rail track
-
పట్టాలపై నడుస్తుంది.. ట్రైన్ కాదు (ఫోటోలు)
-
ధైర్యంగా రైలుకు ఎదురెళ్లాడు.. ‘సంఘమిత్ర’కు ప్రమాదాన్ని తప్పించాడు
చీరాల: ఓవ్యక్తి అప్రమత్తతతో వ్యవహరించడంతో సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్‌కు పెనుప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళితే.. బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపూరుపాలెం రైల్వేస్టేషన్ సమీపంలో గురువారం ఉదయం 7:15నిమిషాల సమయంలో బహిర్భూమికి వెళుతూ పట్టాలు దాటుతున్న స్థానికుడు గద్దె హేమసుందరబాబు రైలు పట్టా విరగడాన్ని గమనించాడు. అదే సమయంలో చెన్నై వెళుతున్న సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్ వేగంగా వస్తోంది. వెంటనే రైలుకు ఎదురెళ్లి లోకో పైలెట్‌కు రైలు పట్టాలు చూపిస్తూ సైగలు చేస్తూ సంకేతాలు పంపించాడు. అప్రమత్తమైన లోకోపైలెట్ రైలు వేగం తగ్గించి రైలును నిలిపివేశాడు. అనంతరం రైలు పట్టా విరిగి ఉందని చెప్పి ఘటనా స్థలానికి తీసుకెళ్లి చూపించాడు. దీంతో విషయాన్ని రైల్వే అధికారులకు తెలియజేశారు. చీరాల, బాపట్ల నుంచి వచ్చిన రైల్వే ఇంజనీరింగ్ అధికారులు విరిగిన పట్టాకు మరమ్మతులు చేశారు. దీంతో 40 నిమిషాలు ఆలస్యంగా సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్ రైలు బయలుదేరింది. పలు రైళ్లు ఆలస్యంగా నడిచాయి. కాగా పెను ప్రమాదం నుంచి తప్పించిన హేమసుందరబాబును రైల్వే అధికారులతో సహా ప్రయాణికులు ప్రశంసించారు. ఘోర ప్రమాదాన్ని నివారించిన గద్దె హేమసుందరబాబు సాహసాన్ని అభినందిస్తూ ఎస్పీ వకుల్ జిందాల్ ఆయనను ఘనంగా సత్కరించారు. బాపట్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో మెమెంటో, ప్రశంసా పత్రాన్ని అందజేశారు. -
డబుల్ ధమాకా..
రహదారి మీద, రైలు పట్టాల మీద దూసుకెళ్లే వాహనమిది. ప్రపంచంలోనే తొలి డ్యూయల్ మోడల్ వెహికల్(డీఎంవీ) ఇదేనని జపాన్ చెబుతోంది. టొకుషిమా పరిధిలోని కయో ప్రాంతంలో ఇది శనివారం ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఈ వాహనం రహదారిపై వెళ్లేపుడు రబ్బరు టైర్లను, పట్టాలపై ప్రయాణించేటపుడు ఇనుప చక్రాలను వాడుతుంది. ఒకేసారి 21 మంది ప్రయాణించవచ్చు. -
‘తండ్రి’ పెదాలను తాడుతో కుట్టి, ఆపై.. వీడసలు మనిషేనా?
