E-auto
-
ఆటో డ్రైవర్‌కు ఆనంద్ మహింద్రా ఆఫర్!
హైదరాబాద్: మందుల్లేని మహమ్మారి కరోనా ను కట్టడి చేయాలంటే వ్యక్తిగత పరిశుభ్రత, సామాజిక, భౌతిక దూరాలు పాటించడమే మన ముందున్న మార్గం. ఈ నేపథ్యంలో ఈ-ఆటోరిక్షాను అరలుగా మార్చి ప్రయాణికులకు సామాజిక దూరం వెలుసుబాటు కల్పించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మహింద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహింద్రా.. ఆటోరిక్షాను ఐదు భాగాలుగా విభజించిన సదరు డ్రైవర్ వినూత్న ఆలోచనపై ప్రశంసలు కురిపించారు. (చదవండి: వావ్.. క్వారంటైన్ ఫ్యాషన్ వీక్ చూశారా?) ‘క్లిష్ట పరిస్థితుల్లో వేగవంతమైన, వినూత్న ఆలోచనలు చేయగల సామర్థ్యం మన సొంతం. నూతన పరిస్థితులకు అనుగుణంగా విభిన్న ఆలోచనలు నన్ను ఆశ్చర్యపరుస్తున్నాయి’అనే క్యాప్షన్‌తో ఆనంద్ మహింద్రా వీడియో షేర్ చేశారు. మహింద్రా ఆటో, ఫార్మ్ సెక్టార్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజేశ్ జెజురికర్ను ఈ ట్వీట్‌కు ట్యాగ్ చేశారు. తమ ఆటో బిల్డింగ్ కంపెనీలో ఈ-ఆటోరిక్షా డ్రైవర్‌ను సలహాదారుగా పెట్టుకుందామని పేర్కొన్నారు. కాగా, 27 సెకండ్ల నిడివిగల ఈ వీడియోకు 10 వేల వ్యూస్ రాగా.. 9 వేల లైకులు వచ్చాయి. (చదవండి: కరోనా: 20 మందికి విందు.. ఆమెకు పాజిటివ్) -
చెత్త తరలింపునకు ఈ– ఆటోలు
విజయవాడ సెంట్రల్ : పుష్కరాల సందర్భంగా నగరంలో చెత్త వేగంగా ట్రాన్స్ఫర్ స్టేషన్‌కు తరలించేందుకు ఈ– ఆటో వెహికిల్, ట్రైసైకిళ్లను అందుబాటులోకి తెచ్చారు. మంగళవారం బంగ్లాలో కమిషనర్ వీటిని స్వయంగా నడిపి చూశారు. ఆయన మాట్లాడుతూ సాధారణ ఆటోల కంటే వేగంగా, కాలుష్యరహితంగా ఈ– ఆటోల్లో చెత్తను తరలించవచ్చని చెప్పారు. వాహనాలు బ్యాటరీలో నడవడం వల్ల కాలుష్యం తగ్గుతోందన్నారు. హైడ్రాలిక్ సిస్టంలో రివర్స్‌గేర్ కలిగి ఉన్న వాహనాలు చెత్త తరలింపునకు ఉపయోగంగా ఉంటాయన్నారు. ఒక్కో ఆటోలో 350 కిలోల చెత్తను తరలించవచ్చని చెప్పారు. -
ఇద్దరు యువకుల సృష్టి ఈ-ఆటో
నగరంలో రోజురోజుకు పెరిగిపోతున్న కాలుష్యం.. కష్టమవుతున్న నియంత్రణ.. ఇద్దరు యువకులను ఆలోచింపజేసింది. కాలుష్య నగరికి కాసింత సాంత్వన చేకూర్చేందుకు ఈ స్నేహితులు ఈ-ఆటోను రూపొందించారు. చంపాపేటకు చెందిన మామిడోజు భరత్, నల్లగొండకు చెందిన మధుకర్‌రెడ్డి స్నేహితులు. బీటెక్ పూర్తి చేసిన వీరు పెద్దఅంబర్‌పేటలో అడాప్ట్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ స్థాపించారు. తక్కువ ఖర్చుతో కాలుష్య రహిత వాహనాలను తయారు చేయాలని గత కొన్నేళ్లుగా అధ్యయనం చేసిన వీరు ఈ-ఆటోను రూపొందించారు. ‘ఇది ఐదు గంటలు చార్జింగ్ చేస్తే 110 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. బ్యాటరీల సహాయంతో వీటిని రూపొందించాం. త్వరలోనే వీటికి సోలార్ సిస్టం ఏర్పాటు చేస్తాం. కేవలం రూ.లక్ష ఖర్చుతో వీటిని తయారుచేశాం. ‘స్వీకర్’ పేరుతో త్వరలోనే ప్యాసింజర్, ట్రాలీ ఈ-ఆటోలను మార్కెట్లోకి విడుదల చేస్తాం. కేంద్రప్రభుత్వం నుంచి అనుమతి కూడా తీసుకున్నామ’ని భరత్ తెలిపారు. వివరాలకు 9133073318, 18002700248(టోల్‌ఫ్రీ) నంబర్లలో సంప్రదించాలన్నారు.