చెత్త తరలింపునకు ఈ– ఆటోలు
విజయవాడ సెంట్రల్ : పుష్కరాల సందర్భంగా నగరంలో చెత్త వేగంగా ట్రాన్స్‌ఫర్ స్టేషన్‌కు తరలించేందుకు ఈ– ఆటో వెహికిల్, ట్రైసైకిళ్లను అందుబాటులోకి తెచ్చారు. మంగళవారం బంగ్లాలో కమిషనర్ వీటిని స్వయంగా నడిపి చూశారు. ఆయన మాట్లాడుతూ సాధారణ ఆటోల కంటే వేగంగా, కాలుష్యరహితంగా ఈ– ఆటోల్లో చెత్తను తరలించవచ్చని చెప్పారు. వాహనాలు బ్యాటరీలో నడవడం వల్ల కాలుష్యం తగ్గుతోందన్నారు. హైడ్రాలిక్ సిస్టంలో రివర్స్‌గేర్ కలిగి ఉన్న వాహనాలు చెత్త తరలింపునకు ఉపయోగంగా ఉంటాయన్నారు. ఒక్కో ఆటోలో 350 కిలోల చెత్తను తరలించవచ్చని చెప్పారు.