జార్ఖండ్ రాష్ట్రంలో అమానుష ఘటన వెలుగు చూసింది. 65 ఏళ్ల వృద్ధుడి పెదాలను తాడుతో కుట్టి, చేతులు, కాళ్లను రైల్వే ట్రాక్‌కు కట్టి దాష్టీకానికి పాల్పడ్డాడు సవతి కొడుకు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా.. పోలీసులు రైల్వే ట్రాక్ నుంచి వృద్ధుడిని రక్షించారు. పాలము జిల్లాలోని అంటారి రోడ్ బ్లాక్‌లోని భీతిహర గ్రామంలో భోలా రామ్ అనే వృద్ధుడి మొదటి భార్య చనిపోగా 2010లో రెండో వివాహం చేసుకున్నాడు. అయితే సవతి తండ్రిపై రెండో భార్య కొడుకు ద్వేషాన్ని పెంచుకున్నాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి భోలా రామ్ మూత్ర విసర్జనకు బయటకు వెళ్లగా.. అదే సమయంలో కొడుకు మరో ఇద్దరితో కలిసి వృద్ధ తండ్రిపై విచక్షణ రహితంగా దాడి చేశారు. అనంతరం ముగ్గురు వ్యక్తులు తండ్రి పెదాలను తాడుతో కుట్టి, చేతులు, కాళ్ళను కట్టి, సమీపంలోని రైల్వే ట్రాక్‌కు తీసుకొని వెళ్లారు. రాత్రి 11 గంటల సమయంలో భోలా రామ్‌ను రైల్వే ట్రాక్‌తో కట్టేసి వారందరూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఉదయాన్నే గ్రామస్తులు ట్రాక్‌పై కట్టి పడేసిన వ్యక్తిని చూసి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు వృద్ధుడిని రక్షించి ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న వృద్ధుడి పెదాలను కలిపి కుట్టుడానికి ఉపయోగించిన తాడును వైద్యులు తొలగించారు. ప్రస్తుతం ఆయన క్షేమంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అయితే ఈ ఘటనలో రెండో భార్య హస్తం కూడా ఉందని పోలీసులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేశామని, నిందితులను అరెస్టు చేస్తామని వెల్లడించారు. ఇందుకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండటంతో.. ‘‘వీడసలు మనిషేనా. తండ్రి అన్న గౌరవం లేకపోయినా, సాటి మనిషి అన్న కనికరం అయినా ఉండాలి కదా’’ అంటూ నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. -
కిమ్ ఆంక్షలు: ‘బతికిపోయాను ఉత్తర కొరియాలో పుట్టలేదు’
సియోల్: కరోనా మహమ్మారి కట్టడి కోసం ప్రపంచవ్యాప్తంగా దేశాలన్ని ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. చాలా దేశాలు ముందు జాగ్రత్తగా చర్యగా సరిహద్దులు మూసేశాయి. కొన్నాళ్ల తర్వాత రాకపోకలకు అనుమతించాయి. కానీ ఉత్తర కొరియాలో మాత్రం నేటికి ఆంక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. దాంతో విదేశాల నుంచి నార్త్ కొరియా వెళ్లిన వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్వదేశనికి వెళ్లలేక.. అక్కడే ఉండలేక చాలా బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో స్వదేశానకి వెళ్లేందుకు రష్యన్ దౌత్యవేత్తలు చేసిన ప్రయత్నం ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియోని రష్యన్ విదేశాంగ శాఖ తన టెలిగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం