వాట్సాప్లో వచ్చే ఆ మెసేజ్తో జాగ్రత్త! | No, PM Modi Is Not Offering Free Mobile Recharges Worth Rs. 500 via WhatsApp | Sakshi
Sakshi News home page

వాట్సాప్లో వచ్చే ఆ మెసేజ్తో జాగ్రత్త!

Published Mon, Jan 2 2017 7:18 PM | Last Updated on Wed, Aug 15 2018 6:32 PM

వాట్సాప్లో వచ్చే ఆ మెసేజ్తో జాగ్రత్త! - Sakshi

వాట్సాప్లో వచ్చే ఆ మెసేజ్తో జాగ్రత్త!

ఈ లింకు క్లిక్ చేస్తే మీ మొబైల్కు ఉచితంగా రూ.500 రీఛార్జ్ అయిపోతుంది. వెంటనే రీఛార్జ్ చేసుకుని, మరో 15 మంది ఫ్రెండ్స్ కి ఫార్వర్డ్ చేయడంటూ ప్రధాని నరేంద్రమోదీ పేరుమీదనే ఓ లింకు వైరల్ అవుతున్న విషయం విదితమే. ప్రధాని ఇటీవల పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన అనంతరం ఈ లింకు ఎక్కువగా సర్క్యూలేట్ అవుతోంది. నగదు కొరతతో నిజంగానే మోదీ మనకు ఉచితంగా రీఛార్జ్ చేస్తున్నాడమోనని భావించి, చాలామంది ఆ లింకును ఓపెన్ చేస్తున్నారు. దానిలో ఎంతమందికి రూ.500 రీఛార్జ్గా వస్తుందో తెలియదు కాని, మన వ్యక్తిగత సమాచారమైతే లీకైపోయి, హ్యాకర్ల చేతిలోకి వెళ్లిపోతుందట. ఈ లింకు ఓపెన్ చేసినా, క్లిక్ చేసినా ప్రజలకు హానికరమేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రధాని పేరు మీద సర్క్యూలేట్ అయ్యే http://balance.modi-gov.in/  లింకు ఫేకని వెల్లడైంది.
 
ఆ లింకును క్లిక్ చేయగానే మన మొబైల్ నెంబర్, ఆపరేటర్, రాష్ట్రం వంటి వివరాలు అందించాలి. అన్ని వివరాలు నింపిన తర్వాత రీఛార్జ్ బటన్ నొక్కగానే, మరో కొత్త పేజీ ఓపెన్ అవుతోంది. ఈ పేజీలో లింకును మరో 15 మంది స్నేహితులకు షేర్ చేయాలని అడుగుతోంది. అయితే ఈ వెబ్సైట్లో నింపే సమాచారం హ్యాకర్ల చేతిలోకి వెళ్తుందని, యూజర్ల సమాచారాన్ని వారు తప్పుడు కార్యకలాపాలకు వాడుతున్నారని వెల్లడైంది. అదేవిధంగా ఈ హోమ్ పేజీలోనే తాము ఏ టెలికాం కంపెనీకి చెందిన వాళ్లం కాదని నిబంధనలు, షరతుల్లోనే ఉంటుంది. మొదటిసారి వాట్సాప్ వీడియో కాలింగ్ను యూజర్లకు ప్రవేశపెట్టినప్పుడు కూడా ఇదే మాదిరి ఓ ఫేక్ మెసేజ్ విపరీతంగా సర్క్యూలేట్ అయింది. ఈ లింకులు చాలా ప్రమాదకరమని, ఎట్టిపరిస్థితుల్లో వాటిని ఓపెన్ చేయొద్దని హెచ్చరికలు జారీఅవుతున్నాయి. వ్యక్తిగత సమాచారాన్ని పన్నగం పెట్టి ఉచిత రీఛార్జ్ల కోసం పాకులాడవద్దని హెచ్చరిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement