జిల్లాలో 418 సాలిడ్ వేస్ట్‌మేనేజ్‌మెంట్ యూనిట్లు
జిల్లాలో 418 సాలిడ్ వేస్ట్‌మేనేజ్‌మెంట్ యూనిట్లు
Published Mon, Mar 6 2017 10:37 PM | Last Updated on Tue, Sep 5 2017 5:21 AM
వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఏర్పాటు
సాలిడ్ వేస్ట్‌మేనేజ్‌మెంట్ డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ మేనేజర్ శాస్త్రి
కడియం (రాజమహేంద్రవరం రూరల్) : జిల్లాలో వచ్చే ఆర్థిక సంవత్సరంలో 418 యూనిట్లు ఏర్పాటు చేయనున్నట్టు సాలిడ్ వేస్ట్‌మేనేజ్‌మెంట్ డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ మేనేజర్ శాస్త్రి తెలిపారు. మండలంలోని దుళ్ల పంచాయతీలో నిర్మిస్తున్న యూనిట్‌ను సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం జిల్లాలో 118 యూనిట్లు మంజూరు కాగా, 51 యూనిట్లు వర్మికంపోస్టును ఉత్పత్తి చేస్తున్నాయన్నారు. నెలాఖరుకు మిగిలిన వాటిలో కూడా ఉత్పత్తి ప్రారంభమవుతుందని చెప్పారు. యూనిట్లు విజయవంతంగా నడవాలంటే ప్రజల సహకారంతో ఎంతో అవసరమన్నారు. తడి, పొడి చెత్త సేకరణకు అవసరమైన చెత్తబుట్టలను ఎవరికి వారు కొనుగోలు చేసి ప్రోత్సహించడం ద్వారా గానీ, ఆయా గ్రామాల్లోని దాతల సహకారంతో గానీ సమకూర్చుకోవచ్చునన్నారు. పంచాయతీ నిధులతో కొనుగోలు చేసి ఆ సొమ్మును ప్రజల నుంచి వసూలు చేసుకునేందుకు కూడా అవకాశం ఉందని చెప్పారు. ఈ మూడు పద్ధతుల్లో ఏది వీలుంటే దాని ద్వారా చెత్తసేకరణ బుట్టలు సమకూర్చేందుకు ఆయా పంచాయతీలు కృషి చేయాలని సూచించారు. ఆయన వెంట డిస్ట్రిక్ట్ రీసోర్స్ పర్సన్ ఆర్మ్‌స్ట్రాంగ్, ఉపాధి పథకం సిబ్బంది నాగేశ్వరరావు, సర్పంచి గుర్రపు సత్యనారాయణ తదితరులు ఉన్నారు.
Advertisement
Advertisement