ఇది ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతోంది. వివరాలు.. రష్యన్ దౌత్యవేత్త మూడవ కార్యదర్శి వ్లాడిస్లావ్ సోరోకిన్, మరికొందరు తమ కుటుంబ సభ్యులతో పాటు ఉత్తర కొరియాలో చిక్కుకుపోయారు. కోవిడ్ వ్యాప్తికి భయపడి ఆ దేశం గతేడాది జనవరి నుంచి తన సరిహద్దులను మూసి వేసింది. దాంతో ఈ రష్యన్ దౌత్యవేత్తలు ఇన్నాళ్లు కొరియాలోనే ఉండి పోవాల్సి వచ్చింది. నిషేధం ఎప్పుడు ఎత్తివేస్తారో తెలియదు. ఇంకా ఎంతకాలం ఇలా ఉండాల్సి వస్తుందోనని వారు ఆందోళన చెందారు. దాంతో ఉత్తర కొరియా నుంచి రష్యాకు చేరుకోవడానికి వారు ఓ అద్భుతమైన మార్గం ఎన్నుకున్నారు. ఈ మేరకు ఓ రైల్ ట్రాలీని సిద్దం చేసుకున్నారు. తమ లగేజ్, చిన్న పిల్లలు, ఆడవారిని ట్రాలీలో కూర్చో పెట్టారు. ఆ తర్వాత మరి కొందరు ఆ ట్రాలీని రైలు పట్టాలపై తోయడం ప్రారంభించారు. అలా దాదాపు 32 గంటల పాటు ప్రయాణం చేసి రష్యా సరిహద్దుకు చేరుకున్నారు. వీరి రాక గురించి రష్యా విదేశాంగ శాఖ అధికారులకు ముందుగానే సమాచారం ఉండటంతో.. దౌత్యవేత్తల కోసం సరిహద్దులో వాహనాలు సిద్దంగా ఉంచారు. ఆ తర్వాత ఉత్తర కొరియా నుంచి వచ్చిన దౌత్యవేత్తల బృందానికి కోవిడ్ టెస్ట్ చేసి.. దేశంలోకి అనుమతించారు. కొద్ది రోజుల పాటు బయట తిరగవద్దని తెలిపారు. అలా మరో రెండు గంటల ప్రయాణం తర్వాత ఈ దౌత్యవేత్తలు తమ ఇళ్లకు చేరుకున్నారు. దాదాపు ఏడాది తర్వాత పుట్టిన గడ్డను చేరడంతో వారి సంతోషానికి హద్దు లేకుండా పోయింది. అంతసేపు పడిన శ్రమను మర్చిపోయి.. సంతోషంగా అరుస్తూ కేకలేశారు. ఈ సందర్భంగా వ్లాడిస్లావ్ సోరోకిన్ మాట్లాడుతూ.. ‘‘క్షేమంగా ఇంటికి చేరుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. కానీ మా ప్రయాణం కనిపించినంత సులువేం కాదు. చాలా ఇబ్బందిపడ్డాం. ముఖ్యంగా రష్యావైపు నడుచుకుంటూ రావడం అనేది ఎంతో కష్టంతో కూడుకున్నది. ఏదైతేనేం క్షేమంగా ఇంటికి వచ్చాం. అది చాలు’’ అన్నారు. వీరి ప్రయాణానికి సంబంధించిన వీడియోను రష్యన్ విదేశాంగ శాఖ సోషల మీడియాలో షేర్ చేయడంతో ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది. ఇది చూసిన నెటిజనులు దేవుడికి ధన్యవాదాలు నేను ఉత్తర కొరియాలో జన్మించలదు అంటూ కామెంట్ చేస్తున్నారు. చదవండి: ఆమె బతికే ఉంది.. ఇదిగో సాక్ష్యం ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర సరిహద్దులోకి వ్యక్తి.. -
రైలు కింద పడి వ్యక్తి మృతి
అరకు: విశాఖపట్నం జిల్లాలోని అరకులోయ రైల్వే రిక్వెస్ట్ స్టేజి వద్ద గురువారం ఉదయం 7 గంటల సమయంలో రైలు కింద పడి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు అరకు మండలం కొండవీధి గ్రామానికి చెందిన కళాసి కొర్ర నానాజి(32)గా గుర్తించారు. రైలు కింద పడటంతో శరీరం నుజ్జునుజ్జైపోయింది. సంఘటనా స్థలానికి చేరుకున్న రైల్వేపోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
