రైలు పట్టాలపై వ్యర్థాలను వేసే వారిపై కఠిన చర్యలు ఎందుకు తీసుకోవడంలేదని జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ) రైల్వే శాఖపై మండిపడింది.
న్యూఢిల్లీ: రైలు పట్టాలపై వ్యర్థాలను వేసే వారిపై కఠిన చర్యలు ఎందుకు తీసుకోవడంలేదని జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ) రైల్వే శాఖపై మండిపడింది. వ్యర్థాలను వేసే వారిపై రూ.5 వేల జరిమానా విధించాలని ఆదేశించింది.
‘పట్టాల పక్కన భారీగా వెలసిన మురికివాడలతోపాటు శాశ్వత కట్టడాల్లోని వారు గార్బేజ్ వ్యర్థాలను పట్టాలపై విసిరేయడాన్ని ఎందుకు అనుమతిస్తున్నారని మండిపడింది. కఠినంగా జరిమానాలు విధిస్తే దీన్ని నియంత్రించవచ్చంది. రైలు పట్టాలపై వ్యర్థాలను వేసే వారిని ట్రిబ్యునల్ హజరు పరచాలని సూచించింది.