
తిరువణ్ణామలై: ప్రేమించిన సమయంలో తీసుకున్న అసభ్య ఫొటోలను యువతి భర్తకు సెల్‌ఫోన్‌లో పంపిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే తిరువణ్ణామలై జిల్లా కీల్‌పెన్నాతూర్ గ్రామానికి చెందిన 20 సంవత్సరాల యువతి అదే గ్రామంలో పాత్రలు విక్రయించే దుకాణానికి పనికి వెళ్లింది. ఆ సమయంలో దుకాణం యజమాని కుమారుడు వీరమణికి యువతితో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. వీరమణి ఆమెను వివాహం చేసుకుంటానని మాయమాటలు చెప్పి లోబరుచుకున్నాడు.
ఆ సమయంలో యువతికి తెలియకుండా ఫొటోలు తీశాడు. ఆ ఫొటోలను చూపించి యువతిని బెదిరించి పలు మార్లు లైంగికవాంచ తీర్చుకున్నాడు. ఆనంతరం ఆ యువతిని వివాహం చేసుకునేందుకు వీరమణి నిరాకరించాడు. సెల్‌ఫోన్‌లో ఉన్న అసభ్య ఫొటోలు పూర్తిగా తొలగిస్తానని చెప్పాడు. ఈ విషయం తెలియని యువతి కుటుంబ సభ్యులు ఆమెకు మరో యువకుడితో ఈనెల 6వ తేదీన వివాహం జరిపించారు. వివాహం అనంతరం యువతి తనను దూరం పెట్టడంతో జీర్ణించుకోలేని వీరమణి ఆమె భర్త సెల్‌ఫోన్ నెంబరును తెలుసుకొని ఆమె అసభ్య ఫొటోలను వాట్సాప్ ద్వారా పంపాడు. దీన్ని ఆమె భర్త ఇంట్లోని కుటుంబ సభ్యులకు చూపించి ఇకపై ఆ యువతితో కాపురం చేయలేనని పుట్టింటిలో వదిలిపెట్టాడు. దీనిపై బాధిత యువతి తల్లిదండ్రులు తిరువణ్ణామలై మహిళా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి యువకుడిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment