
న్యూఢిల్లీ : వాట్సాప్‌లో బ్యాంకు మెసేజ్‌లు రావడం ఎప్పుడైనా చూశారా? లేదు కదూ! కానీ ఇక నుంచి చూడబోతారు. భారత్‌లో టాప్ బ్యాంకులన్నీ ఇక నుంచి వాట్సాప్ ద్వారానే తన కస్టమర్లతో సంభాషించాలని చూస్తున్నాయి. అలర్ట్‌లను, ఏదైనా బ్యాంకు సమాచారాన్ని వాట్సాప్ ద్వారా పంపాలని యోచిస్తున్నాయని తెలిసింది. ఇప్పటికే ఐదు టాప్ బ్యాంకులు దీనిపై టెస్టింగ్ ప్రారంభించాయని తాజా రిపోర్టులు పేర్కొన్నాయి. టెస్టింగ్ ప్రారంభించిన బ్యాంకుల్లో కొటక్ మహింద్రా బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, ఇండస్‌ఇండ్ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియాలు ఉన్నట్టు తెలిసింది. తొలుత వాట్సాప్ ఆధారిత కమ్యూనికేషన్ కలిగి ఉన్న కస్టమర్లకు ఈ సేవలను లాంచ్ చేయనున్నట్టు రిపోర్టులు తెలిపాయి.
రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా తప్పనిసరి చేసిన పాయింట్ ఆఫ్ సేల్ ట్రాన్సాక్షన్స్, ఏటీఎం విత్‌డ్రా అలర్ట్‌లను పంపడానికి బ్యాంకులు ఇక నుంచి వాట్సాప్‌ను వాడనున్నాయి. దీని కోసం కస్టమర్లు తమ వాట్సాప్ రిజిస్ట్రర్ మొబైల్ నెంబర్‌ను అందించాల్సి ఉంటుంది. ఆ అనంతరం ప్లాట్‌ఫామ్‌పై బిజినెస్, రిసీవ్ కమ్యూనికేషన్‌తో అకౌంట్లను లింక్ చేసుకోవడానికి వీలవుతుంది. ప్రస్తుతం బ్యాంకులు తమ అలర్ట్‌లను ఎస్‌ఎంఎస్‌ల ద్వారా అందిస్తున్నాయి. ఎస్‌ఎంఎస్‌తో పాటు అదనంగా వాట్సాప్ మెసేజ్‌లను బ్యాంకులు పంపించాలనుకుంటున్నాయి. కేవలం అలర్ట్‌లకే కాకుండా.. బ్యాంకులతో కమ్యూనికేషన్ కోసం కూడా వాట్సాప్‌ను వాడుకోవచ్చు. కస్టమర్ సర్వీసు విషయాలకు, క్వరీస్ నిర్వహించడానికి బ్యాంకులు దీన్ని ఉపయోగించనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment