీక్కొంటున్నారు. ఆది నుంచి అడుగడుగునా అవాంతరాలు ఎదుర్కొంటున్న సాగర్ శుధ్ది కార్యక్రమం ఎప్పటికి పూర్తవుతుందనేది సమాధానం లేని ప్రశ్నగా మిగి లింది. హుస్సేన్‌సాగర్ ప్రక్షాళన ప్రాజెక్టులో భాగం గా బంజారా నాలా, బల్కాపూర్ నాలా, పికెట్ నాలా, కూకట్పల్లి నాలాల ముఖద్వారం వద్ద పేరుకుపోయిన వ్యర్థాలు వెలికి తీయాలని హెచ్ఎండీఏ నిర్ణయించింది. తొలిదశలో భాగంగా బంజారా, బల్కాపూర్, పికెట్ నాలా వద్ద 6.5 లక్షల క్యూబిక్ మీటర్ల మేర వ్యర్థాలను తొలగించేందుకు నడుం బిగించింది. తొలుత పికెట్ నాలా వద్ద డ్రెడ్జింగ్ కార్యక్రమాన్ని గత ఏడాది డిసెంబర్లో ప్రారంభించింది. సాగర్ నుంచి వెలికి తీసిన వ్యర్థాలను జవహర్‌నగర్‌కు తరలించాలనుకొన్నారు. అయితే... స్థానిక ప్రజల నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తం కావడంతో గచ్చిబౌలిలోని సెంట్రల్ యూనివర్సిటీ వెనుక ఉన్న క్వారీలను ఇందుకోసం ఎంపిక చేశారు. అక్కడ కూడా తీవ్ర వ్యతిరేకత ఎదురవ్వడంతో శివారులోని గాజులరామారం వద్ద 2.5 ఎకరాల్లోని క్వారీలను డంప్ సైట్‌గా నిర్ణయించారు. ఇందుకు పీసీబీ కూడా గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో 4 నెలలగా ఇక్కడి క్వారీల్లోకి సాగర్ వ్యర్థాలను తరలిస్తున్నారు. ఇప్పటికే సుమారు 20వేల టన్నుల వ్యర్థాలను క్వారీల్లో నింపారు. స్థానికుల కన్నెర్రతో... డంప్ సైట్లో తగిన జాగ్రత్తలు తీసుకోకుండా సాగర్ వ్యర్థాలను క్వారీల్లో నింపుతున్నారంటూ స్థానికులు అభ్యంతరం పెట్టారు. భారీ వర్షాలకు అది కరిగిపోయి సమీపంలోని కుంటలు, జలాశయాల్లోకి చేరుతుందని, పంట భూములు కూడా విషతుల్యం అయ్యే ప్రమాదం ఉందని ఆక్షేపిస్తూ పీసీబీకి ఫిర్యాదు చేశారు. దీంతో పీసీబీ అధికారులు గాజులరామారంలోని డంప్ సైట్‌ను సందర్శించి తాము నిర్దేశించిన నియమాలు అతిక్రమించినట్టు గుర్తించారు. ‘ఏ మాత్రం జాగ్రత్తలు పాటించకుండా శివారు ప్రాంతంలోని నీటి కుంటలు, భూములను విషతుల్యం చేస్తారా..? పశుపక్ష్యాదులతో పాటు ఆ ప్రాంత ప్రజల ఆరోగ్యం పట్టదా..? నిర్దేశిత ప్రమాణాలు పాటించకుండా ‘సాగర్’ వ్యర్థాలను క్వారీల్లో డంప్ చేయడం ఎంతవరకు సమంజసం’ అంటూ పీసీబీ తీవ్ర అభ్యంతరం తెలిపింది. వాస్తవానికి నిబంధనల ప్రకారం డంప్ సైట్ నుంచి వ్యర్థాలు కిందికి జారిపోకుండా చుట్టూ ‘క్లే లైనింగ్’ ఏర్పాటు చేయడంతో పాటు సైడ్‌వాల్‌కు 90 సెం.మీ.ల మందంతో హెచ్డీపీఈ షీట్ లైనర్ను వేయాలి. అయితే... హెచ్ఎండీఏ అధికారులు క్వారీలో కేవలం 15 సెం.మీ. మందం ఉన్న హెచ్‌డీపీ షీట్‌ను మాత్రమే వేశారు. దీంతో నిర్దేశిత నియమాలను అతిక్రమించారని పీసీబీ ఆక్షేపిస్తూ వ్యర్థాల డంపింగ్‌ను నిలిపివేయాలని హెచ్ఎండీఏకు నోటీసులు జారీ చేసింది. ఫలితంగా సాగర్ నుంచి వెలికి తీసిన వ్యర్థాలను గాజులరామారం డంప్ సైట్‌కు తరలించే కార్యక్రమానికి పూర్తిగా బ్రేక్ పడింది. ఇక్కడి నుంచి ఒక్కలారీ వ్యర్థాలను తరలించాలన్నా పీసీబీ అనుమతి తప్పనిసరి. ఈ నేపథ్యంలో సాగర్ ప్రక్షాళన ఎప్పటికి పూర్తవుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. అది ఒండ్రు మట్టేనట.. ప్రస్తుతం పికెట్ నాలా వద్ద వెలికి తీసిన వ్యర్థాలు ఒండ్రు మట్టి (సెడిమెంట్) అని, దీనివల్ల ఎలాంటి ప్రమాదం లేదని, కొందరు కావాలనే రాద్దాంతం చేస్తున్నారని హెచ్ఎండీఏ అధికారులు వాదిస్తున్నారు. నిజానికి పంటభూముల్లో ఎరువుగా ఉపయోగపడే ఈ సెడిమెంట్ వల్ల భూములు గాని, నీటికుంటలు గాని విషతుల్యం కావని, ఆ విషయాన్ని పీసీబీయే నిర్ధరించి తమకు అనుమతి ఇచ్చిందంటున్నారు. వాస్తవానికి ఒండ్రుమట్టి నింపే క్వారీ వద్ద లైనింగ్ ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదన్నది, భూమిలోకి ఇంకకుండా అడుగున బెడ్ వద్ద 90 సెం.మీ. మందంతో లైనర్ ఏర్పాటు చే శామని, సైడ్ వాల్స్‌కు 15 సెం.మీ. మందంతో హెచ్డీపీఈ షీట్ ఏర్పాటు చే శామని చెబుతున్నారు. తాము తీసుకున్న జాగ్రత్తలన్నింటినీ వివరిస్తూ పీసీబీకి లేఖ కూడా రాశామని అధికారులు తెలిపారు.