
వ్యర్థాలతో గోదావరి కలుషితం
ఏటూరునాగారం/ములుగు: భక్తు లు గోదారమ్మకు దీప ఆరాదన కో సం తీసుకొస్తున్న అరటి తొక్కలు పూజల అనంతరం నదిలోనే వదులుతున్నారు. అలా చేయొద్దని అధికారులు చెప్పినా ఎవరూ పట్టించుకోవడంలేదు. ఫలితంగా గోదావరి నీరు కలుషితమవుతున్నారుు.
ఆకట్టుకుంటున్న ప్రదర్శనలు
రామన్నగూడెం ఘాట్‌లో చిందు, యక్షగాణ కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకుంటున్నారుు. జిల్లా సమాచార పౌర సంబంధాలశాఖ ఆధ్వర్యంలో గత11 రోజుల నుంచి ఘాట్ వద్ద ప్రతిరోజూ రాత్రి కళాకారులతో భాగవతం, రామాయణం, మహాభారతం నాటకాల ద్వారా భక్తులకు వివరిస్తున్నారు. అంతే కాకుండా ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, పుష్కరాల్లో భక్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను జానపద పాట ల ద్వారా వివరిస్తున్నారు. పుష్కరాల సందర్భంగా భక్తులకు వివిధ వేశ భాషలతో ప్రదర్శించడం మాకు ఎంతోసంతోషంగా ఉందని దేవ రుప్పుల మండలం అప్పరెడ్డి పల్లి గ్రామానికి చెందిన గడ్డం సమ్మయ్య తెలిపారు.