పెళ్లయిన నెల రోజులకే వరుడి మృతి
కేకేనగర్(చెన్నై): తిరుచ్చి మురుక్కుపట్టిపాళెం సమీపంలో రైలు పట్టాలపై శుక్రవారం గుర్తు తెలియని శవం కనపడింది. తిరుచ్చి రైల్వే పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరుచ్చి ప్రభుత్వాసుపత్రికి పంపారు. మృతుడి ప్యాంట్‌జేబులో ఉన్న ఓటర్ఐడీ ఆధారంగావిచారణ జరిపిన పోలీసులకు అతడు కన్యాకుమారి జిల్లా విలవన్‌కోడు తాలూకాకు చెందిన జగన్‌బాబు (31) అని తెలిసింది. పోలీసుల విచారణలో అతడు కొన్ని సంవత్సరాలుగా సింగపూరులో పనిచేసి గత జనవరిలో సొంత ఊరికి వచ్చినట్లు అదే ఊరికి చెందిన అజిత (25)ను జూన్‌లో 8వ తేదీ వివాహం చేసుకున్నట్టు తెలిసింది. చెన్నైలో ఉద్యోగం చేస్తున్న అజితను చూడడానికి జగన్‌బాబు చెన్నైకు రైల్లో బయలుదేరినట్లు తెలిసింది. శుక్రవారం బోగీలో రద్దీ ఎక్కువగా ఉండడం వలన ఫుట్‌బోర్డుపై నిలబడి ఉన్న జగన్‌బాబు మురుక్కుపట్టి వద్ద కాలు జారి కింద పడి మృతి చెందినట్లు తెలిసింది. సమాచారం అందుకుని అతని భార్య, బంధువులు తిరుచ్చి ప్రభుత్వాసుపత్రికి వచ్చి జగన్‌బాబు మృతదేహంపై పడి భోరున విలపించారు. వివాహం జరిగిన నెల రోజులకే జగన్‌బాబు మృతి చెందిన సంఘటన అతని కుటుంబంలో శోకాన్ని మిగిల్చింది. -
పట్టాలపై వ్యర్థాలు వేస్తే భారీ జరిమానా
న్యూఢిల్లీ: రైలు పట్టాలపై వ్యర్థాలను వేసే వారిపై కఠిన చర్యలు ఎందుకు తీసుకోవడంలేదని జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ) రైల్వే శాఖపై మండిపడింది. వ్యర్థాలను వేసే వారిపై రూ.5 వేల జరిమానా విధించాలని ఆదేశించింది. ‘పట్టాల పక్కన భారీగా వెలసిన మురికివాడలతోపాటు శాశ్వత కట్టడాల్లోని వారు గార్బేజ్ వ్యర్థాలను పట్టాలపై విసిరేయడాన్ని ఎందుకు అనుమతిస్తున్నారని మండిపడింది. కఠినంగా జరిమానాలు విధిస్తే దీన్ని నియంత్రించవచ్చంది. రైలు పట్టాలపై వ్యర్థాలను వేసే వారిని ట్రిబ్యునల్ హజరు పరచాలని సూచించింది. -
రైలు కింద పడి వ్యక్తి మృతి
కాచిగూడ : రైలు కింద పడి గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన కాచిగూడ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం జరిగింది. రైల్వే హెడ్ కానిస్టేబుల్ నిరంజన్ నాయక్ తెలిపిన వివరాల ప్రకారం... మలక్‌పేట - డబీర్‌పుర రైల్వే స్టేషన్ల మధ్య గుర్తుతెలియని వ్యక్తి (సుమారు 30 సంవత్సరాలు) రైలు పట్టాలపై పడుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని ఒంటిపైన బ్లూ కలర్ టీ షర్టు, బూడిద రంగు ప్యాంట్ ఉంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
రైలుపట్టాలపై విద్యార్థిని మృతదేహం
