హైదరాబాద్ మురుగుంతా మనకే..
వలిగొండ : మండల కేంద్రంలో మంగళవారం, బుధవారాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. దీంతో చెరువులు, కాల్వలు నీటితో కళకళలాడుతున్నాయి. ఇక ఇటీవల హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షంతో మూసీ కళకళలాడుతోంది. మండలంలోని సంగెం భీమలింగం కత్వ వద్ద ప్రారంభమయ్యే మూసీ భీమలింగం కత్వ మీదుగా పొంగిపొర్లుతూ ప్రవíß స్తోంది. కాగా హైదరాబాద్‌లోని డ్రెయినేజీ, రసాయనాలు వర్షం నీటితో కలిసి రావడంతో నీరు నల్లగా పారడమే కాకుండా , దుర్వాసన వెదజల్లుతోంది.
వర్షం...రైతుల హర్షం
మండలంలోని పలు గ్రామాల్లో ఇటీవల కురుస్తున్న వర్షాలు రైతులకు ఊరటనిస్తున్నాయి. మండలంలో సుమారు 5386 హె క్టార్‌లలో వరి, 856 హె క్టార్‌లలో అపరాల పంటలు, 5136 హెక్టార్‌లలో పత్తి సాగు చేస్తున్నారు. ఇక జూన్‌లో 88 మీ.మీ, జూలైలో 157 మీ.మీ, ఆగస్టులో 124 మీ.మీ కురిసింది. సాధారణ వర్షపాతం కంటే ఎక్కువ శాతం నమోదు కావడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.