శిథిలమైన గొడారి ఆనకట్ట | Godari decaying dam | Sakshi
Sakshi News home page

శిథిలమైన గొడారి ఆనకట్ట

Published Mon, Jun 23 2014 12:49 AM | Last Updated on Sat, Sep 2 2017 9:13 AM

శిథిలమైన గొడారి ఆనకట్ట

శిథిలమైన గొడారి ఆనకట్ట

  •      నాసిరకం మరమ్మతులతో నీరు వృథా
  •      వరదలకు కొట్టుకుపోయిన ఆఫ్రాన్ గట్లు
  •      పనుల్లో అవినీతి కారణమని రైతుల ఆరోపణ
  • అనకాపల్లి: వేలాది ఎకరాల భూములకు సాగు నీరందించాల్సిన గొడారి ఆనకట్టకు నాణ్యత లేని మరమ్మతులు చేపట్టడంతో రెండేళ్లు కాకుండానే పరిస్థితి మొదటికొచ్చింది. దిగువ భూములకు సాగునీరు అందడం లేదు. సుమారు 5 వేల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరందిస్తున్న గొడారి ఆనకట్టపై నీటిపారుదల శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
     
    ఎడారవుతున్న పంట భూములు

    శారద నది పరీవాహక ప్రాంతంలో భాగంగా పట్టణానికి దిగువన ఉమ్మలాడ, ఎన్‌జీఓ కాలనీ మధ్య గొడారి ఆనకట్ట ఉంది. ఈ ఆనకట్ట పరిధిలో 4,494 ఎకరాల ఆయకట్టు ఉండగా, 2150 మంది రైతుల భూములకు సాగు నీరందిస్తోంది. ఎడమవైపున్న కృష్ణంరాజు కాలువకు సాగునీటి సరఫరాకు గొడారి ఆనకట్టే కీలకం. ఇటీవల మరోవైపు పైనుంచి వస్తున్న నీటి ప్రవాహం ఎన్‌జీఓ కాలనీ వైపున్న గట్టును బలహీనపరుస్తూ, గండి పడేందుకు కారణమవుతోంది. దీంతో తరచూ ఎన్‌జీఓ కాలనీ పరిసరాలు వరద నీటిలో చిక్కుకుంటున్నాయి.

    1999లో గొడారి ఆనకట్ట ప్రాధాన్యాన్ని గుర్తించి పునర్నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు నిధులు మంజూరు చేశారు. 2002లో పునర్నిర్మాణ పనులు పూర్తవడంతో ప్రారంభోత్సవం జరిగింది. మూడు నుంచి 4 ఆఫ్రాన్లు, ఎగువగోడ, దిగువగోడ, వరద గట్లు, రీచ్‌లతో గొడారి ఆనకట్టను నిర్మించారు.

    2012, 2013 సంవత్సరాల్లో సంభవించిన భారీ తుపాన్లతో కుడివైపు గట్లకు గండ్లు పడ్డాయి. గొడారి ఆనకట్టను 13.48 కోట్ల నిధులతో పటిష్టపరిచేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ శంకుస్థాపన చేశారు. ఆయన హఠాన్మరణంతో పనులకు గ్రహణం ఏర్పడింది. వైఎస్ అనంతరం వచ్చిన ప్రభుత్వాలు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించాయి. నిధుల మంజూరు చేయకపోవడంతో పనులు నిలిచిపోయాయి. వేలాది మంది రైతుల ఆశలు అడియాశలయ్యాయి.
     
    మరమ్మతుల్లో అవినీతి
     
    గొడారి ఆనకట్ట పరిధిలో వరద ఉధృతికి కొట్టుకుపోయిన అఫ్రాన్‌తో పాటు రీచ్‌ల తాత్కాలిక పనులు, కుడివైపు గట్ల పటిష్టానికి చేపట్టిన పనుల్లో అవినీతి జరిగిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సుమారు రూ.32.82 లక్షలతో నిర్మించిన ఆఫ్రాన్, రీచ్‌లు స్వల్ప వ్యవధిలోనే వరద ఉధృతికి కొట్టుకుపోయాయి. సమీపంలోని ఆనకట్ట రాళ్లతో నాసిరకం పనులు చేపట్టారని రైతులు ఆరోపిస్తున్నారు. గొడారి ఆనకట్ట నుంచి భారీగా నీరు ప్రవహించినప్పుడు ఆనకట్టకు సమీపంలోని భూములపై ఇసుక మేటలు వేయడంతో అవి భారీ ఇసుక ర్యాంపులుగా మారాయి. ఆనకట్టకు ఎగువన నీరుండాల్సి ఉన్నా లీకుల వల్ల సాగునీరు వృథాగా పోతోంది.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement