collecting
-
చెత్త ఏరిన స్టార్ హీరోయిన్.. వీడియో వైరల్
Parineeti Chopra Collects Plastic Waste While Scuba Diving: బాలీవుడ్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది ముద్దుగుమ్మ పరిణీతి చోప్రా. వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ అమ్మడు తాజాగా నెటిజన్ల ప్రశంసలు పొందుతుంది. స్కూబా డైవింగ్ అంటే ఇష్టమున్న పరిణీతి చోప్రా డైవింగ్ చేస్తూ ఓ మంచి పని చేసింది. స్కూబా డైవింగ్ చేస్తూ సముద్రంలోని చెత్తను సేకరించింది. ఈ చెత్తను సేకరించే వీడియోను సోషల్ మీడియాలో 'సరదాగా డైవింగ్ చేశాను. అలాగే చెత్తను సేకరించడం వల్ల ఓ మంచి పని చేయగలిగా. సముద్రాన్ని క్లీన్ చేయడానికి నాతో చేరండి' అనే క్యాప్షన్‌తో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో వైరల్ కావడంతో చెత్త సేకరించిన పరిణీతి చోప్రాపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. 'పరిణీతి మీరు చాలా గొప్ప పని చేస్తున్నారు', 'మిమ్మల్ని చూస్తే గర్వంగా ఉంది', 'సూపర్', 'సూపర్ స్టార్స్ కూడా ఇలాంటి పనులు చేసి భూమిని రక్షించేలా అందరికీ అవగాహన కల్పించాలి' అంటూ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. చదవండి: థియేటర్లో అందరిముందే ఏడ్చేసిన సదా.. వీడియో వైరల్ ఆ హీరోలా ఎఫైర్స్ లేవు.. కానీ ప్రేమలో దెబ్బతిన్నా: అడవి శేష్ సైలెంట్‌గా తమిళ హీరోను పెళ్లాడిన తెలుగు హీరోయిన్.. View this post on Instagram A post shared by Parineeti Chopra (@parineetichopra) -
మరో వివాదంలో ఫేస్బుక్
‘నాకు ఫేస్బుక్ అకౌంట్ లేదు. కాబట్టి నా వివరాలేవీ వాళ్లకు తెలియవు’ అన్న ధీమాలో మీరుంటే పొరపాటు పడ్డట్టే! మీకు ఫేస్బుక్ ఖాతా లేకపోయినా, మీ ఆండ్రాయిడ్ ఫోన్లో వాడే ఇతర యాప్‌ల ద్వారా మీ గుట్టంతా ఆటోమేటిక్‌గా ఫేస్‌బుక్‌కు వెళ్లిపోతోందట. బ్రిటన్‌కు చెందిన ప్రైవసీ ఇంటర్నేషనల్ అనే స్వచ్ఛంద సంస్థ ఈ సంచలన విషయాన్ని బయటపెట్టింది. సాధారణంగా ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లు అనేక యాప్స్‌ను వాడుతుంటారు. వాళ్లు ఏ యాప్‌ను ఓపెన్ చేసినా వారి సమాచారం అంతా ఆటోమేటిక్‌గా ఫేస్‌బుక్‌కు చేరిపోతోందని ఈ అధ్యయనంలో తేలింది. ఫేస్బుక్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కిట్(ఎస్డీకే) ద్వారా ఈ యాప్ డెవలపర్లు యూజర్ల సమాచారాన్ని ఫేస్‌బుక్‌తో పంచుకుంటున్నారు. గతేడాది ఆగస్టు–డిసెంబర్ నెలల మధ్య కోటి నుంచి 50 కోట్లమంది యూజర్లు వాడుతున్న 34 యాప్‌లను పరిశీలించిన అనంతరం ప్రైవసీ ఇంటర్నేషనల్ ఈ విషయాన్ని ధ్రువీకరించింది. ఈ జాబితాలో డ్యుయోలింగో, ట్రిప్ అడ్వైజర్, ఇన్‌డీడ్, స్కైస్కానర్ వంటి యాప్‌లు ఉన్నాయి. ఈ యాప్‌లు ప్రధానంగా ఎలాంటి సమాచారాన్ని ఫేస్‌బుక్‌కు అందజేస్తున్నాయో కూడా ఈ సంస్థ విశ్లేషించింది. 