పెట్రోల్ బంకులో పెట్రోలుతోపాటు నీరు | Petrol pump delivers water at HP Petrol bunk in Chaitanyapuri | Sakshi
Sakshi News home page

పెట్రోల్ బంకులో పెట్రోలుతోపాటు నీరు

Published Fri, Aug 28 2015 4:59 PM | Last Updated on Tue, Sep 4 2018 5:16 PM

పెట్రోల్ బంకులో పెట్రోలుతోపాటు నీరు - Sakshi

పెట్రోల్ బంకులో పెట్రోలుతోపాటు నీరు

హైదరాబాద్ : చైతన్యపురిలోని హెచ్‌పీ పెట్రోల్ బంకులో శుక్రవారం పెట్రోలు కొట్టించుకున్న వాహనదారులకు పెట్రోలుతో పాటు నీరు కూడా వచ్చింది. ఓ వ్యక్తి బాటిల్‌లో పెట్రోల్ పోయించుకోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సదరు వ్యక్తి పెట్రోల్ బంకు యజమాన్యాన్ని ఈ విషయం గురించి అడగటంతో.. వారు భూగర్భంలోని ట్యాంకర్‌ను పరిశీలించగా అందులో నీళ్లు ఉన్నట్లు గుర్తించారు. దీంతో పెట్రోలు కొట్టించుకున్నవారికి తిరిగి డబ్బులు ఇచ్చేశారు. కాగా కొంతమంది వ్యక్తులు ఈ విషయం గురించి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement