నగరంలోని మల్కాజ్‌గిరి రైల్వే స్టేషన్ సమీపంలో రైలు పట్టాలపై శుక్రవారం ఓ ఇంటర్ విద్యార్థిని మృతదేహం వెలుగు చూసింది.
మల్కాజ్‌గిరి (హైదరాబాద్) : నగరంలోని మల్కాజ్‌గిరి రైల్వే స్టేషన్ సమీపంలో రైలు పట్టాలపై శుక్రవారం ఓ ఇంటర్ విద్యార్థిని మృతదేహం లభ్యమైంది. రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. మృతురాలి దగ్గర లభించిన ఐడీ కార్డు ఆధారంగా... రంగారెడ్డి జిల్లా శామీర్‌పేట మండలం బీజేఆర్ నగర్‌కు చెందిన నవ్యగా మృతురాలిని గుర్తించారు. ఈసీఐఎల్ శ్రీ చైతన్య కళాశాలలో ఇంటర్ చదువుతున్న నవ్య పట్టాలు దాటుతూ ప్రమాదవశాత్తూ మృతి చెందిందా? లేక ఆత్మహత్య చేసుకుందా అన్నది ఇంకా తెలియరాలేదు. పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.