krishna pipeline
-
పగిలిన కృష్ణా పైప్‌లైన్
కందుకూరు: రంగారెడ్డి జిల్లాలోని కందుకూరు మండలం రాచులూరు గ్రామ శివారులో కృష్ణ నీటిని సరఫరా చేసే పైపు లైన్ పగలడంతో.. తాగునీరు వృథాగా పోతోంది. షాద్‌నగర్ పైపు వెళ్లే పైప్‌లైన్ ప్రమాదవశాత్తు పగలిపోవడంతో.. గురువారం తెల్లవారుజాము నుంచి నీరు వృథాగా పోతోంది. ఇది గుర్తించిన స్థానికులు సంబంధిత అధికారులకు సమాచారం అందించినా ఇప్పటివరకు స్పందించకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు -
ఇదేమి ‘కృష్ణా!’
చాంద్రాయణగుట్ట: ఫలక్‌నుమా రైల్వే బ్రిడ్జి పక్కన ఉన్న కృష్ణా పైప్‌లైన్ మరోసారి పగిలింది. దీంతో పెద్ద ఎత్తున మంచినీరు వృథాగా పోయింది. భారీ లీకేజీ ఏర్పడటంతో తాగునీరు ఫౌంటె న్లా విరజిమ్మింది. ఉదయం 8 నుంచి 10 గంటల వరకు లీకైన నీరు పక్కనే అ ల్ జుబేల్ కాల నీలోని ఇళ్లలోకి చేరుకోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. రైల్వే పట్టాలపై కూడా నీరు చేరింది. సమాచారం అందుకున్న జలమండలి అధికారులు ఎట్టకేలకు సరఫరా నిలిపివేయడంతో లీకేజీకి తెరపడింది. అనంతరం అధికారులు, సిబ్బంది వచ్చి మరమ్మతులు చేపట్టారు. -
పైప్‌లైన్ పగిలి చెరువును తలపిస్తున్న రోడ్డు
-
నీటి కష్టాలకు చెక్!
ఓఆర్ఆర్ పరిధిలోని గ్రామాలకు నీటి కేటాయింపు ఖరారు సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఔటర్ రింగురోడ్డు సమీప ప్రాంతవాసులకు శుభవార్త. ఎన్నాళ్లుగానో తాగునీటి ఎద్దడితో సతమతమవుతున్న ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం వరం ప్రకటించింది. ప్రతి కుటుంబానికి కనీస నీటి కేటాయింపును ఖరారు చేసింది. దీంతో ఔటర్ రింగురోడ్డు లోపల, బయట ఉన్న 80 గ్రామాలు, 164 హాబిటేషన్లలోని ప్రజలకు త్వరలో శుద్ధమైన తాగునీరు పక్కాగా అందనుంది. కేటాయింపులు ఇలా.. ప్రస్తుతం కృష్ణా పైపులైన్ ఉన్న గ్రామాల్లో శుద్ధ నీటిని అందిస్తున్నారు. కానీ కుటుంబానికి ప్రత్యేకించి కోటా అనేది లేకుండా ఇష్టానుసారంగా నీటిని కేటాయిస్తున్నారు. ఈ క్రమంలో కుటుంబాల సంఖ్యకు.. నీటి సరఫరా కోటాకు పొంతన లేకుండాపోతోంది. దీంతో ప్రజల దాహార్తి తీరడం లేదు. ఈ క్రమంలో నీటి కోటా పెంచాలంటూ జిల్లా యంత్రాంగం పలుమార్లు ప్రభుత్వానికి నివేదించింది. దీంతో ప్రభుత్వం 80 గ్రామ పంచాయతీలు, 164 హాబిటేషన్లకు నీటి కేటాయింపు విధానంపై స్పష్టత ఇచ్చింది. గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక్కో కుటుంబానికి రోజుకు వంద లీటర్లు, మున్సిపాలీటీల్లోని