61 శాతం యాప్స్‌ను యూజర్లు ఓపెన్‌చేయగానే వారి సమాచారం ఫేస్‌బుక్‌కు చేరిపోతుందని తెలిపింది. ఈ యాప్స్ పంపిన సమాచారాన్ని గూగుల్ అడ్వర్టైజింగ్ ఐడీ ద్వారా ఇతరులు పంచుకుంటున్నారని వెల్లడించింది. ఈ సమాచారం ఆధారంగా ప్రకటనకర్తలు యూజర్ల ప్రొఫైల్స్‌ను రూపొందించి వారికి అనుకూలమైన, ఆసక్తి కలిగించే ప్రకటనలు ఇస్తున్నారని పేర్కొంది. జర్మనీలోని లీపింగ్లో జరిగిన కాస్ కంప్యూటర్ కాంగ్రెస్‌లో ప్రైవసీ ఇంటర్నేషనల్ ఈ నివేదికను సమర్పించింది. ఇదంతా మామూలే: ఫేస్బుక్ ప్రైవసీ ఇంటర్నేషనల్ నివేదికపై ఫేస్బుక్ స్పందించింది. యూజర్ల సమాచారాన్ని కంపెనీలు పంచుకోవడమన్నది చాలా మామూలు విషయమని తెలిపింది. దీనివల్ల వినియోగదారులతో పాటు కంపెనీలకు కూడా లాభం చేకూరుతుందని వెల్లడించింది. ఈ సమాచారం ఆధారంగా డెవలపర్లు తమ యాప్‌ను మరింత బాగా తయారుచేయగలరంది. -
బిల్లుల వసూలు పై దృష్టి సారించండి
ఎస్ఈ భార్గవ రాముడు కర్నూలు(రాజ్‌విహార్): నెలవారి విద్యుత్ బిల్లుల వసూలుపై దృష్టి సారించాలని ఏపీసీపీడీసీఎల్ కర్నూలు ఎస్ఈ (ఆపరేషన్స్) జి. భార్గవ రాముడు సూచించారు. శుక్రవారం స్థానిక కొత్త బస్టాండ్ సమీపంలోని విద్యుత్ భవన్లో కర్నూలు డివిజన్ నెలవారీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన సెక్షన్ల వారీగా జరుగుతున్న పురోగతి పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్పాట్ బిల్లింగ్ ప్రక్రియ పూర్తయ్యాక బిల్లుల వసూలుపై దృష్టి 100 శాతం లక్ష్యం సాధించాలని సూచించారు. ఉన్నతాధికారుల సూచనల మేరకు పాత బకాయిలను ప్రస్తుత నెల బిల్లుతోపాటు 12 శాతం పాత బకాయిలను రాబట్టాలన్నారు. నిర్ణీత గడువులోపు బిల్లులు చెల్లించని పక్షంలో విద్యుత్ సరఫరాను నిలిపివేయాలన్నారు. సమావేశంలో కర్నూలు ఆపరేషన్స్ డిజినల్ ఎలక్ట్రికల్ ఇంజనీరు పి.వి. రమేష్, డీఈటీ మహమ్మద్ సాధిక్, సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ మతృనాయక్, ఏడీఈలు, ఏఈలు, ఏఓలు పాల్గొన్నారు. -
యూటీఎఫ్ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ
చిలుకూరు: యూటీఎఫ్ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో బుధవారం మండలంలోని పలు పాఠశాల్లో సీపీఎస్ (కాంట్రిబ్యూటరీ పెన్షెన్ స్కీం) విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయిలని కోరుతూ సంతకాల సేకరణ చేశారు. ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయ సంఘం నాయకులు మాట్లాడుతూ సమస్యల పరిష్కారం చేయడంలో ప్రభుత్వం విఫలం చెందిందన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చుండూరి ప్రసాద్‌రావు, జిల్లా, మండల నాయకులు ఖాదర్‌పాషా, బావసింగ్, రమేష్‌బాబు, మూర్తి, కడారు సైదులు, టీఎల్ నరసింహరావు, ఆరె బాబు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.