మల్కాజ్గిరి (హైదరాబాద్) : నగరంలోని మల్కాజ్గిరి రైల్వే స్టేషన్ సమీపంలో రైలు పట్టాలపై శుక్రవారం ఓ ఇంటర్ విద్యార్థిని మృతదేహం లభ్యమైంది. రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. మృతురాలి దగ్గర లభించిన ఐడీ కార్డు ఆధారంగా... రంగారెడ్డి జిల్లా శామీర్‌పేట మండలం బీజేఆర్ నగర్‌కు చెందిన నవ్యగా మృతురాలిని గుర్తించారు. ఈసీఐఎల్ శ్రీ చైతన్య కళాశాలలో ఇంటర్ చదువుతున్న నవ్య పట్టాలు దాటుతూ ప్రమాదవశాత్తూ మృతి చెందిందా? లేక ఆత్మహత్య చేసుకుందా అన్నది ఇంకా తెలియరాలేదు. పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. -
పట్టాలపై శవం.. పోలీసుల జగడం
పెంపుడు కుక్కను రైల్వే ట్రాక్ పైకి తీసుకెళ్లి దాని చావుకు కారణమయ్యాడని ఓ వ్యక్తిపై కేసు నమోదయిన సంఘటన ఇప్పుడు హైదరాబాద్‌లో చర్చనీయాంశమైంది. ఇక్కడిలా కుక్క కోసం హైరానా జరగగా.. రైల్వే ట్రాక్‌పై చనిపోయిన మనిషి విషయంలో మాత్రం తీవ్రంగా వాదులాడుకుని దాదాపు ఆరుగంటలపాటు శవాన్ని అలాగే వదిలేశారు ఘనత వహించిన పోలీసులు. ఆ సమయంలో ఆ శవం మీదుగా 17 రైళ్లు రాకపోకలు సాగించాయి. పోలీసుల తీరును, వ్యవస్థల మధ్య సమన్వయలోపాన్ని బయటపెట్టిన ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని క్విలా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. హౌరా నుంచి అమృత్సర్ ప్రయాణిస్తోన్న అకల్తక్త్ ఎక్స్‌ప్రెస్ రైలు.. బరేలీ జిల్లా కేంద్రానికి సమీపంలో ఓ గుర్తు తెలియని వ్యక్తిని ఢీకొట్టింది. ఈ ప్రమాదం గురువారం ఉదయం ఆరు గంటలకు జరిగింది. ప్రమాదాన్ని గుర్తించిన రైలు డ్రైవర్.. బరేలీ స్టేషన్ మాస్టర్‌కు సమాచారం అందిచాడు. ఆ మాస్టర్.. జీఆర్పీఎఫ్ బలగాలను పురమాయించాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న జీఆర్పీఎఫ్ సిబ్బంది శవాన్ని తొలగిద్దామనే అనుకున్నారు. కానీ.. ఎందుకొచ్చిన తలనొప్పిలే అనుకుని స్థానిక సివిల్ పోలీసులకు కబురుపెట్టారు. ట్రాక్ వద్దకు చేరుకున్న సివిల్ పోలీసులు.. 'శవం ట్రాక్ పైన ఉంది కదా.. దానిని మేమెలా స్వాధీనం చేసుకుంటాం? అని కొర్రీ వేశారు. నిజమే. ట్రాక్ నుంచి అటు 30 మీటర్లు, ఇటు 30 మీటర్లు (కొన్నిసార్లు ఈ కొలత మారుతూ ఉంటుంది) రైల్వే శాఖదే. అయితే శవాన్ని తీసుకెళ్లేందుకు తమ వద్ద సరంజామా సిద్ధంగా లేదని, మీరే ఎదో ఒకటి చెయ్యండని సివిల్ పోలీసుల్ని రైల్వే పోలీసులు అడిగారు. వాళ్లేమో 'మా ఉన్నతాధికారుల్ని అడిగి చెప్తాం' అన్నారు. ఇలా వీళ్లు జగడమాడుతుండగానే.. శవం పడి ఉన్న ట్రాక్‌పై నుంచి రైళ్లు వెళుతూ వస్తూనే ఉన్నాయి. దాదాపు ఆరు గంటలు.. అంటే మద్యాహ్నం పన్నెండు గంటల తర్వాత గానీ పంచాయితీ ఓ కొలిక్కిరాలేదు. చివరికి క్విలా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఆదేశాలతో యువకుడి శవాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్ట్‌మార్టం నిర్వహించారు. ఇప్పటికింకా ఆ యువకుడి ఆచూకీ తెలియరాలేదని, 72 గంటల్లోగా స్పందన రాకుంటే మున్సిపాలిటీ వారితో అంత్యక్రియలు నిర్వహిస్తామని ఇన్స్పెక్టర్ కమ్రూల్ హసన్ చెప్పారు. -
విశాఖలో రైల్వే ట్రాక్‌పై ఎస్సై శవం