బిల్లుల వసూలు పై దృష్టి సారించండి
ఎస్‌ఈ భార్గవ రాముడు
కర్నూలు(రాజ్‌విహార్):
నెలవారి విద్యుత్ బిల్లుల వసూలుపై దృష్టి సారించాలని ఏపీసీపీడీసీఎల్ కర్నూలు ఎస్‌ఈ (ఆపరేషన్స్) జి. భార్గవ రాముడు సూచించారు. శుక్రవారం స్థానిక కొత్త బస్టాండ్ సమీపంలోని విద్యుత్ భవన్‌లో కర్నూలు డివిజన్ నెలవారీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన సెక‌్షన్ల వారీగా జరుగుతున్న పురోగతి పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్పాట్ బిల్లింగ్ ప్రక్రియ పూర్తయ్యాక బిల్లుల వసూలుపై దృష్టి 100 శాతం లక్ష్యం సాధించాలని సూచించారు. ఉన్నతాధికారుల సూచనల మేరకు పాత బకాయిలను ప్రస్తుత నెల బిల్లుతోపాటు 12 శాతం పాత బకాయిలను రాబట్టాలన్నారు. నిర్ణీత గడువులోపు బిల్లులు చెల్లించని పక్షంలో విద్యుత్ సరఫరాను నిలిపివేయాలన్నారు. సమావేశంలో కర్నూలు ఆపరేషన్స్ డిజినల్ ఎలక్ట్రికల్ ఇంజనీరు పి.వి. రమేష్, డీఈటీ మహమ్మద్ సాధిక్, సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ మతృనాయక్, ఏడీఈలు, ఏఈలు, ఏఓలు పాల్గొన్నారు.