
ఇదేమి ‘కృష్ణా!’
చాంద్రాయణగుట్ట: ఫలక్‌నుమా రైల్వే బ్రిడ్జి పక్కన ఉన్న కృష్ణా పైప్‌లైన్ మరోసారి పగిలింది. దీంతో పెద్ద ఎత్తున మంచినీరు వృథాగా పోయింది. భారీ లీకేజీ ఏర్పడటంతో తాగునీరు ఫౌంటె న్‌లా విరజిమ్మింది. ఉదయం 8 నుంచి 10 గంటల వరకు లీకైన నీరు పక్కనే అ ల్ జుబేల్ కాల నీలోని ఇళ్లలోకి చేరుకోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. రైల్వే పట్టాలపై కూడా నీరు చేరింది. సమాచారం అందుకున్న జలమండలి అధికారులు ఎట్టకేలకు సరఫరా నిలిపివేయడంతో లీకేజీకి తెరపడింది. అనంతరం అధికారులు, సిబ్బంది వచ్చి మరమ్మతులు చేపట్టారు.