ఒక్కో కుటుంబానికి 135 లీటర్లు, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఒక్కో కుటుంబానికి 150 లీటర్ల చొప్పున కేటాయించింది. ఈమేరకు గురువారం పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఈ గ్రామాల్లోని 7.32లక్షల మందికి నిర్దేశించిన కోటాలో తాగునీరు అందించాల్సి ఉంది. లబ్ధిపొందే గ్రామాలు: 80 నివాస ప్రాంతాలు : 164 గ్రామాల్లో కుటుంబానికి రోజుకు: 100 లీటర్లు మున్సిపాలిటీల్లో: 135 లీటర్లు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో: 150 లీటర్లు -
రేపు సగం సిటీకి నల్లా బంద్
సాక్షి,సిటీబ్యూరో: కృష్ణా పైప్‌లైన్‌కు భారీ లీకేజి ఏర్పడిన కారణంగా ఈనెల 24న(బుధవారం)నగరంలో సగం ప్రాంతాలకు నీటి సరఫరా నిలిపివేస్తున్నట్టు జలమండలి ప్రకటించింది. కృష్ణా ఫేజ్-2పరిధిలోని 1600 డయా వ్యాసార్థంగల భారీ రింగ్‌మెయిన్-1 పైప్‌లైన్ కు చాంద్రాయణ గుట్ట ఫ్లైఓవర్ వద్ద సోమవారం భారీ లీకేజి ఏర్పడింది. మరమ్మతులు చేసేందుకు 16 గంటల సమయం పడుతుందని జలమండలి అధికారులు చెబుతున్నారు. దీంతో ఈనెల 24న ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పలు ప్రాంతాలకు సరఫరా నిలిపివేసి మరమ్మతులు చేస్తామంటున్నారు. నగరంలోని సగం ప్రాంతాలకు మంచినీటి సరఫరా నిలిచిపోనుంది. సాహెబ్‌నగర్ రిజర్వాయర్ నుంచి మైలార్దేవ్ పల్లి వరకు ఉన్న ఈ ప్రీస్ట్రెస్డ్ కాంక్రీట్(పీఎస్సీ)భారీ మంచినీటి పైప్‌లైన్‌కు తరచూ లీకేజీలు ఏర్పడడం, ఆయా ప్రాంతాలు జలమయం కావడం పరిపాటిగా మారింది. భారీ వాహనాలు పైప్‌లైన్ మీదుగా వెళితే చాలు పైప్‌లైన్‌కు చిల్లులు పడుతున్నాయి. పైప్‌లైన్ నిర్మాణం సమయంలో మైల్డ్‌స్టీల్‌తో తయారు చేసిన పైప్‌లైన్ వేయకపోవడం కారణంగానే ఈ పైప్‌లైన్‌కు తరచూ లీకేజీలు ఏర్పడుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికైనా ఈ పైప్‌లైన్ మార్చని పక్షంలో నిత్యం ఇలాంటి లీకేజీలు తప్పవని హెచ్చరిస్తున్నారు. నీటిసరఫరా ఉండని ప్రాంతాలు.. కిషన్‌భాగ్, చార్మినార్, బాలాపూర్ రిజర్వాయర్ పరిధి,గోషామహల్, జహానుమా, మైసారం, సంతోష్‌నగర్(పార్ట్), ప్రశాసన్‌నగర్ రిజర్వాయర్, ఎస్ఆర్ నగర్, బోరబండ, ఎస్పీఆర్హిల్స్, ఎర్రగడ్డ, సోమాజిగూడా, ఎల్లారెడ్డిగూడా, లింగంపల్లి రిజర్వాయర్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి, చందానగర్, మైలార్‌దేవ్‌పల్లి, రాజేంద్రనగర్, హైదర్గూడా తదితర ప్రాంతాల్లో బుధవారం నీటి సరఫరా నిలిపివేస్తున్నామని జలమండలి అధికారులు ప్రకటించారు.