
Send Message To Unsaved Number In Whatsapp: వాట్సాప్‌లో ఒకరికి మెసేజ్ చేయాలంటే కచ్చితంగా ఫలనా వ్యక్తి నంబర్‌ను సేవ్ చేసుకోవాలి. సేవ్ చేస్తేనే వాట్సాప్ యాప్‌లో ఆయా వ్యక్తి నంబరు కన్పిస్తోంది. థర్డ్‌పార్టీ యాప్స్ ఉపయోగించి ఫలానా వ్యక్తి నంబర్‌ను సేవ్ చేసుకోకుండా వాట్సాప్‌లో మెసేజ్ చేయవచ్చు. వాట్సాప్‌లో సేవ్‌లేని నంబర్లకు మెసేజ్ ఇలా చేయండి...
Send Message To Unsaved Number In Whatsapp: వాట్సాప్ ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన మెసేజింగ్ యాప్‌లలో ఒకటి. వాట్సాప్ లేని స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయంటే చాలా అరుదు. స్మార్ట్‌ఫోన్ల రాకతో సంప్రదాయక మొబైల్ మెసేజ్‌లకు స్వస్తి చెప్పి పలు యాప్స్‌ను ఉపయోగించి మెసేజ్‌లను చేస్తుంటాం. వాట్సాప్ మనందరి నిత్యజీవితాల్లో ఒక భాగమైంది. పొద్దునే లేచి డేటా ఆన్ చేసి వాట్సాప్‌లో ఏమైనా మెసేజ్‌స్ వచ్చాయో లేదో చూస్తాం.
చదవండి: WhatsApp: మీ ఫొటోలు సరికొత్త రూపంలో..!
వాట్సాప్‌లో ఒకరికి మెసేజ్ చేయాలంటే కచ్చితంగా ఫలనా వ్యక్తి నంబర్‌ను సేవ్ చేసుకోవాలి. సేవ్ చేస్తేనే వాట్సాప్ యాప్‌లో ఆయా వ్యక్తి నంబరు కన్పిస్తోంది. థర్డ్‌పార్టీ యాప్స్ ఉపయోగించి ఫలానా వ్యక్తి నంబర్‌ను సేవ్ చేసుకోకుండా వాట్సాప్‌లో మెసేజ్ చేయవచ్చు. థర్డ్‌పార్టీ యాప్స్‌నుపయోగించి మెసేజ్ చేయడం మన భద్రతకే భంగం వాటిల్లుతుంది. అంతేకాకుండా మనల్ని ప్రమాదంలోకి నెట్టే అవకాశం ఉంది.
ఇలాంటి సందర్భాలను మనలో చాలా మంది ఎదుర్కొన్న వాళ్లమే. కొన్ని సార్లు మనకు చికాకు కూడా తెప్పిస్తోంది. వాట్సాప్‌లో నంబర్ లేకుండా మెసేజ్ ఎలా పంపాలి లేదా కాంటాక్ట్ యాడ్ చేయకుండా వాట్సాప్ మెసేజ్ ఎలా పంపాలో ఇక్కడ తెలుసుకుందాం.
వాట్సాప్‌లో సేవ్‌లేని నంబర్లకు మెసేజ్ ఇలా చేయండి...
- మీ ఫోన్‌లోని బ్రౌజర్‌ని(క్రోమ్ లేదా ఫైర్‌ఫాక్స్) ఒపెన్ చేయండి. ఇప్పుడు మీరు http://wa.me/xxxxxxxxxx ఈ లింక్‌ని కాపీ చేసి యూఆర్‌ఎల్ అడ్రస్ బార్‌లోపేస్ట్ చేయాలి.
- ఇక్కడ xxxxxxxxxx స్థానంలో మన దేశ కంట్రీ కోడ్ 91తో పాటు మీరు మెసేజ్ పంపాలనుకున్న మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
ఉదాహరణ: మీ వాట్సాప్‌లో సేవ్ కాని ఫలానా నంబర్‌కు ‘http://wa.me/919911111111’ ఎంటర్ చేయాలి. ఇక్కడ తొలి రెండు అంకెలు మన దేశ కోడ్. తరువాత మెసేజ్ పంపాలనుకున్న వ్యక్తి మొబైల్ నంబర్
- మీరు లింక్‌ను టైప్ చేసిన తర్వాత, లింక్‌ని తెరవడానికి ఎంటర్ నొక్కండి .
- తరువాత మీరు రెసిపెంట్(గ్రహీత) ఫోన్ నంబర్‌తో గ్రీన్ కలర్‌తో మెసేజ్ బటన్‌తో ఒక వాట్సాప్ పేజీని చూస్తారు. గ్రీన్ కలర్ మెసేజ్‌బటన్‌పై క్లిక్ చేస్తే మీరు వాట్సాప్‌కు మళ్లించబడతారు.
- అంతే మీరు ఫలానా నంబర్‌ను సేవ్ చేసుకోకుండా ఈ విధంగా మెసేజ్ చేయవచ్చును.