![Lake Dumping Issue In Karimnagar - Sakshi](/styles/webp/s3/article_images/2021/07/19/lake.jpg.webp?itok=9bDdmOr-)
సాక్షి, సిరిసిల్ల(కరీంనగర్): సిరిసిల్ల మున్సిపల్ పరిధి చంద్రంపేటలోని ఈదుల చెరువు కట్ట పరిసర ప్రాంతాల్లో చెత్త, కోళ్ల వ్యర్థాలను పడవేస్తున్నారు. చెరువు చుట్టు పక్కల ప్రాంతంలో దుర్గంధం వెదజల్లుతుందోని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గ్రామంలోని చెత్తచెదారాన్ని, చికెన్‌సెంటర్ నిర్వాహకులు కోళ్ల వ్యర్థాలను చెరువుకట్ట చుట్టూ పక్కల డంప్ చేస్తున్నారని వారు పేర్కొన్నారు. ఈదుల చెరువు మత్తడి దూకడానికి సిద్ధంగా ఉందని, చెరువు పరిసర ప్రాంతాల్లో చెత్తను డంప్ చేయకుండా, నీరు కలుషితం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment