Parineeti Collects Plastic Waste From Ocean While Scuba Diving, Video Viral - Sakshi
Sakshi News home page

చెత్త సేకరించిన స్టార్‌ హీరోయిన్‌.. నెటిజన్ల ప్రశంసలు..

Published Sun, Jun 19 2022 3:46 PM | Last Updated on Sun, Jun 19 2022 5:06 PM

Parineeti Chopra Collects Plastic Waste While Scuba Diving - Sakshi

Parineeti Chopra Collects Plastic Waste While Scuba Diving: బాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది ముద్దుగుమ్మ పరిణీతి చోప్రా. వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ అమ్మడు తాజాగా నెటిజన్ల ప్రశంసలు పొందుతుంది. స్కూబా డైవింగ్‌ అంటే ఇష్టమున్న పరిణీతి చోప్రా డైవింగ్ చేస్తూ ఓ మంచి పని చేసింది. స్కూబా డైవింగ్ చేస్తూ సముద్రంలోని చెత్తను సేకరించింది. ఈ చెత్తను సేకరించే వీడియోను సోషల్‌ మీడియాలో 'సరదాగా డైవింగ్ చేశాను. అలాగే చెత్తను సేకరించడం వల్ల ఓ మంచి పని చేయగలిగా. సముద్రాన్ని క్లీన్‌ చేయడానికి నాతో చేరండి' అనే క్యాప్షన్‌తో షేర్‌ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. 

ఈ వీడియో వైరల్‌ కావడంతో చెత్త సేకరించిన పరిణీతి చోప్రాపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. 'పరిణీతి మీరు చాలా గొప్ప పని చేస్తున్నారు', 'మిమ్మల్ని చూస్తే గర్వంగా ఉంది', 'సూపర్‌', 'సూపర్‌ స్టార్స్ కూడా ఇలాంటి పనులు చేసి భూమిని రక్షించేలా అందరికీ అవగాహన కల్పించాలి' అంటూ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. 

చదవండి: థియేటర్‌లో అందరిముందే ఏడ్చేసిన సదా.. వీడియో వైరల్‌
ఆ హీరోలా ఎఫైర్స్‌ లేవు.. కానీ ప్రేమలో దెబ్బతిన్నా: అడవి శేష్‌
సైలెంట్‌గా తమిళ హీరోను పెళ్లాడిన తెలుగు హీరోయిన్‌..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement